Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిపై ముగిసిన చంద్రబాబు సమీక్ష
 
విజయవాడ: అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసింది. ఆస్పత్రులు, ఐటీ పార్క్‌లు, పాఠశాలల ఏర్పాటు కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారానికి ఒక నోటిఫికేషన్ సీఆర్డీఏ విడుదల చేయనుంది. వెలగపూడి సచివాలయం ఎలివేషన్‌ డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎల్‌అండ్‌టీ ఇచ్చిన డిజైన్‌ను యథాతధంగా ప్రభుత్వం ఆమోదించింది.
Link to comment
Share on other sites

చంద్రబాబుతో బ్రిటన్‌ బృందం భేటీ

అమరావతి: విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బ్రిటన్‌ పార్లమెంటరీ బృందం సమావేశమయ్యింది. అమరావతిని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడం, రవాణా సౌకర్యాల కల్పన, సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధమని బ్రిటీష్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. విపత్తు నిర్వహణ వ్యూహాలపై సమావేశంలో చర్చించారు

Link to comment
Share on other sites

ఏపీ రాజధానికి ప్రపంచబ్యాంక్‌, హడ్కో, ఆంధ్రా బ్యాంక్‌ రుణాలు
 
విజయవాడ: రాజధాని నిర్మాణానికి భారీగా రుణాలు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్‌, హడ్కో, ఆంధ్రా బ్యాంక్‌ ముందుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.17500 కోట్లు రుణంగా ఇచ్చేందుకు మూడు బ్యాంకులు ఆసక్తి చూపించాయి. దీంతో రాజధాని నిర్మాణం మరింత వేగం కానుంది.
Link to comment
Share on other sites

Amaravati-Land-Prices-UK-Investment-PWC-The UK government represented by British Deputy High Commission, Hyderabad, has engaged Price water house Coopers Private Limited (PWC), to prepare the strategy report which will suggest the investment opportunities to the UK-based companies and to the AP government on ways and means for mobilizing funds to build Amaravati. It has estimated the reserve price of land per acre in the upcoming capital city at 4.3 crores in 2019 and it is estimated that the basic reserve price of land will increase from 2 crores to 4 crores in the next three years. The reserve price will also include total infrastructure cost incurred per acre by CRDA as well. AP government can get 31,000 crores and the maximum basic reserve basic price will escalate to about 6 crores. The agency also estimated that the total funding requirement of the capital would be about 70,000 crores. The UK Export Finance Lending Group will provide the maximum amount of loan at a rate of 85 percent of the project cost in Amaravati. Loans will be available with an interest rate of 0.40 to 3.5 percent depending on the tenure. But then, the state government has to bear the hedging costs.
 

Link to comment
Share on other sites

అత్యద్భుతంగా జలాభిముఖ ఉద్యానవనం

అమరావతికే మకుటం శాఖమూరు జలాశయం

సత్వరమే నిర్మాణం చేపట్టి జూన్‌ కల్లా పూర్తి చేయాలి

రాజధాని నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలోని శాఖమూరు రిజర్వాయరు ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జలాభిముఖ ఉద్యానవనం(వాటర్‌ఫ్రంట్‌ పార్కు)గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రపంచ ప్రముఖ నగరాల్లోని నమూనాల్ని పరిశీలించి, ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని సూచించారు. సెంట్రల్‌ పార్కుగా అభివృద్ధి చేస్తున్న శాఖమూరు జలాశయం అమరావతికే వన్నె తెస్తుందని తెలిపారు. రిజర్వాయరు నిర్మాణాన్ని వెంటనే చేపట్టి, వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పురోగతిపై బుధవారం చంద్రబాబు విజయవాడలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 97 హెక్టార్లలో విస్తరించి ఉన్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని ప్రపంచశ్రేణి ప్రమాణాలతో తీర్చిదిద్దితే అది భవిష్యత్తులో రాజధానికి మకుటంగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలోని కొండవీటివాగు జలాభిముఖ (వాటర్‌ఫ్రంట్‌) నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి, త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పరిపాలన నగరం మీదుగా వెళుతున్న కాలువ... ప్రభుత్వ భవన సముదాయం మధ్యగా, సచివాలయాన్ని రెండుగా చీల్చుతూ వెళుతున్నందున ఆ ప్రతిపాదనను పునః పరిశీలించాల్సి ఉందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కాలువ ప్రభుత్వ పరిపాలన నగరానికి ప్రధాన ఆకర్షణగా, అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్‌గా ఉంటుందని తెలిపారు. ఆ కాలువను ప్రత్యామ్నాయ మార్గానికి మళ్లించి, ఆగ్రా తాజ్‌మహల్‌ తరహాలో ప్రత్యేక కాలువ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనను ఆయన ముఖ్యమంత్రి ముందుంచారు. దీనిపై నిపుణుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ఆరు రుతువుల్లోనూ ప్రత్యేకంగా ఉండాలి.. రాజధానిలో వాటర్‌ఫ్రంట్‌ నిర్మాణాలన్నీ ఆరు రుతువుల్లోనూ ఎప్పుడు చూసినా ప్రత్యేకంగా కనిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యానవనాల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వీటిలో ఎలాంటి వృక్ష జాతులు నాటాలో కడియం నర్సరీ యజమానులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వీటిలో ఔషధ విలువలున్న వృక్షజాతుల్ని పెంచాలని సూచించారు.

