swas Posted November 25, 2016 Posted November 25, 2016 Intha long antae kastam...2 weeks long trip 8-10 hrs journey up and 2 ways ayithe 1 day. But it is mainly intended to promote internal tours with in AP
akhill Posted November 25, 2016 Posted November 25, 2016 I mean not engines we need diesel I mean solar panels on top tho fans, solar ac's, solar based cooking pettochu one time investment ya i think so. but antha surface area undakapovachu cruise lo.. lets see.
swas Posted November 26, 2016 Posted November 26, 2016 ya i think so. but antha surface area undakapovachu cruise lo.. lets see. Even in papikondalu tours lo ne now a days solar vi using no need of much space needed. Inka cruise ante easy ee
sonykongara Posted January 19, 2017 Author Posted January 19, 2017 In Gadkari speech at Davos, he said "the country is focusing big on cruise tourism" Subhas chandra&Singapore gallu Vizag-Singapore ki cruise ani 2 years back propose chesaru. AP's request got rejected in 2015 for lack of customs&immigration infra at our ports. With Gadakari latest statement He did not give details but time to consider BIG on Tourism Cruise for EAST coast(mainly Vizag) Cochin&mangalore,Mumbai already unnai kani not much on EAST coast(Except one for Kolkatta which is not good choice) Vizag&Godavari-konaseema-Yanam(All 3 risk free places for Tourists with 1 STOP) and Buddhist circuit near Krishna&Guntur with another STOP will pull crowd On the way they can have Andaman stop also India chudali chala mandi Chinese,Singapore,Thailand&Malaysia vallaki untundi. Sri lanka is expecting 300K+ only Chinese this year and we are nowhere.
sonykongara Posted March 13, 2017 Author Posted March 13, 2017 (edited) v Edited September 27, 2024 by sonykongara
sonykongara Posted January 14, 2018 Author Posted January 14, 2018 విశాఖలో నౌకా విహారం13-01-2018 23:01:59 200 కోట్లతో ప్రతిపాదనలు.. ‘కాలింగ్ పోర్టు’గా అభివృద్ధి నిర్వహణ ప్రకటన జారీ.. రెండు విభాగాల్లో పర్యాటకం కలిసి వెళ్లనున్న పోర్టు, టూరిజం విభాగాలు విశాఖపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): నౌకా విహార పర్యాటకానికి విశాఖపట్నంలో ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్న విశాఖపట్నానికి నౌకా విహారం లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఇక్కడి నుంచి అండమాన్‌కు ప్రతి నెలా ఒక ఓడను నడుపుతున్నారు. రెండు ప్రాంతాల అవసరాల కోసం తిరుగుతున్న కార్గో కమ్ పాసింజర్ నౌకగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఎవరూ దీనిని నౌకా విహారంగా భావించడం లేదు. ఆ స్థాయి కూడా దానికి లేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోర్టు ఇక్కడి నుంచి క్రూయిజ్ టూరిజానికి నడుంకట్టింది. సమగ్ర నివేదిక రూపొందిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పోర్టులు అన్నింటికీ ఒక బృందాన్ని పంపి, ఎక్కడెక్కడ ఏయే వసతులు ఉన్నాయో, నౌకా విహార పర్యాటకం ఎక్కడ అభివృద్ధి చేయవచ్చో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ బృందం మూడు నెలలు పర్యటించి దేశంలో కేవలం ఐదు పోర్టులు (ముంబై, కొచ్చిన్, గోవా, మంగుళూరు, చెన్నై) మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, ఆరవ స్థానంలో విశాఖపట్నాన్ని ‘కాలింగ్ పోర్టు’గా అభివృద్ధి చేయవచ్చునని నివేదించింది. కాలింగ్ పోర్టు అంటే...? నౌక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నపుడు మధ్యలో ఏదైనా పోర్టులో ఆగి, అక్కడ ప్రయాణికులను దించి, తిరిగి ఎక్కించుకుంటే..ఆ పోర్టును ‘కాలింగ్ పోర్టు’గా వ్యవహరిస్తారు. ఆ విధంగా విశాఖను అభివృద్ధి చేయవచ్చునని కేంద్ర బృందం పేర్కొంది. ప్రకటన జారీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఎప్పటి నుంచో పర్యాటకులకు నౌకా విహారం అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. 