Jump to content

Amaravati


Recommended Posts

అడుగులన్నీ అమరావతి వైపే...
 
636169486232570477.jpg
  • అమరావతిలో భారీ నిర్మాణాలు
  • భూమి అడుగుతున్న పలు సంస్థలు 
  • ఎస్‌బీఐ నుంచి ఐఓసీఎల్‌ వరకు విజ్ఞప్తులు 
  • 5 లక్షల చదరపు అడుగుల్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం 
  • గ్రామాల అభివృద్ధికి రూ.25లక్షల చొప్పున కేటాయింపు
ప్రసిద్ధ వైద్య, విద్యా, ప్రభుత్వ రంగ సంస్థల అడుగులన్నీ రాజధాని వైపు పడుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ కార్యాలయాలు నిర్మించుకునేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే విద్యా వైద్య రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. తమ కార్యాలయాలను నెలకొల్పేందుకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి వినతులు అందిస్తున్నాయి.
 
ఆంధ్రజ్యోతి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ కార్యాలయాలు నిర్మించుకునేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.24వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖత చూపాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం లాంటి విశ్వవిద్యాలయాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా చేశాయి. అదేవిధంగా వైద్యరంగంలోను పలు సంస్థలకు భూముల కేటాయింపు చేశారు. బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ తమకు కేటాయించిన భూమిలో వైద్య విశ్వవిద్యాలయం, ఇతర యూనిట్ల కోసం సుమారు 15.6లక్షల చదరపు అడుగుల భవనాలను నిర్మించనుంది. వాటితోపాటు వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలు, ట్రస్ట్‌లు తమకు భూమి కేటాయించాలని కోరుతున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన ఆఫ్‌ ఇండియా, బ్యూరో ఆఫ్‌ ఇండియన స్టాండర్డ్స్‌(బీఐఎస్‌), ఇండియన ఆయిల్‌ కార్పొరేషన లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)లు తమ తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు భూములు అడిగాయి. వీటితో పాటు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం, నందమూరి బసవతారకం క్యాన్సర్‌ ఫౌండేషన, ఆప్కాబ్‌, ఎపీఎ్‌సఎ్‌ఫసీ తదితర సంస్థలు భూములు అడుగుతున్నాయి. బ్రహ్మకుమరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ ప్రాంగణంలో ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడే ఆ సంస్థకు భూ కేటాయింపు చేశారు. అక్కడ భారీ భవనాలు నిర్మించారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అమరావతిలోను తమకు భూమి కేటాయించాలని వారు దరఖాస్తు చేశారు. 25ఎకరాల భూమిని కేటాయించాలని కోరింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం 10ఎకరాలు వరకు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో సుమారు 5లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపడతారు. ఆడిటోరియమ్‌లు, మెడిటేషన హాళ్లు, తరగతి గదులు, భోజనశాలలు, ఆడియో, వీడియో శిక్షణ గదులు, పరిపాలనా భవనం ఇలాంటివన్నీ నిర్మిస్తారు. వీరికి ఎకరా రూ.4.1కోట్ల విలువ కట్టి.. దానిపై లీజు నిర్ణయించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. లీజు నామమాత్రంగా ఉండాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. భూ కేటాయింపు చేస్తే దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఎక్కువ భాగంలో పచ్చదనం నింపుతామని సదరు సంస్థ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్మాణాలకు తోడు.. ఇలా పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్న సంస్థలన్నీ నిర్మాణాలను చేపడితే ఇక్కడ భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరుగుతుంది. పామ్‌ దుబాయ్‌, బుర్జ్‌ ఖలీఫాలపై సీఎం దృష్టిమరోవైపు సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 11, 12, 13 తేదీల్లో యూఏఈ, కువైట్‌లలో పర్యటన సందర్భంగా అమరావతికి, రాష్ట్రానికి పెట్టుబడులపై దృష్టిపెట్టనున్నారు. ప్రసిద్ధి చెందిన ఎత్తైన కట్టడం బుర్జ్‌ఖలీఫా, దుబాయ్‌లో సముద్ర ఒడ్డుకు కాస్త లోపలున్న దీవుల్లో నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణాల సమాహారం పామ్‌ దుబాయ్‌ నిర్మాణ సంస్థలతో చర్చించనున్నారు. అమరావతిలో ఒక ఐకానిక్‌ నిర్మాణం, ప్రాజెక్టు లాంటిది చేపట్టే అంశంపై చర్చ జరిగే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు రాజధానిలో ఒక్కో గ్రామానికి రూ.25లక్షల చొప్పున కేటాయించింది. వీటికి మ్యాచింగ్‌గా కేంద్రం ఒక్కోగ్రామానికి రూ.25లక్షలు ఇవ్వనుంది.
Link to comment
Share on other sites

