Jump to content

Amaravati


Recommended Posts

అబ్బురపడేలా అమరావతి!
 
636304976017939431.jpg
  • సింగపూర్‌కన్నా మిన్నగా నిర్మిస్తాం
  • అవినీతి మచ్చలేని దేశం సింగపూర్‌
  • అందుకే ఆ దేశంతో కలిసి అడుగులు
  • అమరావతి.. రాష్ట్రానికి బాహుబలి
  • ఆనంద నగరంగా తీర్చిదిద్దుతాం
  • జవజీవాలతో తొణికిసలాడేలా చేస్తాం
  • ప్రజా రాజధానిగా రూపుదిద్దుతాం
  • కన్సార్షియానికి 3 దశల్లో భూములు
  • లాభాల్లో 75 శాతం మనకే: చంద్రబాబు
  • రాజధాని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై కన్సార్షియంతో 2 ఎంవోయూలు
  • పనులకు లాంఛనంగా శంకుస్థాపన
  • హాజరైన సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం మెచ్చేలా.. స్వర్గాన్ని తలపించేలా.. సింగపూర్‌ కన్నా మిన్నగా ఆంధ్రుల ప్రజారాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని నగర స్టార్టప్‌ ఏరియా తొలిదశ అభివృద్ధి కార్యక్రమానికి సోమవారం సీఎం శ్రీకారం చుట్టారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌తో కలసి ఉద్దండరాయునిపాలెం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో.. స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అభివృద్ధి పరిచేందుకు సింగపూర్‌ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎంవోయూలు కుదుర్చుకుంది.
 
వీటిపై అధికార బృందాలు సంతకాలు చేశాయి. ఈ రెండు కార్యక్రమాల్లోనూ సీఎం మాట్లాడారు. ప్రపంచమే అమరావతికి వచ్చేలా రాజధాని నగరాన్ని అత్యద్భుతంగా నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిని రాష్ట్రానికి బాహుబలిగా అభివర్ణించారు. క్రమశిక్షణ, చిత్తశుద్ధి, పక్కా ప్రణాళికతో స్వల్పకాలంలోనే ప్రపంచంలోని మేటి దేశాల్లో ఒకటిగా ఎదిగిన సింగపూర్‌ స్ఫూర్తితో, దాని భాగస్వామ్యంతో ఆ దేశం కంటే మిన్నగా అమరావతిని రూపొందించాలన్నదే తన ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీసంఖ్యలో ఉద్యోగాలు, సంపద, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రజలందరూ సుఖసంతోషాలతో, నాణ్యమైన జీవనం గడిపేలా చూసేందుకే సింగపూర్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అవినీతి మచ్చ లేని, స్వచ్ఛతకు పర్యాయపదమైన దేశంగా పేరొందిన సింగపూర్‌తో ఎంవోయూల ద్వారా ఒక్క అమరావతే కాకుండా యావత్తు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు.
 
అమరావతి రూపకల్పనలో సింగపూర్‌ ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడుగునా చేయూతనందిస్తోందని, ‘అమరావతి సాధ్యమేనన్న విశ్వాసాన్ని’ ప్రజల్లో కలిగించిందని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమపై నమ్మకంతో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన సుమారు 33వేల ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆ భూమిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన రాజధానిని నిర్మించేదుకు సింగపూర్‌ కన్సార్షియం ముందుకురావడం మరో ఎత్తని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని ఇతర రాజధాని నగరాల్లా.. కేవలం పరిపాలనా రాజధానిగా అమరావతి మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో దానిని ప్రజారాజధానిగా మలుస్తామని సీఎం ప్రకటించారు.
 
