Jump to content

Recommended Posts

Posted

Manollu ready gaa unnaru ga,vallu chepparoo ladho,apuday EAP list tho ready...

Central schemes ni kooda maximum utilize chesukuntandhi Ap chaala projects lo because of Proactive involvement by Ap govt.

Posted

40k crores proposal pedithe one crore istharu ... adi pushpaks commitment.

Appudu ap janam pushpams tho kalipi tdp ni kooda Godavari lo kalipestharu,vallatho anta kaaginandhuku
Posted

40k crores proposal pedithe one crore istharu ... adi pushpaks commitment.

 

kaneesam matter chusi comment eyyachu ga... 90% runam central govt bharinchataniki mundukochindi already... total 40k crores raakapoina oka 30k crores vachi dantlo 80% central govt bharisthey adhe chaaala ekkuva..

Posted

Inko 2EAP laki OK cheppakapothe TDP racha start chesudhii :wave:

 

Ade ga CBN plan

 

Till now special status unna 11 states motham aid per year is less then 1000 crores -3000crores max but any state is not in a position to get industries using special status.

 

special status states are not in atleast in top 5 states in getting industries.

 

But AP without special status ranked 1 in getting industries

Posted

పోలవరంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

2014 తరువాత చేసిన వ్యయం రూ.2,754 కోట్లు

తాజా ధరల ప్రకారం మొత్తం ఖర్చు 28,796 కోట్లుగా వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌

17ap-main4a.jpg

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం చెల్లింపులకు 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయంపై సెప్టెంబర్‌ 7న దిల్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందున 1.4.2014 నుంచి ఆ ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తం చెల్లిస్తామని అందులో వెల్లడించారు. విద్యుత్కేంద్రం పనులకు తప్ప జలవనరుల కోసం నిర్మించే ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలో అధికారికంగా విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రాజెక్టుకు పాత ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం రూ.16,010 కోట్లు అంచనా వ్యయంగా నిర్దేశించడంతో అనుమానాలు రేగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజాగా లేఖ రాశారు. పోలవరం చెల్లింపులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం ధరలు కట్టి ఆమోదించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.

* 2014 ఏప్రిల్‌ ఒకటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.2,754.07 కోట్లు ఖర్చు చేసిందని, ఇంతవరకు కేంద్రం రూ.935.00 కోట్లు మాత్రమే చెల్లించిందని తక్షణమే మిగిలిన రూ.1819.07 కోట్లు విడుదల చేయాలని ఆ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.

* కేంద్రం విద్యుత్కేంద్రానికి మినహాయించి మిగిలిన మొత్తం ఇస్తామని ప్రకటించింది. తాజా ధరల ప్రకారం విద్యుత్కేంద్రం మినహా ప్రాజెక్టు పనులకు, పునరావాసం, భూసేకరణ తదితరాలన్నింటికీ కలిపి 28,796.49 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. ఇందులో 2014 ఏప్రిల్‌ 1 వరకు చేసిన ఖర్చు రూ.5,548.69 కోట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. అది మినహాయిస్తే తాజా ధరల ప్రకారం పోలవరం ఖర్చు 23,247.80 కోట్లుగా వివరించారు.

21న పోలవరంపైనా వినతి.. ఈ నెల 21న దిల్లీలో జల వివాదాలకు సంబంధించి సర్వోన్నత మండలి సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిధుల విషయాన్ని కేంద్ర జలవనరులశాఖమంత్రి ఉమాభారతితో పాటు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీదృష్టికి కూడా తీసుకువెళ్తారని ఒక ఐఏఎస్‌ అధికారి శనివారం రాత్రి ఈనాడుకు చెప్పారు.