ప్రత్యేక ఆకర్షణగా పర్వత శ్రేణులు.. రాజధానిని బ్లూ, గ్రీన్‌ నగరంగా నిర్మించాలని సంకల్పించామని, దానికి అదనంగా ఇప్పుడు ‘గ్రీన్‌ హిల్స్‌’ అనే పదాన్ని చేర్చుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ఉన్న పర్వతశ్రేణుల సౌందర్యాన్ని ఇటీవలే చూసి ముగ్దుడినయ్యానన్నారు. కొత్త రాజధానికి ఇది కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా మారుతుందని తెలిపారు.

నీరు ఇంకేలా నిర్మాణాలు.. రాజధానిలో ప్రతి గృహంలో సగభాగం కాంక్రీటు నిర్మాణాలు లేని (అన్‌పేవ్డ్‌) ప్రాంతంగా ఉంటుందని అధికారులు వివరించారు. వర్షపు నీరు, వరద నీరు భూమిలోకి ఇంకిపోయేలా రాజధానిలో నిర్మాణాలు ఉండి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఏ నిర్మాణానికైనా నీరు భూగర్భంలోకి నీరు ఇంకేందుకు వీలుగా లేదంటే రిజర్వాయర్‌కు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాటు ఉండాలని సూచించారు.

పైకి పచ్చదనం... లోపల నీటి శుద్ధి.. రాజధానిలో నీరు, సీవరేజ్‌ కోసం వెట్‌ల్యాండ్‌ ట్రీట్‌మెంట్‌ విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పైకి పచ్చదనంతో ఆకర్షణీయంగా కనబడేలా, లోపల నీటి శుద్ధి జరిగే నమూనాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రహదారుల విషయంలో బ్లాక్‌ టాప్‌ రోడ్ల కంటే వైట్‌ టాప్‌ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని శ్రీధర్‌ వివరించారు.

బుధవారం నుంచి సచివాలయంలోనే.. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పనుల పురోగతిని అధికారులు వివరించారు. ఇంటీరియర్‌ పనులు దాదాపు పూర్తికావొచ్చాయన్నారు. వచ్చే బుధవారం నుంచి అక్కడ విధులకు హాజరవుతానని, ఆ లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘కోహినూర్‌ వజ్రం’ను తరతరాలు గుర్తుంచుకునేలా నిర్మాణాల్లో ఎక్కడైనా దాన్ని ప్రతిబింబించే ఆకృతులు సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్‌లకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడలో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం కార్యక్రమం కింద 5 వేల ఇళ్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్‌ వీర పాండియన్‌కు ముఖ్యమంత్రి అనుమతిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు, లక్ష్మీపార్థసారధి, అజయ్‌జైన్‌, సాయిప్రసాద్‌, మల్లికార్జున తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

వచ్చే జూన్ నాటికి శాఖమూరు రిజర్వాయర్ పార్క్

 