 
అమరావతిలో మౌలిక వసతులే కీలకం
 
636172066998253497.jpg
అమరావతి (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌కు అనుగుణంగా అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు, కన్సల్టెంట్లు సిద్ధం కావాలని ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథి, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ సూచించారు. ఏడీసీ కార్యాలయంలో సోమవారం రాజధాని మౌలిక సదుపాయాల బృహత ప్రణాళికలపై సమావేశం జరిగింది. పబ్లిక్‌హెల్త్‌ ఈఎన్‌సీ, విజయవాడ నగరపాలక సంస్థ ముఖ్య ఇంజనీర్‌ షుకూర్‌, సీఆర్‌డీఏ ప్రొక్యూర్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆంజనేయులతో శ్రీధర్‌ చర్చించారు. తాగునీరు, మురుగునీరు వ్యవస్థలపై సమీక్షించారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన నీటి వనరులను సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఆర్వీ, జీఐఐసీ(చైనా) ప్రతినిధులతో సుధీర్ఘంగా జరిగిన సమావేశంలో రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పట్టిష్ట ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ దశ నుంచే అక్కడ నీటి లభ్యతపై సుధీర్ఘ ప్రణాళిక అవసరమని లక్ష్మీపార్థసారధి, శ్రీధర్‌లు సూచించారు. ఇంటెక్‌ వెల్‌ ప్లాంట్‌ను ఉండవల్లిలో ఏర్పాటుచేయడానికి సాధ్యాసాధ్యాలను చర్చించారు. సమావేశంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ రామమనోహరరావు, ఏడీసీ ముఖ్య సాంకేతిక అధికారి సుదర్శనరెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగాధిపతి డాక్టర్‌ కేవీ గణే్‌షబాబు, ఆర్వీ-జీఐఐసీ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, బృందం లీడర్‌ డాక్టర్‌ సతీష్‌ కామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రీనరీ ప్లాన్‌ను సిద్ధం చేయండి
రాజధాని అమరావతిలో పచ్చదనం తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగా పచ్చదన బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ డి.లక్ష్మీపార్థసారథి రాజధాని గ్రీన్‌ కన్సల్టెంట్‌ హెచ్‌సీపీ ప్రతినిధులకు సూచించారు. ఏడీసీ కార్యాలయంలో సోమవారం రాజధాని గ్రీన్‌మాస్టర్‌ రూపకల్పన కోసం నియమించిన హెచ్‌సీపీ సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. శాకమూరు రిజర్వాయర్‌ అభివృద్ధి, కొండవీటి వాగు ఆధునీకరణలను రాజధానిలో కీలకంగా తీర్చిదిద్దనున్నట్లు సీఎండీ వారికి వివరించారు. వాగుకు ఇరువైపులా ముప్పై అడుగుల చొప్పున పచ్చదనంతో తీర్చిదిద్దాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇంతకంటే మెరుగ్గా నమూనాలను రూపొందించాలని హెచ్‌సీపీ ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో ఏడీసీ ముఖ్య ప్రణాళికా విభాగం అధికారి ఎస్‌.విశ్వనాథ్‌, పట్టణ ప్రణాళిక విభాగాధిపతి పి.సురే్‌షబాబు, అటవీ విభాగం అధికారి ఓబుల్‌రెడ్డి, హెచ్‌సీపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతికి 186 కీ.మీ ఔటర్ రింగ్ రోడ్డు

 

 

 

 

సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ వున్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్) నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో వుంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు ఉండాలని చెప్పారు.

బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా అంతర్, బాహ్య వలయ రహదారులపైనే సాగింది. ఈ రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ 3 ఆప్షన్లను ముఖ్యమంత్రి ముందు వుంచారు. వాటిపై కూలంకుశంగా చర్చించిన ముఖ్యమంత్రి అంతిమంగా రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను కలిపేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం ఉండాలని, రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశంలో, మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.

తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా వుండేలా ప్రజారాజధానిలో బాహ్య వలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బాహ్యవలయ రహదారి నిర్మాణం జరిగితే చుట్టూ వున్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది అవన్నీ కాలగమనంలో రాజధాని నగరంలో కలిసిపోతాయని వివరించారు. రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌనషిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. బాహ్యవలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. బాహ్య వలయ రహదారి లోపల ప్రస్తుతం వుండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు వుంటుందని, ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని గుర్తుచేశారు.

 

రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతర్ వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ వున్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటినుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు.

రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబరు నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్లా ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాలయాల కోసం టెండర్లు పిలవగా పేరొందిన సంస్థలు ఆ ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు. ప్రపంచంలో పేరొందిన మొదటి 10 అక్రిడేటెడ్ విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతిలో వారు తమ శాఖలను నెలకొల్పుకునేలా అన్ని అవకాశాలను కల్పిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని అన్నారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మారియట్, లీలా గ్రూపు వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. షెట్టీ గ్రూపు, అమృత, విట్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వచ్చాయని అధికారులు వివరించారు. రాజధానిలో జస్టిస్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై ఇక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలతో మాట్లాడాలని కోరారు. రానున్న కొద్ది కాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధంచేయాలన్నారు. ప్రతి మాసం ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం ద్వారా అమరావతిని నిత్యం వార్తలలో నిలపాలని అన్నారు.

Link to comment
Share on other sites

6878 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు 
16-12-2016 01:36:33
636174489936512821.jpg
  • 5.49 లక్షల ఎకరాల పరిధిలో ఔటర్‌
  • 8 వరుసలకు సీఎం ఓకే
  • అమరావతి-గుంటూరు మధ్య పరిశ్రమల అభివృద్ధి
అమరావతి, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, 186 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్ల ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ రోడ్ల కోసం మూడేసి ప్రతిపాదనలను గురువారం శాఖాధిపతుల భేటీలో అధికారులు సమర్పించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు 97.5 కి.మీ, 92.5 కి.మీ, 81 కిలోమీటర్ల చొప్పున, ఔటర్‌కు 166, 186, 210 కి.మీ.లతో ప్రతిపాదనలు రూపొందించారు. రూ.6878 కోట్లు ఖర్చయ్యే 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ తో పాటు186 కి.మీల ఔటర్‌ రింగు రోడ్డుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
 
