Jump to content

Amaravati


Recommended Posts

అమరావతి అభివృద్ధికి ‘స్టార్టప్‌’
 
636303205634982173.jpg
  • సింగపూర్‌ కన్సార్టియం ద్వారా అభివృద్ధికి రేపు శ్రీకారం
  • సీఎం సమక్షంలో ఒప్పందం.. మందడంలో వేడుకగా శంకుస్థాపన
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలోని 1,691 ఎకరాల్లో(6.84 చదరపు కిలోమీటర్లు) ప్రతిపాదించిన ‘స్టార్టప్‌ ఏరియా’ అభివృద్ధితో అమరావతి సర్వతోముఖాభివృద్ధి చెంది, ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల సరసన నిలవడం తధ్యమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రభుత్వ భవనాన్ని ఆనుకుని తూర్పు దిక్కున ఉన్న ఈ స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కన్సార్టియం ద్వారా స్విస్‌ చాలెంజ్‌ విధానంలో 3 దశల్లో అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన అవగాహనాపత్రం(ఎంవోయూ)పై సోమవారం సంతకాలు, సదరు ఏరియా రానున్న మందడం వద్ద శంకుస్థాపన, బహిరంగసభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అమరావతి అభ్యున్నతికి చోదకశక్తిగా ఉపకరించనున్న ఈ స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే శంకుస్థాపనను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏపీసీఆర్డీయే ఏర్పాట్లు చేస్తోంది.
 
స్టార్టప్‌ ఏరియా ఆవశ్యకత
అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అత్యంత క్రియాశీలక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగాను, ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, జీవనయోగ్యమైన వసతులు కలిగిన నగరంగాను తీర్చిదిద్దితే రాజధాని నగరం అద్భుతంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఫలితంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో తొలుత ఒక ప్రదేశాన్ని స్టార్టప్‌ ఏరియాగా అభివృద్ధిపరచాలని నిర్ణయించింది. ‘సీబీడీ, సీడ్‌ ఏరియా, ఫైనాన్షియల్‌ డిసి్ట్రక్ట్‌, కోర్‌ ఏరియా’ ఇలా పలువిధాలుగా అభివృద్ధిపరచాలని నిర్ణయించింది.
 
ప్రాజెక్ట్‌ వివరాలు
అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)తో కలసి సింగపూర్‌ కన్సార్టియం ఒక ఎస్‌పీవీ(స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌)ని స్థాపిస్తుంది. అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్‌(ఏడీపీ)గా దీనిని వ్యవహరిస్తారు. ఈ ఏడీపీ అమరావతి స్టార్టప్‌ ఏరియాలోని 1691 ఎకరాలను 3 దశల్లో, 15 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి పరుస్తుంది. తొలి దశలో 656 ఎకరాలు, 2వ దశలో 514 ఎకరాలు, 3వ దశలో 521 ఎకరాలను డెవలప్‌ చేస్తుంది.
 
ప్రతి దశలో 70% భూమిని అభివృద్ధి చేసి, విక్రయించిన తర్వాత తదుపరి దశను చేపడుతుంది. అయితే అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించే అధికారం సీఆర్డీయేకే ఉంటుంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రభుత్వానికి స్థూల విక్రయాదాయంపై వాటా(1వ దశలో 5ు, 2వ దశలో 7.5%, 3వ దశలో 12.5%) రూపంలోను, ఏడీపీ ఆర్జించే లాభాల్లో 42% వాటా(ఇతర పీపీపీ ప్రాజెక్టుల్లో ఇది సాధారణంగా 26%కి మించి ఉండదు) ద్వారానూ లభించడంతోపాటు దాదాపు రూ.2,118 కోట్ల వ్యయంతో ఇందులో ఏడీపీ కల్పించబోయే మౌలిక సదుపాయాలను అనంతరం సీఆర్డీయేకు బదలాయిస్తారు. నూతన రాజధానిలో ప్రపంచస్థాయి ఆర్ధిక వ్యవస్థకు బీజాలు పడడమే కాకుండా ఏడీపీ తొలిదశలోని మూడేళ్లలో 8.07 లక్షల చదరపుటడుగుల నిర్మాణాలను చేపట్టనుంది
Link to comment
Share on other sites

అమరావతి రాజధాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సోమవారం బీజం పడనుంది. 1,691 ఎకరాల్ (6.94 చదరపు కిలోమీటర్ల) పరిధిలో ఈ ఏరియాను స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి పరచే మాస్టర్‌ డెవలపర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన సింగపూర్‌ కన్సార్టియం (అసెండాస్‌- సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌) సోమవారం ఏపీసీఆర్డీయేతో కీలక ఎంవోయూ చేసుకోనుంది. రాజధాని గ్రామాల్లో ఒకటైన మందడం వద్ద ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పెద్దఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు, ఏపీసీఆర్డీయే అధికారులు పాల్గొననున్నారు. సీఎం కోరిన వెంటనే అమరావతి నిర్మాణార్ధం వేలాది ఎకరాలను సమీకరణ ప్రాతిపదికన స్వచ్ఛందంగా అందజేసిన రాజధాని రైతులకు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.

ఏమిటి ఈ స్టార్టప్‌ ఏరియా ?
అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వివిధ పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూముల విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్‌ ఏరియా ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇది అభివృద్ధి చెందితే ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం చకచకా నిర్మితమయ్యేందుకు బాటలు పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో తొలుత ఒక ప్రదేశాన్ని స్టార్టప్‌ ఏరియాగా అభివృద్ధిపరచాలని నిర్ణయించింది.

ఇంకా చెప్పాలంటే... ఈ స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ కాదు... ఇది రాజధాని నిర్మాణం కానే కాదు... ఇది పూర్తిగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహా ప్రాజెక్ట్... 3 లక్షల ఉద్యోగాల కల్పనకై.. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ జి డి పి పై వుంటుంది... హైదరాబాద్ కు హైటెక్ సిటీ ఎలా ఆయువు పట్టో... అమరావతి కి ఇది.. ఇదేమీ ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు.. ఫలితాలకోసం కనీసం 5-10 ఏళ్ళు వెయిట్ చేయాలి...