రాజధాని నగరం నిరంతరం జవజీవాలతో తొణికిసలాడాలన్నది తన తపన అన్నారు. అమరావతి నగరాన్ని.. ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగానే కాకుండా అత్యద్భుత మౌలిక సదుపాయాలతో నాణ్యమైన జీవనానికి నెలవుగా, ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణంలో.. ‘పీపుల్‌ ఫస్ట్‌’ అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వం, వ్యాపారవేత్తలతోపాటు అందరూ ప్రజలకు మేలు చేసే విధంగానే నడుచుకోవాలన్నదే ఈ నినాదం పరమార్ధమని చెప్పారు. అభివృద్ధి పనుల్లో పర్యావరణ పరిరక్షణ విధానాలకూ పెద్దపీట వేయాలని, ప్రతి అంశంలోనూ అమరావతి అగ్రగామిగా నిలిచేలా స్టార్టప్‌ ఏరియాను తీర్చిదిద్దాలని సింగపూర్‌ సంస్థలను కోరామని తెలిపారు. తెలుగువాడి ప్రతిభకు సింగపూర్‌ నైపుణ్యం తోడైతే అమరావతి అగ్రగామిగా నిలవడం ఖాయమన్నారు.
 
మూడు దశల్లో భూముల కేటాయింపు
అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తున్న సింగపూర్‌ కన్సార్షియానికి ఒకేదఫాలో భూములు ఇవ్వడం లేదని సీఎం వివరించారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి 1691(6.84 చదరపు కిలోమీటర్లు) ఎకరాలు కేటాయించామని, ఈ భూముల్లో.. మొదటి దశలో 636 ఎకరాలు, రెండోదశలో 514 ఎకరాలు, మూడో దశలో 321 ఎకరాలు సింగపూర్‌ కన్సార్షియానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. తొలి దశ భూముల విక్రయంలో వచ్చిన రాబడిపై 5.5ు, రెండోదశలో 7.5ు, మూడోదశలో 12.5ు ఈ కంపెనీలు అమరావతి అభివృద్ధి సంస్థకు ఇస్తాయని అన్నారు. సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థల మధ్య వాటా నిష్పత్తి 58:42లో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. లాభాలలో 75 శాతం మేర మనకే ఉంటుందని.. 25 శాతం మాత్రమే సింగపూర్‌ తీసుకుంటుందని అన్నారు.
 
రోడ్లు, విద్యుత్తు, కాల్వలు, వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2118 కోట్లను సింగపూర్‌ సంస్థలు వ్యయం చేస్తాయని అన్నారు. సింగపూర్‌ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందం తరహాలో.. అంతర్జాతీయ, జాతీయ సంస్థలేవైనా రాజధాని అభివృద్ధి పనులు చేస్తామని ముందుకొస్తే వాటికి కూడా భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘ఎవరైనా ముందుకు వస్తారా?’ అని చంద్రబాబు సవాల్‌ చేశారు. మలేషియా.. ఇతర దేశాలనూ రాజధాని అభివృద్ధి కోసం రావాలని ఆహ్వానించామని, కానీ ఏ దేశమూ ముందుకు రాలేదని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని.. అమరావతి చరిత్రను భావితరాలకు అందించేలా నగర నిర్మాణం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Link to comment
Share on other sites

‘ఐకానిక్‌’ వంతెన నిర్మాణంపై ప్రముఖ సంస్థల ఆసక్తి

ఈనాడు, అమరావతి: కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రముఖ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టు) బిడ్లను ఏడీసీ ఆహ్వానించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెచ్‌సీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, టాటాప్రాజెక్ట్సు, గామన్‌ ఇండియా, ఆఫ్కాన్స్‌ తదితర సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచినట్లు తెలిసింది. ఆయా సంస్థలతో సోమవారం విజయవాడలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కార్యాలయంలో కార్యశాల (వర్క్‌షాపు)ను నిర్వహించారు. అధికారులు వంతెన గురించి సంస్థలకు వివరించారు. పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. ఇప్పటికే దీనిపై ఎల్‌అండ్‌టి ఆధ్వర్యంలో ఆకృతులను రూపకల్పన చేశారు. వచ్చేనెల 5 వరకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. మరిన్ని సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యే అవకాశాలున్నాయి. గడువు ముగిసిన తర్వాత మరోసారి కార్యశాలను నిర్వహించనున్నారు