 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ 67.5 కిలోమీటర్లు కాగా.. ప్రతిపాదిత జాతీయ హైవే బైపాస్‌ 15 కిలోమీటర్లతోపాటు ఎన్‌హెచ్‌-65కు సంబంధించి 15 కి.మీ మెరుగుపరుస్తారు. కృష్ణా నదిపై తూర్పు వంతెన 2 కిలోమీటర్లు, పడమర వంతెన 2.5 కిలోమీటర్లు అమరావతి, విజయవాడ నగరాలను అనుసంధానం చేస్తూ బైపాస్‌ రోడ్డుగా రూపొందుతుంది. 97.5 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో హైదరాబాద్‌- చెన్నై రోడ్డులో 34 కిలోమీటర్లు, చెన్నై- విశాఖ 26.5 కిలోమీటర్లు, విశాఖ-హైదరాబాద్‌ 31 కిలోమీటర్లు కలుస్తాయి. హైదరాబాద్‌ చెన్నై రోడ్డుకు 585 ఎకరాలు, చెన్నై-విశాఖ రోడ్డుకు 490 ఎకరాలు, విశాఖ-హైదరాబాద్‌ రోడ్డు అభివృద్ధికి 178 ఎకరాల భూమి అవసరం. వీటి అభివృద్ధికి రూ.4,434 కోట్లు, భూసేకరణకు రూ.2,444 కోట్లతో మొత్తం రూ.6878 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇన్నర్‌ పరిధిలోకి 1,21,224 ఎకరాలు వస్తాయి. భవిష్యతలో మరో 46,224 ఎకరాలు కలిసే అవకాశముంది. దీని పరిధిలోకి కాచవరం, వైకుంఠపురం, పెదపరిమి, తాడికొండ, చినకాకాని, పెదవడ్లపూడి, నూతక్కి, పెనమలూరు, నిడమానూరు, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వస్తాయి. సుమారు 19 లక్షల జనాభాతో విజయవాడ, అమరావతి అభివృద్ధి జరుగుతుంది.
 
 
ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. 
విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి మీదుగా 186 కిలోమీటర్లతో ఔటర్‌ నిర్మాణం చేపడతారు. హైదరాబాద్‌, విశాఖపట్నం బైపాస్‌ రోడ్లును అనుసంధానిస్తూ ప్రధాన రోడ్లను కలుపుతూ ఈ రోడ్డును నిర్మిస్తారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలికి దగ్గరగా ప్రధాన కార్యాచరణ కేంద్రాలు, గన్నవరం ఎయిర్‌పోర్టుకు మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. వీరపనేనిగూడెంలో ఏపీఐఐసీ పరిశ్రమల క్లస్టర్‌కు డైరెక్ట్‌ కనెక్ట్‌విటీని ఏర్పాటుచేస్తారు. అమరావతి- గుంటూరు మధ్యలో రోడ్డుకు ఇరువైపులా అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. 186 కిలోమీటర్ల పొడవైన ఈ ఎనిమిది వరుసల రోడ్డుకు రెండు పక్కలా సర్వీస్‌ రోడ్లు వస్తాయి. నదులు, రిజర్వాయర్లను మినహాయిస్తే 5,49,838 ఎకరాలు ఔటర్‌ పరిధిలోకి వస్తాయి. ఇన్నర్‌ రోడ్డుతోపాటు 4,00,614 ఎకరాల భూమి అభివృద్ధి జరుగుతుంది. ఔటర్‌ పరిధిలోకి కంచికచర్ల, అమరావతి, లింగాపురం, పాటిబండ్ల, మందపాడు, పేరేచర్ల, పుల్లటిగుంట, అనంతవరప్పాడు, వేజెండ్ల, నందివెలుగు, వల్లభాపురం, వల్లూరుపాలెం, నెప్పల్లి, వెల్దిపాడు, పెదఅవుటుపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, గిరిపల్లి, శోభనాపురం, కోడూరు, మైలవరం, గంగినేని గ్రామాలు వస్తాయి.
Link to comment
Share on other sites

అమరావతిలో 27 పట్టణాలు
 
636176225292174136.jpg
  • ప్రతి వెయ్యి ఎకరాల్లో ఒకటి
  • 4 రహదారులు, ఒక మెట్రోస్టేషన్‌
  • కృష్ణా ఒడ్డున వాణిజ్య కేంద్రాలు
  • 100 చిన్నపార్కులు
 