Posted

7 ప్రాజెక్టులకు వచ్చేది రూ.159 కోట్లే

కృషి సించాయి కింద కేంద్ర వాటా ఇంతే

మిగిలింది రాష్ట్రం రుణంగా తీసుకోవచ్చు

ఈనాడు - హైదరాబాద్‌

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి దక్కేది రూ.159 కోట్లే. అంతకుమందు అమలులో ఉన్న సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)లో మార్పులు చేసి ఎన్టీయే ప్రభుత్వం దాన్ని పీఎంకేఎస్‌వైగా మార్చింది. ఇందులో దేశంలోని 99 ప్రాజెక్టులను చేర్చింది. వీటిని వెంటనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్రం తన వాటాను నాబార్డు నుంచి రుణంగా తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వనుంది. తాజా విధివిధానాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అందనున్న సాయంపై రాష్ట్ర జలవనరుల శాఖ లెక్కించగా రూ.159.09 కోట్లు వస్తుందని తేలింది. ఏఐబీపీ కింద మొత్తం 8 పథకాలకు కేంద్రం సాయం అందిస్తూ వస్తోంది. ఇందులో మద్దిగడ్డ రిజర్వాయర్‌ 2013లోనే పూర్తయింది. మిగిలిన ఏడు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ 8 ప్రాజెక్టులను రూ.2179.90 కోట్లతో చేపట్టేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇందులో రూ.1726.91 కోట్లను ప్రాజెక్టు వ్యయంగా పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. పెరిగిన ధరలకు అనుగునంగా అంచనా వ్యయంలో 20 శాతం మేర పెంచాలని గత ఏప్రిల్‌ 1న నిర్ణయించింది. ఆ మేరకు 8 ప్రాజెక్టుల వ్యయం 2072.29 కోట్లకు చేరింది.

కేంద్రం వాటా ఇలా.. నిబంధనల ప్రకారం కరవు ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రాల వాటాలు 60:40 నిష్పత్తిలో ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు వాటి 25:75 నిష్పత్తిలో ఉంటుంది. ఈ మేరకు 8 ప్రాజెక్టులకు కేంద్రం తన వాటాగా మొత్తం రూ.604.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ.445.39 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేసింది. ఇంకా రూ.159.09 కోట్లు రావాల్సి ఉంది.

వచ్చే ఏడాది అప్పు ఇప్పుడే తీసుకోండి.. కేంద్రం తన వాటాగా నాబార్డు నుంచి రుణంగా తీసుకుని రాష్ట్రానికి అందిస్తుంది. ఆ మొత్తాన్ని కేంద్రమే తిరిగి చెల్లించుకుంటుంది. రాష్ట్రాల వాటాగా ఖర్చు చేసే మొత్తాన్నీ అవసరమయితే నాబార్డు నుంచి రుణంగా తీసుకోవచ్చని పేర్కొంది. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై గురువారం దిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఏడాదిలో తీసుకునే రుణపరిమితిపై ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల ఆర్థికశాఖ అధికారులు కేంద్ర ఆర్థికశాఖతో సంప్రదించుకుని అవసరమనుకుంటే వచ్చే ఏడాది తీసుకునే అప్పు ఈ ఏడాది తీసుకునేలా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకోవచ్చని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల సడలించే విషయంలో మాత్రం సానుకూల స్పందన రాలేదు.

Posted

90% cental govt vallu kadtaru ,SS valla baga jarige manchi ede

The content above was like we will get loan . I understood like interest we will be paying and some time later they will give us the money . There is no time frame of giving money to state to clear the loan .but for sure we will get money . Correct me if I am wrong
  • 1 month later...
  • 3 months later...
Posted
విదేశీ సాయం 1.65 లక్షల కోట్లు
 