Link to comment
Share on other sites

‘ఐకానిక్‌’ వంతెన నిర్మాణంపై ప్రముఖ సంస్థల ఆసక్తి

ఈనాడు, అమరావతి: కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రముఖ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టు) బిడ్లను ఏడీసీ ఆహ్వానించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెచ్‌సీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, టాటాప్రాజెక్ట్సు, గామన్‌ ఇండియా, ఆఫ్కాన్స్‌ తదితర సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచినట్లు తెలిసింది. ఆయా సంస్థలతో సోమవారం విజయవాడలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కార్యాలయంలో కార్యశాల (వర్క్‌షాపు)ను నిర్వహించారు. అధికారులు వంతెన గురించి సంస్థలకు వివరించారు. పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. ఇప్పటికే దీనిపై ఎల్‌అండ్‌టి ఆధ్వర్యంలో ఆకృతులను రూపకల్పన చేశారు. వచ్చేనెల 5 వరకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. మరిన్ని సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యే అవకాశాలున్నాయి. గడువు ముగిసిన తర్వాత మరోసారి కార్యశాలను నిర్వహించనున్నారు

:wall:

Link to comment
Share on other sites

రాజధాని రైతుల్లో హర్షాతిరేకం
16-05-2017 09:41:10
636305245781148935.jpg
  • ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్‌కు గజమాలతో సత్కారం
  • అభివృద్ధి జరగడం ఆనందంగా ఉంది
  • అనుకున్న సమయానికి పూర్తి చేయాలి..
  • అభిప్రాయపడిన రైతులు
తుళ్లూరు: ఉద్దండ్రాయునిపాలెం సమీపంలో సోమవారం జరిగిన రాజధాని స్టార్టప్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజధాని రైతులు కొనియాడారు. సభ ముగిసిన అనంతరం వారు వేదిక సన్మానం నిర్వహించారు. మందడానికి చెందిన రైతులు ఆలూరి కోటేశ్వరావు, సుబ్రమణ్యం, నూతక్కి కొండయ్య, కొండెపాటి శివరామయ్య, తదితరులు గజపూలమాలలతో సత్కరించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య సభ్యులు చంద్రబాబు, ఈశ్వరన్‌లను శాలువా కప్పి సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మందడం రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు.
 
ఆనందంగా ఉంది..
చంద్రబాబు నాయుడిపై నమ్మకంతోనే భూములిచ్చాం. సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలతో ఒప్పందం చేసుకోవటం మంచిదిగా భావిస్తున్నాం. అభివృద్ధి వేగంగా జరిగితే రైతులకు చాలా లాభం కలుగుతుంది. సీడ్‌ ఏరియా అభివృద్ధికి శంకుస్థాన చేయటం చాలా ఆనందంగా ఉంది.
- నూతక్కి కొండయ్య
 
సంకల్పమున్న నాయకుడు..
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నది చేస్తారు. ఆయన మీద నమ్మకం ఉంచే భూములిచ్చాం. ఈ రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. సింగపూర్‌ కంపెనీతో ఒప్పదం చేసుకోవటం మంచిదే. అయితే అనుకున్న సమయానికి పనులు పూర్తి అయ్యేటట్లు పర్యవేక్షణ ఉండాలి. రైతులందరూ స్వచ్ఛందంగా భూములిచ్చాం.
- బి.నరేంద్రబాబు, జడ్పీటీసీ సభ్యుడు
 
