Jump to content

pulichintala project


Recommended Posts

పులిచింతలకు భారీగా వరద
 
విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి అధికంగా ఉంది. ఇన్‌ఫ్లో 2 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నీటి నిల్వ 26.75 టీఎంసీలుగా నమోదు అయ్యింది. దీంతో అధికారులు పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. వరద పరిస్థితిపై ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి నిల్వ తర్వాత గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. పులిచింతల డ్యాం వద్దకు చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు.
Link to comment
Share on other sites

 

పులిచింతలకు భారీగా వరద

 

విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి అధికంగా ఉంది. ఇన్‌ఫ్లో 2 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల నీటి నిల్వ 26.75 టీఎంసీలుగా నమోదు అయ్యింది. దీంతో అధికారులు పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. వరద పరిస్థితిపై ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. పులిచింతల ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి నిల్వ తర్వాత గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. పులిచింతల డ్యాం వద్దకు చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు.

 

3 laks touch avutaadi emo  

Link to comment
Share on other sites

పులిచింతల ప్రాజెక్టు 10గేట్లు ఎత్తివేత

గుంటూరు(కలెక్టరేట్‌): ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 10 గేట్లను 4మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. జలాశయానికి 4.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 2.5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించామని, వారికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Link to comment
Share on other sites

4.6 laks aaa almatti ki kuda raledu gaa saami antha flow

 

Guntur and nalgonda allakallolam ayyuntay

 

 

Almost equal to pulichintala dam storage but this year 30tmc ee kada already 25tmc already undi inko 5 tmc catch chesi remaining all into prakasham barrage ki releasing

Link to comment
Share on other sites

పులిచింతల ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో
 
636101672187034066.jpg
గుంటూరు : భారీ వర్షాలతో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అతలాకుతలమవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. జనావాసాలను ముంచెత్తడంతో పాటు నడికుడి మార్గంలో రైల్వేట్రాక్‌ మీదగా ప్రవహిస్తున్నాయి. పల్నాడులో సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా 4,06,276 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజ్‌కు, అక్కడి నుంచి సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. బ్యారేజ్‌ దిగువున లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎద్దువాగు, నాగులేరు, చంద్రవంక, ఎర్రవాగు, వెన్నాదేవి, అనుపాలెం, ముప్పాళ్ల, జొన్నలగడ్డ, కొప్పగంజి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. బెల్లంకొండ - పిడుగురాళ్ల మధ్య రైల్వేట్రాక్‌ కొట్టుకుపోవడంతో గుంటూరు - నడికుడి - సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగించాలని, సిబ్బందిలో స్ఫూర్తి, ఏకాగ్రత నింపుతూ పనులు చేయించాలన్నారు. ప్రజలకు మేమున్నామన్న భరోసా ఇవ్వగలగాలని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా కూడా కలెక్టర్‌తో మాట్లాడి మార్గమధ్యలో నిలిచిపోయిన ఫలక్‌నుమా, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

పులిచింతలకు భారీగా వరద.. 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల 

 

జిల్లా మేళ్లచెర్వు మండలంలోని వజినేపల్లి పరిధిలో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. ఎగువన భారీగా వర్షాలు కురవడంతో గురువారం భారీగా నీరు వచ్చి చేరింది. పులిచింతలకు ఇన్‌ ఫ్లో 3లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. 15 గేట్లు ఎత్తి 3లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలను సందర్శించేందుకు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. పులిచింతలలో 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతుండటం ఇదే మొదటి సారి.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...