ప్రాజెక్ట్‌ వివరాలు
అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ), సింగపూర్‌ కన్సార్టియం కలిసి అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) కంపెనీగా ఏర్పడి స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయనున్నాయి.
ఏడీపీలో సింగపూర్‌ కన్సార్టియంకు 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుంది. మొత్తం 1691 ఎకరాలు స్టార్టప్‌ ఏరియాకుగానూ 15 ఏళ్లలో 3 దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల భూమిని అభివృద్ధి పరుస్తారు.

 

స్థూల విక్రయాదాయంపై రెవెన్యూ వాటా కింద మొదట దశలో 5 శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతాన్ని ఏడీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మొత్తం మూడు దశల్లో కలిపితే ఇది 8.7 శాతం ఉంటుంది. ఏడీపీ కంపెనీ కేంద్ర రాజధాని ప్రాంతంలో భూమిని అభివృద్ధి పరిచి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పరుస్తుంది. క్వీన్‌బీలను, ఉద్యోగ అవకాశాలను పెంచే సంస్థలను ఆకర్షించే విధంగా మార్కెటింగ్‌ చేస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్లాట్లను విక్రయించే అధికారం సీఆర్‌డీఏకే ఉంటుంది. దీనివల్ల భూమిపై హక్కులు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. ఆ ఫ్లాట్లను వేలంద్వారా అత్యధిక పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను అందించగలిగే సంస్థలకు విక్రయిస్తాం. తొలి దశలో రిజర్వు ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించారు.

ఏడీపీ, ప్రభుత్వ కమిటీ ద్వారా మిగతా దశల్లో విక్రయ ధరలను నిర్ణయిస్తారు. మెకన్సీ అండ్‌ కో సంస్థ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో 15 ఏళ్లలో అమరావతిలో 1.25 లక్షల కుటుంబాలు స్థిరపడతాయి. 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.1,15,000 కోట్లు లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నులు రూపంలో రూ.8వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు రాబడి వస్తుంది. తొలి మూడేళ్లలో చేపట్టనున్న 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి చోదకంగా ఉపయోగపడతాయి.

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుతో నగదు రూపంలో ప్రభుత్వానికి రూ.1246 కోట్లు (53 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి రూ.1105 కోట్లు (47 శాతం) ఆదాయాల వాటా లభిస్తుంది. అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పొందడంద్వారా రూ.2118 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో ప్రభుత్వానికి రూ.3364 కోట్లు (75.3 శాతం), సింగపూర్‌ కన్సార్టియానికి 24.7 శాతం ఆదాయం లభిస్తుంది.

దీని పై కూడా కోర్ట్ కేసులు వేసిన అమరావతి వ్యతిరేకులు
స్విస్‌ ఛాలెంజ్‌ పై మొదట కోర్ట్ లో కేసు వేస్తె, మధ్యలోనే టెండర్ ఆపేసి మళ్ళీ టెండర్ పిలిచారు... అప్పుడు ఎవ్వరూ ఈ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనకు, ఎదురు ప్రతిపాదన ఇవ్వలేదు.. అప్పుడు కోర్ట్, అసలు మీ అర్హత ఏంటి అని అడిగి, ఈ అమరావతి వ్యతిరేకుల బినామీలను కౌంటర్ దాఖలు చెయ్యమని కోర్ట్ అంటే, అప్పటినుండి మాయమయ్యారు ఈ బినామీలు... ఎందుకంటే ఈ బినామీ కంపెనీల ద్వారా కేసులు వేయడానికి 2016 లోనే, ఈ బినామీ కంపెనీ ధర్మవరంలో పెట్టారు...

అమరావతి వ్యతిరేకులకు ఇంకా, ఏదైనా నొప్పిగా వుంటే, మొహమాటం లేకుండా, హై కోర్ట్ కు, సుప్రీం కోర్ట్ కు వెళ్ళవచ్చు... బినామీలతో కాకుండా, అమరావతిని వ్యతిరేకించే వారు, స్వయంగా వెళితే మంచిది... ప్రజలకి కూడా వాస్తవాలు తెలికగా అర్ధమవుతాయి... 

Link to comment
Share on other sites

1691 ఎకరాల్లో ‘స్టార్టప్‌ ప్రాంత’ అభివృద్ధి

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సోమవారం మరో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ప్రభుత్వ కోర్‌ ఏరియాలో సింగపూర్‌ కన్సార్టియం చేయబోయే ‘స్టార్టప్‌ ప్రాంత’ అభివృద్ధికి తొలి అడుగు పడనుంది. మొత్తం 1691 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ స్టార్టప్‌ ప్రాంతంలో మౌలికసదుపాయాల కల్పనకు సింగపూర్‌ సంస్థ రూ.2,118 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనిద్వారా రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో 2.50లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చనేది అంచనా. రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపలెం ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్డీఏ) ఈ భూమిని మూడు దశల్లో సింగపూర్‌ కన్సార్టియంకు అందజేస్తుంది. ఇక్కడ స్టార్టప్‌ కంపెనీలు స్థాపనకు కావాల్సిన మౌలికసదుపాయాలన్నిటినీ ఆ సంస్థ కల్పిస్తుంది. సింగపూర్‌ కన్సార్టియంకు ఆసియాలోని 30 దేశాల్లో 3వేలకుపైగా సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగా అమరావతికి పెట్టుబడులు రానున్నాయి. మొదటి మూడేళ్లలో ఈ సంస్థ 8.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది.