 
చరిత్రలో నిలిచిపోయే రోజు..
సీడ్‌ క్యాపిటల్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేయటం అనేది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం మందడం రెవెన్యూలో జరగటం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి పనులు వేగంగా జరిగితే రైతులకు మేలు జరుగుతుంది. మొదటి నుంచి చెపుతున్నట్లుగానే రైతులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అభివృద్ధి విషయంలో ముందుకు వెళుతున్నారు. సింగపూర్‌ కంపెనీతో ఒప్పదం చేసుకోవటం మంచిదే.
- ఆలూరి సుబ్రహ్మణ్యం, మందడం
 
 
అభివృద్ధి చూస్తున్నాం..
రాజధాని నిర్మాణం ఇప్పుడు చూస్తామా.. లేక ఇంకా సమయం పడుతుందా.. అనే ఆలోచనలుండేవి. అభివృద్ధి పనులు వేగం చూస్తే రాజధాని నిర్మాణానికి ఎంతో సమయం అవసరం లేదనిపిస్తుంది. ఇప్పటికే కళ్లముందు జరుగుతున్న అభివృద్ధి చూస్తున్నాం. ప్రభుత్వ భవనాలు నిర్మించే లింగాయపాలెం రెవెన్యూలోని భూమిని లాండు పూలింగ్‌కిచ్చాను. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు. రైతులు ఆయన మీద నమ్మకంతోనే భూములు ఇచ్చారు.
- ఇడుపులపాటి సీతారామయ్య, మందడం రైతు
Link to comment
Share on other sites

Singapore firms appointed master developer for Andhra Pradesh's new capital city
 
Ascendas-Singbridge and Sembcorp Development have been appointed to master develop the commercial core of Amaravati, a 6.84 square-kilometre area with developments for business, commercial and residential uses.
 

Read more at http://www.channelnewsasia.com/news/singapore/singapore-firms-appointed-master-developer-for-andhra-pradesh-s-8848694
Link to comment
Share on other sites

స్విస్ ఛాలెంజ్ .... స్వచ్ఛమే!
 
636305009287603014.jpg
అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మొట్టికాయలు వాళ్ళే తినాలి కాబట్టి..!!
 
మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సాలుకి 1.15 లక్షల కోట్లు అదనపు జోడింపు, ప్రభుత్వ ఖజానాకి పదివేల కోట్లు పన్నుల రూపేణా రాబడి. ఇదంతా కేవలం 1691ఎకరాల్లోనే! మూడు దశల్లో!!
 
ఎక్కడ?అమరావతి స్టార్ట్ అప్ ఏరియాలో! సాధ్యమా? సుసాధ్యమే అంటున్నారు చంద్రబాబు..! అంతే కాదు, ఇంతకు ముందు తాను ఇదే లాంటి ప్రయోగం, కొంచం తక్కువ స్థాయిలో చేసిన, హైదరాబాదు హైటెక్ సిటీలోని, రహేజా మైండ్ స్పేస్ చూడమంటున్నారు!
ఇదంతా అబద్ధం అంటూ స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని రాజధాని మీద బురద వేస్తున్నాయి. కొంచంసేపు సమయం వెచ్చించి, అమరావతిలో మందడం గ్రామం దగ్గర నిన్న, సోమవారం స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అభివృద్ధి కోసం శంఖుస్థాపన చేయబడిన ‘స్టార్ట్ అప్ ఏరియా’ లోని వివరాలను కొంచంసేపు పరిశీలిద్దాం.
 
ప్రపంచ స్థాయి కంపెనీలను అమరావతికి తేవడం అనే లక్ష్యంతో, మూడు లక్షల ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అంతర్జాతీయ క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్, బిజినెస్ పార్కులు, ఐటీ పార్కులు, బీటీ పార్క్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో పాటు, 3 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించే విధంగా ఒక ‘స్టార్ట్ అప్’ నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్ కన్సార్టియంతో, స్విస్స్ చాలెంజ్ టెండర్ ప్రక్రియ ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన “అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ తో ఒప్పందం కుదుర్చుకొని 1691 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, 3 దశల్లో, 15 సంవత్సరాల్లో అమరావతి నగర అభివృద్ధికి ఒప్పందం కుడుర్చుకోన్నాము. దీనిలో ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పరేషన్ ద్వారా 42 % వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58% వాటా వుంటుంది. ఇదీ స్థూలంగా ప్రాజెక్టు ముఖ చిత్రం.
 
