Jump to content

Grand canyon of India | Gandikota Fort


Recommended Posts

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గండికోట

2వేల ఎకరాల్లో అయిదు మండలాలుగా అభివృద్ధి

నెల రోజుల్లో ప్రారంభం కానున్న పనులు

అక్టోబరులో గండికోట ఉత్సవం

11ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమికంగా ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఇక్కడున్న గండికోట, మైలవరం రిజర్వాయర్లు, కోట, ఆలయాలు, రాతి కొండలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, పెన్నా నది ప్రధాన ఆకర్షణలు. 2015లోనే ముఖ్యమంత్రి గండికోటకు వెళ్లినప్పుడు.. ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదారిని రూ.16కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కార్యరూపం దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రాజెక్టు స్వరూపం..

* చారిత్రక గండికోట పక్కన పెన్నా నది భూ నిధిలో 2వేల ఎకరాల్లో అయిదు జోన్లలో పర్యాటకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేస్తారు.

* కోట, కెనాయన్‌, సాహస, థీమ్‌పార్క్‌, గోల్ఫ్‌ ఇలా అయిదు జోన్లుగా ఇక్కడ పర్యాటకాభివృద్ధి పనులు చేపడతారు.

* కోట, ఇతర పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తారు. సౌండ్‌, లైట్‌ షో, వారసత్వ నడక వంటివి అందుబాటులోకి తెస్తారు.

* కెనాయన్‌ జోన్‌లో రాతి కొండలపైనుంచి పరిసరాలను చూడడం, హెలికాప్టర్‌ రైడ్‌, తాడువంతెన(రోప్‌-వే)వంటివి ఉంటాయి.

* గోల్ఫ్‌ జోన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గోల్‌ú్ఫ కోర్సును సిద్ధం చేసి, గోల్ఫ్‌ క్లబ్‌, అకాడమీ, గోల్ఫ్‌ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.

* సాహసక్రీడల్లో కొండలు ఎక్కడం (రాక్‌ క్లైంబింగ్‌), పారా గ్లైడింగ్‌, స్కై డైవింగ్‌, బోటింగ్‌, జలక్రీడలు ఉంటాయి.

* పర్యాటకాభివృద్ధి వ్యూహంలో భాగంగా.. హంపి, తిరుపతి వంటి వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గండికోట నుంచి కలుపుతూ ట్రిప్‌లు నిర్వహిస్తారు.

వసతులపై అధ్యయనం

ప్రస్తుతం గండికోట వద్ద ఉన్న వనరులు, వసతులు ఏమిటి? ఎక్కడెక్కడి నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు, వారికి వచ్చే మార్గాల్లో ఎలాంటి వసతులు అవసరం, ఇప్పటికే అందుబాటులో ఉన్నవి ఏమిటి.. వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇది కొలిక్కి రానుంది. బెంగళూరు, తిరుపతి, నెల్లూరు నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తున్నందున మొదట ఆ మార్గాల్లో దారి పక్కన వసతులు(వే సైడ్‌ ఎమినిటీస్‌) ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో మెరుగుపరచాలని నిర్ణయించారు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి కడపకు ట్రూ-జెట్‌ సంస్థ విమానాలను తిప్పుతున్నందున కడపలో దిగగానే పర్యాటకులను గండికోటకు రహదారి మార్గంలో తీసుకువెళ్లేలా అదే సంస్థతో పర్యాటకాభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫ్రీ కోట్‌ సంస్థ ప్రస్తుతం గండికోటలో వారాంతంలో నిర్వహిస్తున్న సాహసక్రీడలను ప్రతిరోజూ డిమాండ్‌ మేరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. వచ్చే అక్టోబరులో గండికోట ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిపై తమిళనాడు, కర్ణాటకల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. తర్వాత ప్రతి 15రోజులకోసారి గండికోటలోనే ప్రత్యేక కార్యక్రమాలు ఉండేలా చూస్తారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 7 months later...

గండికోటకు మహర్దశ
దత్తతకు ముందుకొచ్చిన దాల్మియా సంస్థ
రెండుమూడు రోజుల్లో ఏపీటీడీసీతో అవగాహనా ఒప్పందం
  మరోవైపు రూ.100 కోట్లతో మహా పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధికి ప్రణాళిక
ఈనాడు - అమరావతి
28ap-state1a.jpg

కడప జిల్లాలోని గండికోటను అభివృద్ధి చేసేందుకు దాల్మియా భారత్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఈ సంస్థతో రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అవగాహనా ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో తీసుకొచ్చిన ‘వారసత్వ దత్తత’ పథకంలో తొలిగా దాల్మియా సంస్థ దిల్లీలోని ఎర్రకోట నిర్వహణ బాధ్యతను తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు సంప్రదింపులు జరపడంతో అది గండికోటను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఏపీటీడీసీ ఎండీ హిమాన్షుశుక్లా తెలిపారు. దాల్మియా ఎర్రకోటను అయిదేళ్లపాటు దత్తత తీసుకుంది. గండికోట విషయంలో ఒప్పంద సమయంలో కాలపరిమితి ఖరారవనుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద ఆయా కార్పొరేట్‌ సంస్థలు ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కేంద్రం అనుమతించింది.

