Jump to content

Recommended Posts

Posted

adi above sea level hight anukunta, not water levels 46 feet :think:

 

 

dhawaleswaram ki pattiseema ki chala distance vundi kada akkada levels kada chusedi

 

water level w.r.t sea ne kada ekkadaina chusedi. 

45 ft at dowleswaram actually mean 15 deep water in Godavari at the barrage. 

so water level behind the barrage will be same everywhere. but water depth will be less at Pattiseema. I am not sure how much it is. You are asking the water depth in Godavari at Pattiseema location while water overflowing at Dowleswaram?

Posted

. You are asking the water depth in Godavari at Pattiseema location while water overflowing at Dowleswaram?

yes,pattiseema pumps deggara 14 feets vundadu ani antunnanu

Posted

yes,pattiseema pumps deggara 14 feets vundadu ani antunnanu

Last year article

 

Chief Minister N. Chandrababu Naidu has said that Godavari river water will be diverted from Pattiseema project into Polavaram Right Main Canal (RMC) with the help of 24 pumps on July 6 as the water level at Dowleswaram crossed 14 metres.

Posted

Last year article

 

Chief Minister N. Chandrababu Naidu has said that Godavari river water will be diverted from Pattiseema project into Polavaram Right Main Canal (RMC) with the help of 24 pumps on July 6 as the water level at Dowleswaram crossed 14 metres.

 

 

at pumpuhouse not dhawaleswaram

E7.jpg

Posted

This picture is wrong. water depth at Pattiseema can never be 15 meters. water level w.r.t sea it is. depth will be at the most 20-25 feet. 

:iagree:, above sea level anukunta 

Posted

ఈనాడు, అమరావతి: కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ సాగుకు సీలేరు నుంచి నీటిని విడుదల చేసి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లించే విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరులశాఖ అధికారులకు సూచించారు. జులై నెలలో గోదావరిలో ప్రవాహాలు పెరిగే లోపు కృష్ణా డెల్టాలో నారుమళ్లకు నీటిని అందించేందుకు ఈ అవకాశంపై ఆలోచించాలన్నారు. అమరావతి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి వ్యవసాయంపై వీడియో కాన్ఫరెన్సు అనంతరం జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు అధికారులతోను, వివిధ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లతో సమీక్షించారు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు కింద ఈ ఖరీఫ్‌లో ఆరుతడి పంటలకే పరిమితమైతే ఆ తర్వాత వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండి ముందే ఆయకట్టు సాగు చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు

Posted

కృష్ణా డెల్టాలోనూ ముందస్తు సాగు

జిల్లాలో 52 వేల ఎకరాలకు జులై మొదటివారంలోనే సాగునీరు

పులిచింతల, పట్టిసీమ నీరు వినియోగించుకునే యోచన

పట్టిసీమ ద్వారా ఈ సంవత్సరం వంద టీఎంసీల నీరు

ఈనాడు, ఏలూరు

ఇప్పటికే గోదావరి డెల్టాకు ముందుస్తుగా సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం అదే వూపుతో కృష్ణాడెల్టాకు కూడా ముందుగా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని ఏవిధంగా నెరవేర్చాలనే అంశంపై ఇప్పటికే తర్జనభర్జన పడుతుండగా పట్టిసీమ పంపులు పూర్తిగా తయారైన నేపథ్యంలో దీనిని కూడా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. పట్టిసీమ నుంచి నీరు తీసుకోవాలంటే కొంతసమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటికి పులిచింతల ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా జిల్లాలోని కృష్ణాడెల్టాను త్వరితగతిన పూర్తిచేయాలని యోచిస్తున్నారు.

జిల్లాలో ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల్లో 52 వేల ఎకరాలు ఉండగా వీటికి ఆగస్టు చివరి వారంలోగాని నీరు అందడంలేదు. గడిచిన సంవత్సరం పట్టిసీమ ద్వారా నీరు విడుదలైనా పైనుంచి నీరు రాకపోవడంతో నాట్లు త్వరగా పడలేదు. అయితే ఆఖరి నిమిషంలో ప్రభుత్వవిప్‌ చింతమనేని ప్రభాకర్‌, కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌లు అవసరమైన ప్రాంతాలకు పైపుల ద్వారా నీరు తోడించడం వల్ల రైతులు గట్టెక్కారు. అయితే ఖరీఫ్‌లో ఆఖరి దశలో నీరు ఎలాగైనా అందుతుందని కానీ తొలిదశలో నీరు అందించడమే ముఖ్యమని ఆలోచించిన ప్రభుత్వం ఈసారి పులిచింతలలో ఉన్న నీటిని వినియోగించుకోవడం ద్వారా కృష్ణాడెల్టాలో కూడా సాగు ముందుకు జరపాలని నిర్ణయించింది. జులై మొదటివారంలోనే నీరు ఇస్తే ఇక్కడ నారుమళ్లు పూర్తయి నవంబరు చివరికి పంట చేతికి వస్తుందని ప్రణాళిక వేస్తున్నారు. నారుమడుల వరకూ పులిచింతల నీటిని వాడినా ఆ తర్వాత పట్టిసీమ నీటిద్వారా సాగును ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లవచ్చని యోచిస్తున్నారు.

