Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
హ్యుందాయ్‌కి ఆహ్వానం

ఈనాడు, అమరావతి: దక్షిణ కొరియాలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఆహ్వానించింది. కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి రెడ్డివారి ప్రీతమ్‌రెడ్డి సియోల్‌లోని హ్యుందాయ్‌ మోటార్స్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల తయారీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇప్పటికే కియా మోటార్స్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్తు వాహనాల తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోందని మంత్రి వివరించారు. ‘‘మీరు విద్యుత్తు వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే కంపెనీకి కావాల్సిన సంపూర్ణ సహకారం అందిస్తాం’’ అని తెలిపారు.

Link to comment
Share on other sites

అమరావతిలో కొరియన్‌ సిటీ
08-12-2017 02:20:30
 
636482964321592828.jpg
  • పారిశ్రామికవేత్తలు సానుకూలం.. 8 వేల కోట్ల పెట్టుబడులు
  • కియ సంస్థలతో డీల్‌.. ఎల్‌జీ, హ్యుండయ్‌ వస్తాయి: సీఎం
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో సింగపూర్‌ సిటీ తరహాలో కొరియన్‌ సిటీని అభివృద్ధి చేయాలని దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలను కోరాం. మా ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించారు. అమరావతిలో వీలైనన్ని దేశాలు భాగస్వామ్యమైతే అది అంతర్జాతీయ నగరం అవుతుంది.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దక్షిణ కొరియా పర్యటన విశేషాలను వెల్లడించారు. దక్షిణ కొరియా పర్యటనలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా చేయగలిగామని సీఎం వెల్లడించారు.
 
తన పర్యటనలో భాగంగా 25 దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులతో ముఖాముఖి చర్చలు జరిపానని, రెండు ఒప్పందాలు చేసుకున్నామని, ఒక లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియ పరిశ్రమ వల్ల రూ.12915 కోట్ల(2 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల) పెట్టుబడి వస్తుందని, ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు. కియ మోటార్స్‌కు భూమి, నీరు, అనుమతులు అత్యంత వేగంగా ఇవ్వడం కొరియా పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరిచిందన్నారు. దీంతో కియకు అనుబంఽధ పరిశ్రమలన్నీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా 37 అనుబంధ సంస్థలు రూ.4,995.2 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయని తెలిపారు. కియతోపాటు 37 అనుబంధ సంస్థలతో కలిపి కొరియన్‌ టౌన్‌షిప్‌ని అనంతపురంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
 
మరికొన్ని కొరియన్‌ కంపెనీలతో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకున్నామని, వాటి ద్వారా రూ.3 వేల కోట్ల పెట్టుబడి వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కొరియా ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. దక్షిణ కొరియాలో ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటామని కియ మోటార్స్‌ అధ్యక్షుడు హున్‌ వూ పార్క్‌ ముందుకొచ్చారని తెలిపారు. బుసాన్‌లో కూడా ఏపీకి ప్రత్యేక ప్రతినిధిగా మరో పారిశ్రామికవేత్తను నియమిస్తామన్నారు. అక్కడ ఏపీ పెట్టుబడుల కార్యాలయం పెడతామని తెలిపారు. ప్రసిద్ధ ఎలక్ర్టానిక్స్‌ సంస్థ ఎల్‌జీ అధ్యక్షుడు సూన్‌ క్వోన్‌తో సమావేశమయ్యామని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని సీఎం వెల్లడించారు.
 
స్టోరేజ్‌ బ్యాటరీలు, ఎలక్ర్టానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వారు భావిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్‌ సంస్థ డార్సిల్‌ డైరక్టర్‌ టెన్నీ కాంగ్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్‌ విశ్వవిద్యాలయంలో భాగస్వామి కావాలని కోరగా సానుకూల స్పందన లభించిందన్నారు. బీటీఎన్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎండీ ప్రొఫెసర్‌ వై కిమ్‌తో భేటీలో.. దేశంలోనే మొదటి లోకల్‌ ఫ్రెండ్లీ ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. దక్షిణకొరియా-భారత్‌ మధ్య 10 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయ ఒప్పందంలో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ స్మార్ట్‌సిటీని భారత్‌లో ఏర్పాటు చేస్తారన్నారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హ్యుండాయ్‌ మోటార్స్‌ యాజమాన్యాన్ని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌. అమర్నాథరెడ్డి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని హ్యుండాయ్‌ మోటార్స్‌ గ్రూపు వైస్‌ ప్రెసిడెంట్‌ జంగ్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. సియోల్‌ పర్యటనలో ఉన్న అమర్నాథరెడ్డి గురువారం జంగ్‌తో సమావేశమయ్యారు.
 