2016లో ఇక్కడ జరిగిన అంతర్జాతీయ నౌకాదళం యుద్ధనౌకల సమీక్ష సందర్భంగా విదేశీ నౌకల రాక కోసం ఫిషింగ్ హార్బరులో ప్రత్యేకంగా ఒక జెట్టీని అభివృద్ధి చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి దేశీయ నౌకలను నడపాలని ప్రయత్నించారు. అయితే స్థానిక మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆదిలోనే ఆగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విశాఖకు నౌకా విహారం అవసరమని, తప్పకుండా ప్రయత్నించాలని సూచించడంతో విశాఖపట్నం పోర్టు చైర్మన్ కృష్ణబాబు క్రూయిజ్‌ల నిర్వహణకు ఆసక్తిగలవారు ఎవరైనా ముందుకు రావాలని ప్రకటన జారీ చేశారు. పోర్టుకే నిర్వహణ బాధ్యత కృష్ణానదిలో ఇటీవల బోటు ప్రమాదానికి గురై, పలువురు మృతిచెందిన నేపథ్యంలో బోట్లు, నౌకల నిర్వహణ బాధ్యత అంతా అనుభవం కలిగిన పోర్టుకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విశాఖలో రూ.200 కోట్లతో నిర్మించే జెట్టీ, టెర్మినల్, నౌకల వ్యవహారాలన్నీ విశాఖపట్నం పోర్టు చూసుకుంటుంది. పర్యాటకులను ఇక్కడి నుంచి తీసుకువెళ్లి అన్నీ చూపించే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ తీసుకుంటుంది. ఈ నిర్మాణాలన్నీ రెండేళ్లలో పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని యత్నిస్తున్నారు. ఈ బాధ్యతను విశాఖపట్నం పోర్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థకు అప్పగిస్తున్నట్లు పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. దేశీయ నౌకా విహారం! విశాఖపట్నం పరిసర ప్రాంతాలను కలుపుతూ దేశీయ పర్యాటకుల కోసం అవసరమైన నౌకలను నడపడాన్ని ‘దేశీయ నౌకా విహారంగా వ్యవహరిస్తారు. విశాఖపట్నం నుంచి చిలకా సరస్సు (ఒడిషా), పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్, ఇటు అమరావతి తదితర ప్రాంతాలకు డొమెస్టిక్ క్రూయిజ్ నడపాలనే ఆలోచన ఉంది. ఇతర దేశాల నుంచి ప్రయాణికులను తీసుకొచ్చే భారీ నౌకలను ‘ఇంటర్నేషనల్ క్రూయిజ్’గా పేర్కొంటారు. మలేషియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల నుంచి ఇక్కడి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి వచ్చే నౌకలు కాలింగ్ పోర్టు అయిన విశాఖపట్నంలో ఆగి, ఇక్కడ పర్యాటకులను దించి, వారికి స్థానికంగా వున్న సింహాచలం, కైలాసగిరి, ఎర్రమట్టి దిబ్బలు, కురుసుర సబ్‌మెరైన్, తొట్లకొండ, బావికొండ వంటి చూపించి, రాత్రికి తిరిగి ఇక్కడి నుంచి పంపించే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రూ.200 కోట్లతో అభివృద్ధి విశాఖ పోర్టులో పర్యాటకానికి అనువైన జెట్టీ నిర్మాణానికి రూ.60 కోట్ల నుంచి 80 కోట్లతో ఒక టెర్మినల్, మరో రూ.100 కోట్లతో బెర్త్ నిర్మించాల్సి ఉందని పోర్టు చైర్మన్ మొవ్వా తిరుమల కృష్ణబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మొత్తం రూ.200 కోట్ల ఖర్చు లో 50 శాతం కేంద్రం, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు భరించాల్సి ఉంటుందన్నారు. ఇది పూర్తయితే దేశీయ నౌకా విహారం, ఇంటర్నేషన ల్ క్రూయిజ్ పేరిట రెండు రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు.
abhi Posted January 14, 2018 Posted January 14, 2018 Good hope 2019-2020 they will start this service Nd it will help tourism a lot
sonykongara Posted January 24, 2019 Author Posted January 24, 2019 నేడు విశాఖకు ‘సిల్వర్ డిస్కవరర్’!24-01-2019 01:46:24 100 మంది విదేశీ పర్యాటకులతో అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ విశాఖ జనవరి 23 (ఆంధ్రజ్యోతి): చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే ఘట్టానికి విశాఖ పోర్టు ఘనమైన ఏర్పాట్లు చేసిం ది. అంతర్జాతీయ పర్యాటక రంగంలో నగరాన్ని నిలపడానికి ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్ ‘సిల్వర్ డిస్కవరర్’ను గురువారం నగరానికి తీసుకువస్తోంది. ఫిషింగ్ హార్బర్ సమీపాన జనరల్ కార్గో బెర్తులో దీన్ని లంగరు వేస్తారు. రష్యాలో తయారైన ఈ క్రూయిజ్ లైనర్ అత్యంత విలాసవంతమైనది కావడం మరో విశేషం. సౌకర్యాల పరంగా 7స్టార్ రేటింగ్ లభించడంతో దీన్ని 7 స్టార్ క్రూయిజ్ లైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాల నుంచి వందమంది వరకు పర్యాటకులు ఇందులో వస్తున్నారు.
