Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రంగా అమరావతి
ఏపీ ఎన్‌ఆర్‌టీ చొరవ
ఇప్పటికే కొలువుదీరిన 15 సంస్థలు
1ap-main8a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల శిక్షణ ఇకపై రాజధాని ప్రాంతంలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఎస్‌ఏపీ, ఒరాకిల్‌, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్‌, డాట్‌ నెట్‌ వంటి రకరకాల సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు అమరావతిని హబ్‌గా మార్చేందుకు ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీ ఎన్‌ఆర్‌టీ) చొరవ చూపుతోంది. ప్రస్తుతం యువత ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసుకుని వివిధ సాఫ్ట్‌వేర్‌ కోర్సులను నేర్చుకునేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాల బాట పడుతున్నారు. అక్కడే ఉద్యోగాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. అదే సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు స్థానికంగా అందుబాటులో ఉంటే రాజధాని ప్రాంతంలో ఐటీ రంగం వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఈ ఉద్దేశంతోనే బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ నగరాల్లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు తమ శాఖలను అమరావతిలో నెలకొల్పేలా ఏపీ ఎన్‌ఆర్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అవసరమైన కార్యాలయ స్థలంతోపాటు, రూ.కోటిన్నర వరకూ ఏకకాల పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంలో 15 శిక్షణ సంస్థలు అమరావతిలో తమ శాఖలను నెలకొల్పి కార్యకలాపాలు ప్రారంభించాయి. మరిన్ని శిక్షణ సంస్థల కోసం మంగళగిరి-గుంటూరు జాతీయ రహదారి పక్కనే ఓ వాణిజ్య భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 60 వరకూ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఉండగా.. వాటికి నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం కష్టంగా మారింది. దీనివల్ల కొన్ని కంపెనీలు తిరిగి వెళ్లిపోయే పరిస్థితికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా సంస్థల అవసరాల మేరకు శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఏడాదిలోపు 20 వేల ఉద్యోగాలు లక్ష్యం
సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలు, ఐటీ కంపెనీల మూలాలు విదేశాల్లో ఉన్నందున అవి రాజధాని ప్రాంతంలో శాఖలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్ని ఏపీ ఎన్‌ఆర్‌టీ అందిస్తోంది. ప్రోత్సాహకాలను  ప్రభుత్వం అందిస్తోంది. శాఖల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చాలా కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. రానున్న ఆరు నెలల్లో 6 సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నగరానికి రానున్నాయి. వీటికి నైపుణ్యాలున్న మానవ వనరులను అందిస్తాం. ఈ ఏడాదిలోగా 20వేల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.

- రాజశేఖర్‌ చప్పిడి, డైరెక్టర్‌, మైగ్రెంట్‌ రీసోర్స్‌ సెంటర్‌, ఏపీ ఎన్‌ఆర్‌టీ
Link to comment
Share on other sites

విశాఖలో సినర్జీస్‌ కాస్టింగ్స్‌ కొత్త ప్లాంట్‌
01-05-2018 23:59:08
 
636608238769042572.jpg
  •  రూ.650 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : సినర్జీస్‌ క్యాస్టింగ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ అల్యూమినియం అల్లాయ్‌ వీల్స్‌ ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఎపి ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఎపిఇడిబి) సిఇఒ జె కృష్ణ కిశోర్‌, సినర్జీస్‌ కాస్టింగ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ మొవ్వా ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మార్చుకున్నారు. సుమారు రూ.650 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌తో పాటు, ఇతర అనుబంధ పరిశ్రమల ద్వారా 2,000 మందికిపైగా ఉద్యోగా లు లభిస్తాయి.తొలుత ఏటా 23 లక్షల వీల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని తరువాత దశలవారీగా 50 లక్షలకు విస్తరిస్తారు. ఎపి ఆటోమొబైల్‌ హబ్‌గా మారుతుండంతో కొత్త యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు శేఖర్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

జూలైనాటికి చిత్తూరు ప్లాంట్‌ రెడీ: గ్రీన్‌ప్లై
08-05-2018 01:53:12
 
636613418073089111.jpg
  • రూ.800 కోట్లతో ఏర్పాటు
న్యూఢిల్లీ: ఫైబర్‌బోర్డుల తయారీ సంస్థ గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో రూ.800 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. జూలైకల్లా ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. చిత్తూరు ప్లాంట్‌లో తయారు చేయనున్న మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డు(ఎండిఎఫ్ )లను దక్షిణాది మార్కెట్‌తోపాటు విదేశాలకు సరఫరా చేయనుంది. తద్వారా ఇంజినీర్డ్‌ ప్యానెళ్ల విభాగ టర్నోవర్‌ను భారీగా పెంచుకోవాలని సంస్థ ఆశిస్తోంది.
 
