Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

LIXIL to invest $65 million to establish ceramic manufacturing plant in Andhra Pradesh

The move comes after company completed its acquisition of Sentini Sanitarywares, including its recently established contemporary sanitaryware plant.Ankit Sharma  |

NEW DELHI: LIXIL Corporation (LIXIL) will invest approximately US 65 million dollars to establish a ceramic manufacturing facility in Andhra Pradesh.

The move comes after company completed its acquisition of Sentini Sanitarywares, including its recently established contemporary sanitaryware plant.

Bijoy Mohan,CEO, LIXIL Asia Pacific said, "Our investment in this factory will create significant value for our employees, customers, consumers and communities. Enhanced local capacity along with flexibility and agility in the supply chain will help LIXIL achieve market leadership in India.”

After the acquisition, the company will be renamed LIXIL India Sanitarywares. Seshagiri Rao Tipirneni, the chairman of Sentini Group, will continue to be a shareholder and will act as an advisor to the Board of Directors of this entity.

“This investment demonstrates our strong commitment to the dynamic Indian market and its consumers, which is a strategic priority for LIXIL for the future. The move also strengthens our overall ceramics production capacity, enabling exports to key markets such as the U.S,” said Kinya Seto, president and CEO, LIXIL.

The factory currently has a production capacity of 1 million units per year with scalability of up to 2 million units in the future.

The facility will manufacture products for both GROHE and American Standard.

Shubhajit Sen, country head, LIXIL India said “We see great growth potential in India and, with this investment, aim to capture 15-20% share and lead the local ceramics market in the next 3 years.”

Link to comment
Share on other sites

రాష్ట్రానికి రారండోయ్‌!
25-01-2018 02:19:58
636524436028509537.jpg
  • ప్రఖ్యాత కంపెనీలకు సీఎం పిలుపు
  • దావోస్‌లో చంద్రబాబు వరుస చర్చలు
  • నీటిని దాచి... అందించే ‘యూపీఎల్‌’
  • వేదాంత ‘విశ్వవిద్యాలయ నగరం’ ప్రతిపాదన
  • ఈ ఏడాదే సీ-295 విమానం ఉత్పత్తి కేంద్రం
  • టాటా, ఎయిర్‌ బస్‌ సంయుక్త భాగస్వామ్యం
  • బ్లాక్‌ చైన్‌ ‘ఏథేరియం’కు ఆహ్వానం
‘ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రం. విభజన తర్వాత ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. 2022కు దేశంలోని మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు
 
దావోస్‌లో ఎయిర్‌బస్‌ సీఈవో డిర్క్‌ హోక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం
 
 
అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పుష్కలంగా వర్షాలు కురిసినప్పుడు నీటిని దాచి.. అవసరమైనప్పుడు అదే నీటిని అందించే వినూత్న పరికరం! సకల విద్యా సదుపాయాలుండే ‘విశ్వవిద్యాలయ నగరం’! బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ శిక్షణకు ఆహ్వానం! ఇలా వివిధ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను సీఎం చంద్రబాబు నవ్యాంధ్రకు ఆహ్వానించారు. దావోస్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆయా సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు జరిపారు. ఈ ఏడాది చివరిలోనే నవ్యాంధ్రలో ‘సీ-295’ రవాణా విమానం తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ సీఈవో డిర్క్‌ హోక్‌ సీఎంకు హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన అనుమతులను తెచ్చుకుంటున్నామని తెలిపారు.
 
సైనిక, వ్యూహాత్మక రంగాల్లో రవాణా కోసం ఉపయోగించే సీ-295 విమానాల తయారీని ఎయిర్‌ బస్‌ సంస్థ టాటా భాగస్వామ్యంతో నెలకొల్పుతోంది. వివిధ దేశాల్లో ఉన్న తమ తయారీ యూనిట్లను ఒకసారి సందర్శించాలని ముఖ్యమంత్రిని హోక్‌ ఆహ్వానించారు. ఈ విమాన తయారీ కేంద్రంపై ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ గత ఏడాదే కొత్త ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాజాగా మరోసారి సీఎం వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. భారత్‌లో జోస్టన్‌ తరహాలో ఒక విశ్వ విద్యాలయ టౌన్‌షి్‌పను నెలకొల్పే ఉద్దేశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాంత సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వివరించారు. ఈ టౌన్‌షి్‌పను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వేదాంత ప్రాజెక్టులను, సామాజిక బాధ్యత కింద చేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి అనిల్‌ అగర్వాల్‌ వివరించారు.
 
పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంతో బాధ్యతతో, ఉత్సాహంతో పనిచేస్తున్నారని అభినందించారు. ‘‘మీ బృందం స్పందిస్తున్న తీరు అభినందనీయం. మీ ప్రభుత్వంతో కలసి పనిచేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని అన్నారు. విశాఖ నగరంలో జంట శిఖరాలను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేదాంతకు భూమిని కేటాయించి, అనుతులు ఇచ్చింది.
 
బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ సంస్థ ఏర్పాటుకు కృషి
దావోస్‌ పర్యటనలో భాగంగా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీకి చెందిన ‘ఏథేరియం’ వ్యవస్థాపకుడు జో లుబిన్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ సంస్థను ఏథేరియం - రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నెలకొల్పితే బాగుంటుందని జోబిన్‌కు సీఎం సూచించారు. భారత్‌లో ఎక్కడా బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కోర్సు లేదని, రాష్ట్రంలో ఏదైనా విద్యాలయాన్ని ఎంపిక చేసుకుని మూడు నెలల కోర్సు ప్రారంభించవచ్చని జో లుబిన్‌ తెలిపారు. ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ వచ్చే వారం న్యూయార్క్‌ పర్యటనలో భాగంగా ఏథేరియంను సందర్శిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు.
 
హెచ్‌పీ 3డీ ప్రింటింగ్‌ హెడ్‌తో భేటీ
హెచ్‌పీ 3డీ ప్రిటింగ్‌ హెడ్‌ స్టీవెన్‌ నిగ్రోత్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. మెటల్‌ గేర్‌ వీల్‌ తయారీ, త్రీ-డీ ప్రింటింగ్‌ విధానంపై ఈ సంస్థ ప్రతినిధులు ఒక ప్రదర్శన ఇచ్చారు. తాము ఇప్పటికే ‘వైజాగ్‌ మెడ్‌టెక్‌’ జోన్‌లో నూతనతరం 3డీ ప్రింటింగ్‌ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రెండు నెలల్లో అమరావతికి వస్తానని స్టీవెన్‌ వెల్లడించారు.
 