APDevFreak Posted January 24, 2019 Posted January 24, 2019 https://www.silversea.com/destinations/asia-cruise/chennai-to-yangon-9904.html
sonykongara Posted January 1 Author Posted January 1 Visakha Cruise Terminal: సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ (ఐసీటీ)గా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్)రూ.57.55 కోట్ల్శు సంయుక్తంగా నిర్మించాయి. By Andhra Pradesh News DeskUpdated : 01 Jan 2025 07:50 IST మార్చి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న టెర్మినల్‌కు ఇటీవల వచ్చి వెళ్లిన ది వరల్డ్ క్రూజ్ షిప్ ఈనాడు, విశాఖపట్నం: విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ (ఐసీటీ)గా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్)రూ.57.55 కోట్ల్శు సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో, రెండువేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్‌లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్‌లెట్‌లు, డ్యూటీఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్‌లతో టెర్మినల్ సిద్ధమైంది. 2023 సెప్టెంబరులో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ్ఞద వరల్డ్ఠ్ ఇక్కడికి వచ్చింది. 2025 మార్చి నుంచి ఇక్కడ పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్‌సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక సహా వివిధ దేశాలకు, చెన్నై, సుందర్‌బన్స్ వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి క్రూజ్‌లు నడిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నౌక ఆకారంలో విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ కొత్తగా నిర్మించిన టెర్మినల్ వద్ద డాక్ చేసిన ది వరల్డ్ క్రూజ్ షిప్ (పాత ఫొటో)
sonykongara Posted January 24 Author Posted January 24 Cruise ship: విశాఖపట్నం పోర్ట్‌కు క్రూజ్ షిప్.. ముహూర్తం ఖరారు కార్డేలియా క్రూజ్ షిప్ విశాఖపట్నం పోర్టుకు రానుంది. By Andhra Pradesh News TeamPublished : 24 Jan 2025 20:50 IST Ee Font size విశాఖపట్నం: కార్డేలియా క్రూజ్ షిప్ విశాఖపట్నం పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్ పుదుచ్చేరి, చెన్నై- విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీస్‌కు షిప్పింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈమేరకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శి టి.వేణు గోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ (ఐసీటీ)గా పిలిచే దీన్ని రూ.96.05 కోట్లతో కేంద్ర పర్యాటకశాఖ (రూ.38.50 కోట్లు), విశాఖ పోర్టు ట్రస్ట్)రూ.57.55 కోట్లతో సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని నౌక ఆకారంలో, రెండువేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూజ్‌లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్‌లెట్‌లు, డ్యూటీఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్‌లతో టెర్మినల్ సిద్ధమైంది. 2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ‘ద వరల్డ్’ ఇక్కడికి వచ్చింది. ఇది విశాఖ నగర సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు అత్యంత సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత అనువుగా ఉంటుంది
sonykongara Posted January 25 Author Posted January 25 క్రూయిజ్ షిప్ వచ్చేస్తుంది ABN , Publish Date - Jan 25 , 2025 | 01:10 AM విశాఖపట్నం పోర్టు క్రూయిజ్ టెర్మినల్ మళ్లీ కూత పెడుతోంది. పోర్టు ప్రకటన ఆగస్టు 4-22 తేదీల మధ్య నడపనున్నట్టు వెల్లడి పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు రాక ఈసారైనా కార్యరూపం దాల్చేనా? గతంలో పలుమార్లు ప్రకటనలకే పరిమితం ఏడాదిన్నర కిందట సిద్ధమైన టెర్మినల్ (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) విశాఖపట్నం పోర్టు క్రూయిజ్ టెర్మినల్ మళ్లీ కూత పెడుతోంది. క్రూయిజ్ షిప్‌లు వస్తాయని ప్రచారం చేస్తోంది. ఆగస్టు 4-22 తేదీల మధ్య మూడుసార్లు క్రూయిజ్ షిప్‌ను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పోర్టు యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఈ నౌక (పేరు ప్రకటించకపోవడం గమనార్హం) పుదుచ్చేరి-చెన్నై-విశాఖపట్నం మధ్య నడుస్తుందని తెలిపింది. క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తరువాత ఇలాంటి ప్రకటనలు చేయడం పోర్టుకు పరిపాటిగా మారింది. గతంలో సింగపూర్ క్రూయిజ్ షిప్ వస్తుందని, ముంబై మేరీటైమ్ సదస్సులో ఒప్పందం చేసుకున్నామని అధికారులు ప్రకటించారు. కానీ అది అడ్రస్ లేదు. వాస్తవానికి టెర్మినల్ నిర్మించక ముందే (2022లో) విశాఖలోని పర్యాటక సంస్థలు కార్డిలియో క్రూయిజ్ షిప్పింగ్ యాజమాన్యంతో మాట్లాడి పుదుచ్చేరి-చైన్నై-విశాఖపట్నం మధ్య ఎంప్రెస్ నౌకను నడిపించారు. ఇప్పుడూ అదేమార్గంలో నడుపుతామని పోర్టు యాజమాన్యం చెబుతున్నా ఏ షిప్ వస్తుందనే విషయం వెల్లడించలేదు. టెర్మినల్ ప్రారంభించి 16 నెలలు పూర్తి పోర్టు అధికారుల కథనం ప్రకారం క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని 3,530 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ 2,750 చ.మీ. విస్తీర్ణంలో ఉండగా, దానిని ప్రయాణికుల రాకపోకలకు ఉద్దేశించారు. ఈ టెర్మినల్‌ను ఆనుకొని 180 మీటర్ల పొడవైన బెర్త్ ఉంది. నాలుగు మూరింగ్ డాల్ఫిన్లతో కలిపి బెర్తు పొడవు 330 మీటర్ల వరకు వస్తుంది. దీని వెడల్పు 376. మీటర్లు. డ్రాఫ్ట్ 8.1 మీటర్లు. దీంతో పెద్ద పెద్ద క్రూయిజ్ షిప్‌లను కూడా తీసుకురావచ్చు. పార్కింగ్‌లో ఏడు బస్సులు, 70 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు నిలుపుకొనేలా వసతి కల్పించారు. దీనిని కేంద్ర మంత్రి చేతులు మీదుగా 2023 సెప్టెంబరులో ప్రారంభించారు. 16 నెలలు పూర్తయింది. అప్పటి నుంచి బోణీ లేదు. ఒక్క క్రూయిజ్ షిప్ కూడా రాలేదు. పోర్టు అధికారులకు దానిని ఎలా నిర్వహించాలో తెలియకపోవడమే ప్రధాన కారణమని అంటున్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులు కొందరు పలు సూచనలు చేయగా వాటిని పట్టించుకోలేదు. ఒక కమిటీని ఏర్పాటుచేసి, క్రూయిజ్ సంస్థల వద్దకు వెళ్లి, ఈ ప్రాంతం గురించి, పర్యాటక స్థలాల గురించి, టెర్మినల్ సౌకర్యం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే...కనీసం ఏడాది తరువాతైనా స్లాట్లు ఇస్తారని కొందరు సూచించగా అధికారులు పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో పైనుంచి వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక టెర్మినల్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకు అప్పగించాలని కూడా చూశారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఎవరూ ముందుకురాలేదు. దాంతో పోర్టు యాజమాన్యమే క్రూయిజ్ షిప్‌లను తీసుకురావలసిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి విశాఖపట్నం వచ్చి సమావేశం నిర్వహించడంతో విశాఖపట్నం పోర్టు ‘ఆగస్టులో క్రూయిజ్’ అంటూ ప్రకటన విడుదల చేసింది
sonykongara Posted February 13 Author Posted February 13 చెన్నై- విశాఖ - పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ నౌక ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై- విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు. By Andhra Pradesh News DeskUpdated : 13 Feb 2025 07:32 IST Ee Font size కార్డెల్లా క్రూయజ్ నౌక విశాఖపట్నం (వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై- విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు. మూడు సర్వీసుల్లో భాగంగా తొలిసారి జూన్ 30న చెన్నైలో బయలుదేరి జులై 2కు విశాఖ చేరుతుంది. జులై 2న విశాఖలో బయలుదేరి 4న పుదుచ్చేరి వెళ్తుంది. 4న పుదుచ్చేరిలో బయలుదేరి 5న చెన్నైకి చేరుతుంది. రెండో సర్వీసుగా జులై 7న చెన్నైలో బయలుదేరి 9న విశాఖకు, 11న పుదుచ్చేరి, అక్కడ నుంచి 12న చెన్నైకి వెళ్తుంది. మూడో సర్వీసుగా జులై 14న చెన్నైలో బయలుదేరి 16న విశాఖకు, అక్కడ నుంచి 18న పుదుచ్చేరి చేరుకుని, 19వ తేదీకి చెన్నైకి చేరుతుంది. బుధవారం విశాఖలో నిర్వహించిన ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు ఈ వివరాలు వెల్లడించారు.
