Jump to content

Amaravati

Recommended Posts

వెంకటేశ్వరస్వామి ఆలయ డిజైన్లను పరిశీలించిన చంద్రబాబు
23-08-2018 12:33:58
 
636706244412708218.jpg
అమరావతి: రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించతలపెట్టిన వెంకటేశ్వరస్వామి ఆలయ డిజైన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం పరిశీలించారు. ఉండవల్లిలో ఆయన సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆయా డిజైన్లను సీఎంకు చూపించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు ప్రాధాన్యమిస్తూ ఆలయ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు.
Link to comment
Share on other sites

25 ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం: నారాయణ
23-08-2018 15:36:45
 
636706354081905141.jpg
 
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీ (తిరమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ డిజైన్లను సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఆమోదించారన్నారు. ఉండవల్లి సమీపంలో 25 ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.140 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు నారాయణ తెలిపారు. టీటీడీ ఆమోదం పొందిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. విశాఖ మెట్రోరైల్ నిర్మాణానికి రోలింగ్ స్టాక్స్ సంస్థ ముందుకొచ్చిందని, విశాఖ మెట్రో రూ.8 వేల కోట్ల ప్రాజెక్టని మంత్రి పేర్కొన్నారు. పీపీపీ పద్ధతిలో విజయవాడ, విశాఖ మెట్రో నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

అమరావతిలో భవ్యమైన ఆలయం
చంద్రబాబు

04221123BRK112BABU.JPG

అమరావతి: అమరావతిలో తితిదే నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనా చిత్రాలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రదర్శించారు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే భవ్యమైన, నవ్యమైన నిర్మాణం జరగాలని సీఎం వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా భావించి ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరారు. ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సీఆర్డీఏ సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు అభివృద్ధిపైనా చర్చించారు. మెట్రో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియాకు చెందిన నిర్మాణ సంస్థలు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించాయి. పారిశ్రామిక, మౌలిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని సీఎం వారికి తెలిపారు. అనంతపురం జిల్లా లో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ వేగవంతంగా నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటి కారు జనవరిలో ఉత్పత్తి కానున్నట్లు చెప్పారు.

విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను సుందరంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను ముఖ్యమంత్రి సమీక్షించారు. వైకుంఠపురం, చోడవరం నుంచి అటు అమరావతి వరకు ఉన్న విశాలమైన నదీ తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మొత్తం 27 కిలోమీటర్ల మేర ఉన్న ఈ తీరప్రాంతాన్ని "నీలి-హరిత సుందర ప్రాంతం" గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా కొండ, ఘాట్లు ఉన్న ప్రాంతాలు హరితవర్ణంగా మార్చాలని చెప్పారు. ఈ కాలువల్లో 365 రోజులు నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉన్నందున వీటిని మంచి పర్యాటక ఆకర్షణలుగా మార్చడానికి వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుద్ధ, పరిశుభ్ర జలాలు ఈ కెనాళ్లలో ప్రవహించేలా చూడాలన్నారు. పర్యావరణ పరంగా అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. విజయవాడ కనకదుర్గ గుడి కి చుట్టుపక్కల 25 ఎకరాలు అభివృద్ధికి ఇచ్చిన ప్రతిపాదనలు అధికారులు ముఖ్యమంత్రి కి అందజేశారు. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద పార్కింగ్ ప్రదేశం, సర్వీస్ అపార్టుమెంట్లు, పార్కులు నిర్మాణం జరగాలని సీఎం చెప్పారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దుర్గ గుడికి వెళ్లేలా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రతిపాదనను అధికారులు సీఎం కు వివరించారు. కేరళ వరద బాధితులకు సీఆర్డీఏ తరఫున ఒక రోజు జీతాన్ని 5.57 లక్షల రూపాయలను సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ విరాళంగా అందజేశారు.

Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:

8gmPeHY.jpg

I would love to see Electric vehicles running on the Guntur-Vijayawada-CRDA roads as soon as possible. The positives (environmentally...pollution) from this will be felt and seen as early as in 4 weeks. The news will hit the international media very quickly soon after those vehicles start running on the roads. AMARAVATI barnd value will go higher.