అక్కడ స్మార్ట్‌ క్యాంపస్‌ - ఇక్కడ స్మార్ట్‌ ఏపీ
నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ సుబ్రా సురేశ్‌తోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సింగపూర్‌లోని తమ వర్సిటీ క్యాంప్‌సను స్మార్ట్‌ క్యాంప్‌సగా తీర్చిదిద్దుతున్నామని సురేశ్‌ వివరించారు. ఇప్పటికే 60 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్సిటీలో అంతర్గత రవాణాకు ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉపయోగిస్తామని... తమది ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్‌ అని వివరించారు. ఈసారి సింగపూర్‌ పర్యటనకు వచ్చినప్పుడు నన్యాంగ్‌ క్యాంప్‌సను సందర్శించాలని చంద్రబాబును సురేశ్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చాలని తాము కార్యాచరణను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా సురేశ్‌కు చంద్రబాబు వివరించారు.
 
 
సాగుపైనా దృష్టి...
దావో్‌సలో ఒకవైపు పెట్టుబడుల వేట సాగిస్తూనే... మరోవైపు, రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధిపైనా చంద్రబాబు దృష్టి సారించారు. వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థలతో మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భూమిలో నీటిని గ్రహించి ఆ నీటిని కరువు సమయంలో తిరిగి విడుదల చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ తరహా ఉత్పత్తులను యూపీఎల్‌ లిమిటెడ్‌ సంస్థ తయారు చేస్తోంది. అలాగే, భూమిపై చల్లిన ఎరువులు భారీ వర్షాల సమయంలో కొట్టుకుపోయి వృథా కాకుండా సంరక్షించే మరో ఉత్పత్తిని సైతం యూపీఎల్‌ సంస్థ రూపొందించింది. దీంతో, 30 శాతం ఎరువుల వినియోగం తగ్గుతుందని తయారీ సంస్థ వివరిస్తోంది. యూపీఎల్‌ సంస్థ గ్లోబల్‌ సీఈవో జై షరో్‌ఫతో బుధవారం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
Link to comment
Share on other sites

శ్రీసిటీలో ఐఎఫ్‌ఎఫ్‌ ప్లాంట్‌
25-01-2018 00:50:33
 
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన ఐఎ్‌ఫఎఫ్‌ (ఇంటర్‌నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రన్సెస్‌ ) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఆసియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్న వ్యూహంలో భాగంగా శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది ఈ ప్లాంట్‌ 2019 ఆఖరునాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కేంద్రంలో తయారయ్యే ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్టు ఐఎ్‌ఫఎఫ్‌ ఎండి ఎంజి ప్రకాష్‌ చెప్పారు. ఐఎ్‌ఫఎఫ్‌ ప్రపంచంలోని బడా కార్పొరేట్‌ సంస్థల్లో ఒకటి ఈ సంస్ధ వార్షిక అమ్మకాలు 310 కోట్ల డాలర్లు. శ్రీసిటి ప్లాంట్‌ పెట్టుబడి వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు
Link to comment
Share on other sites

రాష్ట్రానికి ఎయిర్‌బస్‌?
సి-295 విమానాల ఉత్పత్తి కేంద్రం
సంస్థ సీఈవోతో సీఎం చంద్రబాబు చర్చలు
వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానాలపై యూపీఎల్‌  సీఈవోతో భేటీ
ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా చేసుకోవాలని విజ్ఞప్తి
బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై ఎథేరియంకు ప్రతిపాదన
ఈనాడు - అమరావతి
24ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో సి-295 విమానాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకి ఎయిర్‌బస్‌ సంస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, అన్ని అనుమతులూ వెంట వెంటనే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో ఆయన బుధవారం ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ సంస్థ సీఈవో డిర్క్‌ హోక్‌ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎయిర్‌బస్‌ సంస్థ టాటా గ్రూప్‌తో కలసి ఈ విమాన తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఏపీ కోరుతోంది. ఎయిర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. రాష్ట్రాన్నీ సందర్శించారు. ‘‘ఈ ఏడాది చివరిలోగా ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పుతాం’’ అని డిర్క్‌ హోక్‌ పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని తమ ఉత్పాదక  యూనిట్లను ఒకసారి సందర్శించాలని చంద్రబాబుని ఆయన ఆహ్వానించారు.

విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ ఏర్పాటుకి ఆహ్వానం
భారత్‌లో బోస్టన్‌ తరహాలో ఒక విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ నెలకొల్పే ఉద్దేశంతో ఉన్నామని వేదాంత సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ చొరవను అనిల్‌ అగర్వాల్‌ ప్రశంసించారు.

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు
రాష్ట్రంలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో మూడు నెలల బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు ప్రారంభించాలని ‘ఎథేరియం’ సంస్థ వ్యవస్థాపకుడు జో లుబిన్‌ను చంద్రబాబు కోరారు. ఈ టెక్నాలజీలో ఆ సంస్థకు చాలా అనుభవం ఉంది. భారతదేశంలో ఎక్కడా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు లేదని, రాష్ట్రంలోని ఏదైనా యూనివర్శిటీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎథేరియం సంయుక్తంగా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు.

విరివిగా త్రీడీ ముద్రణ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా త్రీడీ ముద్రణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఈ పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని హెచ్‌పీ సంస్థను ముఖ్యమంత్రి కోరారు. హెచ్‌పీ త్రీడీ ప్రింటింగ్‌ హెడ్‌ స్టీఫెన్‌ నిగ్రోతో ఆయన సమావేశమయ్యారు. రెండు నెలల్లో భారత్‌ పర్యటనలో భాగంగా అమరావతికి వస్తానని స్టీఫెన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్రీడీ ప్రింటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు విషయమై హెచ్‌పీ భారత్‌ సీఈవోతో సంప్రదిస్తానని తెలిపారు.

ఫ్రాన్‌హోఫర్‌ ప్రతినిధితో భేటీ
లీప్‌ఝిగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ రీసెర్చ్‌ సంస్థకు సంబంధించిన ఫ్రాన్‌హోఫర్‌ ప్రతినిధి తొబియాస్‌ డౌత్‌ తదితరులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 20 వేల మంది ఉద్యోగులు కలిగిన ఈ సంస్థ ఐరోపాలోని అనేక కంపెనీలకు మార్కెట్‌ అనలైటిక్స్‌ సేవల్ని అందజేస్తోంది. ఫ్రాన్‌హోఫర్‌ క్లయింట్‌లుగా ఉన్న బీఎండబ్ల్యూ, బాష్‌ భారత్‌లో తమ వ్యాపార విస్తరణకు అవకాశాల్ని అన్వేషిస్తున్నాయి. ఫ్రాన్‌హోఫర్‌తో ఆంధ్రప్రదేశ్‌ కలసి పనిచేయడం వల్ల పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. లీప్‌ఝిగ్‌ను సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు.