  • ఆరు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
  • కేంద్ర మంత్రి మేఘ్వాల్‌ వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): విదేశీ సహాయ(ఈఏపీ) ప్రాజెక్టుల కింద 2014 జూన నుంచి ఇప్పటి వరకూ రూ.1.65 లక్షల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. మొత్తం 17 ప్రాజెక్టులను ప్రతిపాదించగా.. అందులో 6 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరో 19 ప్రాజెక్టులు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయి. కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జునరామ్‌ మేఘ్వాల్‌ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన తర్వా త ఏపీ ప్రతిపాదించిన విదేశీ రుణ ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి..
  • విశాఖపట్నం మెట్రో రైల్‌- రూ.6371 కోట్లు
  • సాగునీటి, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు రెండో దశ- రూ.1700 కోట్లు
  • అందరికీ 24 గంటల విద్యుత(ప్రపంచబ్యాంకు సహాయంతో) - 2694 కోట్లు
  • అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు-3368 కోట్లు
  • పట్టణ నీటి సరఫరా, నీటి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టు - 2606.31 కోట్లు
  • రహదారుల నిర్మాణ ప్రాజెక్టు-2310 కోట్లు
  • మండల అనుసంధాన, గ్రామీణ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు - 2290 కోట్లు
  • రహదారులు, వంతెనల పునరుద్ధరణ ప్రాజెక్టు - 2290 కోట్లు
  • ప్రభుత్వానికి సైబర్‌ సెక్యూరిటీ- 943 కోట్లు
  • గ్రామీణ నీటి పారుదల ప్రాజెక్టు - 3150 కోట్లు
  • 20 నగరపాలికల్లో సమగ్ర వరదనీటి డ్రైనేజీ పథకాలు - 5037.53 కోట్లు
  • 56 నగర పాలికల్లో నీటి సరఫరా మెరుగుదల పథకాలు - 12030.89 కోట్లు
  • 6 నగర పాలికల్లో సమగ్ర మురుగునీటి పథకాలు - 12030.89 కోట్లు
  • ఆరోగ్య వ్యవస్థ బలోపేత ప్రాజెక్టు - వ్యయం ఇంకా నిర్థారించాల్సి ఉంది
  • విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ - 4250 కోట్లు
  • సమీకృత వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు - 1120 కోట్లు
  • కరువు నివారణ ప్రాజెక్టు - 508 కోట్లు
  • కేంద్రం ఆమోదించిన ఆరు ప్రాజెక్టులు..
  • సాగునీరు, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు రెండోదశ - 1700 కోట్లు
  • అందరికీ 24 గంటల విద్యుత (ప్రపంచబ్యాంకు సహాయంతో) - 2694 కోట్లు
  • అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు - 3368 కోట్లు
  • విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ - 4250 కోట్లు
  • సమీకృత వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు - 1120 కోట్లు
  • కరువు నివారణ ప్రాజెక్టు - 508 కోట్లు
  • 1 month later...
Posted
హోదాను మించి లబ్ధి!
 
636254831709176816.jpg
  • గరిష్ఠంగా రాబట్టుకోవడమే లక్ష్యం
  • ఆ దిశగానే ఈఏపీ రప్రతిపాదనలు
  • కేంద్ర పథకాలు, ఈఏపీ వాటాపై దృష్టి
  • ఏఐబీపీ కిందా 90% నిధులకు కృషి
  • కేబినెట్‌ నోట్‌పై స్పష్టత కోసం చర్చలు

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాతో ఏడాదికి ఎంత ప్రయోజనం చేకూరుతుందో దానికి సమానమైన లబ్ధిని విదేశీ ప్రాయోజిత ప్రాజెక్టుల (ఈఏపీలు) రూపంలో పొందాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం, ఈఏపీల్లో 90 శాతం నిధులు భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గరిష్ఠంగా కేంద్ర సాయాన్ని పొందడానికి ఉన్న పరిమితులూ, అస్పష్టతను అధిగమించడం ఎలాగో అధికారర యంత్రాంగం కసరత్తు చేస్తోంది. స్పష్టత కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని భావిస్తున్నారు.
 