 

sakhamuru-reservoir-16112016.jpg

కొత్త రాజధాని అమరావతి నగరానికే అలంకారంగా నిలిచే శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. సెంట్రల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్న శాఖమూరు రిజర్వాయర్ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్‌ పార్కుగా తీర్చిదిద్దాల్సి వున్నదని, వివిధ అంతర్జాతీయ నగరాల్లో వున్న నమూనాలను పరిశీలించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని ఆయన చెప్పారు. శాఖమూరు రిజర్వాయర్‌, పార్కులతో పాటు నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో వున్న 24 కిలోమీటర్ల కొండవీటివాగు వాటర్‌ఫ్రంట్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, రాజధాని నగర అభివృద్ధి-నిర్వహణ సంస్థల ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, కన్సల్టెంట్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. 97 హెక్టార్లలో విస్తరించి వున్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని ప్రపంచశ్రేణిలో తీర్చిదిద్దితే అది భవిష్యత్తులో రాజధానికి మకుటంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పరిపాలన నగరం మీదుగా వెళుతున్న కాలువ ప్రభుత్వ భవన సముదాయం మధ్యగా సచివాలయాన్ని రెండుగా చీల్చి వెళుతున్నందున ఆ ప్రతిపాదనపై పున:పరిశీలన జరపాల్సివుందని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ కాలువ ప్రభుత్వ పరిపాలన నగరానికి ప్రధాన ఆకర్షణగా, అత్యుత్తమ వాటర్ ఫ్రంటుగా వుంటుందని భావించినా, 200 మీటర్ల లోతున వుండే ఆ కాలువను ప్రత్యామ్నాయ మార్గానికి మళ్లించి ఆగ్రా తాజ్‌మహల్ తరహాలో ప్రత్యేక కాలువ మార్గాన్ని ఏర్పరచుకోవాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు వుంచారు. దీనిపై నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాజధాని నగరంలో నిర్మించే వాటర్ ఫ్రంట్ నిర్మాణాలన్నీ ఆరు కాలాలలో ఎప్పుడు చూసినా ప్రత్యేకంగా కనిపించాలని, ముఖ్యంగా ఉద్యానవనాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఈ పార్కులలో ఎటువంటి వృక్ష జాతులను నాటాలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కడియం నర్సరీ యజమానులతో సంప్రదించాలని చెప్పారు. ఔషధ విలువలు వున్న వృక్ష జాతులను పెంచాలని సూచించారు. రాజధాని ప్రాంతంలోని రైతులు కొత్త రాజధానిలో వనాలను సంరక్షించే బాధ్యత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వారికి ఉద్యాన వన సంరక్షణలో అవసరమైన నైపుణ్యం అందించేలా శిక్షణ ఇప్పించాలని చెప్పారు. రానున్న కాలంలో పార్కులలో వన సంరక్షణ బాధ్యతల్ని చూసేందుకు ప్రత్యేకంగా సంస్థాగతమైన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

మన రాజధాని నగరాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా రూపొందించాలని సంకల్పించామని, ఇప్పుడు దానికి అదనంగా గ్రీన్ హిల్స్ అనే పదాన్ని కూడా చేర్చుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. బెజవాడ, అమరావతి చుట్టుపక్కల వున్న పర్వతశ్రేణుల సౌందర్యాన్ని ఇటీవలే చూసి ముగ్ధుడినయ్యానని ప్రస్తావిస్తూ, కొత్త రాజధానికి ఇదే కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా మారనున్నదని అన్నారు. నవ నగరాల్లో ప్రవహించే వాటర్ ఫ్రంట్ నిర్మాణాల్లో నీటి నిల్వ స్థాయి ఎప్పుడూ మధ్యతరహాలో వుండాలని, వరదలు వస్తే నీరంతా రిజర్వాయర్లలోకి వెళ్లిపోయేందుకు వీలుగా అధిక నీటిమట్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

 

రోడ్ క్రాస్ సెక్షన్ ఆకృతులపై సమావేశంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్యుత్, ఇతర అవసరాలకు ఉపయోగించే అంతర్ వాహికల (డక్ట్స్) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సివున్నదని చెప్పారు. సమీకృత బహుళార్ధక అంతర్వాహికల (ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ డక్ట్స్) కంటే వ్యక్తిగత అంతర్వాహికలే (ఇండివిడ్యువల్ డక్ట్స్) ప్రయోజనకరంగా వుంటాయని వివరించారు. రాజధానిలోని ప్రతి గృహంలో సగభాగం అన్‌పేవ్డ్ ఏరియాగా వుంటుందని తెలిపారు. వర్షం నీరు, వరద నీరు భూమిలోకి నేరుగా ఇంకిపోయే ఏర్పాటు వుండి తీరాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ఏ నిర్మాణాలకైనా అట్టడుగు భాగాన భూగర్భంలో నీరు ఇంకి రీఛార్జ్ అయ్యేందుకు వీలుగా, లేదా నీరు రిజర్వాయర్‌కు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాటు వుండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో లక్షా 50 వేల పంటకుంటల తవ్వకాలతో నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నామని, నగర, పట్టణ ప్రాంతాలలో సైతం ఈ తరహా ఏర్పాట్లు చేసుకోకపోతే భవిష్యత్తులో నీటికి వెతలు తప్పవని హెచ్చరించారు. స్మార్మ్ సిటీలంటే ఇటువంటి ముందుజాగ్రత్తలు తీసుకునే విధానాలతో రూపొందించేవేనని అన్నారు.