ఆయన జైల్లో.. ఈయన కారుల్లో!
కియ మోటార్స్‌ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలపై మాట్లాడుతూ చంద్రబాబు వోక్స్‌వ్యాగన్‌ ప్రస్తావన తెచ్చారు. ఎంతో కష్టపడి కియ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చామన్నారు. గతంలో కూడా ఆటోమొబైల్‌ రంగం రాష్ట్రానికి వచ్చేలా పునాది వేశామని, వోక్స్‌వ్యాగన్‌తో సంప్రదింపులు జరిపామని తెలిపారు. అయితే వైఎస్‌ హయాంలో పారిశ్రామికవేత్తల్లో లేనిపోని భయాలు కల్పించారని, అక్రమాలు చేసేలా ప్రోత్సహించారని విమర్శించారు. వాటి ఫలితంగానే వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ డైరక్టర్లలో ఒకరు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కానీ దానికి కారణమైన నాయకుడు మాత్రం దర్జాగా కాలరెగరేసి తిరుగుతూ మాపై విమర్శలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

వ్యవసాయం కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌
08-12-2017 02:24:24
 
636482966659745482.jpg
  • సహకరిస్తామన్న హనీవెల్‌
  • అమరావతిలో జపాన్‌ సంస్థ పెట్టుబడులు
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని లాభాదాయకంగా, స్థిరమైన వృద్ధ్దిసాధించే విధంగా రాష్ట్రంలో త్వరలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ను ఏర్పాటుచేస్తున్నామని ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఇందుకోసం హనీవెల్‌ కంపెనీ సహకరిస్తుందని తెలిపారు. హానీవెల్‌ కంపెనీ ఇండియా ఉపాధ్యక్షుడు అక్షయ్‌తో గురువారం సచివాలయంలో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. సాఫ్ట్‌వేర్‌, ఏరోస్పేస్‌, ఐవోటి, టర్బో జెట్స్‌, సెన్సార్ల తయారీ లాంటి వివిధ సేవలు ఈ కంపెనీ అందిస్తోంది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు కూడ సహాకారం అందించాలని లోకేశ్‌ కోరగా అందుకు కంపెనీ ప్రతినిధి అంగీకరించారు.
 
త్వరలోనే హానీవెల్‌ బృందాలను ఏపీకి పంపి, క్షేత్రస్థాయిలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. కాగా, తక్కువ ఖర్చుతో ఇళ్లు, ఐటీ ఆఫీస్‌ స్పేస్‌, నెక్ట్స్‌ జనరేషన్‌ ఆటో ఎలక్ర్టిక్‌ వాహనాల మోడల్‌సిటీ నిర్మాణాలకు ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌కు చెందిన కునిఉమి ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తెలియజేసింది. కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్‌ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. గృహ సదుపాయంతో కూడిన ఐటీ పార్కుల అభివృద్ధ్ది కోసం ఐఐటీ విధానం తీసుకొచ్చామని, విశాఖపట్నం, అనంతపురంలలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలున్నాయని వివరించారు. ఏపీలో ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెంచేందుకు త్వరలోనే ఈవీ పాలసీ తీసుకురాబోతున్నామన్నారు. జపాన్‌కు రావాలని ఈ సందర్భంగా లోకేశ్‌ను కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

పెట్టుబడులకు అనుకూలం ఏపీ
08-12-2017 02:40:55
 
  • ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలకు మంత్రి పితాని ఆహ్వానం
అమరావతి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయని ఏపీ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలను ‘ప్రమోషన్‌ ఏపీ’లో భాగంగా అక్కడి ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలకు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం, ఉత్పత్తికి ఇక్కడున్న నాణ్యమైన మానవ వనరులు, ఎగుమతులకు పోర్టుల్లో ఉన్న అవకాశాలు, నిరంతర విద్యుత్‌ సరఫరా, భూ కేటాయింపులు తదితరాలు వివరించి పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. అమెరికాలోని తెలుగు సంఘాలనూ గురువారం భేటీ అయ్యారు. అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి వెంట తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి, రవి పులి ఉన్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో మత్స్య వర్సిటీ
08-12-2017 03:01:07
 