 
   కేంద్ర ప్యాకేజీ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.53,804 కోట్ల విలువైన ఈఏపీ ప్రతిపాదనలను పంపిన విషయం తెలిసిందే. అందులో 90 శాతం (రూ.48,424 కోట్ల) మేరకు కేంద్ర గ్రాంటును ఆశిస్తోంది. అయితే, కేంద్ర కేబినెట్‌ నోట్‌పై మరింత స్పష్టత రావలసి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదాతో కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎ్‌సఎ్‌స)లో 90 శాతం గ్రాంటుగా రావడంతోపాటు అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం (ఈఏపీ కోసం), ప్రత్యేక ప్రణాళికా సాయం, సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), పునర్వ్యవస్థీకృత సత్వర విద్యుత అభివృద్ధి-సంస్కరణ కార్యక్రమం (ఆర్‌-ఏపీడీఆర్‌పీ), అదనపు కేంద్ర సాయం రూపాల్లో కేంద్రం నుంచి నిధులు అందుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ విషయంలో సీఎ్‌సఎ్‌సను ప్రామాణికంగా తీసుకుని... అందులో 60:40 నిష్పత్తికి బదులు 90:10 నిష్పత్తిని పాటిస్తే ఏమేరకు నిధులు వస్తాయో రాష్ట్ర అధికారులు లెక్కలు వేశారు. కేంద్ర కేబినెట్‌ నోట్‌లో సీఎ్‌సఎ్‌సనే పేర్కొన్నారు. అయితే, ప్రత్యేక హోదా రాషా్ట్రలకు సీఎ్‌సఎ్‌సలో 90 శాతంతోపాటు అదనపు కేంద్ర సాయం కింద ఈఏపీలోనూ 90 శాతం కేంద్రం ఇస్తుంది కాబట్టి... కేంద్ర నోట్‌లో ఈ రెండు పదాలూ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తాజాగా ప్రతిపాదించారు. ఇదే జరిగితే కేంద్ర సాయం పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఏఐబీపీ కింద కూడా 90 శాతం నిధులను పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
 
మరింత స్పష్టతకోసం...
ఈఏపీ ప్రాజెక్టుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాన్ని ఏడేళ్ల తర్వాత కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. ఆ విషయంలో కేంద్ర నిబద్ధత, ద్రవ్య జవాబుదారీ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి తదితర అంశాలపై అధికార వర్గాల్లో సందేహాలున్నాయి. ఈఏపీ కింద వచ్చే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే భావిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుందని, కాబట్టి దాన్ని కేంద్ర గ్రాంటుగా పరిగణించాలని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనపు అప్పు చేయడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు సూచించారు. దీనిపై కేంద్రంతో మాట్లాడవలసి ఉంది. సీఎస్‌ఎ్‌సలనే ప్రామాణికంగా తీసుకుని.. కేంద్ర కేబినెట్‌ నోట్‌లో ఆ మాటను ప్రస్తావించిన చోట ఈఏపీ అనే పదాన్ని కూడా చేర్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ మరో విన్నపం.
 
   ఏఐబీపీ, దీర్ఘకాల సాగునీటి నిధి (ఎల్‌టీఐఎ్‌ఫ)లో సాధారణ రాషా్ట్రలకు కేంద్ర సాయం 25 శాతంగా ఉంటే... ప్రత్యేక హోదా రాష్ట్రా‌లకు 90 శాతం ఇస్తుంది. రాషా్ట్రనికి 90 శాతం ఎల్‌టీఐఎఫ్‌ రుణం 797.95 కోట్లు ఉంటే... అందులో ప్రస్తుత పద్ధతి ప్రకారం కేంద్రం వాటా కేవలం రూ.111.05 కోట్లు. అయితే 90 శాతం వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 718.15 కోట్లు ఆశిస్తోంది. కేబినెట్‌ నోట్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రస్తావించలేదని గుర్తించిన అధికారులు.. కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించారు. స్పష్టత, సవరణల కోసం కేంద్రంతో చర్చించి.. ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనన్ని నిధులను పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
 
dabbaf.jpg 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...