సింగపూర్‌ మంత్రి రాక: రాజధాని ప్రాంతంలో సింగపూర్‌ కన్సార్టియంతో సీఆర్డీఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సోమవారం ఎంఓయూపై సంతకాలు, శంకుస్థాపన కార్యక్రమం ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాళ్లాయపాలెం వద్ద శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సింగపూర్‌ పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ విజయవాడకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో కీలకదశకు శ్రీకారం
 
636303820137348369.jpg
అమరావతి: రాజధాని నిర్మాణంలో కీలకదశకు శ్రీకారం చుట్టారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలో ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. సింగపూర్‌ కన్సార్టియం, ఏపీ సీఆర్డీఏ మధ్య మరో ఒప్పందం చేసుకుంటారు. చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
సీడ్‌ కేపిటల్‌లో మూడు దశల్లో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి చేయనున్నారు. సింగపూర్‌ నుంచి పారిశ్రామికవేత్తల బృందం రానుంది. సింగపూర్‌ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీడ్ కేపిటల్‌ మందడం దగ్గర స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి శిలాఫలకాన్ని చంద్రబాబు, ఈశ్వరన్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగసభ నిర్వహిస్తారు. ఈ సభకు మంత్రులు హాజరుకానున్నారు.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి నేడు శంకుస్థాపన

సింగపూర్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

సంతకాలు చేయనున్న చంద్రబాబు, ఈశ్వరన్‌

14ap-main7a.jpg

ఈనాడు-అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన ‘స్టార్టప్‌’ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చ.కి.మీ. పరిధిలో (1691 ఎకరాల్లో) స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సోమవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్యలో శంకుస్థాపన కార్యక్రమం, అనంతరం బహిరంగ సభ జరగనున్నాయి. స్టార్టప్‌ ప్రాంతానికి ప్రధాన అభివృద్ధిదారుగా (మాస్టర్‌ డెవలపర్‌) ఎంపికైన సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ సంస్థల కూటమి (కన్సార్టియం)కి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ‘లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌’ని అందజేస్తారు. సింగపూర్‌ సంస్థల కూటమి నుంచి అంగీకార పత్రాన్ని అందుకుంటారు.

బంధం మరింత బలోపేతం..

అమరావతికి బృహత్‌ ప్రణాళిక రూపకల్పన, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సోమవారం ఉదయం కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోబోతోంది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంపు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్‌ ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒప్పందంపై చంద్రబాబు, ఈశ్వరన్‌ సంతకాలు చేస్తారు. ఎంఓయూ అమలుకు అవసరమైన మార్గదర్శనం చేసేందుకు చంద్రబాబు, ఈశ్వరన్‌ల సారథ్యంలో ఉన్నతస్థాయి సంయుక్త అమలు పర్యవేక్షణ కమిటీ (జేఐఎస్‌సీ) ఏర్పాటవుతుంది. ఆ వెంటనే ఈ కమిటీ తొలి సమావేశంతో పాటు చంద్రబాబు, ఈశ్వరన్‌ మధ్య ముఖాముఖి సమావేశం జరుగుతుంది. ఎంఓయూని అమలు చేసేందుకు సింగపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన సీనియర్‌ అధికారులతో సంయుక్త వర్కింగ్‌ కమిటీ (జేఐడబ్ల్యూసీ)ని ఏర్పాటు చేస్తారు.

సింగపూర్‌ నుంచి వస్తున్న 60 నుంచి 70 మంది వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ముఖ్యమంత్రి అల్పాహార విందు సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 10 నుంచి 2 గంటల వరకు విజయవాడలోని ఒక హోటల్‌లో జరుగుతాయి. అనంతరం చంద్రబాబు, ఈశ్వరన్‌ స్టార్టప్‌ ప్రాంత శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరి వెళతారు.

మూడు దశల్లో అభివృద్ధి..

కేంద్ర రాజధాని ప్రాంతంలోని స్టార్టప్‌ ప్రాంతం అమరావతికే తలమానికం కానుంది. స్టార్టప్‌ ప్రాంతానికి కేటాయించిన 1691 ఎకరాల ప్రాంతం.. ప్రభుత్వ భవనాల సముదాయాన్ని ఆనుకుని, కృష్ణా తీరం వెంబడి విస్తరించి ఉంది. దీన్ని 15 ఏళ్లలో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాల్ని అభివృద్ధి చేస్తారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ సంస్థల కూటమి, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సంయుక్తంగా అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) పేరుతో ఒక ప్రత్యేక సంస్థని (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌-ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తాయి. ఏడీపీలో సింగపూర్‌ కూటమి రూ.306 కోట్లు, ఏడీసీ రూ.222 కోట్లను మూలధన పెట్టుబడిగా పెడతాయి.

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిలో తొలుత 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మితప్రాంతం కలిగిన అత్యాధునిక బహుళ ప్రయోజన భవనాల్ని నిర్మిస్తారు. వీటిలో కార్యాలయాలు, వినోద కేంద్రాలు, నివాస ప్రాంతాలు ఉంటాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. 15 ఏళ్లలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పూర్తయ్యేసరికి ఇక్కడ 1.25 లక్షల కుటుంబాలు నివసిస్తాయని, 2.50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, జీఎస్‌డీపీకి రూ.1.15 లక్షల కోట్లు సమకూరుతాయని, ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ప్రాజెక్టు పర్యవేక్షణకు సింగపూర్‌ ప్రభుత్వమే స్వయంగా ప్రాజెక్ట్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీసు (పీఎఫ్‌ఓ) ఏర్పాటు చేస్తుంది.

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధితో పాటు, ఆంధ్రప్రదేశ్‌, సీఆర్‌డీఏ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఏపీఐపీఏ) లేదా రాజధానిప్రాంత పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (క్రిపా)లను ఏడీపీ ఏర్పాటు చేయనుంది.

Link to comment
Share on other sites



  • నేడు స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి శ్రీకారం
  • చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన
  • హాజరుకానున్న సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
  • ఉదయం కన్సార్షియంతో ఎంవోయూ
  • 2018కల్లా స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి!