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
  • చైనా నుంచి సాంకేతిక సహకారం
  • మంత్రి ఆదినారాయణరెడ్డి
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీలైనంత త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్‌ గ్రూప్‌తో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలో దీని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చైనా అకాడమీకి చెందిన జియాన్‌ విశ్వవిద్యాలయ సహకారం ఎలా ఉండాలి, ఆనంద్‌ గ్రూపు ఏమేమి చేయాలి, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలన్న విషయాలపై విజయవాడలో గురువారం ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
 
ఈ చర్చల్లో చైనా సహకారంపై సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని మంత్రి చెప్పారు. నిర్ధిష్ట ప్రతిపాదనలతో కార్యాచరణ పత్రాన్ని రూపొందించి తీసుకురావాలని చైనా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఇందుకు జియాన్‌ వర్సిటీ అధికారులు అంగీకరించారు. ఈ ప్రతిపాదనలు వచ్చాక మంత్రిమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. వర్సిటీ ఏర్పాటులో ఆనంద్‌ గ్రూపు 51 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం భాగస్వామ్యం కలిగి ఉంటాయన్నారు. మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటుతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుందని, కాలుష్య రహిత వాతావరణంలో అధికోత్పత్తి సాధిస్తామని చెప్పారు. ఉన్న వనరులను వినియోగించుకుని, అత్యధిక రకాల చేపలను సాగు చేయగలమని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

నవ్యాంధ్రకు ఉక్కు వరం 
09-12-2017 02:01:33
 
636483816945218924.jpg
 
  • రాష్ట్రానికి ‘ఆటోగ్రేడ్‌ స్టీల్‌’ తయారీ ప్లాంటు
  • రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
  • సెయిల్‌, మిట్టల్‌ సంయుక్త భాగస్వామ్యం
  • ప్లాంటు కోసం గుజరాత్‌, ఏపీ పోటీ
  • నవ్యాంధ్రకు కలిసొచ్చిన ‘తూర్పు తీరం’
  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్‌ సింగ్‌ ప్రకటన
హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు మరో భారీ పరిశ్రమ వస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ‘సెయిల్‌’, అంతర్జాయతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిట్టల్‌ సంయుక్తంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. కార్లు, ఇతర వాహనాల తయారీలో ఉపయోగించే అత్యుత్తమ ఉక్కు (హై ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌)ను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. ఉక్కు శాఖ మంత్రి చౌదురి బీరేందర్‌ సింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ‘‘తమ రాష్ట్రాల్లోనే ఈ ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ కోరాయి. అయితే... తూర్పు తీరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోనే దీనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం’’ అని బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై సెయిల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ జాయింట్‌ వెంచర్‌ను 1birendra.jpgఏర్పాటవుతుందని, ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆయన తెలిపారు. ‘‘ఆర్సెలార్‌ మిట్టల్‌ వద్ద ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీనిని సెయిల్‌తో కలిసి పంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంపై కసరత్తు 99 శాతం పూర్తయిపోయింది. ఒక వారం లేదా రెండు వారాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
 
కార్ల తయారీ హబ్‌గా భారత్‌..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌ ప్రపంచ కార్ల తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని మంత్రి బీరేందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రపంచంలోని కార్ల తయారీలో భారత్‌ వాటా 28 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాహన తయారీకి ఉపయోగించే హైఎండ్‌ స్టీల్‌ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందని చెప్పారు.
సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ భాగస్వామ్యంలో ఏర్పాటు కానున్న ఈ ఆటోగ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 లక్షల టన్నులుగా ఉండనుందని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని 25 లక్షల టన్నులకు పెంచుకునే వెసులుబాటు ఉందని అన్నారు. భారత్‌లో ఆటో గ్రేడ్‌ స్టీల్‌ తయారీలో చేతులు కలపడంపై అవకాశాలు పరిశీలించాలని 2015లో సెయిల్‌-ఆర్సెలార్‌ మిట్టల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు పడింది. మరోవైపు... ఎన్‌ఎండీసీ ఉద్యోగుల కొత్త వేతన సవరణపై శనివారం ప్రకటన చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
Link to comment
Share on other sites