Link to comment
Share on other sites

27న అమరావతి బాండ్ల లిస్టింగ్‌
23-08-2018 03:50:19
 
  • బీఎస్‌ఈలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
  • పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రులు
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): అమరావతి బాండ్ల కు అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో ఈ నెల 27న తలపెట్టిన లిస్టింగ్‌ ప్రక్రియను కోలాహలంగా నిర్వహించేందుకు ఏపీసీఆర్డీయే విస్తృత సన్నాహాలు చేస్తోంది. బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(బీఎ్‌సఈ)లో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అమరావతి బాండ్ల లిస్టింగ్‌ సందడిగా జరగనుంది. ఈ బాండ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అధికారికంగా ట్రేడింగ్‌లోకి రావడంతోపాటు.. వీటిని కొనుగోలు చేసిన సంస్థలకు.. విక్రయించుకొనే వీలు కల్పించడాన్నే లిస్టింగ్‌ అంటారు. ఆర్బీఐ సహా పేరొందిన వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతోపాటు పెట్టుబడిదారులు కూడా హాజరుకానున్నారు. కొద్ది రోజులుగా వీరందరికీ ఆహ్వానాలు పంపించడంతోపాటు అమరావతి నుంచి ముంబై వెళ్లే వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో సీఆర్డీయే నిమగ్నమై ఉంది.
 
విజయానికి గుర్తుగా..!: దేశంలోని అన్ని స్థానిక సంస్థలూ కలిపి ఇన్నేళ్లలో విడుదల చేసిన బాండ్ల విక్రయం ద్వారా సమకూరనంత అధిక మొత్తాన్ని ఒక్క అమరావతి బాండ్లు పొందిన సంగతి తెలిసిందే. రూ.1,300 కోట్ల విలువైన ఈ బాండ్లకు జారీ చేసిన గంటలోనే అనూహ్య స్పందన లభించింది. ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయ్యి రూ.2,000 కోట్లు సమకూరిన విషయం విదితమే. ఈ పరిణామంతో జాతీయ మదుపరుల్లో అమరావతి, సీఎం చంద్రబాబు పట్ల ఎంత నమ్మకం ఉన్నదీ నిర్ధారణ అయ్యింది. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా రాజధాని కోసం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కోసం లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో మరికొద్ది నెలల్లో మసాలా బాండ్లు, అనంతర కాలంలో సాధారణ ప్రజలూ అమరావతి నిర్మాణంలో పాల్గొనేలా రూ.100 ముఖ విలువ కలిగిన బాండ్లను జారీ చేయాలని సీఆర్డీయే యోచిస్తోంది. అందుకే 27నాటి లిస్టింగ్‌ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని చూస్తోంది.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

indulo AP government success emundi. OA kakapothe.

Link to comment
Share on other sites

11 minutes ago, sonykongara said:

entha bari mottam e city kuda cheyyaledu ga bro, adi kuda kattaboye city

 ekkuva vaddi ki appu teesukovatam kuda goppena?

by the way, it is nothing to with new/old/city. AP government is the guarantor. No matter who comes to power next in AP, this debt obligation must be honored.

Edited by swarnandhra
Link to comment
Share on other sites

4 minutes ago, swarnandhra said:

 ekkuva vaddi ki appu teesukovatam kuda goppena?

by the way, it is nothing to with new/old/city. AP government is the guarantor. No matter who comes to power next in AP, this debt obligation must be honored.

pune ki inchu minchu antha vaddi ke teccharu,kani elanti ekkuva tisukuravam goppe okarakam ga vere ekkada loan tsukunna dpr antaru deniki entha karchupetdamu ela anni cheppali,e bonds ki amaravati ke kadu vere epani kayina use chesukovacchu.

Link to comment
Share on other sites

59 minutes ago, sonykongara said:

5YB8AHN.jpg

This article tries to justify why this bonds are needed instead of regular loans and the rate at which they were sold. In a way it is explaining there is no wrong doing/scam in this. I too agree that.

TG took loans around 80000 cr (some of them at lower rate than AP) in the last 4 years. can it be credited as KCR success story?