అమరావతి/గుంటూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. అమరావతి నగరానికి తలమానికంగా నిలిచే స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భూమి పూజ నిర్వహించనుంది. కృష్ణా నదికి అభిముఖంగా 1691 ఎకరాల్లో(6.84 చదరపు కిలోమీటర్లు) ప్రతిపాదించిన స్టార్టప్‌ ఏరియాను శరవేగంగా అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియను పరుగులెత్తించాలని ప్రభు త్వం భావిస్తోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్ణీత గడువులోగా నిర్మించినట్లే.. అమరావతి స్టార్టప్‌ ఏరియాని కూడా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై సోమవారం ఉదయం విజయవాడలో సింగపూర్‌ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ల సమక్షంలో ఉన్నతాధికారుల బృందాలు స్విస్‌ చాలెంజ్‌ విధానంలో చేపట్టనున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేయనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం 6.84 చదరపు కిలోమీటర్లలో స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌ కన్సార్షియంను మాస్టర్‌ డెవలపర్‌గా నియమిస్తూ లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను అందజేస్తుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజధాని ప్రాంతంలోని మందడం వద్ద సోమవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు.

 

ఎంవోయూ అమలు ఇలా..

అమరావతి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి కుదుర్చుకున్న ఎంవోయూను అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. దీనిలో భాగంగా ‘జేఐఎ్‌ససీ(సంయుక్త కార్యాచరణ స్టీరింగ్‌ కమిటీ)ని ఏర్పాటు చేస్తారు. దీనిలో సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన తదితరులు సభ్యులుగా ఉంటారు. దీంతోపాటు ‘జేఐడబ్ల్యూసీ(సంయుక్త కార్యాచరణ వర్కింగ్‌ కమిటీ)’ని రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాలకు చెందిన సీనియర్‌ అధికారులతో నియమిస్తారు. వీటితోపాటు అమరావతికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు.. సంస్థాగత సహకారం అందించేందుకు ‘ఏపీ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన ఏజన్సీ’(ఏపీఐపీఏ) లేదా ‘క్యాపిటల్‌ రీజియన ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన ఏజన్సీ’(సీఆర్‌ఐపీఏ)ని సింగపూర్‌ కన్సార్షియం ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు సింగపూర్‌ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్‌ ఆఫీ్‌సను కూడా స్థాపిస్తుంది.

 

స్టార్టప్‌ ఏరియాలో ఏముంటాయంటే..

స్టార్టప్‌ ఏరియాలో ప్రధానంగా శాశ్వత అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, సచివాలయం, హెచవోడీలు, డైరెక్టరేట్లు, కమిషనరేట్ల నిర్మాణం జరుగుతుంది. ఒకపక్క హైకోర్టు నిర్మిస్తారు. ఇందుకోసం ప్రపంచస్థాయిలో ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్లు తెప్పించి పరిశీలించారు. అమరావతి చరిత్రని ప్రతిబింబించడంతోపాటు అత్యాధునికంగా ఉండే డిజైన్లను ఆమోదించి నిర్మాణం చేపడతారు. ప్రభుత్వ భవనాలే కాకుండా మంత్రుల నివాసాలు, సీనియర్‌ అధికారులకు బంగ్లాలు ఇందులో నిర్మిస్తారు. రివర్‌ ఫ్రంట్‌ని అభివృద్ధి చేస్తారు. రాయపూడి, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, మందడం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతారు. 2018 నాటికి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

 

ఉపాధి కల్పించే సంస్థలకు ప్రాధాన్యం..

నిర్ణీత ప్రమాణాల మేరకు స్టార్టప్‌ ఏరియాలో డెవలప్‌ చేసిన ప్లాట్లను వేలం ద్వారా.. ప్రపంచంలో పేరొందిన, అత్యధిక పెట్టుబడులు పెట్టి, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందించగలిగిన సంస్థలకు చర్చల ద్వారా కేటాయిస్తారు. క్వీన బీ కంపెనీ (తాము రావడంతోపాటు పలు ఇతర సంస్థలనూ రప్పించగలిగే సామర్ధ్యమున్నవి)లను, ఉద్యోగావకాశాలను పెంచే సంస్థలను ఆకర్షించేలా ఏడీపీ(అమరావతి డెవల్‌పమెంట్‌ పార్టనర్‌) మార్కెటింగ్‌ చేస్తుంది. స్టార్టప్‌ ఏరియాను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలి దశలో రిజర్వ్‌ ధరను ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించగా, 2, 3 దశల్లో మిగిలిన భూముల ధరలను ప్రభుత్వ కమిటీ మరియు ఏడీపీ సంయుక్తంగా ఖరారు చేస్తాయి. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధితో నవ్యాంధ్ర రాజధానిలో ప్రపంచస్థాయి ఆర్థికవ్యవస్థకు బీజాలు పడుతాయని భావిస్తున్నారు. ప్రముఖ ఆర్థిక సలహా సంస్థ మెకన్సీ అండ్‌ కో అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల 15 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.1,15,000 కోట్ల స్థూల ఉత్పత్తి ఆదాయం లభించనుంది.