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 27 కొత్త పట్టణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కో పట్టణం 1000 ఎకరాల్లో విస్తరించేలా నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 28 వేల ఇళ్లు, లక్ష మంది జనాభాతో ఈ పట్టణాలు ఏర్పాటుకానున్నాయి. ఒక్కో పట్టణంలో 4 రహదారులు నిర్మిస్తారు. వాటిని పట్టణ సరిహద్దుల్లో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక జూనియర్‌ కాలేజీ, ఒక మైట్రోస్టేషన్‌ నిర్మిస్తారు. దీనికి సంబంధించి సీఆర్‌డీఏ ప్రణాళికలను రూపొందించింది. రాజధానిలోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనిర్మాణం కానుంది. దీనిలో గ్రీ-బ్లూ(పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5% భూమిని కేటాయించారు. కృష్ణానది ఒడ్డున 15 కిలోమీటర్ల ప్రాం తంలో రాజధాని నిర్మాణం జరుగుతుంది. 9 నగరాలు(పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలకా్ట్రనిక్‌, విజ్ఞాన, క్రీడల నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు.
 
250 ఎకరాలతో వంద చిన్న పట్టణాలు
250 ఎకరాల్లో దాదాపు 7వేల ఇళ్లు, 25 వేల జనాభా ఉండేలా ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపడతారు. ఈ ప్రాంతంలో ఉండే అందరికీ నడిచి వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్‌మాల్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. రాజధానిలో ఇలాంటి ప్రాంతాలు వంద వరకు ఉంటాయి. ఒక్కో ఇరుగుపొరుగు ప్రాంతాన్ని మళ్లీ నాలుగు సమానమైన చిన్న ప్రాంతాలుగా విభజిస్తారు. 62.5 ఎకరాల్లో అరకిలోమీటరు పరిధిలో ఉండే కమ్యూనిటీలో దాదాపు 1700 ఇళ్లు, 6 వేల జనాభా ఉంటారు. ఒక్కో కమ్యూనిటీని మళ్లీ 2 నుంచి 4 క్లస్టర్లుగా విభజిస్తారు. ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో పార్కు ఉంటుంది. అలాగే ఆ ప్రదేశంలో ఉండేవారందరికీ కలిపి వాహనాలు నిలపుకోడానికి ఉమ్మడి పార్కింగ్‌ ప్రదేశం ఉంటుంది. ఇందులో 300 నుంచి 800 కుటుంబాలు వరకు ఉంటాయి.
 
క్రమపద్ధతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
కృష్ణానది ఒడ్డున ఒక క్రమపద్ధతిలో వాణిజ్య కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని వాణిజ్య కేంద్రం(సీబీడీ-సెంట్రల్‌ బిజినెస్‌ డిసి్ట్రక్ట్‌)గా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, కార్పొరేట్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. వాణిజ్య పరంగా 3 ప్రాంతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. స్థానిక వాణిజ్య అవసరాలకు ప్రతి కమ్యూనిటీలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు.
 
60 మీటర్ల వెడల్పున 3 ప్రధానరోడ్లు
అంతర్జాతీయ నగరాలకు దీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున 2 ప్రధానరోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్‌ రింగ్‌రోడ్లు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల ఔటర్‌ రింగురోడ్లు నిర్మిస్తారు. 134 కిలోమీటర్ల పొడవున మెట్రోరైలు మార్గం నిర్మించే ప్రతిపాదనా ఉంది. కాలుష్య రహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభు త్వ ప్రధాన ఉద్దేశం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
 
అమరావతిలో గ్యాస్‌ ప్రాజెక్టు
రాజధాని అమరావతిలో గ్యాస్‌ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేస్తోంది. రాజధానిలో నివశించే జనాభాకు అవసరమైన గ్యాస్‌ సమకూర్చేలా చర్యలు చేపట్టారు. ఏపీ గ్యాస్‌ సరఫరా సంస్థ(ఏపీ జీడీసీ) ఎండీ ఎస్‌.నారాయణతో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీ సీఆర్‌డీఏ అధికారులతో పాటు మౌలిక సదుపాయాల కన్పల్టెంట్‌ ఆర్వీ, జీఐఐసీ ప్రతినిధులు సంయుక్తంగా శనివారం అమరావతి గ్యాస్‌ ఆధారిత బృహత్తర ప్రణాళికపై చర్చలు జరిపారు.
Link to comment
Share on other sites

