Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Tyre Manufacturing Plant, Chittoor – Apollo Tyres


The Cabinet also approved the proposal to allot land to an extent of 56.63 acres in Chittoor in favour of M/sApollo Tyres Ltd., for the establishment of a Tyre Manufacturing Plant. The plant would be set up with an investment of Rs. 4,500 crores across three phases and would provide employment to 1,400 people. This project would be one of the most important projects with regards to the government’s aim to develop an auto ancillary ecosystem in the state.

Link to comment
Share on other sites

Apollo Tyres adds truck radials in Andhra after strong revival in segment

 

Original plan was to make only cars tyres; firm also plans Rs 10 bn capex for maintenance of existing units and to complete Chennai expansion

Apollo Tyres is planning to produce commercial vehicle tyres at its upcoming facility at Andhra Pradesh, where it plans to invest around Rs 18-20 billion. Originally the company was planning to produce only car tyres, but it is now adding tyre bus radials (TBR).

The company said it has lined up around Rs 10 billion for the current fiscal as capex, towards regular maintenance of existing facilities and to complete the Chennai expansion. This doesn't include investments in Andhra Pradesh.

Gaurav Kumar, CFO, Apollo Tyres, said that Andhra Pradesh Greenfield would start production in the second half of fiscal 2020.

"We are on the drawing board right now. Given the strong revival in demand and the significant volume growth outlook in AP, we are considering both car and truck tyres," Kumar said, confirmin that the earlier plan was to consider only car tyres.

Apollo had set up a large facility at Oragadam near Chennai, where it produces nearly 8,000 tyres a day and plans increase that to 12,000 tyres. Apollo decided to go for a new greenfield in Andhra, following land constraints in Chennai.

Apollo earlier said it is looking at an initial car tyre capacity of about 16,000 units a day in Andhra Pradesh.

The truck radial capacity is being finalised, and would be based on demand ooutlook, Kumar said. Usually based on machinery configuration, manufacturing capacity is in multiples of 1,500 tyres per day.

At the Chennai facility there is no way that production can be expanded beyond the 12,000 units. Average run rate for fiscal 2018 would be somewhere in the region of 8,000 units, so there is enough scope for growth in terms of capacity utilisation in Chennai this year, Kumar said during an analyst call.

The Chennai plant has a capacity of 16,000 passenger car tyres and 10,000 TBR a day currently. The TBR capacity will go up to 12,000 a day in the next few months. Utilisation is upwards of 90 per cent.

Link to comment
Share on other sites

ఆంధ్రా ఒడికి.. పెట్టుబడి
3 ఏళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు
ఇప్పటికే రూ.24,901 కోట్లతో    పరిశ్రమల స్థాపన
అన్నీ ఆచరణకు వస్తే  2 లక్షల మందికిపైగా ఉపాధి
ఈనాడు - అమరావతి
3ap-main4a.jpg

రాష్ట్ర పారిశ్రామికరంగంలో విదేశీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం విదేశీ సంస్థలు రూ.1,00,141 కోట్లతో 55 పరిశ్రమల స్థాపనకు చేసుకున్న ఒప్పందాల్లో 65 శాతానికిపైగా ఆచరణకు నోచుకున్నాయి. మిగతా 35 శాతం వివిధ దశల్లో ఉన్నాయి. విదేశీ పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, సౌర, పవన విద్యుత్తురంగాల్లో ఎక్కువగా విదేశీసంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.