Link to comment
Share on other sites

amar9.jpgఅమరావతి స్టార్టప్‌కు శ్రీకారం
 
636304319664601854.jpg
గుంటూరు/తుళ్లూరు: అమరావతి రాజధాని నగరానికి తలమానికంగా నిలిచే స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భూమిపూజ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి సింగపూర్‌ సంస్థతో ఓ ఒప్పందానికి రానుంది. కార్యక్రమానికి 70 మంది సింగపూర్‌ ప్రతినిధులు, వెయ్యిమంది పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఐదువేలమందితో బహిరంగ సభ జరపటానికి ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజదాని రైతులకు సీఆర్‌డీఏ ఫోన్‌ మేసేజ్‌లతో ఆహ్వానాలు పంపారు. గుంటూరు జేసీ కృతికా శుక్లా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక, సభికులు కూర్చునేందుకు షామియానాలను రంగురంగులుగా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో వీవీఐపీ, వీఐపీ సాధారణ పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో ఎయిర్‌ కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంభందించి ఫొటో గ్యాలరీని వేదిక పక్కన ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని జేసీ శుక్లా పేర్కొన్నారు.
శంకుస్థాపనకు పటిష్ట బందోబస్తు
రాజధాని స్టార్టప్‌శంకుస్థాపన కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ తెలిపారు. ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సీఎం సహా దేశ విదేశ పారిశ్రామిక, వ్యాపార వాణిజ్యవేత్తలు హాజరవుతున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హెలీప్యాడ్‌, సభ జరిగే ప్రదేశం, పార్కింగ్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. రూరల్‌ జిల్లా నుంచి 750 మంది సిబ్బంది బందోబస్తుకు హాజరవుతున్నారన్నారు. సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామాంజనేయులు, తుళ్ళూరు ఏఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో పాటు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Link to comment
Share on other sites

చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ విజయవాడలో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి అవగాహన ఒప్పందం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సింగపూర్‌ ప్రతినిధుల బృందం ఈరోజు విజయవాడ చేరుకుంది. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు 60 మంది ప్రతినిధులకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

Link to comment
Share on other sites

Singapore’s Mega Tower in Amaravati Core capital works of Andhra Pradesh are on the run with the target of completing the first phase of the development of the capital city before next elections. The first phase is going to have a huge financial tower to be built by Singapore consortium who would sign the deal with AP to take up the contract of the development works of the capital city. The memorandum of Understanding would be signed by Naidu and the Singapore minister likely today. The plan is to start with the construction of the eight lakh square feet financial tower spreading over 600 acres, while the memorandum covers the development of Amaravati start-up area of 1,691 acres. The state will launch an application facilitating the sale of plots as a part of the land collection for the development. Farmers can use this application to sell their plots. The memorandum is planned to benefit both the parties with creating opportunities for Singapore to invest in AP and AP get to use their expertise for economic development. 

 

Link to comment
Share on other sites

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీ
 
విజయవాడ: స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం సోమవారం జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఏపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ తరపున ఈశ్వరన్‌ చైర్మన్లుగా ఉన్నారు. సభ్యులుగా ఏపీ తరపున ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి, సింగపూర్ తరపున ఈశ్వరన్‌తో పాటు మరో నలుగురు సభ్యుల నియామకం జరిగింది. ఆరు నెలలకోసారి స్టీరింగ్‌ కమిటీ సమావేశం, రెండు నెలలకోసారి అధికారుల కమిటీ సమావేశం జరగనుంది. ఫైనాన్సియల్ కన్సల్టెంట్‌గా మెకన్సీ, నగర రూపకర్తగా నార్మన్ ఫోస్టర్ వ్యవహరిస్తున్నాయి. 
 
అయితే ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో చైర్మన్లు సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ.. అమరావతిలో వీలైనంత త్వరగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. స్విస్ ఛాలెంజ్‌లో సింగపూర్ కన్సార్టియం ఎంపిక కాగానే మంత్రిమండలి సమావేశంలో చర్చించామని, దీనికి మా ప్రధానమంత్రి పూర్తి మద్దతు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. 2018 ఆరంభంలో సింగపూర్ ప్రధాని భారత్ పర్యటన ఉంటుందని, ఈ సందర్భంగా ఆయన అమరావతిని సందర్శించే అవకాశం ఉంటుందని ఈశ్వరన్ తెలిపారు.
Link to comment
Share on other sites


అమరావతి: అమరావతి పేరుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని, భూలోక స్వర్గంగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని, కియా మోటార్స్‌ను అనంతపురానికి తీసుకొచ్చానని చెప్పారు. మందడంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు తెలిపారు. రాజధాని అభివృద్ధికి ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నానని, రాజధాని రైతుల త్యాగం వల్లే రాజధాని కల సాకారమైందని సీఎం పేర్కొన్నారు. సింగపూర్‌ కన్సార్టియం ద్వారా స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, సింగపూర్‌లాగా అభివృద్ధి చేస్తామంటే ఎగతాళి చేశారని, ఏడాది క్రితమే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభకావాల్సిందని, కొంతమంది కోర్టుకెళ్లడం వల్లే రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగిందని చంద్రబాబు వివరించారు.

 

ఏపీకి అండగా ఉంటామని సింగపూర్‌ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. పారదర్శకంగా ఉండేందుకే స్విస్‌చాలెంజ్‌ పద్ధతి తీసుకువచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని అభివృద్ధి ప్రాంతంలో సీఆర్డీఏకు 42 శాతం వాటా ఉందని, 2.50 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.8-10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. 190 రోజుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఘనత ఈప్రభుత్వానిదేనని, ఉపాధి కోసం ఎవరైనా ఇక్కడికి రావాల్సిందేనని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తాం

స్టార్టప్‌ ప్రాంత పనులు వేగంగా ప్రారంభించండి

సింగపూర్‌ సంస్థల కన్సార్షియానికి సీఎం సూచన

ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేస్తూ పత్రం అందజేత

ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య ఎంఓయూపై చంద్రబాబు, ఈశ్వరన్‌ సంతకం

ఈనాడు - అమరావతి

15ap-main1a.jpg

రాజధానికి అమరావతి అని పేరు పెట్టినప్పుడు అందరి ఆమోదం లభించింది. అమరావతి అంటే దేవతల రాజధాని. అందుకే భూమి మీదో మరో స్వర్గాన్ని, బ్రహ్మండమైన నగరాన్ని నిర్మించుకుంటాం. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే అమరావతి నుంచి వచ్చాం అని గర్వంగా చెప్పేటట్టు ఉండాలి.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

15ap-main1b.jpg ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంకుర (స్టార్టప్‌) ప్రాంత అభివృద్ధికి తొలి అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ సంతకాలు చేశారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎంపిక ధ్రువీకరణ, అంగీకార పత్రాల బదలాయింపు జరిగింది.

