Jump to content

Recommended Posts

  • 1 month later...
Posted

భోగాపురం విమానాశ్రయ స్థల సమస్యకు పరిష్కారం

వివాదాస్పద మూడు గ్రామాల్లో పరిహారం పెంపు

తాజా ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించదలచిన అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థల సేకరణలో 175.82 ఎకరాలకు సంబంధించి ఏర్పడిన సమస్యకు పరిష్కారం లభించినట్లే.. ఇందుకు అనువుగా ప్రభుత్వం ఆ భూములకు పరిహారాన్ని పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. రవడ, సవరవల్లి, ఏ.రావివల గ్రామాల్లోని ఈ భూములకు సంబంధించి పరిహారం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎకరానికి రవడలో రూ.35లక్షలు, సవరవల్లిలో రూ.36 లక్షలు, ఏ.రావివలసలో రూ.34లక్షలు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ 175.82 ఎకరాల్లో ప్రభుత్వ భూములు పోనూ రైతుల వద్ద 130 ఎకరాల భూమి వివాదంలో ఉంది.

  • 3 weeks later...
Posted

Gmr kuda UA vade kadha vasthe super

Hyd 8 yrs lo kattaru, aa exp tho idi 4 yrs lo complete chestam ani raju garu interview lo cheparu. First phase before elections complete. Cheyagalgithe too good annattu

Posted

Hyd 8 yrs lo kattaru, aa exp tho idi 4 yrs lo complete chestam ani raju garu interview lo cheparu. First phase before elections complete. Cheyagalgithe too good annattu

2019 ki first phase may not possible... But significant progress vuntundhi
Posted

bhoga1.jpg

 

ippudu una techology tho 1 year lo 1st run way ready cheyochu easy ga

 

inka remaining vi one by one chesukuntu pothe better

Posted

Single tenders kakunda multiple tenders evvali oke company work chesthe too much delay avthundhi atleast 5 infra companies ki evvali. Vallu malli yelago subs split chestharu work fast avthundhi. Main consultant correct vaadu aythe with in year ye project ayna complete avvalsindhe.

 

Japan lo 38 miles metro project 11 companies ki echaru anta 2012 lo 2014 ki operation lo ki vachai anta. So mana vallu kuda single ga l&T ki ala evvakudadhu ye line ki aa line veru veru vallaki evvali . Ekkada funds main problem central vallu involve avvali funds vishyam lo. 1&1/2 year lo metro very much possible if contract splits with new modern technology and good consultant company guidance and observations

Posted

Single tenders kakunda multiple tenders evvali oke company work chesthe too much delay avthundhi atleast 5 infra companies ki evvali. Vallu malli yelago subs split chestharu work fast avthundhi. Main consultant correct vaadu aythe with in year ye project ayna complete avvalsindhe.

 

Japan lo 38 miles metro project 11 companies ki echaru anta 2012 lo 2014 ki operation lo ki vachai anta. So mana vallu kuda single ga l&T ki ala evvakudadhu ye line ki aa line veru veru vallaki evvali . Ekkada funds main problem central vallu involve avvali funds vishyam lo. 1&1/2 year lo metro very much possible if contract splits with new modern technology and good consultant company guidance and observations

It depends on the necessity brother
Posted
ఎయిర్‌పోర్టు అథారిటీకే ‘భోగాపురం’
 
 
  • నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టి 30.2% రెవెన్యూ ఇచ్చేందుకు ఏఏఐ సుముఖం
  • గన్నవరం రన్‌వే విస్తరణకూ కేంద్రం ఓకే
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవరోధాలన్నీ తొలగిపోయాయి. రూ.2260.73 కోట్లతో నిర్మించే ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇప్పటికే పర్యావరణ, రక్షణ శాఖ అనుమతులు లభించగా... నిర్మాణ, నిర్వహణ పనులను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చేపట్టనుంది. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సోమవారం ఓపెన్‌ చేసిన ఫైనాన్స్‌ బిడ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ కార్పొరేషన్‌ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో టెండర్లను పిలిచింది. ఎయిర్‌పోర్టును నిర్మించి, నిర్వహణ బాధ్యతలు చేపడుతూనే... ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఇచ్చే విధంగా టెండర్లను పిలిచారు.
 
ఏఏఐతోపాటు విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణలో విశేషానుభవం కలిగిన జీఎంఆర్‌ సంస్థ బిడ్‌లు దాఖలు చేశాయి. ఏఏఐ 30.2ు రెవెన్యూ వాటాను ఇచ్చేందుకు ముందుకు వస్తే... జీఎంఆర్‌ సంస్థ 21.6ు మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానని ప్రతిపాదించింది. దీంతో.. ఏ-1గా నిలిచిన ఏఏఐకి ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ నిర్ణయించింది. తొలిదశలో ఎయిర్‌బ్‌స-ఏ380 విమనాలు దిగేలా ఎయిర్‌స్ట్రి్‌పను అభివృద్ధి చేస్తారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి తగ్గుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా.. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో రూ.144.93 కోట్లతో రన్‌వే విస్తరణకు కేంద్ర పర్యావరణశాఖ అమోదం తెలిపింది
Posted

