Jump to content

Amaravati


Recommended Posts

28న అమరావతి భవనాల డిజైన్లు
 
636233272361523626.jpg
  • సీఎంకు అందజేయనున్న నార్మన్ ఫోస్టర్‌
  • మొత్తం 3 రకాల డిజైన్లు
  • ప్రజాభిప్రాయం మేరకు ఒకటి ఖరారు
  • ఆర్కిటెక్ట్‌ సంస్థతో చర్చల కోసం లండనకు మంత్రి నారాయణ
  • ఇప్పటికే చర్చలు జరపుతున్న శ్రీధర్‌

(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలోని 900 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగానిర్మించ తలపెట్టిన ప్రభుత్వ సముదాయం, 2 ఐకానిక్‌ భవనాల (అసెంబ్లీ, హైకోర్టు)కు సంబంధించిన డిజైన్లను ఆర్కిటెక్ట్‌ సంస్థ ఈనెల28న సీఎం చంద్రబాబుకు అందజేయనుంది. మునిసిపల్‌ శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ మంగళవారం సచివాలయంలో ఈ విషయం తెలిపారు. లండనకు చెందిన నార్మన ఫోస్టర్‌ సంస్థ డిజైన్లను రూ పొందిస్తోంది. నార్మన ఫోస్టర్‌ ప్రతినిధులు మొత్తం 3 రకాల డిజైన్లను సీఎం కు సమర్పిస్తారని నారాయణ వెల్లడించారు. వాటిని పబ్లిక్‌ డొమైనలో ఉంచి ప్రజాభిప్రాయం తెలుసుకుంటుదని చెప్పారు. అత్యధికులు మెచ్చిన డిజైనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలిపారు. ఈ డిజైన్లకు సంబంధించి సదరు కంపెనీకి మన అభిప్రాయాలు, సూచనలు తెలియజేసేందుకు తాను మరోసారి లడన వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సీఆర్డీయే కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, ఏడీసీ ఉన్నతాధికారులు అమరావతి నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇంగ్లండ్‌కు చెందిన వివిధ ప్రసిద్ధ సంస్థల నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. అమరావతిలోని అడుగడుగూ, ప్రతి నిర్మాణమూ అటు మన వారసత్వ సంపద, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఇటు అత్యధునాతనంగానూ, వినూత్నంగానూ ఉండాలన్న విషయాన్ని నార్మన ఫోస్టర్‌తో జరిపే చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్టు తెలిపారు.
 
డిజైన్లపై ‘నిపుణుల కమిటీ’ సమావేశాలు
అమరావతిలోని అణువణువూ ఒకపక్క వైవిధ్యం, సృజనాత్మకతకు పట్టం గడుతూనే మరోపక్క వేలాది సంవత్సరాల ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వసంపద కలిగిన ఈ ప్రదేశపు విశిష్టతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధ, గురువారాల్లో విజయవాడలో సమావేశం కానుంది. రాష్ట్ర మీడియా సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ సమన్వయకర్తగా వ్యవహరించనున్న ఈ ఉన్నతస్థాయి కమిటీలో పలు రంగాలకు చెందిన మొత్తం 11 మంది నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. పరకాల ప్రభాకర్‌, డాక్టర్‌ కె.పద్దయ్య, ప్రొఫెసర్‌ డి.కిరణ్‌క్రాంతి చౌదరి, కె.వి.రావు, డాక్టర్‌ ఈ.శివనాగిరెడ్డి, ఆనందసాయి, అమరేశ్వర్‌ గల్లా, పాపినేని సాయి, వి.రామకృష్ణ, విజయభాస్కర్‌, ప్రొఫెసర్‌ రంగనాయకులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ముందే ప్రస్తావించిన విధంగా అమరావతి డిజైన్లు అందరినీ అలరించేలా రూపొందేందుకు ఉపకరించే సలహాలు, సూచనలను ఇవ్వనుంది. 2 రోజుల సమావేశాల్లో చర్చించిన అంశాల సారాంశాన్ని డాక్టర్‌ పరకాల నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారని, దానిని పరిశీలించిన తర్వాత అది మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌కు పంపనున్నట్టు తెలిసింది. ఆ నివేదికలోని సలహాలు, సూచనల ప్రకారం అది అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుందని సమాచారం.
 