అసెండస్‌-సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ రెండూ సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలే. వాటిలో 74.77 శాతం వాటా ప్రభుత్వానిదే. అత్యంత నీతివంతమైన, పైసా అవినీతి జరగదని ప్రపంచమంతా చర్చించుకునే దేశం సింగపూర్‌. అలాంటి దేశంతో ఒప్పందం చేసుకోవడం, వారి సంస్థలు ఇక్కడికి రావడం చాలా సంతోషం. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు మొత్తం పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3364 కోట్లు, సింగపూర్‌ కంపెనీలకు రూ.1105 కోట్లు లభిస్తాయి. ఆ లెక్కన మన రాష్ట్ర ప్రభుత్వానికి 75 శాతం, సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలకు 25 శాతం వాటా లభిస్తుంది. 1.25 లక్షల కుటుంబాలు ఇక్కడ నివసించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల- రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

15ap-main1c.jpg

బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అలా అమరావతి కూడా మరో బాహుబలి కావాలి. ప్రపంచమంతా మన రాజధానిపై చర్చించాలి. సినిమా తీయడానికే మూడు, నాలుగేళ్లు పట్టింది. అలాంటిది రాజధాని నగరం నిర్మాణం కావాలంటే చాలా సమయం పడుతుంది. ఎంతమంది అడ్డం పడినా ధైర్యంగా ముందుకెళ్తున్నా. ప్రజలు సహకరించినంత వరకూ, వారి ఆశీస్సులు ఉన్నంత వరకూ ఎవరూ నన్నేమి చేయలేరు.

- చంద్రబాబు

అత్యున్నత ప్రమాణాలు కలిగిన నివాస, వాణిజ్య, ప్రజా సదుపాయాలు వస్తాయి. అమరావతిని నివాసానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.

- సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌

రాజధాని అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులను వేగంగా మొదలుపెట్టాలని, వచ్చే ఎన్నికల నాటికి పురోగతి కనిపించాలని సింగపూర్‌ సంస్థల కన్సార్షియానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సింగపూర్‌లో 55 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉందని, తాము మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియానికి ‘ఎంపిక ధ్రువీకరణ పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) అందజేసే కార్యక్రమం సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో చంద్రబాబు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సమక్షంలో జరిగింది. సింగపూర్‌ కన్సార్షియం ప్రతినిధులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ‘ఎంపిక ధ్రువీకరణ పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) అందజేశారు. వారి నుంచి ఆయన ‘అంగీకార పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌) అందుకున్నారు. ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధి, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, సామర్థ్యాల పెంపునకు అవసరమైన సహకారం, సంస్థాగత, సాంకేతిక సహకారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై చంద్రబాబు, ఈశ్వరన్‌ సంతకాలు చేశారు. అమరావతిని నవ నగరాలుగా నిర్మిస్తున్నామని, వాటికి వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు, డెవలపర్లను ఆకర్షించే దిశగా స్టార్టప్‌ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల్ని సింగపూర్‌ సంస్థల కన్సార్షియం, ఏడీసీల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ఏడీపీ సమకూరుస్తుందని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రాధాన్యతల్ని అర్ధం చేసుకుని, కీలకపాత్ర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌-2029’ని అధ్యయనం చేయాలని సింగపూర్‌ సంస్థలకు ఆయన సూచించారు. సింగపూర్‌ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు చెందిన 20 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది.

15ap-main1d.jpg

దేవుడే నన్ను ఆదేశించాడు

‘‘ఏడాది కిందటే మొదలుకావాల్సిన రాజధాని ప్రాంత స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు...కొంతమంది అడ్డంకులు సృష్టించడంతో ఆలస్యమైంది. న్యాయస్థానాలకు వెళ్లడం, పదే పదే ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చెయ్యడంతో విలువైన ఏడాది సమయాన్ని కోల్పోయాం. సంకల్పబలం గట్టిగా ఉండటంతో మళ్లీ ఈ ప్రాజెక్టును ప్రారంభించగలిగాం...’’అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.ఎన్నికల ప్రచారంలో సింగపూర్‌ లాంటి రాజధాని నగరాన్ని నిర్మిస్తానని చెబితే కొందరు ఎగతాళి చేశారని, మరికొందరు అది సాధ్యమా? అని అనుమానం వ్యక్తం చేశారని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఆ కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రైతుల త్యాగంతోనే ఇది సాధ్యపడిందన్నారు. గుంటూరు జిల్లా మందడంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....అప్పట్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకు తోడు సైబరాబాద్‌ను నిర్మించానని, మళ్లీ ఇప్పుడు అమరావతిని నిర్మించమని ఆ దేవుడే తనను ఆదేశించాడన్నారు. రాజధాని అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చే ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు సింగపూర్‌ కంపెనీల తరహాలో భూమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గౌరవంగా భావిస్తా: ఈశ్వరన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు. చంద్రబాబునాయుడు కలలు కంటున్న ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

నిధుల సమీకరణకు నవమార్గాలు

అమరావతి అభివృద్ధి, నిర్వహణ విషయంలో తొమ్మిది తరహాల్లో నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూమి తనఖా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఎన్‌డీబీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల నుంచి వివిధ రూపాల్లో నిధుల సమీకరణ, పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. బీమా వంటి సంస్థల నుంచి దేశీయ రుణ సమీకరణ, పెన్షన్‌ నిధులు, ఇన్‌ఫ్రా నిధుల వంటి ఈక్విటీ ఫండ్ల ద్వారా నిధుల సమీకరణ, అంతర్జాతీయంగా రుణాల సమీకరణ, ఎన్‌ఆర్‌ఐ బాండ్లు, గ్రీన్‌ బాండ్లు, మసాలా బాండ్ల ద్వారా నిధులు సమీకరించి అమరావతిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

15ap-main1e.jpg

ఇతర దేశాల సహకారం

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల సహాయ సహకారాలు తీసుకుంటోంది. ప్రస్తుతం సింగపూర్‌ ప్రభుత్వంతో రాజధాని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఇతర దేశాల సహాయసహకారాలు అందిపుచ్చుకుంటామని పేర్కొంటోంది. మొత్తం 8 దేశాలను ఇందులో వివిధ అంశాల్లో భాగస్వాములను చేయాలని ప్రతిపాదిస్తోంది.