భోగాపురానికి పర్యావరణ అనుమతులు

2,004 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం

రూ.2,260 కోట్ల వ్యయం

వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు

ఈనాడు, దిల్లీ, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరుచేసింది. 2,004.52 ఎకరాల్లో రూ.2,260.73 కోట్లతో చేపట్టే ఈ విమానాశ్రయం ద్వారా నిర్మాణ సమయంలో 1100 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో 500 మంది రోజువారీ కార్మికులు, 500 మంది స్థానిక కార్మికులు, వంద మంది అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభించాక వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇందులో 500 మంది శాశ్వత, 500 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటారు. ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం అటవీ, ప్రైవేటు, ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తున్నారు. ప్రతిపాదిత విమానాశ్రయం విశాఖకు 45 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తూర్పువైపున కిలోమీటరున్నర దూరంలో బంగాళాఖాతం, పశ్చిమాన కిలోమీటరున్నర దూరంలో ఐదో నంబర్‌ జాతీయ రహదారి వెళ్తుంది. ప్రతిపాదిత విమానాశ్రయ స్థలం అమతం, రావివలస, సవరపల్లి, గూడెపువలస, కంచేరు, కావులవాడ, రావడ గ్రామాల పరిధిలోకి వస్తుంది. దీని పరిధిలోకి వచ్చే కంచేరు, కావులవాడ, గూడెపువలస గ్రామాలను ఖాళీ చేయిస్తారు. ఈ విమానాశ్రయానికి విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి నీరు సరఫరా చేస్తారు. విమానాశ్రయం కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత.. రోజూ 1,576.8 కేఎల్‌డీల నీటి అవసరం ఉంటుంది. ఇందులో 872.5 కేఎల్‌డీ మంచినీళ్లు, 674.7 కేఎల్‌డీ పునఃవినియోగ నీటిని వాడుకుంటారు. విమానాశ్రయంలో ఏ380 లాంటి భారీ విమానాలూ దిగనున్నాయి. ఈ విమానాల రాకపోకల కోసం ఇక్కడ 3.8 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద రన్‌వేను నిర్మిస్తారు. తొలిదశలో ఏటా 60.60లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఈ విమానాశ్రయంలోనే 600 ఎకరాల్లో పౌరవిమానయాన ఆధారిత పరిశ్రమల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. పరిశోధన-అభివృద్ధి కేంద్రం, ప్రయోగశాలలు, మల్టీమోడల్‌, లాజిస్టిక్స్‌, ఎగ్జిబిషన్‌, సమావేశ మందిరం, విమానయాన విద్యా సంస్థ, శిక్షణ కేంద్రం, ప్రయాణికుల కోసం వినోద కేంద్రం లాంటివి ఇందులో ఏర్పాటుచేస్తారు.

విమానాశ్రయం ప్రారంభమైతే ప్రస్తుత విశాఖ విమానాశ్రయంపై ట్రాఫిక్‌ ఒత్తిడి పూర్తిగా తగ్గనుంది. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు అనుసంధానం పెరిగి వ్యాపార లావాదేవీలు విస్తరించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది. విశాఖ పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం కానుంది.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకే నిర్మాణ బాధ్యతలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ (బీఐఏసీఎల్‌) నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా దక్కించుకుంది. ‘నమూనా తయారీ, నిర్మాణం, పెట్టుబడి, నిర్వహణ, బదిలీ’ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పనులను దక్కించుకోడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, జీఎంఆర్‌ సంస్థలు పోటీ పడ్డాయి. భోగాపురం విమానాశ్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 30.2 శాతం వాటా బీఐఏసీఎల్‌కు ఇవ్వడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. జీఎంఆర్‌ సంస్థ కేవలం 21.6 శాతం ఆదాయ వాటా ఇవ్వడానికే సిద్ధమైంది. టెండర్ల ఎంపిక నిర్ణయాన్ని బీఐఏసీఎల్‌ సంస్థ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుకు తేనుంది. మంత్రివర్గం దీన్ని ఆమోదించగానే ఎయిర్‌పోర్టు అథారిటీకి నిర్మాణ పనులను అప్పగించనున్నారు.

విజయవాడ రన్‌వే విస్తరణకూ అనుమతులు

విజయవాడ విమానాశ్రయ రన్‌వే విస్తరణకూ కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరుచేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నుంచి రద్దీ పెరిగినందున బోయింగ్‌ 777, బోయింగ్‌ 747 విమానాలు తిరిగేందుకు వీలుగా ప్రస్తుతం రన్‌వేను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడినుంచి ఏటా 3.6 లక్షలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రన్‌వే విస్తరణ తర్వాత ఈ సంఖ్య 7.5 లక్షలకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం విమానాశ్రయం 531.65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుత విస్తరణ పనులకోసం మరో 698 ఎకరాలు సేకరించారు. దీంతో మొత్తం విస్తీర్ణం 1,229.65 ఎకరాలకు చేరనుంది. విస్తరణ పనుల కోసం రూ.144.93 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...