Edited by swarnandhra
Link to comment
Share on other sites

నీలి హరిత శోభితం కృష్ణాతీరం!
24-08-2018 02:47:09
 
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ప్రవహిస్తున్న మూడు కాలువలతో పాటు కరకట్ట, ప్రకాశం బ్యారేజీ, కృష్ణానదీ తీరప్రాంతాలను నీలి హరితం శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాలువ గట్లన్నింటినీ సుందరీకరించాలని సూచించారు. అమరావతిలోని వైకుంఠపురం నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వరకు ఉన్న దాదాపు 30కిలోమీటర్లకుపైగా కృష్ణా తీరం మొత్తాన్ని అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి పరచడానికి తోడ్పడే ప్రణాళికలను రూపొందించి, వాటికి కార్యరూపం కల్పించాలన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం జరిగిన సీఆర్డీయే సమీక్షా సమావేశంలో పలు ప్రాజెక్టుల ప్రగతిని సీఎం సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లోని కొండ, స్నానఘట్టాలను సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దాలని ఏడీసీ అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏడీసీ రూపొందించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.
 
27న ముంబైకి సీఎం: బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు 27న ముంబై వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.05కు బీఎ్‌సఈ ప్రారంభమైన వెంటనే లిస్టింగ్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.
Link to comment
Share on other sites

పీ హైకోర్టు
24-08-2018 02:01:33
 
636706728962990580.jpg
  • సంక్రాంతి తర్వాత ఇక్కడే కేసుల విచారణ
  • రేపో మాపో రాష్ట్రపతి నోటిఫికేషన్‌!
  • అమరావతిలో సిద్ధమవుతున్న భవనం
  • అక్కడ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆమోదం
  • అక్టోబరు నాటికి నిర్మాణం పూర్తి
  • ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌పై సీజేకు సీఎం లేఖ
  • డిసెంబరు ఆఖరుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌/గుంటూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ‘ఉమ్మడి హైకోర్టు’ విభజనకు రంగం సిద్ధమైంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... జనవరి ఒకటి నుంచే రెండు రాష్ట్రాల హైకోర్టులు వేరు అవుతాయి. సంక్రాంతి సెలవుల తర్వాత నవ్యాంధ్ర హైకోర్టు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుంది. ఒకటి రెండు రోజుల్లోనే హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా... హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే ఉంది. హైకోర్టు విభజన కోసం మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, నవ్యాంధ్రలో పూర్తి సదుపాయాలుంటే తప్ప హైకోర్టును విభజించలేమని ఉమ్మడి హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు విజయవాడలో రెండు మూడు ప్రాంగణాలను పరిశీలనలోకి తీసుకున్నా అవేవీ ఖరారు కాలేదు. మరోవైపు... అమరావతిలో హైకోర్టును ప్రతిష్ఠాత్మకంగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా పూర్తయ్యాయి. అయితే... ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన హైకోర్టు భవనాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
 
నేలపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో ‘జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌’ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులను గత శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కైత్‌, జస్టిస్‌ సీతారామమూర్తి పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు పనుల పురోగతిని జడ్జిలకు వివరించారు. అలాగే... అమరావతిలో నిర్మిస్తున్న జడ్జిల బంగళాలు, ఐఏఎస్‌ అధికారుల నివాసాలను కూడా న్యాయమూర్తులు పరిశీలించారు. జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు ఈ భవన సముదాయం సరిపోతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ అక్టోబరు నాటికి పూర్తవుతాయని... ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ ఏర్పాటుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ సహా మొత్తం పనులు డిసెంబరు ఆఖరునాటికి పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి రెండు రాష్ర్టాలకు వేరు వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేస్తూ ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారని తెలుస్తోంది. జనవరి 1నాటికి భవనం సిద్ధమైనప్పటికీ సంక్రాంతి తర్వాతే ఏపీ హైకోర్టులో కేసుల విచారణ మొదలయ్యే అవకాశముంది.
 
ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కారు... అంతకంటే ముందే హైకోర్టు విభజన, జోనల్‌ వ్యవస్థలకు ఆమోదం పొందాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో... తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గురువారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. అనేక అంశాలపై కేంద్ర పెద్దలు, అధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన గురించి ప్రస్తావించారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...