ఉపాధి మార్గం..
* రాష్ట్రంలో 30విదేశీ సంస్థలు రూ.24,901 కోట్ల పెట్టుబడులు పెట్టి ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటిలో 33,904 మందికి ఉపాధి లభిస్తోంది. ముఖ్యమంత్రి చైనా పర్యటనలో ఒప్పందం చేసుకున్న ఫాక్స్‌కాన్‌, హెంగ్‌జౌ హాటాంగ్‌, సాఫ్ట్‌ బ్యాంకు ఎస్‌బీజీ క్లిన్‌టెక్‌, దావోస్‌ పర్యటనలో ఒప్పందం చేసుకున్న సుజ్‌లోన్‌ ఎనర్జీ, గమేషా రినవబుల్‌, అమెరికా పర్యటనలో ముందుకొచ్చిన పై డేటా సెంటర్‌తోసాటు ఇతర దేశాలకు చెందిన సన్‌ ఎడిషన్‌, పెప్సీ, మాండెలెజ్‌, హస్పిరా తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి.
* మరో 18 విదేశీ సంస్థల ఆధ్వర్యంలో రూ.30,195 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు  చేస్తున్న పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైతే 78,535 మందికి ఉపాధి లభిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌, ముఖ్యమంత్రి సింగపూర్‌ పర్యటనలో ఒప్పందం చేసుకున్న ఎసండాస్‌, చైనా పర్యటనలో ముందుకొచ్చిన ట్రైనా సోలార్‌, లాంగి సిలికాన్‌, జపాన్‌ పర్యటనలో ఒప్పందం చేసుకున్న మిత్సుబిషి, చైనా పర్యటనలో ముందుకొచ్చిన చైనా ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ, ఆర్‌ఎస్‌ఎం గ్రూపు, టోరెయి తదితర సంస్థలు ఉన్నాయి.
* మరో ఏడు విదేశీ సంస్థలు తమ పెట్టుబడులపై ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకొని తదుపరి అనుమతుల కోసం యత్నిస్తున్నాయి. రూ.44,325 కోట్లు పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమలతో 1,18,400 మందికి ఉపాధి లభించనున్నది. వీటిలో ముఖ్యమంత్రి చైనా పర్యటనలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న గోల్డెన్‌ కాంకర్డ్‌ హోల్డింగ్స్‌, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు, దావోస్‌ పర్యటనలో ముందుకొచ్చిన ఇందని గ్లోబల్‌, మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ పార్టనర్స్‌, రష్యా పర్యటనలో ఒప్పందం చేసుకున్న యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ టెక్నోనికాల్‌ సంస్థలు ఉన్నాయి.

విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్న అంశాలు..
* ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను అభివృద్ధి చేసి సిద్ధం చేయడం.
* 24 గంటలూ విద్యుత్తు, నీటి సదుపాయం, రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు అందుబాటులో ఉండటం.
* ఏక గవాక్ష విధానంలో 21 రోజుల్లో ప్రభుత్వశాఖల నుంచి ఆన్‌లైన్‌లో అనుమతులిచ్చేలా చర్యలు, ఇతర రాయితీలు.

Link to comment
Share on other sites

2,954 కోట్లతో భారీ పరిశ్రమలు
విశాఖ, అనంతపురం, చిత్తూరులో నాలుగు ఏర్పాటు
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించిన అధికారులు
ఈనాడు - అమరావతి
12ap-main8a.jpg

రాష్ట్రంలో రూ.2,954 కోట్ల పెట్టుబడులతో మరో నాలుగు పరిశ్రమలు రానున్నాయి. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో సెయింట్‌ గోబోయిన్‌ ఇండియా రూ.2వేల కోట్లతో ప్లాస్టర్‌ బోర్డు, గ్లాస్‌ తయారీ యూనిట్టు (450 మందికి ఉపాధి), అనంతపురం జిల్లాలో గ్రాబ్‌ మెషిన్‌ టూల్స్‌ ఇండియా రూ.304 కోట్లతో (400 మందికి) ‘మెషిన్‌ టూల్స్‌’ తయారీ కర్మాగారం, చిత్తూరులో రూ.150 కోట్లతో (1200 మందికి) ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెల్‌కాన్‌ ఇంపెక్స్‌, రూ.500 కోట్లతో (430 మందికి) స్మార్ట్‌ ఫుడ్‌ లిమిటెడ్‌ ‘రెడీ టు ఈట్‌’ ప్యాకేజ్డ్‌ ఆహార తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో రూ.16,12,316 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 2,721 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే 36,40,068 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలశాఖ కార్యదర్శి సోల్మాన్‌ ఆరోఖ్యరాజ్‌ వివరించారు. ఉత్పత్తి దశలో ఉన్న 706 పరిశ్రమలతో 2,99,078 మందికి ఉద్యోగ, ఉపాధి లభించిందని చెప్పారు. 1,041 పరిశ్రమలు ఆకుపచ్చ కేటగిరి దశకు చేరుకున్నాయని, మరో 1680 యూనిట్లు ఎరుపురంగు కేటగిరిలో ఉన్నాయని తెలిపారు.