సింగపూర్‌: మాస్టర్‌ ప్రణాళికలు, విజ్ఞానం బదలాయింపు

మలేషియా: పెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌, గృహ నిర్మాణ ప్రాజెక్టులు

జపాన్‌: రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల సముదాయాల ఆకృతుల రూపకల్పన, వరద నియంత్రణ వ్యవస్థ, పరిశ్రమలు

చైనా: పారిశ్రామిక పార్కు అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, విద్యుత్తు సరఫరా, పంపిణీ, భవన నిర్మాణ సామగ్రి తయారీ పార్కు

యునైటెడ్‌ కింగ్‌డమ్‌: స్మార్ట్‌ నగరాల అభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం, విజ్ఞాన బదలాయింపు

డెన్మార్క్‌: వ్యర్థ పదార్థాల నిర్వహణ, శుభ్రతకు సంబంధించిన టెక్నాలజీ, స్మార్ట్‌ పాలన,

నెదర్లాండ్స్‌: నదీ ముఖ అభివృద్ధి, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణంలో సహకారం

కజకిస్థాన్‌: సంయుక్త భాగస్వామ్యం, ఆస్థానాతో సోదర నగర భాగస్వామ్యం,

రూ.3 వేల కోట్ల పెట్టుబడి

అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి సీఈఓ సంజయ్‌దత్‌

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించబోయే ‘స్టార్టప్‌ ఏరియా’ కోసం 15ఏళ్లలో మొత్తం రూ.3వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజయ్‌దత్‌ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించారు. ‘‘ ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తాం. మాకున్న అనుభవజ్ఞులు, స్థానికంగా లభించే నైపుణ్యాలను ఉపయోగించుకుని అవసరమైన మౌలికసదుపాయలు కల్పిస్తాం. ముందుగా స్థానికంగా ఎదురయ్యే సవాళ్లు, ఉన్న సానుకూలతను అధ్యయనం చేస్తాం. ఇక్కడికి వచ్చే స్టార్టప్‌ సంస్థల ద్వారా కూడా పెట్టుబడులు వస్తాయి. వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు, విదేశాల్లోని వ్యాపార సంస్థలు అందర్నీ ఆకర్షించేలా ఈ స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలనేది మా సంకల్పం...’’ అని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

వచ్చే ఏడాది ఆరంభంలో అమరావతికి సింగపూర్‌ ప్రధాని

ఎంఓయూ అమలుకు స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

ఈనాడు అమరావతి: సింగపూర్‌ ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ 2018 ఆరంభంలో అమరావతిని సందర్శించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎస్‌సీ) ఏర్పాటు చేశారు. కమిటీకి చంద్రబాబు, ఈశ్వరన్‌ ఛైర్మన్‌లుగా ఉంటారు. ఎంఓయూపై సంతకాలు చేసిన అనంతరం, కమిటీ తొలి సమావేశం జరిగింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ అధికారులతో ఏర్పాటయ్యే సంయుక్త అమలు కార్యనిర్వాహక కమిటీ (జేఐడబ్ల్యూసీ) సమావేశం ప్రతి రెండు నెలలకు నిర్వహిస్తారు. జేఐఎస్‌సీ తొలి సమావేశంలో.... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, రాజధానిలో ఇప్పటికే వచ్చిన వస్తున్న విద్యాసంస్థలు, నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఆర్కిటెక్చర్‌, కన్సల్టెన్సీ సంస్థలను వివరించారు. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక ప్రక్రియలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, కార్యాలయం ప్రారంభిస్తామని ఈశ్వరన్‌ తెలిపారు. స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఎంపిక కాగానే, తమ మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించామని, దీనికి తమ ప్రధాని పూర్తి మద్దతిచ్చారని తెలిపారు. 2018 ఆరంభంలో తమ ప్రధాని భారత పర్యటనకు వస్తున్నారని, అప్పుడు అమరావతిని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. జేఐఎస్‌సీలో ఆంధ్రప్రదేశ్‌ తరపున ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సింగపూర్‌ తరపున ఈశ్వరన్‌తో పాటు మరో నలుగురు కమిటీలో ఉంటారు. త్వరలో వారి పేర్లు ప్రకటిస్తారు. విజయవాడలో కన్సార్షియం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Link to comment
Share on other sites

అబ్బురపడేలా అమరావతి!
 
636304976017939431.jpg
  • సింగపూర్‌కన్నా మిన్నగా నిర్మిస్తాం
  • అవినీతి మచ్చలేని దేశం సింగపూర్‌
  • అందుకే ఆ దేశంతో కలిసి అడుగులు
  • అమరావతి.. రాష్ట్రానికి బాహుబలి
  • ఆనంద నగరంగా తీర్చిదిద్దుతాం
  • జవజీవాలతో తొణికిసలాడేలా చేస్తాం
  • ప్రజా రాజధానిగా రూపుదిద్దుతాం
  • కన్సార్షియానికి 3 దశల్లో భూములు
  • లాభాల్లో 75 శాతం మనకే: చంద్రబాబు
  • రాజధాని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై కన్సార్షియంతో 2 ఎంవోయూలు
  • పనులకు లాంఛనంగా శంకుస్థాపన
  • హాజరైన సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం మెచ్చేలా.. స్వర్గాన్ని తలపించేలా.. సింగపూర్‌ కన్నా మిన్నగా ఆంధ్రుల ప్రజారాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని నగర స్టార్టప్‌ ఏరియా తొలిదశ అభివృద్ధి కార్యక్రమానికి సోమవారం సీఎం శ్రీకారం చుట్టారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌తో కలసి ఉద్దండరాయునిపాలెం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో.. స్టార్టప్‌ ఏరియాను స్విస్‌ చాలెంజ్‌ విధానంలో అభివృద్ధి పరిచేందుకు సింగపూర్‌ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎంవోయూలు కుదుర్చుకుంది.
 