అమరావతిలో భారీ నిర్మాణాలు
 
636177156955056145.jpg
  • భూమి కోసం ఎస్‌బీఐ, ఐవోసీ ఎల్‌ సహా పలు సంస్థల వినతులు 
  •  5 లక్షల చ.అడుగుల్లో బ్రహ్మకుమారి విద్యాలయం 
  •  29 గ్రామాల అభివృద్ధికి సీఆర్‌డీఏ నిధులు 
  •  25 లక్షల చొప్పున కేటాయింపు 
  •  మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కేంద్రం నుంచి మరో పాతిక లక్షలు 
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ కార్యాలయాలు నిర్మించుకునేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్క విద్యా రంగంలోనే ఇప్పటిదాకా సుమారు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖత చూపాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం లాంటి విశ్వవిద్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. వైద్య రంగంలోను పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ తమకు కేటాయించిన భూమిలో వైద్య విశ్వవిద్యాలయం, ఇతర యూనిట్ల కోసం సుమారు 15.6 లక్షల చదరపు అడుగుల భవనాలను నిర్మించనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), భారత ఆహార సంస్థ (ఎఫ్‌బీఐ), భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌), ఇండియన ఆయిల్‌ కార్పొరేషన లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లు తమ తమ కార్యాలయాల కోసం భూములు అడిగాయి. వీటితో పాటు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం, నందమూరి బసవతారకం కేన్సర్‌ ఫౌండేషన, ఆప్కాబ్‌, ఏపీఎ్‌సఎ్‌ఫసీ తదితర సంస్థలు కూడా కోరుతున్నాయి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ ప్రాంగణంలో ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సంస్థకు భూ కేటాయింపు చేశారు. అక్కడ భారీ భవనాలు నిర్మించారు. ఇప్పుడు అమరావతిలోనూ 25 ఎకరాల భూమి కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం 10ఎకరాలు వరకు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో సుమారు 5లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపడతారు. ఆడిటోరియంలు, ధ్యానమందిరాలు, తరగతి గదులు, భోజనశాలలు, ఆడియో, వీడియో శిక్షణ గదులు, పరిపాలనా భవనం ఇలాంటివన్నీ నిర్మిస్తారు. వీరికి ఎకరా రూ.4.1 కోట్ల విలువ కట్టి..దానిపై లీజు నిర్ణయించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. లీజు నామమాత్రంగా ఉండాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. భూ కేటాయింపు చేస్తే దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఎక్కువ భాగంలో పచ్చదనం నింపుతామని సదరు సంస్థ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్మాణాలకు తోడు.. ఇలా పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్న సంస్థలన్నీ నిర్మాణాలను చేపడితే ఇక్కడ భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి. కాగా.. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్‌డీఏ ఒక్కో గ్రామానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించింది. వీటికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కేంద్రం ఒక్కో గ్రామానికి మరో రూ.25 లక్షల చొప్పున ఇస్తుంది. పామ్‌ దుబాయ్‌, బుర్జ్‌ ఖలీఫాలపై సీఎం దృష్టిమరోవైపు సీఎం ఈ నెల యూఏఈ, కువైట్‌లలో పర్యటన సందర్భంగా అమరావతికి, రాష్ట్రానికి పెట్టుబడులపై దృష్టిపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఎత్తైన కట్టడం బుర్జ్‌ఖలీఫా, దుబాయ్‌లో సముద్ర ఒడ్డుకు కాస్త లోపలున్న దీవుల్లో నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణాల సమాహారం పామ్‌ దుబాయ్‌ నిర్మాణ సంస్థలతో చర్చించనున్నారు. అమరావతిలో ఒక ఐకానిక్‌ నిర్మాణం, ప్రాజెక్టు లాంటిది చేపట్టే అంశంపై చర్చ జరిగే అవకాశాలున్నాయని సమాచారం.
Link to comment
Share on other sites