అవసరమైతే నిబంధనలు సడలించాలి: ముఖ్యమంత్రి
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైతే నిబంధనలు సడలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇతర రాష్ట్రాల కంటే ప్రోత్సాహకాలు బాగా ఇవ్వడం, సులభతర వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించినప్పుడు పెట్టుబడులు వస్తాయన్నారు. విశాఖలో భూముల విలువ ఎక్కువగా ఉన్నందున, చిత్తూరు ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించేలా చూడాలని సూచించారు. తిరుపతి నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతం ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమలతో కళకళలాడాలని చెప్పారు. 400 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల మేర ఎగుమతులకు ఈ రంగంలో అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెల 10న కొరియన్‌ అధ్యక్షుడు భారత్‌ పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు హాజరయ్యే శాంసంగ్‌, హ్యూండాయ్‌, ఎల్జీ, సీజే కొరియా ఫిలిప్స్‌, ఏజీఎల్‌, టోషిబా వంటి సంస్థలకు చెందిన వ్యాపార దిగ్గజాలతో చర్చించి రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూలతలను వివరించి పెట్టుబడులు పెట్టించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు వివరించారు. విశాఖ, శ్రీకాళహస్తి-ఏర్పేడు పేరుతో రెండు ప్రాంతాలను, ప్రాథమికంగా 5,815 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఒక బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. మచిలీపట్నం, దొనకొండలో మరో రెండు పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటవుతాయన్నారు.  మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

జనవరి 1 కల్లా  కియా కారు! 
కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన 
12ap-state1a.jpg

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనవరి ఒకటి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కియా తొలి కారును బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కియా మోటార్స్‌ భారత్‌ ప్రతినిధులకు సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ప్లాంట్‌ పనులను వివరించి, వీడియో చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన వేగాన్ని కియా అందుకుంటుందని వ్యాఖ్యానించారు. పనుల నిర్వహణపై సంతృప్తి ప్రకటించారు. కొత్త సంవత్సరంలో భారత్‌లో తయారయ్యే మొదటి కియా కారును దేశానికి అందించాలని కోరారు. కియాకు సంబంధించి భూసేకరణ అంశాలను వెంటనే పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్‌ను ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని యువతకు ఆటోమొబైల్‌ విభాగంలో నైపుణ్యం కల్పించేందుకు కియా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి ఈనెల 20 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Link to comment
Share on other sites

ఆ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే.. 36 లక్షల ఉద్యోగాలు
13-06-2018 03:15:06
 
  • రాష్ట్రంలో వివిధ దశల్లో 2,721 సంస్థలు
  • 16 లక్షల కోట్ల పెట్టుబడులు
  • రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలదే కీలకపాత్ర:సీఎం
  • ఎస్‌ఐపీబీ సమావేశంలో అధికారులతో సమీక్ష
 
అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న 2,721 సంస్థలు ఉత్పత్తిని ప్రారంభిస్తే 36,40,316 మందికి ఉద్యోగాలు దక్కుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) వెల్లడించింది. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణ, ప్రోత్సాహకాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌. అమర్నాథరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు యువతకు ఉద్యోగాలూ రావాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలదే కీలకపాత్ర అన్నారు. ఇప్పటికే 706 పరిశ్రమలు ఉత్పత్తి దశలో ఉన్నాయని సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ వివరించారు. ఈ పరిశ్రమలు రూ.1,47,566 కోట్ల పెట్టుబడి పెట్టి 2,99,078 మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు.
 