ప్రతిపక్షాల ఆరోపణ ఏంటి అంటే, ప్రైవేటు కంపెనీలతో అమరావతిని స్టార్ట్ అప్ ఏరియాని కట్టిస్తున్నారు అని. ఇది పూర్తిగా ఇలాంటి సంస్థలపై ఏ మాత్రం అవగాహన లేని ఆరోపణ. నిజానికి ఈ కన్సార్టియంలో మూడు కంపెనీలు వున్నాయి. అసెండాస్, సేంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జ్. ఈ మూడు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 75 శాతం వాటా వుంది. ప్రైవేటు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి వాటా ఎలా వుంటుంది అనుకొనే వారికి, ఇది నిజమే అని తెలుసుకోవాలి. మన దేశంలా కాకుండా సింగపూర్ ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీల్లో కూడా పెట్టుబడి పెడుతాయి. సింగపూర్ ప్రధానంగా, ‘టేమాసేక్ హోల్డింగ్స్’, ‘జీఐసి హోల్డింగ్స్’ అనే సంస్థల ద్వారా ఇతర ప్రైవేటు కంపనీలలో పెట్టుబడులు పెడుతుంది. వీటిని సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్‌తో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పదం కుదుర్చుకొన్న మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఈ సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్. అంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకొంది సింగపూర్ ప్రభుత్వం. అమరావతిలోని స్టార్టప్ ప్రాజెక్టు రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం లాంటిది.
 
అమరావతిని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించింది 33,000 ఎకరాలు, దానికి అదనంగా ప్రభుత్వ అటవీ భూములు. వీటిలో సింగపూర్ కన్సార్షియంకు మాస్టర్ డెవలపర్ గా ఇచ్చేది 1691 ఎకరాలు. అంటే, రైతుల దగ్గర తీసుకొన్నది మాత్రమే లెక్క వేసుకొంటే కూడా, 5 శాతం మాత్రమే. ఈ అయిదు శాతం భూమిని చూపించి అమరావతిని సింగపూర్ కి అమ్మేస్తున్నారు అనడం ఎంత అన్యాయం కదా.
ఈ స్టార్ట్ అప్ ఏరియా అనేది అవసరం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అనేది ఇంకో అభియోగం. విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన. ఈ స్టార్ట్ అప్ ఏరియా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా అభివృద్ధి చెందితే, ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం వేగంగా నిర్మితమయ్యేందుకు అవకాశం వుంటుంది.
 
దీన్ని ఒక మాడల్ గా చూపించి అమరావతిలోకి మిగతా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆలోచన. ఇక రియల్ ఎస్టేట్ అనే అవకాశమే లేదు. ఉదాహరణలో చెప్పాలంటే, ఈ స్టార్ట్ అప్ ఏరియా రాజధాని నిర్మాణం కానే కాదు. హైదరాబాదులో హైటెక్ సిటీ తెలిసిన వారికి రహేజా మైండ్ స్పేస్ తెలిసే వుంటుంది. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఆ నూట యాభై ఎకరాల జాగాని రహేజాకు ఇచ్చింది, అటూఇటూగా ఇప్పటి స్టార్ట్ అప్ ఏరియా ప్రాతిపదికనే. ఆ రోజు కూడా ఇదేలాంటి ఆరోపణలు చేసారు. ఈ రోజు అక్కడ, కొందామన్న కూడా, ఒక మిల్లీమీటర్ జాగా కూడా దొరుకదు. రహేజాలోకి వచ్చిన సంస్థల ప్రభావంతో ఇప్పుడు అది నిండిపోయి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కూడా పూర్తిగా నిండి పోయింది హైదరాబాదులో. అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే హైదరాబాదు లోని ‘హైటెక్స్’ కూడా ఇలాంటి ప్రాజెక్టే. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎలా ఆయువు అయిందో, అమరావతికి ఈ స్టార్ట్ అప్ ఏరియా అలా అవుతుందని అంచనా.
 
