sonykongara Posted September 1, 2016 Author Posted September 1, 2016 17 TMC datindi ippati ki,40k inflow anta.
RKumar Posted September 2, 2016 Posted September 2, 2016 20 TMC water store chesara till now? Inflow 10K cusecs kindaki vachhinatlundi.
sonykongara Posted September 2, 2016 Author Posted September 2, 2016 ‘పులిచింతల’కు మళ్లీ పెరిగిన ఇన్‌ఫ్లో విజయవాడ : పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మళ్లీ పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే రేపు సాయంత్రం వరకు వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 47.2 మీటర్లు, (17.3 టీఎంసీలు)గా ఉంది. కాగా... ఇన్‌ఫ్లో అధికంగా ఉండడంతో నల్గొండ జిల్లా మేళ్లచెర్వు మండలం చింతిర్యాల గ్రామాన్నిఅధికారులు ఖాళీ చేయించారు. గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న సంగతి తెలిసిందే.
swas Posted September 2, 2016 Posted September 2, 2016 Main thing krishna delta needs water very badly now. 17 tmc is q big one to save farm lands Try to build another barrage in amaravati and storage will be 10#15 tmc If we maintain full capacity using godavari water then only we can save krishna delta. 5tmc+45tmc+15 tmc = 65 tmc 2 times fill chesina chalu we can save water and delta
sonykongara Posted September 2, 2016 Author Posted September 2, 2016 Main thing krishna delta needs water very badly now. 17 tmc is q big one to save farm lands Try to build another barrage in amaravati and storage will be 10#15 tmc If we maintain full capacity using godavari water then only we can save krishna delta. 5tmc+45tmc+15 tmc = 65 tmc 2 times fill chesina chalu we can save water and delta 8tmc tho kadtaru anta.
sonykongara Posted September 2, 2016 Author Posted September 2, 2016 పులిచింతల.. నిండుకుండలా.. గుంటూరు, బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని కృష్ణా పరివాహక గ్రామాలలో భారీగా నీరు చేరడంతో ముంపు బాధితులు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా కృష్ణా నదిలో నీటి మట్టాలు 9 టీఎంసీల నుంచి 17 టీఎంసీలకు పెరగడంతో ముంపు గ్రామాల చుట్టూ నీరు చేరింది. పిడుగురాళ్ల రూరల్ సీఐ వై. శ్రీధర్‌రెడ్డి, బెల్లంకొండ ఎస్‌ఐ శ్రీనివాసరావు, రాజుపాలెం ఎస్‌ఐ అనిల్ కుమార్ ముంపు గ్రామాల్లో మకాం వేసి బాధితులను వారికి కేటాయించిన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు నిమగ్నమయ్యారు. కోళ్లూరు, చిట్యాల, చిట్యాల తండా, కేతవరం, కేతవరం తండా, బోధనం, కామేపల్లి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామానికి 10 మంది చొప్పున అక్కడే ఉండటంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాధితులను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎకరాకు రూ. 10 నుంచి 15 వేల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గురువారం 16.9723 టీఎంసీల నీటినిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టులో ఈ సంవత్సరంలో 30 టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టు కావడంతో 46.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అయినప్పటికీ 3 అంచెల్లో నీటిని నిల్వ ఉంచాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సీజనలో 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి రాబోయే సంవత్సరంలో పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామని తెలిపారు. డ్యామ్ రక్షణ కోసం డ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. 90 అడుగుల లోతులో 306 డ్రిల్లింగ్ హోల్స్ సిమెంట్‌తో నింపాల్సి ఉండగా ఇప్పటి వరకు 60 పూర్తయ్యాయి. 920 మీటర్ల పొడవుతో ఉన్న ప్రాజెక్టుకు 24 గేట్లు అమర్చారు. కాంట్రాక్టర్ల అలసత్వం వల్లే పనులు పూర్తి కాలేదని ప్రాజెక్టు ఎస్‌ఈ ఎం. వెంకటరమణ తెలిపారు.
mahesh1987 Posted September 13, 2016 Posted September 13, 2016 గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. గురజాల గేట్‌హల్ట్ సమీపంలోని దండివాగు ప్రవాహానికి ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు చోట్ల దెబ్బతింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ రైలును నిలిపి వేశారు. వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్ కాలనీ జలమయమైంది. పలువురు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
sonykongara Posted September 13, 2016 Author Posted September 13, 2016 పులిచింతలలోకి భారీ వరద గుంటూరు: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పులిచింతలలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. వరద కారణంగా నీటి నిల్వలు 30 టీఎంసీల వరకు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 16.8 టీఎంసీలు ఉంది. దీంతో అప్రమత్తమైన కృష్ణా, గుంటూరు, నల్గొండ కలెక్టర్లు తీర ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేయించనున్నారు.
sonykongara Posted September 13, 2016 Author Posted September 13, 2016 విజయవాడ: పులిచింతలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పల్నాడులో కురిసిన వర్షాలకు 1,30,555 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో పులిచింతల నుంచి 12,234 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ పరిణామంతో కృష్ణా, గుంటూరు, నల్గొండ కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేయించేయించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 152.56 అడుగులు కాగా, ఈ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 17.7 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.
RamaSiddhu J Posted September 13, 2016 Posted September 13, 2016 A crocodile came to my fields due to back water from pulichinthala... motor bavi daggara chusaru anta mavallu...called farest offcials..
sonykongara Posted September 13, 2016 Author Posted September 13, 2016 A crocodile came to my fields due to back water from pulichinthala... motor bavi daggara chusaru anta mavallu...called farest offcials.. paristhi ela udi bro. ma vallu nrt vellaru
RamaSiddhu J Posted September 13, 2016 Posted September 13, 2016 paristhi ela udi bro. ma vallu nrt vellaru For the first time in my life heard that total blockade from piduguralla to My mandal.....vagulu baga ponguthunnay....Bugga vagu and pillivagu pongatam valla.road block aindi...police are working no one is allowed to pass through...macherla guntur railway track 1/2 km kottukupoindi...no railway connectivity....almost all village govinda puram sink due to pulichinthala back water....reached my ucnles fields in chennaypalem...vemavaram...
sonykongara Posted September 13, 2016 Author Posted September 13, 2016 For the first time in my life heard that total blockade from piduguralla to My mandal.....vagulu baga ponguthunnay....Bugga vagu and pillivagu pongatam valla.road block aindi...police are working no one is allowed to pass through...macherla guntur railway track 1/2 km kottukupoindi...no railway connectivity....almost all village govinda puram sink due to pulichinthala back water....reached my ucnles fields in chennaypalem...vemavaram... ohh sad.
mahesh1987 Posted September 13, 2016 Posted September 13, 2016 A crocodile came to my fields due to back water from pulichinthala... motor bavi daggara chusaru anta mavallu...called farest offcials.. idi kotta emi kaadu gaa uncle aa area lo frequent gaa jaruguthuntadi gaa
AbbaiG Posted September 13, 2016 Posted September 13, 2016 reached my ucnles fields in chennaypalem...vemavaram... Are they supposed to be flooded?? Mumpu gramala avi kooda?
mahesh1987 Posted September 13, 2016 Posted September 13, 2016 Are they supposed to be flooded?? Mumpu gramala avi kooda?yes after 20 tmc anukunta
sonykongara Posted September 14, 2016 Author Posted September 14, 2016 పులిచింతలకు తగ్గిన వరద విజయవాడ: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 29,373 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 9,929 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 21.5 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 47.47 అడుగులుగా ఉంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now