వాటర్, సీవరేజ్ కోసం వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచించారని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. పైకి గ్రీనరీతో ఆకర్షణీయంగా కనిపించేలా లోపల వాటర్ ట్రీట్‌మెంట్ జరిగే మోడల్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు.

రహదారుల విషయంలో బ్లాక్ టాప్ రోడ్ల కంటే వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ముఖ్యమంత్రికి వివరించారు. బ్లాక్ టాప్ రహదారులతో పోల్చితే 15 శాతం వ్యయం అధికంగా వున్నా వైట్ టాప్ రోడ్లు ఉష్ణోగ్రతను చాలావరకు తగ్గిస్తాయని అన్నారు. పైగా నిర్వహణ వ్యయం కూడా తక్కువేనని తెలిపారు. వైట్ టాప్ రోడ్లకు సంబంధించి నవీన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

నివాస ప్రాంతాలలో ప్రతి వంద మీటర్ల దూరానికి ఒక క్రాసింగ్ వుండాలని నిపుణులు సూచించారని, ఆ సూచనలకు అనుగుణంగా రహదారి నిర్మాణాలు వుండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సైకిలిస్టులు, పాదచారుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ బెల్ట్ మార్గం వుంటుందని వివరించారు. ఈ గ్రీన్ బెల్ట్ రహదారికి ప్రతి వంద మీటర్లకు ఒక క్రాసింగ్ వుండేలా రూపకల్పన చేస్తున్నామని చెప్పారు.

వెలగపూడి సచివాలయం పనుల పురోగతిని సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటీరియర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని తెలిపారు. వచ్చే బుధవారం నుంచి అక్కడ విధులకు హాజరవుతానని, ఈలోగా ఏర్పాట్లు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. మనదైన వారసత్వ సంపద- ‘కోహినూర్ వజ్రం’ ఆకృతిని తరతరాలు గుర్తుంచుకునేలా ఎక్కడైనా నిర్మాణాల్లో నిక్షిప్తం చేయాలని ఆర్కిటెక్టులకు ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడలో ఎఫర్డబుల్ హౌసింగ్ కింద 5 వేల ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టడానికి ముఖ్యమంత్రి నగర పాలక సంస్థ కమిషనర్ వీర పాండియన్‌కు అనుమతి ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, అధికారులు లక్ష్మీ పార్ధసారధి, అజయ్ జైన్, సాయిప్రసాద్, చెరుకూరి శ్రీధర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణానికి రూ.17,500 కోట్ల రుణం: సీఆర్డీఏ కమిషనర్
 
636150777680202211.jpg
విజయవాడ: రాజధాని నిర్మాణానికి రూ.17,500 కోట్ల రుణం సిద్ధంగా ఉందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఆయన సీఆర్డీఏ డ్యాష్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచబ్యాంక్, హడ్కో, ఆంధ్రాబ్యాంక్ నుంచి రుణం తీసుకుంటున్నట్లు, రూ. 7,500 కోట్ల రుణానికి హడ్కో ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే మార్చి నుంచి సీడ్ కేపిటల్‌లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 18 నెలల్లో ప్రభుత్వ కాంప్లెక్స్, రాజ్‌భవన్, అసెంబ్లీ నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తులు తట్టుకునేలా రాజధాని నిర్మాణం జరుగుతదని శ్రీధర్ అన్నారు. ప్రధాని మోదీతో కుదిరిన ఒప్పందం మేరకు ఆరు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు యూకే సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏఐఐబీ, ఏడీబీ, ఏన్‌డీసీ లేఖలు పంపాయని, రాజధానిలో బస్సు, రైలు రవాణా అభివృద్ధికి జపాన్, చైనా, యూకే సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని శ్రీధర్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామని, ఇప్పటికే రూ. 1500 కోట్లు విడుదల చేసిన కేంద్రం మరో 2 వేల కోట్లకు ఆమోదం తెలిపిందని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. ఇతర రాజధానుల కంటే అమరావతి వేగంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...