వచ్చే ఆర్థిక సంవత్సరాని(2019-20)కల్లా ఫైబర్‌బోర్డులతోపాటు ఇతర ఇంజినీర్డ్‌ ప్యానెళ్ల వ్యాపార టర్నోవర్‌ను రూ.1,800- 2,000 కోట్ల స్థాయికి పెంచుకోవాలని గ్రీన్‌ప్లై లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ విభాగ టర్నోవర్‌ రూ.775 కోట్ల స్థాయిలో ఉంది. చిత్తూరు ప్లాంట్‌ ద్వారా ఏటా 3.60 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎండిఎఫ్ లను తయారు చేసేందుకు వీలుంటుందని గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్‌ తెలిపింది. సంస్థకు ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పాట్నానగర్‌లో ఎండిఎఫ్ ల తయారీ ప్లాంట్‌ ఉంది. చిత్తూరు ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చాక మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 5.40 లక్షల క్యూబిక్‌ మీటర్లకు చేరుకోనుంది.
 
 
ప్రస్తుతం విక్రయాల్లో ఎగుమతుల వాటా 10 శాతంగా ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. పశ్చిమాసియా, సార్క్‌ దేశాలకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌’ గత మూడు నెలల వ్యవధిలో 4,723 ప్రతిపాదనలు ఆమోదించింది.

వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 49 యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.23,551 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఈ 74 పరిశ్రమలలో 59,087 మందికి ఉపాధి లభించనుంది.

https://pbs.twimg.com/media/DdN4NgeV4AAEpGX.jpg

Link to comment
Share on other sites

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడిలో 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఎలైట్‌ హాస్పిటల్‌ గ్రూపునకు 15 ఎకరాల భూమి కేటాయించారు. నగరి మండలం మంగడు గ్రామంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు 101.18 ఎకరాల రెవెన్యూ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా బదలాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు

Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడులకు వాల్‌మార్ట్‌ ఆసక్తి

07032218BRK141-SR1.JPG

దిల్లీ: యూఎస్‌, ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని మంత్రి నారా లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం దిల్లీలో కౌన్సిల్‌ ప్రతినిధులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనువైన పరిస్థితులను వారికి వివరించారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వాల్‌మార్ట్‌, పలు మెడ్‌టెక్‌ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్స్‌ ఏర్పాటు చేస్తామని సంస్థ ఇండియా సీఈవో క్రిష్‌ అయ్యర్‌ తెలిపారు.

 

Link to comment
Share on other sites

భాగస్వామ్యం' ఫలిస్తోంది!
మొదటి విడతలో రూ.2,955.52 కోట్ల పెట్టుబడులు
పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన 18 సంస్థలు

ఈనాడు, అమరావతి: విశాఖ భాగస్వామ్య సదస్సు ఫలాలు త్వరలో అందబోతున్నాయి. నాడు వివిధ సంస్థలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు సాకారమయ్యేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. మొదటిదశలో 18 సంస్థలతో రూ.2955.52 కోట్ల పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) అందించిన వీరందరికీ ఏకగవాక్ష విధాన పోర్టల్‌లో తదుపరి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకునేలా పరిశ్రమలశాఖ సూచనలు చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దేశ, విదేశాలకు చెందిన వివిధ పారిశ్రామిక సంస్థలు పలు రంగాల్లో రూ.4.39 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పరిశ్రామిక రంగంలో చేసిన ఒప్పందాలు సాకారమయ్యేలా గత రెండు నెలలుగా అధికారులు యత్నిస్తున్నారు. 60 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి మూడు విడతలుగా నిర్వహించిన సమావేశాలకు 40 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి విడతగా 18 సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), విద్యుత్తు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), కర్మాగారాల, పరిశ్రమలశాఖల నుంచి తదుపరి అనుమతులిచ్చేలా ఉన్నత స్థాయి సమావేశం ఆదేశాలిచ్చింది. మొదటి విడతలో ముందుకొచ్చిన సంస్థల్లో అత్యధికం విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీఐఐసీ తరఫున వీరందరికీ స్థలాల కేటాయింపుల కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పెట్టుబడుదారుల్లో కొందరు పారిశ్రామికవాడల్లో భూములు, స్థలాలను పరిశీలించాయి.

24ap-story5b.jpg
Link to comment
Share on other sites

Swift growth in AP's Industrial Sector
 

https://cdn.ncbn.in/ncbn/feed/ncbnBanner1527227193976.jpeg

The Government of AP, under the leadership of Chief Minister Sri Nara Chandrababu Naidu has seen increasing growth in the manufacturing sector. Andhra Pradesh has swiftly become the number one State in India for Ease of Doing Business and is now the productive choice for the manufacturing industry in India. Good infrastructure, compliance with labour laws and meeting the desired environmental standards are some of the factors responsible for the impressive performance of AP. The Government worked towards a manufacturing sector that continues to transform from traditional processes, to the knowledge-based manufacturing of higher value products.

The State achieved double-digit growth rate due to the Manufacturing sector's growth which acted as one of the key levers attributed to the three initiatives undertaken by Government of Andhra Pradesh.