అమరావతిని మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ కంపెనీలకి ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వమే చెయ్యచ్చు కదా అనేది ఇంకొందరి వాదన. పలుదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సింగపూర్ ప్రభుత్వ అండదండలు వుంటాయి కాబట్టి, ఆ స్థాయిలో తమ ప్రభావం చూపుతూ, అమరావతిలోని వున్న విజ్ఞానం, చదువుకొన్న మాన్ పవర్, రానున్న ఇతర సంస్థలు, గ్రోత్ రేటు, భవిష్యత్‌ అవకాశాలు, ప్రపంచ స్థాయి కంపెనీల రాక, మౌలిక సదుపాయాలు, క్వాలిటీ నిర్మాణాలు, లివింగ్ స్పేస్‌లాంటి పాజిటివ్ పాయింట్స్ చెప్తూ, మార్కెట్ చెయ్యడం ఈ సంస్థల ప్రాధాన వ్యాపారం. అమెరికాకు వెళ్లి చంద్రబాబు వ్యాపార అవకాశాలు తెచ్చారని చెప్పి, ఎల్లకాలం ఆయన్ని అమెరికాలోనే ఉండమని చెప్తే, ఇక్కడ పరిపాలన చెయ్యాలి కదా! అందుకని, ఆ స్థాయిలో వ్యాపారం అభివృద్ధి చెయ్యాలి కాబట్టి, మన రాష్ట్రం తరఫున ఈ సంస్థలు చేస్తాయన్నమాట. ఇక ఈ సంస్థల శక్తి యుక్తులు చూస్తే, ఈ కన్సార్టియంకి రూ. 50,000 కోట్ల విలువ చేసే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల అనుభవం వుంది. మన దేశంలోని చెన్నై, బెంగళూరులలో నిర్మాణ అనుభవంతో పాటుగా, 19 దేశాల్లో ఆఫీసులు కలిగి, ఇప్పటి దాకా 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేసిన ట్రాక్ రికార్డ్ వుంది. ఈ సంస్థలు చంద్రబాబు బినామీలు, వారితో మిలాకత్ అయ్యి అవినీతి చేస్తున్నారు, అందుకోసమే స్విస్ చాలెంజ్ పెట్టారు అని ఇంకొక అర్ధం లేని ఆరోపణ. ప్రభుత్వం టెండర్ల ప్రక్రియని పూర్తి పారదర్శకతతో చేసింది. ‘రిక్వెస్ట్ ఫార్ ప్రపోజల్’ ప్రక్రియని 47 ప్రధాన విదేశీ ఎంబెసీలకు పంపింది. 105 దేశాలకు పంపింది. అన్నీ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. కావాల్సిన సమయం 45 రోజులు ఇచ్చారు. ఇదే రకమైన అనుభవంతో, ఇంకెవరైనా వస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అమరావతి భూములను ప్రైవేటు వారికి ఇచ్చేస్తున్నారు అని ఇంకొకరి అవగాహనా రాహిత్యం. 6.8 కిలోమీటర్ల పరిధిలోని ఈ స్టార్టప్ నగరం మొదటి ఫేజ్ లో 651ఎకరాల్లో నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణాలు, వాటిని అంతర్జాతీయ సంస్థలకి, 70 శాతం అమ్మకం పూర్తి అయిన తర్వాతే, రెండవ ఫేజ్ లో 514 ఎకరాల స్థలం ఇవ్వబడుతుంది. దానిలో 70 శాతం పూర్తి అయిన తర్వాతనే చివరి ఫేజ్ లోని 521 ఎకరాలు ఇవ్వబడుతాయి. సింగపూర్ సంస్థతో కేవలం జీపీఏ మాత్రమే జరుగుతుంది. భూమి మీద యాజమాన్య హక్కు ఇవ్వబడదు. భూమి మీద చేసిన నిర్మాణాలకు సిఆర్డీఏ మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది.
 