వీటిపై అధికార బృందాలు సంతకాలు చేశాయి. ఈ రెండు కార్యక్రమాల్లోనూ సీఎం మాట్లాడారు. ప్రపంచమే అమరావతికి వచ్చేలా రాజధాని నగరాన్ని అత్యద్భుతంగా నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిని రాష్ట్రానికి బాహుబలిగా అభివర్ణించారు. క్రమశిక్షణ, చిత్తశుద్ధి, పక్కా ప్రణాళికతో స్వల్పకాలంలోనే ప్రపంచంలోని మేటి దేశాల్లో ఒకటిగా ఎదిగిన సింగపూర్‌ స్ఫూర్తితో, దాని భాగస్వామ్యంతో ఆ దేశం కంటే మిన్నగా అమరావతిని రూపొందించాలన్నదే తన ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీసంఖ్యలో ఉద్యోగాలు, సంపద, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రజలందరూ సుఖసంతోషాలతో, నాణ్యమైన జీవనం గడిపేలా చూసేందుకే సింగపూర్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. అవినీతి మచ్చ లేని, స్వచ్ఛతకు పర్యాయపదమైన దేశంగా పేరొందిన సింగపూర్‌తో ఎంవోయూల ద్వారా ఒక్క అమరావతే కాకుండా యావత్తు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు.
 
అమరావతి రూపకల్పనలో సింగపూర్‌ ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడుగునా చేయూతనందిస్తోందని, ‘అమరావతి సాధ్యమేనన్న విశ్వాసాన్ని’ ప్రజల్లో కలిగించిందని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమపై నమ్మకంతో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన సుమారు 33వేల ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆ భూమిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన రాజధానిని నిర్మించేదుకు సింగపూర్‌ కన్సార్షియం ముందుకురావడం మరో ఎత్తని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని ఇతర రాజధాని నగరాల్లా.. కేవలం పరిపాలనా రాజధానిగా అమరావతి మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో దానిని ప్రజారాజధానిగా మలుస్తామని సీఎం ప్రకటించారు.
 
రాజధాని నగరం నిరంతరం జవజీవాలతో తొణికిసలాడాలన్నది తన తపన అన్నారు. అమరావతి నగరాన్ని.. ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగానే కాకుండా అత్యద్భుత మౌలిక సదుపాయాలతో నాణ్యమైన జీవనానికి నెలవుగా, ఆర్ధిక కార్యకలాపాల కేంద్రంగా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణంలో.. ‘పీపుల్‌ ఫస్ట్‌’ అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వం, వ్యాపారవేత్తలతోపాటు అందరూ ప్రజలకు మేలు చేసే విధంగానే నడుచుకోవాలన్నదే ఈ నినాదం పరమార్ధమని చెప్పారు. అభివృద్ధి పనుల్లో పర్యావరణ పరిరక్షణ విధానాలకూ పెద్దపీట వేయాలని, ప్రతి అంశంలోనూ అమరావతి అగ్రగామిగా నిలిచేలా స్టార్టప్‌ ఏరియాను తీర్చిదిద్దాలని సింగపూర్‌ సంస్థలను కోరామని తెలిపారు. తెలుగువాడి ప్రతిభకు సింగపూర్‌ నైపుణ్యం తోడైతే అమరావతి అగ్రగామిగా నిలవడం ఖాయమన్నారు.
 
మూడు దశల్లో భూముల కేటాయింపు
అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తున్న సింగపూర్‌ కన్సార్షియానికి ఒకేదఫాలో భూములు ఇవ్వడం లేదని సీఎం వివరించారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి 1691(6.84 చదరపు కిలోమీటర్లు) ఎకరాలు కేటాయించామని, ఈ భూముల్లో.. మొదటి దశలో 636 ఎకరాలు, రెండోదశలో 514 ఎకరాలు, మూడో దశలో 321 ఎకరాలు సింగపూర్‌ కన్సార్షియానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. తొలి దశ భూముల విక్రయంలో వచ్చిన రాబడిపై 5.5ు, రెండోదశలో 7.5ు, మూడోదశలో 12.5ు ఈ కంపెనీలు అమరావతి అభివృద్ధి సంస్థకు ఇస్తాయని అన్నారు. సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థల మధ్య వాటా నిష్పత్తి 58:42లో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. లాభాలలో 75 శాతం మేర మనకే ఉంటుందని.. 25 శాతం మాత్రమే సింగపూర్‌ తీసుకుంటుందని అన్నారు.
 
రోడ్లు, విద్యుత్తు, కాల్వలు, వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2118 కోట్లను సింగపూర్‌ సంస్థలు వ్యయం చేస్తాయని అన్నారు. సింగపూర్‌ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందం తరహాలో.. అంతర్జాతీయ, జాతీయ సంస్థలేవైనా రాజధాని అభివృద్ధి పనులు చేస్తామని ముందుకొస్తే వాటికి కూడా భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘ఎవరైనా ముందుకు వస్తారా?’ అని చంద్రబాబు సవాల్‌ చేశారు. మలేషియా.. ఇతర దేశాలనూ రాజధాని అభివృద్ధి కోసం రావాలని ఆహ్వానించామని, కానీ ఏ దేశమూ ముందుకు రాలేదని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని.. అమరావతి చరిత్రను భావితరాలకు అందించేలా నగర నిర్మాణం చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...