నామధేయాలపై సైతం చర్చ
ఇదిలా ఉండగా..నిపుణుల కమిటీ కేవలం రాజధాని డిజైన్లకే పరిమితంకాకుండా అమరావతికి వివిధ దిశల్లో ముఖద్వారాలుగా ఉన్న ప్రదేశాలను మన ప్రత్యేకతలను చాటేలా రమణీయంగా రూపొందించడమెలాగన్న అంశంపై కూడా చర్చించి, సీఆర్డీయే, ఏడీసీలకు సలహాలను ఇవ్వనుందని భోగట్టా. దీంతోపాటు రాజధానిలోని వివిధ ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, ఐకానిక్‌ కట్టడాలకు పెట్టాల్సిన పేర్లపై కూడా కమిటీ చర్చించే అవకాశముంది. 7 నెలల వ్యవధిలోనే నిర్మితమవడం ద్వారా రికార్డు నెలకొల్పిన వెలగపూడి సచివాలయ సముదాయంలోని 6 బ్లాక్‌లకు కూడా చక్కటి తేటతెనుగు పేర్లను పెట్టే విషయంపై కూడా ఈ కమిటీ చర్చించనుందని సమాచారం.
Link to comment
Share on other sites

శతాబ్దాల అవసరాలకు తగినట్టుగా రాజధాని నిర్మాణం: పరకాల
 
636233608832050710.jpg
అమరావతి : శతాబ్దాల అవసరాలకు తగినట్టుగా రాజధాని నిర్మాణం
జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతిలో నిర్మించే నవనగరాలకు అందరితో సంప్రదించిన తర్వాతే పేర్లు ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే మన చరిత్ర, సంస్కృతికి అనుగుణంగా రాజధాని నిర్మాణం జరగాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు భావన అన్నారు. రాష్ట్రానికి చెందిన రాజవంశీకుల వారసత్వ సంపదను ప్రతిబింబించేలా కొత్త రాజధాని ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

e parakala ni chusthey chirakesthadhi recommendation from bjp wife anukunta

em chestunnadu emi ardham kaadhu ,...teesi vere vaalani appoint cheyyandi babu garu

Link to comment
Share on other sites

e parakala ni chusthey chirakesthadhi recommendation from bjp wife anukunta

em chestunnadu emi ardham kaadhu ,...teesi vere vaalani appoint cheyyandi babu garu

no brother parakala ki knowledge undi, London School of Economics, JNU, NewDelhi political science lo phd chesadu

 

.

Link to comment
Share on other sites

Guest Urban Legend

no brother parakala ki knowledge undi, London School of Economics, JNU, NewDelhi political science lo phd chesadu

 

.

 

mari media management oh ?

Link to comment
Share on other sites

Guest Urban Legend

he is Communications advisor for Govt of Andhra Pradesh

it is his responsibility to maintain and build public image of ap govt

which is big failure in this term ..he is to be blamed

Link to comment
Share on other sites

నార్మ‌న్ ఫోస్ట‌ర్‌తో మంత్రి నారాయ‌ణ భేటీ
22brk157a.jpg

విజ‌యవాడ‌: అమరావతి రాజధానికి భవన నిర్మాణ ఆకృతుల్ని సిద్ధం చేస్తున్న ప్రధాన ఆర్కిటెక్టు నార్మన్ ఫోస్టర్ ను మంత్రి నారాయణ బృందం లండన్ లో కలిసింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్ డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ లు భేటీ అయ్యారు. పరిపాలనా నగరంలో ప్రభుత్వ భవనాలైన అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ లాంటి భవనాలతో పాటు జస్టిస్ సిటీలో నిర్మితం కానున్న హైకోర్టు భవనాలకు సైతం నార్మన్ ఫోస్టర్ సంస్థ అకృతుల్ని రూపోందిస్తోంది. ఈ నెల 28 నాటికి ముఖ్యమంత్రికి ముసాయిదా ఆకృతుల్ని చూపించాలని నార్మన్ ఫోస్టర్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ ముసాయిదా ఆకృతుల్లో స్థానిక అంశాలు, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా మార్పులు  చేర్పులు చేయాలని మంత్రి బృందం మాస్టర్ ఆర్కిటెక్టు నార్మన్ ఫోస్టర్ కు సూచించింది. మరోవైపు ముఖ్యంత్రి ఈ ముసాయిదా ఆకృతులు పరిశీలించిన అనంతరం ఏప్రిల్ చివరి నాటికి తుది ఆకృతి సిద్దం కానుంది.

Link to comment
Share on other sites

అమరావతిలో ఫిన్ టెక్నాలజీ టవర్ నిర్మించనున్న యస్ బ్యాంక్ Super User 23 February 2017 Hits: 307  
yes-bank-amaravati-23022017.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఫిన్ టెక్నాలజీ (ఫిన్టెక్ ) టవర్ నిర్మించేందుకు యస్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ ముంబైలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చారు.

ఇప్పటికే యస్ బ్యాంక్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో మొలిక సదుపాయాలు, ఐటి రంగాలను విస్తరించింది. భారత్ లో ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్లలో కూడా పలు సంస్థలు నిర్వహిస్తోంది.

దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అమరావతిలో తమ వ్యాపార సామ్రాజ్యా న్నివిస్తరించుకోవాలన్న ఆసక్తితో ఉంది. దీని పై ముఖ్యమంత్రితో చర్చించిన బ్యాంక్ చైర్మన్ రాణాకపూర్ ఫిన్టెక్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

<div style="text-align: center;">

Advertisements

</div>

ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిశ్రమలకిస్తున్న ప్రోత్సాహకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. నేరుగా అమరావతి చ్చి స్థానిక పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.

పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌ బ్యాంక్‌ ఆసక్తి కనబరిచింది.

Link to comment
Share on other sites

వెలగపూడి : అమరావతి రూపకల్పనలో సంస్కృతి, చరిత్రకు సంబంధించి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రజా రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరిని బాగస్వామ్యం చేశామన్న ఆయన అమరావతిలో రోడ్లు, భవనాలు చరిత్రలో నిలిచిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాజధానికి వస్తే రాష్ట్ర చరిత్ర ప్రతిబింభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. చారిత్రక విషయాలు ఎలా పొందుపరచాలన్నదానిపై చర్చిస్తున్నామని పరకాల అన్నారు.https://youtu.be/iUyXasKWOLs

Link to comment
Share on other sites

జస్టిస్‌ సిటీకి 3,300 ఎకరాలు
అమరావతినిర్మాణం తనకు వచ్చిన మంచిఅవకాశమని సీఎం పేర్కొన్నారు. అందులో నిర్మించనున్న తొమ్మిది నగరాల్లో జస్టిస్‌ సిటీకి 3,300 ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. ‘సింగపూర్‌, లండన్‌ తరహాలో జస్టిస్‌ సిటీ అభివృద్ధికి మీ సహకారం అవసరం’ అని జడ్జీలను కోరారు. దేశంలో బలీయమైన, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అశాసీ్త్రయంగా జరిగిందన్న సీఎం, దాని కారణంగా తలెత్తిన నష్టాలను రాష్ట్రం భరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అభివృద్ధి చేశా. ఇప్పుడు అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అభివృద్ధి చేస్తా. అమరావతి ప్రపంచంలోనే ఐదు మేటి నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

 

నవ్య’ దిశలుగా అభివృద్ధి
25-02-2017 01:04:19
636235814608494109.jpg
  • కేంద్రీకరణ కాదు విస్తరించాలి.. సవాళ్లలోంచే ఎదుగుతున్న ఏపీ
  • వివాద పరిష్కారాల నిడివి తగ్గితే రాషా్ట్రనికి అపారంగా పెట్టుబడులు
  • న్యాయసదస్సులో జస్టిస్‌ రమణ.. కమర్షియల్‌ కోర్టులకు సీఎం ఓకే
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నూతన రాష్ట్రంలో అభివృద్ధిని విస్తరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. హైకోర్టు, పరిశ్రమలు సహా ప్రతిదీ హైదరాబాద్‌లో ఉండటంతో ఈ ప్రాంతంలో లాయర్లకు అవకాశాలు పరిమితమయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన ప్రజల జీవితాల్లో ఒక టర్నింగ్‌ పాయింట్‌ అని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జస్టిస్‌ రమణ ప్రశంసించారు. ‘మేధో సంపత్తి, వాణిజ్య-నూతన చట్టాలు’ అనే అంశంపై శుక్రవారం విజయవాడలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘పరిమిత ప్రభుత్వం- అపరిమిత పాలన’ను తాను విశ్వసిస్తానని, కొత్త రాష్ట్రంలో ఈ దిశగా మంచి ఫలితాలను రాబట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జ్యుడీషియల్‌ అకాడమీని, స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినట్టు చెప్పారు. వ్యాపార సంస్థల వాణిజ్య ప్రయోజనాలను కాపాడటానికి సమర్థవంతమైన న్యాయ ప్రక్రియ అవసరమన్న జస్టిస్‌ రమణ, ఇందుకోసం కమర్షియల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు.
 
‘‘నేను జపాన్‌ పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ అంశాన్ని గమనించాను. ఆ దేశ కంపెనీలు ఇండియాలో... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. అయితే ఒక వివాద పరిష్కారానికి ఇండియాలో ఎంత కాలం పడుతుందనే ప్రశ్న ఎక్కువగా వినవచ్చింది’ అని ఆయన వివరించారు. గతంలో పెట్టుబడులు భౌతికంగా భూమి, మెషీన్ల రూపంలో కనిపించేదని, ఇప్పుడవి ఐడియాలు, ఇతరత్రా కనిపించని రూపాల్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నంత వేగంగానే, సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయని, ఈ విషయంలో విశాఖపట్నం దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు 2013లో 149 నమోదు కాగా 2016లో 400 కేసులు నమోదయ్యాయని జస్టిస్‌ రమణ వివరించారు
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...