రాష్ట్రం మొత్తం స్మార్ట్‌..!
సింగపూర్‌లోని నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్‌ మాట్లాడుతూ తమ యూనివర్సిటీ ప్రాంగణాన్ని స్మార్ట్‌ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రాంగణంలో అంతర్గత రవాణాకి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తున్నామని, 35 శాతం ఇంధనం ఆదా అవుతోందని వెల్లడించారు. తమది ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ అనుకూల క్యాంపస్‌ అని, ఒకసారి సందర్శించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

కరవు నియంత్రణ  ఆవిష్కరణలపై చర్చ
భూమిలోని నీటిని గ్రహించి, ఆ నీటిని కరవు సమయంలో తిరిగి విడుదల చేసే సరికొత్త సాంకేతికతపై యూపీఎల్‌ సంస్థ గ్లోబల్‌ సీఈవో జైష్రాఫ్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ సంస్థ ఒక ఎకరం విస్తీర్ణంలో 2 వేల లీటర్ల నీటిని గ్రహించే పరికరాల్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది కరవుని నియంత్రించేందుకు దోహదం చేయడమే కాకుండా, 30 నుంచి 40 శాతం వరకు ఉత్పాదకతా పెంచుతుందని జైష్రాఫ్‌ వివరించారు. భూమిపై చల్లిన ఎరువులు భారీ వర్షాలకు కొట్టుకుపోయి వృథా కాకుండా సంరక్షించే మరో పరిజ్ఞానాన్ని సైతం తాము రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎరువుల వినియోగం తగ్గించడం, సమర్థ నీటి నిర్వహణ, సాగు ఖర్చుల్ని తగ్గించడం, ఉత్పాదకత పెంచడం తమ లక్ష్యాలుగా ఆయన వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించండి మీ ఉత్పత్తులకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసుకోండి’’ అని చంద్రబాబు కోరారు.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌
న్యూయార్క్‌ వర్సిటీ గవర్నమెంట్‌  ల్యాబ్‌ సంసిద్ధత
  సౌర విద్యుత్‌ పరికరాల తయారీ కంపెనీ ఏర్పాటుకు ‘ఏకాన్‌’ సంస్థ ఆసక్తి
  వివిధ సంస్థల ప్రతినిధులతో దావోస్‌లో లోకేష్‌ సమావేశాలు
26ap-main7a.jpg

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇన్నోవేషన్‌ ల్యాబ్‌’ ఏర్పాటుకు న్యూయార్క్‌ యూనివర్సిటీ గవర్నమెంట్‌ ల్యాబ్‌ ముందుకొచ్చింది. దావోస్‌ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో ల్యాబ్‌ ప్రొఫెసర్‌ బెత్‌ సైమన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటుచేయాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్ని పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే అవకాశముంటుందని లోకేష్‌ పేర్కొన్నారు. బెత్‌ సైమన్‌ సానుకూలంగా స్పందించారు. ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని, అమెరికా నుంచి ఉత్తమ ప్రొఫెసర్లను తీసుకొచ్చి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా తమ ల్యాబ్‌ని సందర్శించాలని లోకేష్‌ని సైమన్‌ ఆహ్వానించారు. ప్రభుత్వ పాలనలో అనేక నూతన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆవిష్కరణల్ని ఈ ల్యాబ్‌ చేస్తోంది. సాంకేతికత ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడం, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని లోకేష్‌ పేర్కొన్నారు. డేటా వినియోగం ద్వారా పాలనలో నూతన ఆవిష్కరణలు, పనితీరు మదింపు, డ్యాష్‌బోర్డ్‌ నిర్వహణలో సహకారం అందించాలని సైమన్‌ను ఆయన కోరారు.

రాష్ట్రంలో సౌర విద్యుత్‌ పరికరాల తయారీ కంపెనీ: ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్‌ పరికరాల తయారీ కంపెనీతో పాటు, గ్రామీణ యువతకు శిక్షణనిచ్చేందుకు సోలార్‌ అకాడెమీని ఏర్పాటుచేస్తామని ‘ఏకాన్‌ లైటింగ్‌ ఆఫ్రికా’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఏకాన్‌ హామీ ఇచ్చారు. ఆయన దావోస్‌లో లోకేష్‌తో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుదుత్పత్తి,  సంబంధిత విడిభాగాల తయారీ రంగాల్లో ఏకాన్‌ లైటింగ్‌ ఆఫ్రికా విస్తరించింది. ఆఫ్రికా గ్రామాల్లో కమ్యూనిటీ సోలార్‌ ఇంధన ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని లోకేష్‌ కోరారు. తయారీ కేంద్రం, అకాడెమీ ఏర్పాటుపై మూడు నెలల్లో ప్రతిపాదనలు, కార్యాచరణ పూర్తిచేసి పనులు ప్రారంభించాల్సిందిగా లోకేష్‌ కోరారు.

హైపర్‌లూప్‌ ప్రతినిధులతో భేటీ..: హైపర్‌ లూప్‌ కంపెనీ ప్రతినిధులు బిపాప్‌, అవిరుక్‌, జోయెల్‌తో లోకేష్‌ సమావేశమయ్యారు. విజయవాడ, అమరావతి మధ్య 12కి.మీ. పొడవున పైలట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు హైపర్‌లూప్‌ సంస్థతో రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. వీలైనంత త్వరగా దాన్ని పూర్తిచేయాలని లోకేష్‌ కోరారు.

గణతంత్ర వేడుకల్లో లోకేష్‌: దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికలో భారతదేశానికి చెందిన ఇన్వెస్ట్‌ లాంజ్‌లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కలసి మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

మరో సాంకేతిక విప్లవం
త్రీడీ ప్రింటింగ్‌తో సుసాధ్యం
ఆధునిక సాంకేతికతకో వర్సిటీ
బ్లాక్‌చెయిన్‌, ఫిన్‌టెక్‌లపై కోర్సులు
ఇన్నోవేషన్‌ వ్యాలీగా ఏపీ
దావోస్‌ పర్యటన విజయవంతం
ఎవరినోట విన్నా ఆంధ్రప్రదేశ్‌ మాటే
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ఈనాడు - అమరావతి
27ap-main11a.jpg