పట్టిసీమలో మోటార్లు సిద్ధం..

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద 24 మోటార్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని పైకి తోడే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నీటిని తోడాలంటే గోదావరిలో నీటిమట్టం 14 అడుగులకు చేరాలి. వర్షాలు అధికంగా పడితే ఈలోగానే ఈ ఎత్తు చేరుకోవచ్చు. ఒకవేళ సాధారణ పరిస్థితులైతే ఆగస్టు మొదటి వారంలోనే గోదావరిలో ఈ పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం పట్టిసీమలో 24 మోటార్లు నిర్వహణకు సిద్ధమయిన నేపథ్యంలో వీటిని మొత్తంగా వినియోగిస్తారు. దీనిద్వారా ఈ సీజన్‌లో వంద టీఎంసీలు నీటిని ఎత్తిపోయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం సీజన్‌ ముగిసే సమయానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు పూర్తికాకపోవడంతో కొన్ని ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా నీటిని ముందుకు తీసుకెళ్లారు. ఈసంవత్సరం ఈ పరిస్థితి రాకుండా ముందుగానే పనులు పూర్తిచేయడానికి ప్రణాళిక రూపొందించారు. యంత్రాల ద్వారా మిగిలిన కాలువ వెడల్పు పనులు, రివిట్‌మెంటు పనులు పూర్తిచేశారు. ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు జరుగుతున్నా గోదావరిలో నీరు అనుకున్న మేర ఎత్తు వచ్చిన వెంటనే మోటార్లు ప్రారంభమవుతాయని, పంపింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి కుడికాలువలో పనులు నిలుపుదల చేసి యంత్రాలను పైకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. నెలరోజులపాటు అనుకున్నస్థాయి నీరు రాకపోతే పనులు మొత్తం పూర్తవుతాయని చెబుతున్నారు. మొత్తంగా వంద టీఎంసీలు నీరు వస్తే గోదావరి, కృష్ణాడెల్టాలో ఉన్న శివారు భూములకు కూడా ఎటువంటి సాగునీటి సమస్య లేకుండా పుష్కలంగా పంటలు పండించవచ్చు. దీనిపై పోలవరం కుడి ప్రధాన కాలువ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి నీటిని అనుకున్న లక్ష్యం మేర తీసుకెళతామని, పనులు వీటికి అడ్డంకి కావన్నారు.

Posted

From Eenadu - WG district edition

 

పట్టిసీమ ద్వారా త్వరలోనే నీటి ఎత్తిపోత

 

పట్టిసీమ ద్వారా నీరు తోడాలంటే మరో నెలరోజులు ఆగాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగడంతో నీరు ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తోడాలంటే గోదావరిలో నీటిమట్టం 14 అడుగులు ఉండాలి. ఈనేపథ్యంలో ఇక్కడ శనివారం సాయంత్రానికి ఆ మేరకు నీటిమట్టం పెరిగింది. అయితే గోదావరి జిల్లాల్లో సాగు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో అక్కడ నీటి అవసరాలు తీరాయని శివారు వరకూ నీరు వెళ్లిందని నిర్థారణ అయ్యాకే నీటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా కృష్ణాడెల్టాలో ముందుస్తు సాగుకు పట్టిసీమ ద్వారా తొలి అడుగు పడింది. దీనిపై పోలవరం కుడికాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌యాదవ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ జిల్లాలో పోలవరం కుడికాలువ పనులు చాలావరకూ పూర్తిచేశామన్నారు. గోదావరిలో సాగు అవసరాలు తీర్చాకే పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఎప్పుడు ఎత్తిపోతలను ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.

