Jump to content

అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కడపపై కరుణ చూపరె


Npower

Recommended Posts

అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కడపపై కరుణ చూపరెందుకనీ..!!
11-07-2017 12:52:18
 
 
636353750007117773.jpg
  • ఉక్కు పరిశ్రమ... ఐటీపై ఆశలేవీ?
  • అవకాశాలున్నా అడుగేయని పారిశ్రామిక ప్రగతి
  • సాగని సాగునీటి ప్రాజెక్టులు
  • పట్టాలెక్కని జిల్లా ప్రగతి
  • నేడు జిల్లాలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. జిల్లా అభివృద్ధిపై హామీలు అనేకం ఇచ్చారు. కాలం గడుస్తున్నా హామీలు చాలామటుకు ఆచరణ సాధ్యం కాలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి సానుకూలంగా ఫలితాలు ఇచ్చిన జిల్లాలో ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వివక్ష సాగుతోందన్న విమర్శలు ఎదురవుతూ వచ్చాయి. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, నేతలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని, కడపను ప్రగతిపథంలో నడిపిస్తామని చెబుతూ వచ్చారే కానీ జిల్లావాసుల ప్రధాన ఆకాంక్షలు మాత్రం నెరవేర్చలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తనయుడు.. రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయనైనా జిల్లాలో అభివృద్ధిని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తారని ప్రజానీకం ఆశిస్తోంది
 
 
కడప: ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, నేతలు జిల్లా అభివృద్ధ్దికి ప్రభుత్వం కట్టుబడి వుందని, కడపను ప్రగతిపథంలో నడిపిస్తామని చెబుతూ వచ్చారే కానీ జిల్లావాసుల ప్రధాన ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ ప్రస్తుతం మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రజానీకం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. జిల్లావాసుల ప్రధాన ఆకాంక్ష ఉక్కు పరిశ్రమ. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ నిర్మాణదశలో పలు అవాంతరాలు, యాజమాన్యం కేసుల్లో ఇరుక్కోవడంలాంటి కారణాలతో ఆగిపోయింది. రాష్ట్ర విభజన ఒప్పందాల్లో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఒప్పందం మేరకు కూడా ఇంతవరకు ఉక్కు పరిశ్రమ వస్తుందన్న ఆశలు కనిపించడం లేదు. సెయిల్‌ ప్రతినిధులు వచ్చి వెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదట్లో ఆరు నెలల్లో తమకు అవసరమైన వసతులు ఎలా కల్పిస్తారో చెప్పమని కోరినట్లు సమాచారం. ఆ తరువాత కొంతకాలానికి కడప జిల్లాలో సెయిల్‌ ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని ప్రకటన వెలువడింది. ఇదిలావుంటే సెయిల్‌ ఇలాంటి ప్రకటన చేసిన రోజే చిత్తూరు జిల్లా పర్యటనలో వున్న లోకేష్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
 
ఆ తరువాత, అంతకుముందు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు చాలా మంది ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతుందని చెప్పారు. చైనా పర్యటన సందర్భంగా అక్కడ ప్రభుత్వ రంగ సంస్థ కడపలో రూ.300 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా వుందని కూడా వార్తలు వచ్చాయి. రూ.300 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఏమాత్రం సాధ్యం కాదు. ఇదిలావుంటే ఆ తరువాత ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఇటువైపు చూడలేదు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కడపతో పాటు సమీప జిల్లాల్లో ఇనుప ఖనిజం పుష్కలంగా వుంది. అవసరమైన నీరు, విద్యుత్‌, మౌలిక వసతులు, ఇతర ఖనిజాలు కూడా లభించేందుకు అవకాశాలు వున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కేంద్రం మరోసారి కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. అయితే ఆ తరువాత టాస్క్‌ఫోర్స్‌ పర్యటన, ప్రతిపాదన ఏదో కూడా ఇంతవరకు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిశ్రమపై ఆశలు మరుగునపడుతున్నాయి.
 