అందువలన ప్రభుత్వానికి దీని మీద సంపూర్ణ కంట్రోల్ వుంటుంది. ఈ భూమిలో ఈక్విటీని, గతంలో హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్లో , రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం చేసినట్టుగా ప్రభుత్వ ఈక్విటీని తగ్గించి/ వారికే అమ్మేసి, క్విడ్ ప్రో కొ పద్ధతిలో వేరే చోట పెట్టుబడులు, లేదా ధన మార్పిడి లాంటి వాటికి వీలు లేదు. ఆ మేరకు ముందుగానే చట్టంలో పెట్టారు. అంటే ప్రభుత్వం భవిష్యత్తులో ఈక్విటీ అమ్మే వీలు లేదు. అంటే, ఇరు వర్గాలకీ డబ్బు మార్పిడి జరిగే అవకాశం లేదు. అందువలన అవినీతికి ఆస్కారం లేదు.
 
ఇక భూమి ఇచ్చిన రైతులకి లాభం ఎలా అంటే, భూమినిచ్చిన రైతుకు లాభం చేకూర్చే విధంగా ఎకరం విలువ నాలుగు కోట్లు రిజర్వ్ ధరగా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ భూమిని తక్కువ అమ్మిన పక్షంలో కూడా ఆ ధర యొక్క బేధాన్ని వుమ్మడి అకౌంట్లోనే జమ చెయ్యాలి. ఎందుకంటే ప్రభుత్వం, కన్సార్టియం ఇద్దరు భాగస్తులు కాబట్టి. మొదటి ఫేజ్ లో నాలుగు కోట్లు ధర నిర్ణయం వలన, రైతులకు సంపద సృష్టిస్తాం అనే మాటని ప్రభుత్వం నిలబెట్టుకొంది.
 
ప్రభుత్వానికి తక్కువ శాతం లాభం అని ఇంకొక వాదన. కానీ పైన చెప్పిన 42 శాతంకి అదనంగా కాకుండా స్థూల విక్రయంలో మళ్ళీ ప్రభుత్వానికి కన్సార్టి యం లాభం చెల్లించాలి. మొదటి ఫేజ్లో 5శాతం, రెండవ ఫేజ్లో 8.5 శాతం, మూడవ ఫేజ్లో 12.5 శాతంగా వుంటుంది. ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 2100 కోట్లు పెడుతుండగా, అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్ 222 కోట్లు పెడుతుంటే, సింగపూర్ కన్సార్టియం 306 కోట్లు పెడుతోంది. పన్నులు, జీడీపీలను లెక్క వేసుకొంటె సరాసరి ప్రభుత్వానికి 57 శాతం రాబడి వస్తుందని అంచనా. మొత్తం మీద ‘స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు’ వలన నగదు రూపంలో ప్రభుత్వానికి రూ.1246 కోట్లు (53 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడంద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు (75.3 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం లభిస్తుంది. స్థూలంగా 3 లక్షల ఉద్యోగాలు, పదివేల కోట్ల పన్ను రాబడి, 1.15 లక్షల కోట్లు స్థూల రాష్ట్ర ఉత్పత్తికి జోడింపు. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి చోదకంగా ఉపయోగపడతాయి కాబట్టి, ఈ స్టార్ట్ అప్ ఏరియా బయట కూడా పలు సంస్థలు వచ్చే అవకాశం వుంది.
 
అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మొట్టికాయలు వాళ్ళే తినాలి కాబట్టి..!!
----­­నీలాయపాలెం విజయకుమార్
తెలుగుదేశం పార్
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...