Posted

ఈనాడు, ఏలూరు

 

ముంచుకొచ్చినా మందగమనమే

పోలవరం కుడికాలువ పనుల్లో సాగదీత

పూర్తికాని 2, 4, 5 ప్యాకేజీల్లో పనులు

14 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

నాలుగైదు రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు ఎత్తిపోతకు అవకాశం

 

పశ్చిమ సాగు అవసరాలకు నీరివ్వడం, కాలువలు కూడా నిండుగా ప్రవహిస్తుండటం, మరోవైపు గోదావరిలో నీటి మట్టం పెరగడంతో రాబోయే నాలుగైదు రోజుల్లో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టిసీమ నీరు ప్రవహించే పోలవరం కుడికాలువలో పనులను ఎక్కడివక్కడ నిలుపుదల చేసి యంత్రాలను పైకి రప్పించనున్నారు. ఈ సంవత్సరం వంద టీఎంసీలు నీటిని పట్టిసీమ ద్వారా తీసుకెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా చేయాల్సిన పనుల వల్ల ఏమైనా అవాంతరాలు ఏర్పడతాయా? అనేది తెలియదు. ఇంత భారీస్థాయిలో నీటిని తీసుకెళ్లే సమయం ఇదేకావడంతో 24 మోటార్లు ఒకేసారి పనిచేయించి నీటిని వదిలితే కాలువ సామర్థ్యం ఎంతమేర ఉంటుందో రోజువారీ గంటలవారీ తెలుసుకుని ఆమేరకు నీటి కోటాను పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలవరం కుడికాలువ పనుల సాగదీత ధోరణి వల్ల ఈ సంవత్సరం కూడా పట్టిసీమ ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేర నీరు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఆఖర్లో హడావుడి చేసిన అధికారులు ఆదిలో అంతగా పనులపై దృష్టిపెట్టక పోవడంతో తాజాగా ఎక్కడివక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా గోదావరి నుంచి నిర్దేశిత పరిమాణంలో నీరు రావడంతో కొద్దిరోజుల్లోనే పట్టిసీమ నుంచి నీటిని తోడే పని ప్రారంభించనున్నారు. జిల్లాలో పోలవరం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువ పనులు 174 కిలోమీటర్ల మేర సాగి కృష్ణా డెల్టా వద్ద ముగుస్తాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించాకా పోలవరం కుడికాలువ తవ్వకం పనులు వేగంగా ముందుకు సాగించారు. ఎట్టకేలకు కాలువ వెడల్పున 80 మీటర్లు మేర తవ్వాల్సిఉండగా 30 మీటర్లు మేర తవ్వకం చేపట్టి యుద్ధప్రాతిపదికన నీటిని కృష్ణాకు అనుసంధానం చేశారు. ఈ సమయంలో పట్టిసీమ ద్వారా నీటిని తోడి కృష్ణాడెల్టాలో పంటలకు సమస్య లేకుండా సాగునీరు అందించగలిగారు. మిగిలిన పనులను మరుసటి సంవత్సరం పూర్తిచేస్తామని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత వీటిని తూతూమంత్రంగా చేపట్టారని విమర్శలు ఉన్నాయి. జిల్లా పరిధిలో నాలుగున్నర ప్యాకేజీలు, కృష్ణా పరిధిలో మరికొంత పని మిగిలి ఉండగా వీటిని వేసవిలో ప్రారంభించారు. అయితే ఏప్రిల్‌, మేలలో అనుకున్న స్థాయిలో జరిగితే ఈ పాటికే పనులు పూర్తయ్యేవి. కానీ గుత్తేదార్లు వేగంగా పనులు చేయక పోవడం వల్ల వేసవి పూర్తయినా కూడా పనులు చివరి దశకు చేరుకోని స్థితి ఏర్పడింది.

 

రెండు ప్యాకేజీల్లో అత్యంత నెమ్మది...

పోలవరం కుడికాలువ నుంచి పెదపాడు మండలం వరకూ అయిదు ప్యాకేజీలు ఉండగా వీటిలో ఒకటి, మూడు ప్యాకేజీ పనులు పూర్తిచేశారు.

 

రెండో ప్యాకేజీలో వివిధ రకాల నిర్మాణాలు 31 నిర్మించాల్సి ఉండగా వీటిలో 17 పూర్తిచేశారు. మరో 13 ప్రగతిలో ఉన్నాయి.

 

27,296 క్యూబిక్‌ మీటర్లు పని చేయాల్సి ఉండగా 12400 చేశారు. 5.10 కిలోమీటర్లు లైనింగ్‌ పనికోసం 52,692 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉంది. దీనిలో 26,433 క్యూబిక్‌మీటర్లు పూర్తిచేశారు.

 

నాలుగో ప్యాకేజీలో 44 నిర్మాణాలకుగానూ 34 పూర్తికాగా మరో పది ప్రగతిలో ఉన్నాయి. ఇక్కడ 15 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనికిగానూ 12 వేల క్యూబిక్‌మీటర్ల వరకూ చేశారు.

 

11.94 కిలోమీటర్ల లైనింగ్‌ పనికిగానూ 1.18 లక్షలు క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉండగా దీనిలో 56 వేల క్యూబిక్‌మీటర్లు పూర్తయింది.