లోకేష్‌ గతంలో కడప ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన ఉక్కు పారిశ్రామికరంగ ప్రముఖులతో చర్చిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈయన ప్రస్తుతం జిల్లాకు రానుండడంతో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై భరోసా ఇస్తారేమోనన్న ఆశతో జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించే క్రమంలో లోకేష్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపిస్తే జిల్లావాసులు అందుకు కృతజ్ఞతలు తెలుపకతప్పరు.
 
సాగని సాగునీటి ప్రాజెక్టులు
జిల్లాలో ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టు గాలేరు-నగరి మొదటి దశ వరకు పూర్తయి నీరిచ్చేందుకు అవకాశం వున్నా రెండో దశ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక ్కడే అన్నట్లు వుంది. 7 ప్యాకేజీల్లో పనులు ఆగిపోగా ఇటీవల ఒక ప్యాకేజీ మాత్రమే పురోగతి వైపు కనిపిస్తోంది. రెండోదశ పూర్తయితే కడప నుంచి జిల్లాలో కోడూరు వరకు సాగు, తాగునీటికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రధాన అడ్డంకిగా వున్న భూసేకరణను పూర్తి చేయాల్సి వుంది. ఇక చిన్న ప్రాజెక్టులైన ఝరికోన, వెలిగల్లు ప్రాజెక్టులు పూర్తయినా కాలువలు పూర్తికాక ఏళ్ల తరబడి రైతులకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నాయి. వెలిగల్లు కింద ప్రధాన కాలువ పూర్తయినా డిస్ట్రిబ్యూటరీ కాలువలు, పంట కాలువలు పూర్తికాలేదు. కాలువ పనులు చేయకుండానే చేసినట్లు గత ప్రభుత్వంలో బిల్లులు చేసుకోవడం వెలుగుచూసింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై విచారణ చేస్తూనే ఈలోపు కాలువల పనులు కూడా చేపడతామని చెప్పింది. అయితే అవి కూడా మొదలు కాలేదు. ఝరికోనకు కాలువలే లేవు.
 
 
బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టుకు వెలిగోడు నుంచి నీరురావాలంటే ఒకటవ కిలోమీటరు నుంచి పదో కిలోమీటరు వరకు కాలువ మరమ్మతులు, లైనింగ్‌ పనులు చేయాల్సి వుంది. ఆ పనులు జరగలేదు. వీటితో పాటు అవుకు టన్నెల్‌ పనులు రెండు, మూడు నెలల్లో పూర్తయితే గండికోటకు ఆశించిన మేరకు నీరు తీసుకురావచ్చు. వీటన్నింటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి వుంది.
 
 
అవకాశం వున్నా అభివృద్ధి ఏదీ
జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అనేక వనరులు అవకాశాలు వున్నా ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదు. జిల్లాలో ఖనిజాలు విస్తారంగా వున్నాయి. ఖనిజాల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు వున్నా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుకావడం లేదు. పండ్లతోటలు విస్తారంగా వున్నా పండ్ల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. మార్కెట్‌ కోసం నిల్వలు వుంచుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రైతాంగం కోరుతున్నా ఒక్క శీతల గిడ్డంగి కూడా ఏర్పాటు కాలేదు. పాడిపరిశ్రమకు ఊతమిచ్చేందుకు కడపలో మహిళా పాలడెయిరీ నిర్మాణానికి కొన్ని పనులు జరిగినా వైఎస్‌ మరణానంతరం అది కూడా ఆగిపోయింది. ఈ పాలడెయిరీ పూర్తి చేస్తే జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధ్దికి దోహదం చేసినట్లవుతుంది. జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కొప్పర్తి వద్ద 6700 ఎకరాల స్థలం వుంది. ఇవి కాకుండా జిల్లాలో 75 వేల ఎకరాల స్థలాన్ని ల్యాండ్‌బ్యాంకు కింద సేకరించి పెట్టారు. మరి ప్రభుత్వం ఈ వనరులను ఉపయోగించుకొని పారిశ్రామికరంగ అభివృద్ధికి చొరవ చూపేందుకు జిల్లాలో రెండురోజుల పర్యటనలో వుంటున్న మంత్రి లోకేష్‌ దృష్టి పెడతారని ఆశిద్దాం.
 