పారిశ్రామిక పార్కుకు 1,572 ఎకరాలు
09-12-2017 00:55:58
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం మూడు గ్రామాల్లోని 1571.42 ఎకరాల భూమిని ఎపిఐఐసికి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయపురం మండలం కోసల గంగారం గ్రామంలో 1541.41 ఎకరాలు, చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో 20.04 ఎకరాలు, గంగవరం గ్రామంలో 9.97 ఎకరాల భూమి ఈ పరిధిలో ఉంది. నిర్థిష్ట కాలపరిమితిలోగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎపిఐఐసిని సర్కారు ఆదేశించింది. గతంలో కంపెనీలకు నేరుగా రెవెన్యూశాఖే భూములు కేటాయించేది. మారిన విధానంతో, తొలుత రెవెన్యూశాఖ ఎపిఐఐసికి భూములు ఇస్తోంది. ఎపిఐఐసినే ఈ భూములను అభివృద్ధి చేసి ఆసక్తి ఉన్న, ప్రభుత్వం ఎంపికచేసిన కంపెనీలకు అవసరాన్ని బట్టి కేటాయిస్తుంది.
Link to comment
Share on other sites

పనాసోనిక్‌పై ఏపీ దృష్టి!
10-12-2017 03:27:46
 
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక పరిశ్రమలను ఏపీకి తీసుకురావడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక మండలి(ఈడీబీ) సీఈవో కృష్ణ కిశోర్‌ జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రముఖ ఎలక్ర్టానిక్‌ సంస్థ పనాసోనిక్‌తో పాటు.. ఎలకా్ట్రనిక్‌ వాహనాల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

ARBL commissions India’s largest two-wheeler battery Plant in Andhra Pradesh

 

MUMBAI: India's leading battery maker, Amara Raja Batteries Ltd (ARBL) on Tuesday commissioned its two-wheeler battery Plant at the Amara Raja Growth Corridor in Chittoor, Andhra Pradesh.

In the first phase, the plant will have a capacity of 5 million units, which will be eventually scaled up to 17 million units. This will call for an estimated investment of Rs 700Cr taking the total capacity for two-wheeler batteries to 29 million units.

The plant will employ 1300 people at full capacity.

It is the most advanced production facility in the country, claims the company, pioneering the use of advanced punched grid making technology for two-wheeler battery manufacturing.

The plant was inaugurated by George R Oliver, Chairman and CEO - Johnson Controls, the JV partner of Amara Raja, who completed two decades of partnership with the Indian battery major.

"When Johnson Controls and Amara Raja first came together in 1997, our goal was simple: deliver high-quality batteries to customers across India. By constantly innovating our products, anticipating the needs of the market and delivering value to our customers every single day, we've certainly met our goal. This advanced battery plant heralds another path-breaking journey between the two companies for creating new milestones, " said Oliver.

Ramachandra N Galla, Chairman, Amara Raja Group said this initiative is a step forward in boosting capabilities to match global competitiveness.

"The advanced, high-speed assembly lines present in this plant will increase efficiencies, thereby driving higher productivity and shorter delivery times. Johnson Controls has always supported our efforts to introduce advanced technology and innovative products," added Galla.

Amara Raja has deployed energy-efficient processes to minimise carbon emissions. For harnessing solar energy, the plant is also installed with 2.7 MW of rooftop solar power which generates 4.5 mn KWh of energy. The high-speed assembly lines and the advanced Robotic system will help minimise human intervention making the process highly reliable, added the company in a statement.

Amara Raja is a company with 26% equity each from the Galla Family and Johnson Controls Inc., USA, Amara Raja Batteries Limited is the technology leader and one of the largest manufacturers of lead-acid batteries for both industrial and automotive applications in the Indian storage battery industry.

In India, Amara Raja is the preferred supplier to major telecom service providers, Telecom equipment manufacturers, the UPS sector (OEM & Replacement), Indian Railways and to the Power, Oil & Gas, among other industry segments. Amara Raja's industrial battery brands comprise PowerStack®, AmaronVoltTMand Quanta®. The Company is a leading manufacturer of automotive batteries under the brands Amaron® and PowerzoneTM, which are distributed through a large pan-India sales & service retail network.

The Company supplies automotive batteries under OE relationships to Ashok Leyland, Ford India, Honda, Hyundai, Mahindra & Mahindra, Maruti Suzuki, and Tata Motors. The Company's Industrial and Automotive Batteries are exported to countries in the Indian Ocean Rim.

Link to comment
Share on other sites

Cbn & Lokesh well done & all the best.... Boom undi kabbati hyd ki vachayi kani cbn goppatanam emi ledu ani vagina edavalaki capital city lekunda... Saraina Infrastructure lekunda vere states to poti padutu boom leni time lo state ki companies teesukuni vastunadu ra kindal chesina  musti edaval lara   

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...