బ్లాక్‌చెయిన్‌, ఫిన్‌టెక్‌, త్రీడీ ప్రింటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన కోర్సుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్నిగానీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని గానీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్రీడీ ప్రింటింగ్‌తో మరో సాంకేతిక విప్లవం రాబోతోందని పేర్కొన్నారు. విశాఖలో వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తన దావోస్‌ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు, పరిశ్రమల్ని రప్పించేందుకే దావోస్‌ వెళ్లినట్లు చెప్పారు. ‘1995లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లా. అప్పట్లో భారత్‌ నుంచి ఎవరూ వచ్చేవారు కాదు. ఈసారి డబ్ల్యూఈఎఫ్‌ మనకు చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం దావోస్‌ను ‘ఇండియా దావోస్‌’గా ప్రకటించారు. ప్లీనరీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి రోజూ యోగా సాధన చేయించారు. ప్రపంచం మొత్తం భారత్‌ ప్రాధాన్యాన్ని గుర్తించింది. మన దేశంవైపు చూస్తోంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

* టెక్నాలజీలో స్విట్జర్లాండ్‌ ముందంజలో ఉంది. జ్యూరిక్‌తో పరస్పర సహకారానికి సోదర రాష్ట్ర ఒప్పందం చేసుకున్నాం. హిటాచితో మరో ఎంవోయూ చేసుకున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ మన సొంతం. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హిటాచి సహకరిస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల్నీ ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తున్నాం. 30 విభాగాల పని పూర్తయింది. మార్చి నాటికి కాగిత రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ వ్యక్తయినా ఇంట్లో కూర్చుని సమస్య ప్రభుత్వం దృష్టికి తేవొచ్చు. యాప్‌ ఆన్‌చేసి నాకు ఈ సమస్య ఉందని చెప్పేస్తే చాలు. మెషీనే ఆ సమస్యను సంబంధిత విభాగం దృష్టికి తీసుకెళ్తుంది. సమస్య పరిష్కారమయ్యాక సమాచారం చేరవేస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో హాజరునూ అనుసంధానిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒక ప్రభుత్వ కార్యదర్శి సీట్లో ఉన్నారో లేదో... నా ఆఫీసులో కూర్చునే తెలుసుకోవచ్చు.
* దావోస్‌లో 25 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాం.
* మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌తో ఎల్‌వోఐ కుదుర్చుకున్నాం. మొత్తం 150 కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 కంపెనీలు ముందే వచ్చాయి. విశాఖలో మొదట మెడ్‌టెక్‌ జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. తర్వాత ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటవుతుంది. దానిలో శాస్త్ర నిపుణలకే 45వేల నుంచి 50వేల ఉద్యోగాలొస్తాయి.
* దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌ బాగా ఆకట్టుకుంది. ఆంధ్రా వంటలు అందరికీ నచ్చాయి. ప్రత్యేక ఆకర్షణ మనమే. ఎవరి నోట విన్నా భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ మాటే వినిపించింది.
* ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఇన్‌ ఇండియా, టెక్నాలజీస్‌ ఫర్‌ టుమారో సమావేశాల్లో పాల్గొన్నాం. ఆరు మంచి టెక్నాలజీలు వచ్చాయి. ఆ సంస్థలతో ఎంవోయూలు చేస్తున్నాం.
* ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. సీఐఐ ముందుకొచ్చింది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఈ వ్యాలీ ఏర్పాటవుతుంది.
* ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ తరఫున పెట్టుబడిలేని సహజ వ్యవసాయంపై సమావేశం జరిగింది. మనం అనుసరిస్తున్న విధానాన్ని అందరూ ప్రశంసించారు.
* అలీబాబా చాలా పెద్ద కంపెనీ. వాళ్ల టెక్నికల్‌ డైరెక్టరుతో సమావేశమయ్యా. భారత్‌లో నిలకడగా టెక్నాలజీని ప్రోత్సహించింది మీరేనని నన్ను అభినందించారు. వారి డేటా సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.
* ఎయిర్‌బస్‌ సీఈవోను కలిశా. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సానుకూలంగా ఉన్నారు.
* మన దగ్గర నాలుగైదు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తామని ఆనంద్‌ మహీంద్రా హామీ ఇచ్చారు.
* రవి రహేజాను ఆంధ్రప్రదేశ్‌కు రమ్మని ఆహ్వానించా. సానుకూలంగా స్పందించారు.
* శాప్‌ గ్లోబల్‌ హెడ్‌తో సమావేశమయ్యా. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించాం.
* సౌదీ అరామ్‌కో ఉపాధ్యక్షుడిని కలిశా. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి సుముఖంగా ఉన్నారు.
* యూపీఎల్‌ సంస్థ వ్యవసాయంలో వినూత్న టెక్నాలజీలు రూపొందించింది. వారు తయారు చేసిన ఒక పదార్థాన్ని నీటిలో కలిపి పొలానికి నీరు పెడితే... ఆరు నెలలు భూమిలో తేమ ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఎరువులు కొట్టుకుపోకుండా ఉండటానికి యూపీఎల్‌ మరో టెక్నాలజీ కనిపెట్టింది. వారం రోజుల్లోనే వాళ్లను రమ్మన్నా. ఆ టెక్నాలజీలతో అద్భుతాలు చేయొచ్చు. ముఖ్యంగా రాయలసీమలో చాలా ఉపయోగపడుతుంది.
* కాకినాడలో రూ.6వేల నుంచి రూ.7వేల కోట్లతో స్మెల్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు వేదాంత సంస్థ ముందుకొచ్చింది. భూమి ఇస్తున్నాం. విశాఖలో వారికి 350 ఎకరాల భూమి ఉంది. అక్కడ రెండు భారీ టవర్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు.
* డస్సాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ మంచి టెక్నాలజీ రూపొందించింది. భవనాలకు సహజంగా గాలి ఎలా రావాలి? విపత్తులు ఎదురైనప్పుడు రక్షణ చర్యలు ఎలా ఉండాలి? ప్రమాదాల నివారణ వంటి అంశాల్లో ఆ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. అమరావతిలో ఆ టెక్నాలజీని వినియోగిస్తాం.