OneAndOnlyMKC Posted February 13 Posted February 13 3 hours ago, sonykongara said: Summer holidays lo aithe inka bavuntundi ga families ki
sonykongara Posted February 18 Author Posted February 18 క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు టెండర్లు ABN , Publish Date - Feb 18 , 2025 | 01:34 AM నగరంలో పర్యాటక అభివృద్ధి కోసం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు సమర్థుల కోసం ఎదురుచూస్తోంది. మరోమారు ఆహ్వానించిన పోర్టు రెస్టారెంట్, గిఫ్ట్ షాపులు, చేతివృత్తుల కళాఖండాలు విక్రయించే షాపులు, ట్రావెల్ డెస్క్, బేకరీతో పాటు ప్రైవేటుగా బోటు జెట్టీకి కూడా అవకాశం ఇస్తామని ప్రకటన అధ్వానంగా టెర్మినల్ రహదారి దానిని బాగుచేస్తే తప్ప ఎవరూ వచ్చే పరిస్థితి లేదు విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): నగరంలో పర్యాటక అభివృద్ధి కోసం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.100 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నిర్వహణకు సమర్థుల కోసం ఎదురుచూస్తోంది. దీని నిర్మాణం పూర్తిచేసి ఏడాది దాటిపోయింది. క్రూయిజ్‌లు ఏమీ రాకపోవడంతో ఆ టెర్మినల్ అలాగే ఉంది. దేశీయ క్రూయిజ్‌లతో పాటు విదేశీ క్రూయిజ్‌లను రప్పించడానికి పర్యాటక శాఖ, టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. టెర్మినల్ నిర్వహణలో పోర్టు అధికారులకు అనుభవం లేకపోవడంతో దానిని ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. దానికి పెద్దగా స్పందన రాలేదు. సమీప భవిష్యత్తులో క్రూయిజ్‌లు వచ్చే సూచనలు లేకపోవడంతో దానిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు తాజాగా ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ జూన్‌లో కార్డెలియో సంస్థ ద్వారా మూడు ట్రిప్పులు ఓ క్రూయిజ్‌ని నడపడానికి ఒప్పించింది. అది వచ్చేలోపు ఇక్కడి పోర్టులోని క్రూయిజ్ టెర్మినల్‌లో పర్యాటకులకు అవసరమైన వసతులన్నీ సమకూర్చాలని పోర్టు అధికారులు నిర్ణయించారు. దీని కోసం తాజాగా సోమవారం టెండర్లు ఆహ్వానించారు. టెర్మినల్‌లో రెస్టారెంట్, గిఫ్ట్ షాపులు, చేతివృత్తుల కళాఖండాలు విక్రయించే షాపులు, ట్రావెల్ డెస్క్, బేకరీతో పాటు ప్రైవేటుగా బోటు జెట్టీకి కూడా అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీనికి 11 నెలల లీజు పరిమితి ఉంటుందని, ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకురావాలని కోరారు. ఆ మార్గం బాగుపడితే తప్ప ఎవరూ రారు పోర్టు అధికారులు క్రూయిజ్ టెర్మినల్‌ను పోర్టు ఆవరణలో నిర్మించారు. దీనికి వెళ్లే మార్గం చాలా దారుణంగా, అపరిశుభ్రంగా ఉంటుంది. అది ఇతరులు సంచరించడానికి అనుమతి కూడా లేని ప్రాంతం కావడం గమనార్హం. ఒంటరిగా అటు వైపు ఎవరైనా వెళితే ఏ దారుణమైనా జరిగే ప్రమాదం లేకపోలేదు. గతంలో పర్యాటక శాఖ అధికారులతో పోర్టు నిర్వహించిన సమావేశంలో ఇదే సమస్య చర్చకు వచ్చింది. టెర్మినల్‌కు వెళ్లే మార్గాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అయితే దీనిపై అధికారులు దృష్టి సారించలేదు. క్రూయిజ్‌లో వచ్చే పర్యాటకులు అందమైన విశాఖ నగరాన్ని చూడాలనుకుంటారు. వారు క్రూయిజ్ నుంచి దిగగానే ఆ దుర్గంధభరితమైన మార్గంలో నగరంలోకి వస్తే ఎంత వేగంగా వెనక్కి వెళ్లిపోదామా? అనే అభిప్రాయం కలుగుతుంది. పోర్టు అధికారులు ముందు ఆ మార్గాన్ని ఆకర్షణీయంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులూ అక్కడ కార్యకలాపాల నిర్వహణకు ముందుకువస్తారు. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now