 
ఐటీ పార్కుపై ఆశలు
లోకేష్‌ ఐటీశాఖ మంత్రిగా కూడా వుండడంతో కడపలో ఐటీ పార్కు ఏర్పాటవుతుందన్న ఆశలు కూడా జిల్లావాసుల్లో కనిపిస్తున్నాయి. గతంలో వైఎస్‌ ప్రభుత్వంలో రిమ్స్‌ పక్కన ఐటీపార్కుకు కూడా స్థలం సేకరించిపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సమాచార, ఐటీశాఖ మంత్రిగా వున్న పల్లె రఘునాధరెడ్డి ఆ స్థలాన్ని పరిశీలించి ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపుతామని చెప్పారు. అయితే ఆ తరువాత అందుకు సంబంధించిన ఏ చర్యలు జరగలేదు. మరి ప్రస్తుత ఐటీశాఖ మంత్రి లోకేష్‌ ఇక్కడ ఐటీపార్కు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటే జిల్లా అభివృద్ధిలో అదో కలికితురాయి అవుతుంది.

 

Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply

Vadilesaaru.  Kadapa nu Pakistan laagaa choostunnaaru.  TDP adhikaaramloki vachina marukshanam jillaalo prati okkadi notilo naanina maata.... ika Kadapa development meeda aasalu vadilesukovaalsinde ani.  Adi nijam chestunnanduku CBN ki dhanyavaadamulu.

 

Steel plant, Urdu university, Haj house..... list goes on.

Link to comment
Share on other sites

Urdu university goes to Kurnool

THE HANS INDIA |    Jan 23,2016 , 01:14 AM IST
      
 

mobile_app_ap.jpg

9598_Urdu_Versity.jpg
Kadapa: The Urdu University, which the TD government has promised to set up in Kadapa, is now being shifted to Kurnool attracting the ire of the Muslim community of Kadapa. Chief Minister Chandrababu Naidu had proposed to set up the Urdu University in Kadapa and a resolution was also passed in the Assembly. 
 
At that time, the Chief Minister said it would be very useful to over four-lakh Muslims of Kadapa.  This move is being opposed by the students as well as the main opposition YSRCP. 
 
Many PG students lamented that they were happy that the Urdu University would come up at Kadapa and would save them from going to Hyderabad. But the present move of the government comes as a shock for the student community. 
Link to comment
Share on other sites

Actual gaa Kadapa centre ... heart of rayalaseema.  Kaani pakkane Tirupati laanti piligrim city vundatam.... Kadapa ku pedda debba.

 

Being a pilgrim city Tirupathi is bound for abundant revenue.  Kaanee Rayalaseema nadiboddulo vunna Kadapa nu maathram chaalaa nirlyaksham chesaaru.  Evaraina Kadapa nu pattinchukunnaaru ante... one and only Okka magaadu NTR maathrame.  Appatlone Allwyn kadapaku pattupatti teppinchaaru.  Buggavanka Dam kattinchaaru.  After him... kadapa went for dogs.  YS is just for name sake... and CBN di always savathi prema.

Link to comment
Share on other sites

జిల్లాలో రెండు లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి కరవై గల్ఫ్‌ దేశాలు కువైట్‌, దుబాయి, సౌదీ, కత్తర్‌ వంటి దేశాలకు వెళ్తున్నారు. జమ్మలమడుగు శివారులో ఉక్కు కర్మాగారం స్థాపిస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. మూడేళ్ల పాలనలో అడుగు ముందుకు పడలేదు. పండ్ల ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించారు. ఉద్యాన కేంద్రం ఏమైందో ప్రభుత్వానికి ఎరుక.