Link to comment
Share on other sites

మాది మిత్ర ధర్మం
అందుకే మాట్లాడటం లేదు
మా వాళ్లను ఆపుతున్నా
వారు వద్దనుకుంటే నమస్కారం పెట్టి అప్పుడు మాట్లాడతాం
భాజపా నేతల విమర్శలపై వారి నాయకత్వమే ఆలోచించాలి
కేసుల కోసమే జగన్‌ రాయబారం
ఆయన అవినీతి ఆస్తుల్ని కేంద్రం స్వాధీనం చేసుకోవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
27ap-main1a.jpg
‘కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అతడివే (జగన్‌ను ఉద్దేశించి) కాదు.. అక్రమంగా ఎవరు ఆస్తులు సంపాదించినా స్వాధీనం చేసుకుని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. బిహార్‌, ఒడిశాలో అదే చేశారు. ఈ భయం లేకపోతే కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చినా ఫర్వాలేదు.. అస్తులుంటే బాగుపడతామని అనుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని, ఎర్రచందనం అక్రమ రవాణాతో సంపాదించిన వారి ఆస్తుల్ని, అవినీతితో రూ.కోట్లలో కూడబెట్టినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. అదే వారికి విధించే నిజమైన శిక్ష. సంపాదించిన ఆస్తులన్నీ పోయి జీరోకి వస్తేనే భయముంటుంది’
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

‘భాజపా నేతలు కొందరు చేస్తున్న విమర్శలపై నేను స్పందించను. మిత్ర ధర్మానికి కట్టుబడి ఉన్నా. దీనిపై వాళ్ల నాయకత్వమే (లీడర్‌షిప్‌) ఆలోచించుకోవాలి. మిత్ర ధర్మంవల్లే మా వాళ్లను ఆపుతున్నా. శుక్రవారమూ విమానాశ్రయంలో తాడేపల్లిగూడెంకు చెందిన మా నాయకుడు కనపడితే గట్టిగా మందలించా. మాట్లాడొద్దని చెప్పా. ఒకవేళ వాళ్లు (భాజపా) వద్దనుకుంటే నమస్కారంపెట్టి అప్పుడు మాట్లాడుకుందాం’ అని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్‌ పర్యటన విశేషాలను వివరించడానికి శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన    విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైకాపా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కుయుక్తులకు పాల్పడుతోందని, ప్రజలు బాగుపడటం చూసి ఓర్వలేకపోతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే భాజపాతో కలిసి పని చేస్తామని జగన్‌ ప్రకటించడం గురించి ప్రస్తావించగా... ‘ఇది మొదటిసారా? ఎప్పటి నుంచో రాయబారాలు సాగడం లేదా? రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు ప్రత్యేక హోదా అడిగారా? ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ఎందుకు వాయిదా వేసుకున్నారు? నిమిషానికో మాట మాట్లాడి ప్రజల్ని మోసగించడం, మభ్యపెట్టడమే తప్ప వాళ్లలో చిత్తశుద్ధి ఉందా? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పడానికే ఇదంతా. అతడికి కావాల్సింది కేసుల నుంచి గట్టెక్కడమే’ అని స్పందించారు.

గవర్నరుపై విమర్శలు చేయను..
గవర్నరు వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై విమర్శలు చేయబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గవర్నరును మార్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు...‘దానిపై వివాదం అవసరం లేదు. కొన్ని వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. కొందరు రాజకీయాల కోసం మాట్లాడతారు. నా పద్ధతి అది కాదు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వారిపై విమర్శలు చేయడం, బజారులో మాట్లాడటం మంచిది కాదు’ అని బదులిచ్చారు.

అలాంటి వాళ్లు రాష్ట్రానికి అవసరమా?
ప్రజలు బాగుపడుతుంటే వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని, అలాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి అవసరమా? అన్న విషయాన్ని ప్రజలే ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘విశాఖపట్నంలో షాపింగ్‌మాల్‌ కడుతుంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందంటున్నారు. లులు గ్రూపు వాళ్లు వద్దని పారిపోతుంటే వెంటపడి ఒప్పించి తీసుకొచ్చా. కొచ్చిలో వాళ్ల షాపింగ్‌మాల్‌కు రోజూ 80వేల మంది వస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శనానికి ఎంతమంది వస్తున్నారో అంతమంది వస్తున్నారు. అలాంటి పెద్ద సంస్థను పట్టుకొస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వాళ్లను నా స్వార్థం కోసం తెచ్చానా? విశాఖకు ఫిన్‌టెక్‌, బ్లాక్‌చెయిన్‌ సంస్థలు వస్తున్నాయి. ఇంత చేస్తుంటే ఏదో అక్రమం జరిగిపోయిందని ఎవడో ఒకడు రాస్తున్నాడు. మూడున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలు వాళ్లకు కనిపించడం లేదు. కియా రావడంతో అనంతపురం స్వరూపమే మారిపోయింది. శ్రీసిటీలో అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. తిరుపతి హార్డ్‌వేర్‌ హబ్‌గా మారింది. ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌, ఆగ్రోప్రాసెసింగ్‌ ఇలా అన్ని రంగాల్లో ముందున్నాం’ అని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం జరగాలి. ఎక్కడ కురిసిన నీరు అక్కడ రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవాలి. భూగర్భాన్నే రిజర్వాయరుగా మార్చుకోవాలి. వచ్చే సంవత్సరం 160 టీఎంసీల జలాలు తెస్తాం. ఇంత చేస్తున్నా ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రజలు బాధపడి అశాంతి రేగి వారికి రాజకీయ లబ్ధి చేకూరాలన్నదే వాళ్ల తపన. ప్రజలు బాగుపడితే చూడలేకపోతే ఎలా? రాజకీయ పార్టీలు ప్రజల కోసం పని చేయాలే తప్ప స్వార్థం కోసం చిచ్చు పెట్టకూడదు. ఇలాంటి రాజకీయ పార్టీలు, నాయకులు అవసరమా? ప్రజలే ఆలోచించుకోవాలి’ అని స్పష్టం చేశారు.

వారికేం అనుభవం ఉంది?
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తుంటే ఉద్యోగాలే రావడం లేదని, ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలొస్తాయని కొందరు వక్రీకరించి మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మాట్లాడుతున్న వ్యక్తులకు ఏం అనుభవం ఉందని ఆయన ప్రశ్నించారు. తాను ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని, రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. ‘మీరు బాగా వృద్ధి సాధిస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వడం లేదని కొందరంటున్నారు. వాళ్లు ఏదో ఇస్తారని నేను పని చేయడం మానేసి పేద అరుపులు అరవాలా? వాళ్లు ఏ రూ.10వేల కోట్లో ఇచ్చినా, నేను కష్టపడటం మానేస్తే అది ఏ మూలకూ చాలదు. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది’ అని పేర్కొన్నారు.

2 వారాల్లోనే భూ వినియోగ మార్పిడి
టెక్నాలజీ వినియోగంవల్ల పింఛన్లు, రేషన్‌ పంపిణీలో పారదర్శకత సాధించామని, దుబారా అరికట్టామని చంద్రబాబు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ వందసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా అనేక మార్పులు తెచ్చామని, భూధార్‌తో భూ వివాదాలు ఉండవని పేర్కొన్నారు. నాలా చట్టంలో సవరణలవల్ల రెండు వారాల్లోనే భూవినియోగ మార్పిడి పత్రాలు జారీ చేయగలమని తెలిపారు.

