Jump to content

Raghurama raju


Recommended Posts

2014 lo TDP lo join avvaalanukonnaadu.. but CBN BJP lo join ayyi MP seat try cheyyamannaadu Narsapur BJP ki istaa ani..same happened with Kamineni..Bjp lo join ayitey kaikalur seat Bjp vadilestaanu ani..  but Bjp vaallaki bob gaari game ardhamayyindemo gokaraju ki ichaaru MP.. 2019 lo easy MP seat TDP ki eeyana contest chestey..  

Link to comment
Share on other sites

17 minutes ago, Chandasasanudu said:

eeyana family photo unda....eela ammayo or eela family lono oka ammai undali...inter class mate....chaala baagundedi,,,,,still flashes

:D Ikkada thread lo matter yenti ...nuv cheptunnadi yenti :sleep:

Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

ysr ki baga close ycp lo join ayyadu jagan debba ki baytaki vacchi cbn tho matladukoni bjp loki velladu kani bjp seat ivvala

Just Matalu kadu deal set chesukunnadu pakka seat ani ,Bjp seat ivvaledu Babu black mail start chesadu pothu cancel ani , Abn programs kani bjp tagga le just oka seat sklm lo Marcharu anthe Akkada munchi start bjp and Tdp ki difference . 

 

Link to comment
Share on other sites

తెదేపా గూటికి రఘురామకృష్ణంరాజు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు
weg-top2a.jpg
భాజపా నేతగా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం తెదేపా తీర్థం పుచ్చుకోవడం రాజకీయ పరిశీలకులకు ఆసక్తికర చర్చనీయాంశమైంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తన కుమారుడు భరత్‌ సహా పార్టీలో చేరారు. ఆయన చేరికతో నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరినట్లయ్యిందని ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 15 శాసనసభ స్థానాలు గెలుచుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరారని ఆమె అన్నారు. రఘురామకృష్ణంరాజు సొంతగ్రామం ఆకివీడు మండలం అయిభీమవరం, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుకు అన్న కుమారుడు, ప్రస్తుత ఎంపీ గోకరాజు గంగరాజుకు మేనల్లుడు. గంగరాజు తండ్రి, రఘురామకృష్ణంరాజు మాతృమూర్తి తండ్రి సోదరులు. ప్రముఖ ఫార్మా పారిశ్రామిక వేత్త సిరీస్‌ రాజుకు మనువడు. రఘురామకృష్ణంరాజుకు అయిభీమవరం,    భీమవరం పట్టణంలో ఇళ్లున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మొదట వైకాపాలోకి వెళ్లారు. వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరవాత భాజపాలో చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టిక్కెట్టు ఆశించారు. ఆయనకే దక్కుతుందని అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో దాన్ని గోకరాజు గంగరాజు దక్కించుకున్నారు. దాంతో ఆయన ఆ ఎన్నికల్లో తెదేపా, భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అప్పటి నుంచి తెదేపా నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ  పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఆయన తెదేపాలో చేరారు.

పారిశ్రామిక వేత్తగా... రఘురామకృష్ణంరాజు పారిశ్రామికవేత్త. ఇంద్‌భరత్‌ పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్స్‌ పేరుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పవర్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. కుమార్తె పేరు ఇందు, కుమారుడి పేరు భరత్‌. వీరిద్దరి పేర్లుతో కలిపి వచ్చేలా సంస్థలకు నామకరణం చేశారు. తమిళనాడు, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్లాంట్లు ఉన్నాయి. సొంతంగా విమానం కూడా ఉంది. దాంతోపాటు దేశంలో సినీ, క్రికెట్‌ రంగ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. పార్లమెంటు సభ్యునిగా పనిచేయాలనేది ఆయన ప్రధాన ధ్యేయంగా సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఈయనకు తెదేపా తరఫున నరసాపురం పార్లమెంట్‌ స్థానం టిక్కెట్లు దక్కుతుందా... ఆయన ఆశలు నెరవేరుతాయా అన్న విషయాలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.

 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...