గ్రీన్‌, రెడ్‌ కేటగిరీలుగా పరిశ్రమల ట్రాకింగ్‌ జరుపుతున్నామని, 1,041 పరిశ్రమలు గ్రీన్‌ కేటగిరి దశకు చేరుకున్నాయని, మరో 1,680 పరిశ్రమలు రెడ్‌ కేటగిరిలో ఉన్నాయని వివరించారు. గ్రీన్‌ కేటగిరిలోని 1,041 పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి దశకు చేరుకుంటే రూ.4,76,111 కోట్ల పెట్టుబడులతో పాటు 8,45,401 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని అధికారులు వివరించారు. ఇందులో 27 పరిశ్రమలు ఉత్పత్తి ట్రయల్‌ దశలో ఉన్నాయని, మరో 64 యూనిట్లలో యంత్రాలు బిగిస్తున్నారని తెలిపారు. రూ.2,10,625 కోట్ల పెట్టుబడులతో మరో 198 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇక రెడ్‌ కేటగిరిలోని 1,680 పరిశ్రమల్లో రూ.16,529 కోట్ల పెట్టుబడులతో వచ్చిన 51 యూనిట్లకు భూ కేటాయింపులు జరిగాయని తెలిపారు. రూ.76,911 కోట్ల పెట్టుబడులతో వచ్చే మరో 429 యూనిట్లకూ భూ కేటాయింపులు జరిగాయని వివరించారు. రూ.2,36,138 కోట్ల మేర పెట్టుబడులతో వచ్చే మరో 300 పరిశ్రమలు... భూ కేటాయింపులు, అనుమతుల దశలో ఉన్నాయన్నారు. ఇవిగాక మరో 900 యూనిట్లు రూ.8,06,557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి డీపీఆర్‌లు సమర్పించేందుకు సన్నద్ధంగా ఉన్నాయని వివరించారు. 629 యూనిట్లతో ఆహార తయారీ పరిశ్రమ ప్రథమ స్థానంలో ఉంటే.. 510 యూనిట్లతో పరిశ్రమల శాఖ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) మొత్తం 413 పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలో 98 సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. 2014 నుంచి ఇప్పటిదాకా రూ.1,21,713 కోట్ల పెట్టుబడులతో 86 మెగా పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ అనుమతులు ఇచ్చింది. వీటి ద్వారా 2,69,710 మందికి ఉపాధి లభించనుంది. రూ.5,229 కోట్లతో 20 మెగా యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిలో 37,340 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రూ.2,107 కోట్లతో మరో మూడు మెగా యూనిట్లు ట్రయల్‌ దశకు చేరుకున్నాయి. ఇవి మూడువేల మందికి ఉపాధి కల్పించాయి. రూ.750 కోట్లతో మరో పరిశ్రమ యంత్రాల బిగింపు దశలో ఉంది. రూ.21,583 కోట్ల పెట్టుబడితో 18 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 46,620 మందికి ఉపాధి దక్కుతుంది.
 
మరో నాలుగు కంపెనీలు..
రాష్ట్రంలో మరో నాలుగు కంపెనీలు రూ.2954 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటిపై ఎస్‌ఐపీబీలో సవివరంగా చర్చించారు. సెయింట్‌ గోబొయన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ రూ.2000 కోట్ల పెట్టుబడితో విశాఖలో ప్లాస్టర్‌ బోర్డు, గ్లాస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను స్థాపించనుంది. గ్రాబ్‌ మెషిన్‌ టూల్స్‌ ఇండియా సంస్థ అనంతపురంలో 400 కోట్ల పెట్టుబడితో, సెల్‌కాన్‌ చిత్తూరులో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చిత్తూరులో రెడీటూ ఈట్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు స్మార్ట్‌ ఫుడ్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌,(వీసీఐసీ), చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌(సీబీఐసీ) పురోగతిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. జూలై 10న కొరియన్‌ అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారని వివరించారు. ఈ పర్యటనలో శాంసంగ్‌, హ్యుండయ్‌, ఎల్జీ, సీజే కొరియా, ఫిల్లిప్స్‌, ఏజీఎల్‌, తోషీబా వంటి దిగ్గజ సంస్థల యాజమాన్య ప్రతినిధులూ రానున్నారని చెప్పారు. ఆ సంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు.
Link to comment
Share on other sites