గండికోటలో.. కోటకు విస్తృత ప్రచారం కల్పించడం, అక్కడ ల్యాండ్‌ స్కేపింగ్‌, సౌచాలయాలు వంటివాటిని నిర్వహించడం వంటి బాధ్యతను దాల్మియా సంస్థ తీసుకోనుంది. కోట వరకే దత్తత పరిమితం. అయితే కేవలం కోట మాత్రమే అభివృద్ధి చేసినా పర్యాటకులను పెద్దగా ఆకర్షించే అవకాశం ఉండదన్న ఆలోచనతో అక్కడ పర్యాటకంగా కూడా మెగా ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు రూ.100కోట్ల అంచనాతో దీన్ని రూపొందించారు. రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాలని, మిగిలిన నిధులను ప్రైవేట్‌ వారి నుంచి పెట్టుబడులుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే ఒక ప్రైవేట్‌ సంస్థ అక్కడ 10 రిసార్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట ్లు ఏపీటీడీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కోటను దాల్మియ సంస్థ దత్తత తీసుకుంటున్నందున కోటతోపాటు, ఈ మెగా పర్యాటక ప్రాజెక్టులోనూ భాగస్వామి కావాలని ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మెగా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధిలో దాల్మియా సంస్థ రూ.10కోట్ల వరకు వెచ్చించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

గండికోటకు పూర్వవైభవమ్ పరిరక్షణకు ..దాల్మియా భారత్ కు అప్పగింత ..

రాష్త్ర ప్రబుత్వంతో ఖరారైన వొప్పందమ్ ఎర్రకోట కూడా కేంద్ర ప్రబుత్వమ్ దీనికే ఇచ్చింది

http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1639956/4a47516b-ecaa-400a-9baf-5deb9ac8870f

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

  • 4 weeks later...
Gandikota: The Hidden Grand Canyon of India ?

Gandikota is a small village located in Kadapa district in Andhra Pradesh, India. The region of Gandikota was established in 1123 under the Western Chalukyan king of Kalyana named Ahavamalla Someswara I.
 
DeIlqinU8AEnXIG.jpg
 
The Gandikota fort was constructed by the Kappa king during 13th century.
Situated on the banks of river Pennar, Gandikota derives its name from two Telugu words ‘Gandi’ meaning gorge and, ‘kota’ meaning fort.
 
DeInkIrV4AE5ONI.jpg
 
Also known as George fort, it is guarded by a huge entrance gate that’s 20 feet high and 101 bastions each over 40 feet high. The fort is surrounded by the deep gorge, impenetrable hills and dense forest. The landscape also includes monolithic boulders of red granite.
 
DeIoQKfV0AACTPL.jpg
 
The area is full of rocky plains and dry plateau landforms with the Penner river flowing in the background. At present, Gandikota Fort lies in ruins and it is now only a tourist attraction.
 
DeIpIZeUQAADLkn.jpg
 
Gandikota have been under the rule of numerous empires- The Chalukya, Viyanagara, Nayaka, Mughal, Quli Qutub and also the British. Hence, the region has a mixed reminiscence of all these reigns, with a higher significance of Nayaka dynasty who took over the control of this fort.
 
DeIpczVVAAIlfuZ.jpg
 
The people here have a distinctive culture; their way of dressing, festivals and food etc. are inspired by their ancestors who ruled the Gandikota. The Pemmasani Nayaks who seem to have ruled this place for three centuries is belived to have descended from the Kakatiya Dynasty.
 
DeIpsR-VwAE8GIW.jpg
 
This quaint little village situated on the banks of the Pennar River, is home to some major historical structures. The fort premises include small fortresses, a granary, two beautiful temples and a mosque.

Yes , a MOSQUE ?
 
DeIqDgAVMAErpSb.jpg
 
All of these ruins speak of their prime even as the structures seem to be on the verge of crumbling.
Gandikota Fort comprises of several other structures, such as, a palace, a magazine, another granary and a pigeon tower which included fretted windows.
 
DeIqONjU0AUioNJ.jpg
 
This temple has its importance due to very ancient. This temple is an example of fine architecture and design. It is believed that this temple is constructed before 500 years ago. The building is very attractive and put a dashing impact on devotee because of its surroundings.
 
DeIq2Z2U0AI7hPh.jpg
 
There are yet many unexplored places and things in the region. Recent architectural research has revealed the presence of underground passages that connect the fort with the valley. The traps set to capture leopards and other animals are still in their place.
 
DeIrMVcV4AAmYGB.jpg
 
DeIrMVqUQAAJTOi.jpg
Edited by Yaswanth526
Link to comment
Share on other sites

photo lo unna ananda raju dampatulu avaru.are they heirs of old kings?

and one intersting thing is gandikota which is part of kadapa mostly ruled by kamma with surname of pemmasani and now we see all reddys domination  there where as kondaveedu part of guntur ruled by reddy kings ,now kamma domination in district..howcome this change come in times 

Edited by kishbab
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...