తీవ్రమైన చేతి నొప్పితోనే దావోస్‌ వెళ్లా..
ఒకపక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో శ్రమపడుతూ, మరోపక్క అభివృద్ధికి అడ్డుతగులుతున్న విపక్షాలతోనూ పోరాటం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా తాను దావోస్‌కి వెళ్లానని చెప్పారు. ‘ఇటీవల నేను ఎక్కువ సమయం మైకు పట్టుకుని మాట్లాడా. సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రతి విషయాన్నీ రాస్తూ ఉంటా. గంటలకొద్దీ మైకు పట్టుకుని మాట్లాడటం, పెన్నుతో రాయడంవల్ల నా కుడిచేయి పది రోజుల నుంచి విపరీతంగా నొప్పి పుడుతోంది. పది రోజుల్లో 11 సార్లు ఫిజియో థెరపీ చేసినా నొప్పి తగ్గలేదు. దావోస్‌కి వెళ్లవద్దని కొందరు సూచించినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెళ్లే తీరాలని నిర్ణయించుకున్నా. తీరా దావోస్‌ బయల్దేరే రోజు నా పొట్టలో ఇబ్బంది ఏర్పడింది. విమానంలో నిద్ర లేదు. దావోస్‌ వెళ్లాక రెండు రోజులు ఇబ్బంది పడ్డా. పెరుగన్నం, టాబ్లెట్‌లతోనే గడిపా. దావోస్‌ నుంచి తిరిగి వచ్చే రోజే ఆరోగ్యం కొంత కుదుటపడింది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Link to comment
Share on other sites

ఎందుకీ అక్కసు?
28-01-2018 02:18:57
 
636527027421155422.jpg
  • అభివృద్ధి చేస్తుంటే అడ్డంకులా?
  • ఎంత కష్టపడుతున్నా బురద చల్లడమా?
  • వీళ్లతో పోరాడాలా... సమస్యలపైనా?
  • పట్టిసీమ లేకుంటే ఏమిటి పరిస్థితి?
  • కృష్ణా డెల్టాకు, సీమకు నీళ్లొచ్చేవా?
  • గోదావరి-పెన్నానూ అనుసంధానిస్తాం
  • ‘సీమ’కు నీళ్లు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం
  • విభజన వేళ గతుకుల రోడ్డులా రాష్ట్రం
  • ఇప్పటికి 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు
  • చెయ్యి బాధిస్తున్నా దావోస్‌కు వెళ్లా
  • మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలే
  • అయినా... అన్ని సమావేశాల్లో పాల్గొన్నా
  • రాష్ట్రానికి కీలక సంస్థలు, పలు ఒప్పందాలు
  • పరిశీలనలో అమరావతి ఎయిర్‌వేస్‌: సీఎం
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక బురద చల్లి ఆనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో పోరాడాలా? రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలా అనేది అర్థం కావడంలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన... శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై భావోద్వేగంతో స్పందించారు.
 
రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకూడదని, అరాచకం పెరిగిపోవాలని .. ప్రజల మధ్య చిచ్చు రేపాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. లులూ సంస్థ విశాఖలో కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వస్తుంటే.. కొందరు ఎలా వస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
‘‘ఈ సంస్థ కొచ్చిన్‌లో నిర్వహిస్తోన్న కార్యకలాపాలు చూసి రాష్ట్రానికి పిలిచాం. వారు కోరినచోట భూములు ఇస్తే ఇప్పుడు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయమేమిటి? అభివృద్ధి చేయాలంటూనే ఇలా అడ్డగింతలేమిటి?’’ అని నిలదీశారు. తనకు ప్రజలపై నమ్మకం ఉందని... ఎవరు పనిచేస్తున్నారో... ఎవరు మాటలు చెబుతున్నారో వారు గ్రహించగలరని అన్నారు.
 
‘‘విభజన సమయానికి రాష్ట్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్రం గతుకుల రోడ్డులా ఉంది. గన్నవరం విమానాశ్రయం రేకుల షెడ్డులా ఉండేది. అయినా.. మూడున్నరేళ్లలో 370 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అనంతపురం జిల్లాకు కియ కార్ల కంపెనీ వచ్చింది. రాయలసీమకు నీళ్లు, పరిశ్రమలు వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుంది.’’ అని వివరించారు. రాష్ట్రం కోసం తాను ఏ కష్టాన్ని లెక్క పెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయా అంశాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...
 
 
‘దావోస్’తో వచ్చిందిదీ..
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పటి నుంచి దావోస్ కు వెళ్తున్నాను. ఇప్పటికి 14సార్లు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతోందో ఈ సదస్సు వల్ల తెలుస్తుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ప్రపంచం భారత్‌ గురించి, అందునా .. ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడుకునేలా చేశాం. దావోస్‌ పర్యటనలో భాగంగా జ్యూరిక్‌తో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం చేసుకున్నాం. మెడ్‌ టెక్‌తో ఒప్పందం కుదిరింది.
 
 
విశాఖలో 1000 నుంచి 2000 ఎకరాల్లో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. దావోస్ లో మెడ్‌సిటీకి సంబంధించి 150 సంస్థలతో ఒప్పందం జరుగుతుందని భావించినా... 50 సంస్థలతో ఒప్పందం జరిగింది. అలీబాబా క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో మొదటి కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేస్తోంది. రెండోది... ఏపీలో వస్తుంది. బ్లాక్‌ చెయిన్‌, హైబ్రీడ్‌ క్లౌడ్‌ హబ్‌, ఫిన్‌టెక్‌ వంటి పాలసీలు తీసుకురావడం వల్ల పలు ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో హిటాచీతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికే మనం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాం.
 
 
హిటాచీ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే... హెచ్‌పీ 3-డి ప్రింటింగ్‌ ప్లాంట్‌ కూడా స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎయిర్‌ బస్‌ కూడా టాటాతో కలసి రవాణా విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌ రహేజాలో 1,35,000 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇప్పుడు... ఏపీలోనూ మైండ్‌ స్పేస్‌ కేంద్రాల ఏర్పాటుకు రహేజా సంసిద్ధత వ్యక్తం చేసింది. శాప్‌ గ్లోబల్‌ హెడ్‌తో సంప్రదింపులు జరిపాం. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ను అమలు చేసేందుకు శాప్‌ అంగీకరించింది.
 
