sonykongara Posted September 21, 2018 Author Posted September 21, 2018 407 కోట్లు ఇచ్చేస్తారా? పులిచింతల గుత్తేదారుకు అదనంగా చెల్లిస్తారా? వచ్చే మంత్రిమండలి ముందుకు పరిహార ప్రతిపాదన న్యాయపోరాటంలో జాప్యంతో పెరిగిన వడ్డీ భారం ఒప్పంద విలువకు మించి చెల్లించాల్సిన అగత్యం ఈనాడు, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు పనులు చేపట్టిన గుత్తేదారు కంపెనీకి 27 అంశాలకు సంబంధించి రూ.407 కోట్లు అదనంగా చెల్లించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. వచ్చే మంత్రిమండలి సమావేశం ముందుకు దీన్ని తీసుకువెళ్తున్న విషయాన్ని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ధ్రువీకరించారు. పులిచింతల ప్రాజెక్టు నాణ్యతపై డ్యాం భద్రతా కమిటీ అనేక అంశాలు లేవనెత్తింది. వాటిని పరిష్కరించకపోగా ఇప్పుడు పరిహారం పేరుతో గుత్తేదారుకు రూ.407 కోట్లు చెల్లిస్తారా అన్నా అంశం చర్చనీయాంశమయింది. నాడు రూ.122 కోట్లు... నేడు 407 కోట్లు ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2012లో గుత్తేదారుకు చెల్లించాల్సిన పరిహారం కేవలం రూ.122 కోట్లు ...ఇప్పుడది రూ.407 కోట్లుగా చేరిందని అధికారులు లెక్క తేలుస్తున్నారు. విచిత్రమేమిటంటే పులిచింతల ప్రాజెక్టు పనులను ఈ గుత్తేదారు 2005లో రూ.268.86 కోట్ల ఒప్పంద విలువతో చేపట్టారు. ఇప్పుడు పరిహారమే రూ.400 కోట్లు దాటిపోయి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. 2015 నుంచి ‘ఈనాడు’ ఈ విషయంపై కథనాలు ప్రచురించింది. పరిహారంపై న్యాయ పోరాటంలో ప్రభుత్వం వెనకబడటం, జాప్యం కారణంగా వడ్డీ భారం రూ.కోట్ల మేర పెరిగిపోతుండటం లాంటి అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఏమిటీ వివాదం పులిచింతల ప్రాజెక్టులో గుత్తేదారు అధనపు ధరలు డిమాండ్ చేయడంతో తొలి వివాద పరిష్కారబోర్డు సూచన మేరకు అప్పట్లో రూ.5.62 కోట్లు చెల్లించారు. మళ్లీ గుత్తేదారు 27 అంశాలు లేవనెత్తగా రూ.95 కోట్లు చెల్లించాలని రెండో వివాద బోర్డు సూచించింది. ప్రభుత్వం వ్యతిరేకించగా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఏర్పాటై రూ.122 కోట్లు చెల్లించాలని తేల్చింది. ఏడాదికి 15శాతం వడ్డీ ఇమ్మంది. ఈ ట్రైబ్యునల్ నిర్ణయంపై న్యాయస్థానంలో సవాల్ చేయాలా లేదా అన్నది గడువు దాటిపోతున్నా ఉన్నతాధికారులు తేల్చలేదు. అయినా అప్పటి ఎస్‌ఈ తన బాధ్యతగా న్యాయస్థానంలో సవాల్ చేసేశారు. ఇదిలా ఉండగా 2014 ఫిబ్రవరి 18న గుత్తేదారుకు పరిహారం చెల్లించాలంటూ జలవనరులశాఖ ఉన్నతాధికారి మెమో ఇచ్చారు. ఆ మెమో గుత్తేదారుకు వరమైంది. ప్రభుత్వం పరిహారం ఇమ్మంటుంటే ఎస్‌ఈ సవాల్ చేయడం ఏమిటని గుత్తేదారు న్యాయస్థానంలో వాదించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం అమలు చేయాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. గుత్తేదారు లేవనెత్తిన 27 అంశాల్లోని నిబద్ధతపై న్యాయపరంగా వాదోపవాదాలు జరగనేలేదు. న్యాయస్థానం ఆదేశాల్ని సవాల్ చేసే అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీంతో గుత్తేదారు మళ్లీ న్యాయస్థానాన్ని ఆ నిర్ణయం అమలు చేయించాలంటూ ఆశ్రయించి, 31 ఎకరాల ప్రభుత్వ ఆస్తులను ఎటాచ్ చేయించారు. ఈ కేసు మళ్లీ సెప్టెంబర్ 24న విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సరైన న్యాయపోరాటం చేయలేదని, ఫైలు కొందరి వద్ద నెలల తరబడి ఉండిపోవడంతో వడ్డీ భారం కోట్ల మేర పెరిగిపోయిందని విమర్శలున్నాయి. న్యాయసలహా మేరకే ఈ విషయంపై న్యాయసలహా తీసుకున్నాం. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన మెమో బిజినెస్ రూల్స్‌కు అనుకూలంగా ఉంటే చెల్లింపులు జరపండి లేని పక్షంలో న్యాయస్థానంలో సవాల్ చేయండి అంటూ వచ్చిన సలహా మేరకే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం. మంత్రిమండలి ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం సూచించిన మేరకే ప్రతిపాదన సిద్ధం చేశాం. - శశిభూషణ్‌కుమార్, జలవనరులశాఖ కార్యదర్శి
AnnaGaru Posted September 21, 2018 Posted September 21, 2018 idi pai court ki vellina Govt ke bokka......original project clause contractor favour ga undindi..
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now