 

అయిదో ప్యాకేజీలో 23 నిర్మాణాలకుగానూ 10 పూర్తికాగా, మరో 13 ప్రగతిలో ఉన్నాయి. వీటిలో 27041 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పనికిగానూ 12,852 క్యూబిక్‌ మీటర్లు పూర్తిచేశారు. 8.05 కిలోమీటర్లు లైనింగ్‌ చేయాల్సిఉండగా దీనిలో 60,983 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉంది. దీనిలో 37389 క్యూబిక్‌మీటర్లు పని పూర్తయింది.

 

ఈ పని మొత్తం పూర్తికావాలంటే కచ్చితంగా మరో సీజన్‌ వరకూ ఆగాల్సిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పనుల్లో కీలకమైన జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న అక్విడెక్టు పని మొత్తం పూర్తిచేయడం ద్వారా ప్రధాన ఆటంకం తొలగినట్లయింది.

 

పట్టిసీమ ద్వారా త్వరలోనే నీటి ఎత్తిపోత

పట్టిసీమ ద్వారా నీరు తోడాలంటే మరో నెలరోజులు ఆగాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగడంతో నీరు ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తోడాలంటే గోదావరిలో నీటిమట్టం 14 అడుగులు ఉండాలి. ఈనేపథ్యంలో ఇక్కడ శనివారం సాయంత్రానికి ఆ మేరకు నీటిమట్టం పెరిగింది. అయితే గోదావరి జిల్లాల్లో సాగు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో అక్కడ నీటి అవసరాలు తీరాయని శివారు వరకూ నీరు వెళ్లిందని నిర్థారణ అయ్యాకే నీటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా కృష్ణాడెల్టాలో ముందుస్తు సాగుకు పట్టిసీమ ద్వారా తొలి అడుగు పడింది. దీనిపై పోలవరం కుడికాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌యాదవ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ జిల్లాలో పోలవరం కుడికాలువ పనులు చాలావరకూ పూర్తిచేశామన్నారు. గోదావరిలో సాగు అవసరాలు తీర్చాకే పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఎప్పుడు ఎత్తిపోతలను ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.

Posted

నేడు పట్టిసీమలో ట్రయల్‌ రన్‌
19-06-2017 00:57:25
గోదావరి ప్రవాహ గమనం తెలుసుకునేందుకే..
అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి వరుసగా రెండో ఏడాది కృష్ణా డెల్టాకు సాగు నీరందించేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సన్నద్ధమవుతోంది. సోమవారం ఈ పథకంలోని 24 పంపుసెట్లకూ ట్రయల్‌ రన్‌ చేయనున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. గోదావరి ప్రస్తుత నీటి మట్టం 14.9 అడుగులు ఉంది. పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే 14 అడుగుల మట్టం సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి నుంచి 2,400 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని కృష్ణా డెల్టాకు పంపితే.. ఖరీఫ్‌ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మంచి రోజు కావడంతో .. అరగంట సేపు పట్టిసీమలోని 24 పంప్‌ సెట్లనుంచి నీటిని ఎత్తిపోస్తారు. అనంతరం గోదావరి నది ప్రవాహాన్ని గమనించి.. మున్ముందు ఎత్తిపోసే వీలుందో లేదో జల వనరుల శాఖ ఓ అంచనాకు వస్తుంది. గోదావరి మట్టం పెరిగితే.. పట్టిసీమ నుంచి ఎత్తిపోతలను కొనసాగిస్తారు. ఫలితంగా కృష్ణా డెల్టా పరిధిలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరందుతుంది.

Posted

This year must achieve 100% benefits from Pattiseema..this year is very crucial to bring more positive vibrations from Delta farmers... All the very best to Water resource dept..and AP Govt.

Posted

This year must achieve 100% benefits from Pattiseema..this year is very crucial to bring more positive vibrations from Delta farmers... All the very best to Water resource dept..and AP Govt.

 

 

Brother don't expect more 65-70% ante 75+ tmc vastundi this year inka small works going on in middle 

 

Idi achieve chesthe chalu krishna, guntur, prakasham few areas ki pampochu water for farming

Guest Urban Legend
Posted

Tough IMD predicted good Monsoon...

Ippati varaku worst Monsoon in catchment areas of krishna and godavari

Chudham em avvudho..e year

Posted

Tough IMD predicted good Monsoon...

Ippati varaku worst Monsoon in catchment areas of krishna and godavari

Chudham em avvudho..e year

last year tho compare chesthe ippativaraku positive lone vunnam ee time ki :)

 

25/26th nundi start avutay ani expecting core minsoon areas lo rains

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...