Architects, designers from across the world come to Amaravati, to ideate on planning Firms from various countries working with AP Capital Region Development Authority (APCRDA) to plan the capital are bringing in native ideas, designs, aesthetics, and cultural influences and amalgamating it with Andhra culture at Amaravati.
Written by Sreenivas Janyala | Amravati | Published:December 21, 2016 6:04 pm

 

amaravati1.jpg Prime Minister Narendra Modi with Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and Telangana Chief Minister K Chandrasekhar Rao at the foundation laying ceremony of Amaravati (Representational image). (Source: PTI)

With architects, designers and planners from Japan, China, Singapore, Netherlands, and the UK involved in planning and designing various components of Amaravati, Andhra Pradesh’s capital would be an assimilation of different styles of architecture, best practices from all over the world, and an environment that ensures good quality of living. Firms from various countries working with AP Capital Region Development Authority (APCRDA) to plan the capital are bringing in native ideas, designs, aesthetics, and cultural influences and amalgamating it with Andhra culture at Amaravati. Last week, an architect from a top consultancy firm UK-based Fosters and Partners met Telugu film director S S Rajamouli, who directed Bahubali, to take inputs on Andhra Pradesh’s culture, history and traditions. Rajamouli had done a lot of research on these aspects for his films, and the architect from Fosters and Partners, who will design some projects in Amaravati, wanted to enlighten himself.

Experts from the Japan International Cooperation Agency (JICA) are providing technical assistance to conduct a detailed traffic and transportation survey for the 217 square kms of Amaravati capital city as well as the 8,603 sq kms of capital region. The final plans and designs of rail and road transportation in Amaravati will have a strong Japanese influence. “Japan has a very strong and efficient public transportation system. It is designed to serve a large number of people very smoothly. We want Amaravati to have such a transport system and JICA is helping us plan it. We are collaborating with many countries and trying to absorb the strength of each country here,” said V Rama Manohara Rao, Additional Commissioner, APCRDA.

Guizhou International Investment Corporation (GIIC) of the Province of Guizhou in China has tied up with Hyderabad-based Aarvee Associates Architects Engineers and Consultants Pvt Ltd through a bidding process to prepare a master plan and detailed project report on infrastructure in the 217 square capital city area. The Chinese firm will provide assistance in designing and planning city-level infrastructure like water, gas and power supply; housing, sewerage treatment plants, storm water drainage system, roads, and government buildings. “The Chinese are very meticulous planners and fast developers. They will take two years to plan a big project but once they are ready, they hit the ground running and complete the project within two to three years. Due to the tie-up between GIIC and the local firm we are getting the Chinese expertise in creating large infrastructure projects. They have given us models on roads and housing,” Rao said. The Chinese firm will also suggest how to develop the plots that have been returned to farmers by the APCRDA under the Land Pooling Scheme. GIIC’s Vice-Chairman Zhang Zhao told CRDA officials that their principle is to love and respect Indian culture; not to impose but align with the flow; and not to make changes unnecessarily.

Before they start working, the international planners and consultants are first studying Indian culture, especially Andhra culture, so that they can assimilate their ideas and designs into the local culture. Singapore Government’s consultancy services company Surbana Jurong is already the lead consultant planning and urban design for Amaravati.

Netherlands-based Arcadis, the well-known engineering consultancy firm, will be planning and designing the blue infrastrure in and around Amaravati—water Modies, reservoirs, ponds and lakes, river drainage system, and canals to rejuvenate water transportation. Arcadis is teaming up with Tata Consulting Engineers for blue infrastructure in Amaravati region. US-based CH2M Hill, programme management consultants who provided their expertise to London Olympics, is likely to come on board as consultants to provide technical expertise to the top management of APCRDA. UK is creating a fund for providing funding to various projects in Amaravati which can also be accessed by private sector. This fund is in turn funded by agencies listed on the London Stock Exchange.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...