ఏకశిలానగరి దశ తిరిగేనా 
ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఇక్కడ రూ.100 కోట్లు ఖర్చు చేసి భక్తులు వసతి కల్పిస్తాం. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వాగ్ధానం చేశారు. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలోనే హడావిడి కనిపిస్తోంది. ఆ తర్వాత అంతా పాత కథే. ఏకశిలానగరి దశ ఎన్నడు తిరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలి.

Link to comment
Share on other sites

Rajadharma ???

Rajadharma rani dharmam pakkana pedithe asalu em cheyyaali kadapa ki? Steel plant not viable annattunnaaru pushpam batch.... Urdu university pakka district ki ellindi..... pinchans iyyatleda? Ration iyyatledaa? Thofa iyyaleda?

 

Mari prakasam, vijayanagaram, srikakulam districts emanukovaali?

Link to comment
Share on other sites

కడపలో భారీ పరిశ్రమ
 
  • దేశంలోనే మొదటి మాంగనీస్‌ ఇండస్ట్రీ
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర స్థాయి పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) జై కొట్టింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైన మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిది.. హ్యుండయ్‌ కార్ల తయారీలో కీలకమైన ‘కియ’ ఆటోమొబైల్‌ సంస్థ. దాదాపు రూ.10,000 కోట్లతో 5000 మందికి ఉపాధిని కల్పించే ‘కియ’ కార్ల తయారీ యూనిట్‌ వెనుకబడిన అనంతపురం జిల్లాలో స్థాపిస్తే యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెనుకొండలో ఈ ప్లాంట్‌ ఏర్పాటైతే ఆటోమొబైల్‌ ఇండసీ్ట్రలో ఏపీపేరు కూడా చేరుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అయితే.. ఇక్కడ లభించే ఇనుప ఖనిజం నాణ్యతపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. ఇదే సమయంలో.. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో మాంగనీసు ఖనిజాధారిత పరిశ్రమను ఈ జిల్లాలో స్థాపించేందుకు ట్రెమేగ్‌ అల్లాయిడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.660 కోట్ల పెట్టుబడితో.. 8000 మందికి ఉపాధిని కల్పిస్తానని ప్రతిపాదించింది. ప్లాంటులో నేరుగా 1200 మందికి.. డోలమైట్‌ గనుల తవ్వకం వల్ల దాదాపు 6800 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ పరిశ్రమ ప్రతిపాదనలు పరిశీలించిన ఎస్‌ఐపీసీ మెగా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను దీనికివ్వాలని నిర్ణయించింది. ఇక టాటా కెమికల్స్‌ నెల్లూరు జిల్లాలో రూ.400 కోట్ల పెట్టుబడితో బయోటెక్నాలజీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రతిపాదనలు పంపింది. 150 మందికి ఉపాధినిచ్చే ఈ పరిశ్రమనూ మెగా ఇండసీ్ట్రగా గుర్తించి రాయితీలు ఇచ్చేందుకు ఏస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. కాగా.. రాష్ట్రంలో భారీపరిశ్రమల స్థాపనకు ప్రతిష్జాటత్మక సంస్థలు ముందుకు రావడం పట్ల సీఎస్‌ దినేశ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల్లో కుదిరిన ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పరిశ్రమల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీసీ) సమావేశం ఆమోదం పొందనున్నాయి.
Link to comment
Share on other sites

private industries raavu kdp ki. vochi pettalante 30% project cost suit ga aduguthunnaru anta. public contracts like national high way, roads, canals etc vatike 25% suit ga aduguthunnaru ani AJ vaade mothukunnadu 2 years back. oka video vesanu. intha high level lo threat unte evadu vosthadu emi sesthadu. suit ante edo anukoneru. adi fancy word for luncham in kdp region.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...