సౌదీ ఆరమ్‌కో కాకినాడలో లేదా కృష్ణపట్నంలో రిఫైనరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. కరువును నియంత్రించేలా రూపొందించిన విధానాలను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యూపీఎల్‌ సంస్థను కోరాం. వేదాంత గ్రూప్‌ రాష్ట్రంలో 20 లక్షల అమెరికన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతుంది. దావోస్ లోనూ ఏపీయే ప్రపంచాన్ని ఆకర్షించింది. అక్కడ ఏర్పాటు చేసిన వాహనాలతో పాటు .. తెలుగు వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి.
 
 
ఆవిష్కరణ కేంద్రంగా...
ఇన్నోవేషన్స్‌ అమలులో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ప్రపంచమంతా ఏకథాన్‌ నిర్వహిస్తాం. సాంకేతిక నైపుణ్యం వినియోగం, కొత్త ఆవిష్కరణలు, సంప్రదాయ సేంద్రీయ ఎరువుల విధానం .. తదితరాలతో ఏపీని వృద్ధి బాటలోకి తీసుకువెళతాం, సంప్రదాయ, సాంకేతికత మేళవింపుతో.. ప్రపంచంలోని టాప్‌-5 రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపడమే నా లక్ష్యం.
 
 
అమరావతి డిజైన్లు మారవు...
నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన అమరావతి నగర డిజైన్లు వాస్తుకూ, గాలి దిశకూ అనుకూలంగానే ఉన్నాయి. ఈ డిజైన్లను మార్చేందుకు వీల్లేదు.
 
 
రాష్ట్రం కోసమే తాపత్రయం
పది రోజులుగా కుడిచెయ్యి విపరీతంగా నొస్తోంది. ప్రతి సమావేశంలో నేను నోట్స్‌ రాసుకొంటాను. అది కూడా కుదరడం లేదు. ఇంత నొప్పితో దావోస్‌ పర్యటనకు వెళ్లాలా అనిపించింది. కానీ... నలుగురిని కలిస్తే రాష్ట్రానికి ఏదో ఒకటి తేగలమన్న నమ్మకంతో బయలుదేరి వెళ్లాను! అక్కడకు వెళ్లిన తర్వాత ఏదో తేడా చేసి విరేచనాలు పట్టుకున్నాయి. మూడు రోజులు ఒట్టి పెరుగు, మాత్రలతో సరిపెట్టుకొన్నాను. అయినా ఒక్క మీటింగ్‌ రద్దు చేసుకోలేదు. రాష్ట్రం బాగుపడాలన్నదే నా తాపత్రయం!
 
 
ఫోన్‌ చేస్తే చాలు
ఇంట్లో కూర్చొని ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే .. కరెంటు సరఫరా, నీటి రాక, రేషను కార్డు, భూమి సమస్యలు, స్కాలర్‌షి్‌పలు వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. దీనికి .. ప్రభుత్వం అలేఖ్యా తరహాలో ఒక యాప్‌ను తీసుకువస్తుంది. ఈ యాప్‌లో తమ సమస్యలు చెబితే .. వెంటనే సంబంధిత శాఖకు సమాచారం చేరుతుంది. సమస్య పరిష్కారమయ్యే దాకా ఆ యాప్‌ వాకబు చేస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్నింటినీ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్‌టీజీ)కి అనుసంధానం చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరును ఆర్‌టీజీ పరిధిలోకి తెచ్చాం. ఈ ఏడాది మార్చి నెల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాగిత రహిత కార్యాలయాలుగా మారుస్తాం!
 
 
అమరావతి ఎయిర్‌ వేస్‌
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఒక టెర్మినల్‌ను నిర్మించాం. మరో టెర్మినల్‌, రన్‌వే నిర్మాణం కోసం భూమిని కేటాయించాం. ఈ రన్‌వే పూర్తయితే ఎలాంటి విమానమైనా వచ్చేందుకు వీలుంటుంది. విశాఖలోనూ ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భాగస్వామ్య సంస్థలు ముందుకు వస్తే... ప్రత్యేకంగా అమరావతి ఎయిర్‌వేస్‌ ఏర్పాటు గురించి పరిశీలిస్తాం.
 
 
అక్రమాస్తులు స్వాధీనం...
కొందరు అక్రమాలు చేసి అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో బంగారు మంచాలు చేయించుకుంటారు. అక్రమంగా సంపాదించే వారెవరైనా సంతోషంగా ఉండలేరు. బంగారు మంచాలపైనా సుఖంగా పడుకోలేరు. ప్రభుత్వ ఉద్యోగులూ కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించారు. ఈ ఆస్తులన్నీ ప్రజలవే! బిహార్‌, ఒడిసా తరహాలో.. అక్రమాస్తులు రాష్ట్రానికే చెందేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
 
 
పట్టిసీమే లేకుంటే...
‘‘నిన్న కూడా ఒకాయన పట్టిసీమలో 400 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఆ ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజు నుంచి ఇవే ఆరోపణలు. వారికి భయపడి ఊరుకొంటే ఇవాళ విజయవాడకు తాగడానికి నీళ్లు దొరికేవి కావు. ఎగువ నుంచి కృష్ణా జలాలు రాకున్నా... పట్టిసీమ ద్వారా నీళ్లిస్తున్నాం. మంచి పంట పండిందని రైతులు ఆనందంగా చెబుతున్నారు. ఈ ఏడాది వందకు పైగా టీఎంసీల నీటిని తెచ్చాం. వచ్చే ఏడాది 160 టీఎంసీల నీటిని తెస్తాం. రాయలసీమలో బాగా ఇబ్బంది పడుతున్న మడకశిర, హిందూపూరం, మదనపల్లి, కుప్పం వంటి ప్రాంతాలకు కూడా నీరిస్తాం. నీళ్లు ఇస్తుంటే అభినందించాలి. కానీ, ఎందుకింత అక్కసు? గోదావరి - పెన్నా నదులను అనుసంధానిస్తాం.
 
 
2027 నాటికి సంపూర్ణ సేంద్రీయం
ఇప్పటికే రాష్ట్రంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాం. 2027 నాటికి రాష్ట్రం సంపూర్ణంగా సేంద్రీయ వ్యవసాయంగా మారుతుంది.
 
 
ఆశించినంత ఆదాయం లేదు
జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం తగ్గింది. కానీ... కేంద్రానికి ఐటీ ఆదాయం పెరిగింది. రెండు వేల నోటు రద్దు అవుతుందనే ప్రచారం వల్ల కూడా డబ్బులు దాచుకోకుండా ఐటీ చెల్లించి తెలుపు చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. జీఎస్టీ పెరిగితేనే రాష్ట్రానికి లాభం ఉంటుంది.
 