భూకేటాయింపుల్లో జాప్యమా?
15-06-2018 03:19:33
 
636646295859252366.jpg
  • ఎస్‌ఐపీబీలో చంద్రబాబు ఆగ్రహం
  • ప్రతి సోమవారం పరిశ్రమల శాఖ సమీక్షకు ఆదేశం
అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తామంటూ ముందుకొచ్చిన సంస్థలకు భూములు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12న జరిగిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో... రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిశ్రమలకు ఏపీఐఐసీ, రెవెన్యూ ఇతర శాఖల నుంచి భూములు అందడం లేదని వెల్లడైంది. దీంతో.. ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించకుండా, నిరోధించేలా వ్యవహరించడం ఏమిటంటూ నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలు ఆర్‌-1, ఆర్‌-2, ఆర్‌-3 కేటగిరీలుగా మిగిలిపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. భూములతో సహా ఇతర అనుమతులు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ క్రిబ్కోకు మినహాయించి .. మిగిలిన సంస్థలు అల్ట్రాటెక్‌, వీబీసీ, గుజరాత్‌ అంబూజా, దీవీస్‌ ల్యాబ్‌, ట్రినా సోలార్‌, లాంజీ సోలార్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, కొత్తవలస ఇన్‌ఫ్రా, హిందుస్థాన్‌ కోకాకోలా, బ్రిటానియా, ోకుల్‌ దాస్‌ ఎక్స్‌పోర్ట్సు, సిరీన్‌ డ్రగ్స్‌, ఇందానీ గ్లోబల్‌, వ్యాస్‌ కేన్సర్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌, ఇండో కౌంట్‌, జీటీపీఎల్‌ వంటి సంస్థలు వేల కోట్లలో పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వచ్చాయి. వీటికి భూములు కేటాయించడంలో ఏపీఐఐసీతో సహా రెవెన్యూ శాఖ ముందడుగు వేయడం లేదని ఎస్‌ఐపీబీలో చర్చకు రావడంతో .. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల శాఖకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు అనుమతులపై ఇకపై ప్రతీ సోమవారం వివిధ శాఖాధిపతులతో సమావేశాన్ని నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌ను ఆదేశించారు. అదేవిధంగా . ఆర్‌-1, ఆర్‌-2, ఆర్‌-3 పరిధిలోని పారిశ్రామికవేత్తలతో వచ్చే నెలలో వర్క్‌షాప్ ను నిర్వహించాలని సాల్మన్‌ ఆరోకియా రాజ్‌కు సీఎం స్పష్టం చేశారు.
 
 
మంత్రివర్గ సమావేశంలో టెక్స్‌టైల్‌ పాలసీ
ఈ నెల 19న జరిగే కేబినెట్‌ సమావేశంలో టెక్స్‌టైల్‌ పాలసీని పరిశ్రమల శాఖ ప్రవేశ పెట్టనున్నది. వాస్తవానికి గత కేబినెట్‌ భేటీలోనే ఈ పాలసీని ప్రవేశ పెట్టాలని పరిశ్రమల శాఖ భావించింది. అయితే.. ఈ పాలసీ పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది చర్చకు రాలేదు. ఎస్‌ఐపీబీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఈ పాలసీని కేబినెట్‌లో పెట్టాలని ఆదేశించారు. దీంతో.. ఈ నెల 19న జరిగే మంత్రివర్గ సమావేశానికి టెక్స్‌టైల్‌ పాలసీ రానున్నది.
 
 
ఖాయిలా పడ్డ పరిశ్రమలకూ చేయూత
రాష్ట్రంలో ఖాయిలా పడ్డ ఎంఎస్ ఎంఈలను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక పాలసీని పరిశ్రమల శాఖ రూపొందిస్తుంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ రూపొందింది. దీనిపై త్వరలోనే సమీక్షించి తుది పాలసీని రూపొందించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది.
Link to comment
Share on other sites

13 ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

ఈనాడు, అమరావతి: గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లోగల 13 ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రత్యేక కేసులుగా పరిగణించి ప్రోత్సాహకాల విడుదల కోసం తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విధానాన్ని (2015-20) ఇప్పటికే విడుదల చేసింది. చాలామంది జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ల వద్ద చేసుకున్న దరఖాస్తులు అపరిష్కృతంగా నిలిచిపోవడంతో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను కోల్పోయారు. ఈ విషయాన్ని బాధితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015-20 విధానం వచ్చిన తరువాతే దరఖాస్తులు చేసినందున ప్రత్యేక కేసులుగా పరిగణించి న్యాయం చేయాలని కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...