1. Economic cities as engines of manufacturing sector's growth: Inspired by the prototypes that have already been successful in Singapore, Korea and China, Andhra Pradesh has become the first state in India to drift from the traditional models of manufacturing, that employ the piecemeal approach of disjointed economic activities and integrated social infrastructure. Andhra Pradesh has proposed the creation of 10 economic cities that will operate on the principles of ‘Plug and Play’, ‘Walk to Work’ and ‘Facilitating Ecosystem Approach’, that allows a provision of 9 out of 20 clearances at the facility level, with only 11 clearances remaining at entrepreneur level.

2. MSME (Micro Small and Medium Enterprises) Clusters: Since MSMEs sector is envisioned to play a dominant role in structurally transferring nearly 1.5 million people to the manufacturing sector by the year 2029, Government of Andhra Pradesh intends to establish one MSME cluster each for 175 assembly constituencies in the State. These clusters are planned around the generation of employment in low skill–labour-intensive manufacturing sectors. MSME cluster development approach will help the industrial units to tap on the interfaces created by the Government, for enhancing the productivity and competitiveness of the manufacturing sector, in the State of Andhra Pradesh.

3. Tapping the potential from Industrial Corridors (VCIC & CBIC): A node based strategy is adopted for the corridor development which includes the development of four nodes across the VCIC region- namely Vishakhapatnam node, Kakinada node, Gannavaram- Kankipadu node, and Srikalahasti- Yerpedu node. These four geographic nodes are expected to drive the growth of industries, supported by a network of multi-modal transport to demand centres, urban clusters, and international gateways. Funded by the Asian Development Bank, VCIC Employment Potential is 5.8 to 11.8 Million, with expected MFG GVA/GSDP contribution to the tune of INR 645 to INR 1275 Billion over 20 years. Meanwhile CBIC, that is funded by the JICA has an employment potential of 0.6 million.

Andhra Pradesh is already a home to many manufacturing and service industries. Taking new momentum from the development of industrial corridors, the government is focused on ensuring holistic development with corridors providing further assistance in integrating, supervising and developing a conducive environment.

Link to comment
Share on other sites

టెక్స్‌టైల్‌ రంగానికి ఊతం!
26-05-2018 03:23:17
 
  • భారీగా ప్రోత్సాహకాలు.. 50ు ధరకే భూముల కేటాయింపు
  • వడ్డీ రాయితీ.. శిక్షణ ఖర్చు ఒక్కొక్కరికీ రూ.10 వేలు
  • కారు చౌకకే విద్యుత్‌ సరఫరా.. ఖరారు చేసిన పరిశ్రమల శాఖ
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు భారీ నజరానాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో గత టెక్స్‌టైల్‌ విధానాన్ని సమూలంగా మార్పు చేసింది. కొత్త విధానాన్ని రూపొందించింది. టెక్స్‌టైల్‌ రంగ ముసాయిదా పాలసీ త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది. దీనిలో కొత్త విధానాన్ని ఆమోదించనున్నారని సమాచారం. టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు కల్పించనున్న రాయితీలు ఇవీ..
  •  మెగా టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు కేటాయించే భూములకు వాటి విలువలో 50 శాతం లేదా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం.. ఏది తక్కువైతే అది.
  •  మెగా, అల్ట్రా మెగా టెక్స్‌టైల్‌ పరిధిలోలేని వాటికి రూ.కోటి దాకా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
  •  మెగా ప్రాజెక్టులకు రూ.3 కోట్లదాకా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
  • అల్ట్రా మెగా టెక్స్‌టైల్‌కు రూ.5 కోట్ల దాకా మౌలిక సదుపాయాలు ఇస్తారు.
  •  నైపుణ్యంతో కూడిన యువతను పరిశ్రమకు అందించేందుకు వీలుగా.. శిక్షణా సంస్థలకు 50ు రాయితీ కింద.. ఒక్కొక్కరికీ రూ.7500 ఇస్తారు.
  •  మెగా,అల్ట్రా మెగా పరిశ్రమల కోసం శిక్షణలో 50ు కింద రూ.10,000 దాకా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయిస్తారు.
  •  ఉత్పత్తులు ప్రారంభించాక ఐదేళ్లదాకా వీవింగ్‌ కోసం యూనిట్‌కు రూ.2 చొప్పున, అపెరల్‌కు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌ను సరఫరా.
  •  మెగా,అల్ట్రా మెగాయేతర పరిశ్రమలకు ప్రతి ఉద్యోగికీ రూ.1000 చొప్పున ప్రభుత్వం ఐదేళ్లపాటు చెల్లిస్తుంది. మెగా పరిశ్రమకు రూ.2500, అలా్ట్రమెగా ప్రాజెక్టుకు రూ.3,750 మహిళలకు, 3,000 పురుషులకు చెల్లిస్తారు.
  •  500 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తుంది. ఇందులో ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో సదుపాయాలు ఉంటాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...