 
అందరితో ఆనందం
పూర్వం కుటుంబ సభ్యులంతా కలసి ఒకే ఇంట్లో ఉండేవారు. పండుగలు, శుభకార్యాలూ కలసి సంతోషంగా చేసుకునేవారు. ఆ సందడే వేరు. కుటుంబ సభ్యుల బంధాలూ బంధుత్వాలతో ఇల్లు కళకళలాడమే కాదు.. మానవత్వమూ ఉండేది. రోజంతా కష్టపడి రాత్రికి ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులతో కలసి భోంచేస్తూ అరగంట గడిపితే ఎంత ఆనందమో! కుటుంబ వ్యవస్థలోనే ఆనందం ఉంది.
 
ఈ ఆత్మీయానురాగాలు, మమకారం కలకాలం ఉండాలన్న అభిప్రాయంతోనే పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో అమ్మకు నమస్కరించే ఆచారం తెలుగిళ్లలో ఉండేది. ఈ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించేందుకే అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలకు రావాల్సిన సమయం వచ్చేసింది.
 
 
ప్రకృతికి ప్రణామం
మన సంప్రదాయాలనూ, సంస్కృతిని మరచిపోతున్నాం. ప్రకృతిని ఆరాధించి, సంరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. హరిత వనాలను పెంచాలి. రాష్ట్రంలో ఒకప్పుడు మైనస్ గా ఉన్న అడవుల పెంపకం, చెట్ల పెంపకం ఇప్పుడు వృద్ధిలోకి వచ్చింది. దీనిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సంప్రదాయ విధానాలను గౌరవించేలా చాలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
 
ఏరువాక, జల సిరికి హారతి, వనం మనం వంటి కార్యక్రమాలు చేపట్టాం. నాగదేవత మా ఇలవేల్పు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి పోయినప్పుడు పుట్టకు భువనేశ్వరి పూజలు చేస్తుంటే మేమంతా భక్తితో నమస్కారాలు చేశాం. అది చూసిన ఊరిలో ఒక పెద్దాయన... పాత రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నాడు. ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయంలో ఒకటి. దానిని కాపాడుకోవాలి.
 
 
చర్చలు మంచివేగా...
చదువుకున్న వాళ్లు ఐదుగురు పిల్లలను కనాలని.. నిరక్షరాస్యులు పిల్లలను కనవద్దని ఓ చైనా ఆర్థిక వేత్త సూత్రీకరించారు. చదువుకున్నవాళ్లయితే సంపాదిస్తారని, పిల్లలను ఉన్నత విద్య అందించి, ప్రయోజకులను చేస్తారని... నిరక్షరాస్యులకు అది సాధ్యం కాదని ఆయన ఇలా చెప్పారు. దీనిపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇది చైనాలో చర్చకు దారితీసి... దేశాభివృద్ధికి దోహదపడింది.
Link to comment
Share on other sites

Major win for ANdhra Pradesh....

 world's LARGEST silicon manufacturer XI'an LONGI kosam 3 years nunchi pettina effort...Trina dropped india plans because of DELHI not clearing policy for them...

/*****

China’s Longi Solar confirms 1 GW Indian manufacturing facility

Longi Solar will set up a 1 GW solar PV manufacturing facility in India’s Andhra Pradesh. It will manufacture 500 MW of cells and 500 MW of modules, a spokesperson tells pv magazine. The facility is expected to be commissioned by Q1 2019 at the latest, and will seek to take advantage of India’s exemption from the recent U.S. solar tariffs, imposed by President Trump last week.

Link to comment
Share on other sites

దివీస్‌ రూ.300 కోట్ల పెట్టుబడులు
31-01-2018 02:20:04
కాకినాడ ప్లాంట్‌పై త్వరలో స్పష్టత
సిఎఫ్‌ఒ కిశోర్‌ బాబు వెల్లడి
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్‌ లేబొరేటరీస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో కొత్తగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంతో పాటు ప్రస్తుత ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు రెడీ అవుతోంది. కార్యకలాపాల విస్తరణ, ప్రతిపాదిత ప్లాంట్‌ కోసం ఈ ఏడాది 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు దివీస్‌ లేబొరేటరీస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఎల్‌ కిశోర్‌ బాబు వెల్లడించారు. 2017 డిసెంబరు వరకు 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.
 
కాకినాడ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, రైతులకు సంబంధించి కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తోందని, ఈ అంశం తేలేవరకు ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టరాదని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్‌ లేబొరేటరీ్‌సకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 505 ఎకరాలు కేటాయించింది. ఇప్పటివరకు కంపెనీ భూమి, ఇతర సివిల్‌ పనుల కోసం 34.35 కోట్ల రూపాయలు వెచ్చించింది. కంపెనీకి కేటాయించిన భూమిలో 351.72 ఎకరాలను ప్రభుత్వం రిజిస్టర్‌ చేయగా మిగిలిన భూమిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నష్టపరిహారం విషయంలో వివాదాలు తలెత్తటంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా కాకినాడ ప్లాంట్‌ ఏర్పాటులో జాప్యం తలెత్తినప్పటికీ ప్రస్తుత ప్లాంట్ల విస్తరణను మాత్రం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు కిశోర్‌ వివరించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మార్చి అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.
 
కాగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ ఎఫ్‌డిఎ) నుంచి ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ నివేదిక (ఇఐఆర్‌) నివేదిక అందుకున్న తర్వాత విశాఖపట్నం ప్లాంట్‌ యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తోందని, ప్రస్తుతం ఉత్పత్తి సాధారణ స్థాయిలకు చేరుకుందని కిశోర్‌ తెలిపారు. దివీస్‌ లేబొరేటరీస్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మొత్తం నాలుగు ప్లాంట్లను నిర్వహిస్తోంది.

Link to comment
Share on other sites

తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ
ఈనాడు, అమరావతి: తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు జీఎం మాడ్యులర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సిద్ధమవుతోంది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్‌ స్విచ్‌లు, ఎల్‌ఈడీ బల్బులు, ఇతర విద్యుత్తు ఉపకరణాలను తయారు చేస్తుంది. విజయవాడకు చెందిన రమేష్‌ జైన్‌ సోదరులు 2000లో నెలకొల్పిన జీఎం మాడ్యులర్‌ సంస్థ యూనిట్‌లు ప్రస్తుతం ముంబయి, బెంగళూరు, చెన్నైల్లో ఉన్నాయి. వ్యాపారాన్ని మరింత విస్తరించే యోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో యూనిట్‌ను తిరుపతిలో నెలకొల్పాలని నిర్ణయించామని జీఎం మాడ్యులర్‌ సంస్థ డైరెక్టర్‌ రమేష్‌ జైన్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...