Jump to content

BRS ventures to invest 12000cr in AP


Recommended Posts

I expect 5000 beds hospitals in next 2 years ravochu and in 5 years lo 10,000 bed super specality hospitals on the way

endadi 5k..10k..

Link to comment
Share on other sites

Guest Urban Legend

very important and necessary for us. edi jarigina immediate ga chennai, hyderabad, bangalore velle pani lekunda amaravathiki ravochu.

 

 

anni hyderabad lo pettukoni maaku anyayam ani comedy yedaithey vundho ...too much le bro tg janam

Link to comment
Share on other sites

13055302_1286153874731534_23042574986134

 

ఏపీలో ఎన్ ఎం సి పెట్టుబడులు 
4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అతిపెద్ద ఆరోగ్య సేవల సంస్థగా పేరు గాంచిన న్యూ మెడికల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంసీ) ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయమై ఎన్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ బీఆర్‌ శెట్టి మే 2వ తేదీన ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎన్‌ఎంసీ సంస్థ రెండు దశల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 4,500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్మించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో అమరావతిలో 1400 పడకల ఆసుపత్రి, కర్నూలులో 300 పడకల ఆసుపత్రి నిర్మించనుంది. ఇదే దశలో అమరావతిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌ తో పాటు ఒక అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్మాణాలన్నింటినీ 2019లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,800 పడకల స్థాయి ఆసుపత్రులు, వైద్య పరికరాలు, ఔషధాల తయారీ సంస్థలను ఏర్పాటు చేయనుంది.

Link to comment
Share on other sites

అబుదాబికి చెందిన బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఆంధ్రప్రదేశ్ లో రూ.12000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అధినేత డీఆర్‌ శెట్టి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో హెల్త్‌కేర్‌, పర్యాటక రంగాలలో పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ డిసెంబర్ 2018 నాటికి ఏపీలో 3,500 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రులను నిర్మించనుంది. అమరావతి పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పనుంది. రాష్ట్రంలో హెల్త్ టూరిజం అభివృద్ధికి సహకరించనుంది.

13094114_1289069151106673_21661195484341

Link to comment
Share on other sites

రాష్ట్రానికి 12వేల కోట్ల పెట్టుబడి
 
635978362760966307.jpg
  • అమరావతిలో వైద్య పరిశోధన కేంద్రం
  • మెడికల్‌ నాలెడ్జ్‌ ఔట్‌సోర్సింగ్‌ సెంటర్‌ కూడా
  • కృష్ణానదీ ద్వీపంలో గోల్ఫ్‌ కోర్సులు
  • స్మార్ట్‌ హౌసింగ్‌కు మౌలిక సదుపాయాలు
  • ఏపీతో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఒప్పందం
విజయవాడ, మే 2: రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయి. సుమారు రూ.12వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీకి చెందిన బీఆర్‌ షెట్టీ వెంచర్స్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ.. పర్యాటకం, గృహనిర్మాణం, మౌలికసదుపాయాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒప్పందంలో పేర్కొంది. ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటినీ 2018 నాటికి పూర్తిచేస్తామని బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది.
 
బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ తరఫున ఆ సంస్థ ప్రచాకర్త, చైర్మన బీఆర్‌ షెట్టీ, ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణ కిషోర్‌ పరస్పర అవగాహన ఒప్పందపత్రంపై సంతకాలు చేశారు. వీలైనంత వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన భూములు, అనుమతులు త్వరగా ఇస్తామని సీఎం చంద్రబాబు... బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌కు హామీ ఇచ్చారు.
 
ఒప్పందంలోని వివరాలు
  • 2018 నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మొత్తం 3500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు నిర్మిస్తుంది.
  • అమరావతిని హెల్త్‌ కేర్‌ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా అక్కడ సూపర్‌ స్పెషలైజేషన, మెడికల్‌ టూరిజంతో 1500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తారు.
  • కర్నూలు డెవలపింగ్‌ ఇండస్ర్టియల్‌ ఎకో సిస్టం సహకారంతో కర్నూలులో 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు.
  • హరిత స్మార్ట్‌ గృహనిర్మాణానికి బీఆర్‌ఎస్‌ మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత తీసుకుంటుంది. గృహనిర్మాణ ప్రాజెక్టుల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 1700 పడకలు ఉండే ఆస్పత్రులు నిర్మిస్తారు.
  • అమరావతిలో అంతర్జాతీయ వైద్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు. వైద్య పరిశోధనలను మెరుగుపరిచే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు. ఆసియాలోనే ఇది మొదటిది.
  • గ్లోబల్‌ ఎల్‌వీవై లీగ్‌ యూనివర్సిటీ నాలెడ్జ్‌ పార్టనర్‌గా ఏపీలో అంతర్జాతీయ స్థాయి మెడికల్‌ యూనివర్సిటీ, ఔషధాల తయారీ కేంద్రం ఏర్పాటు.
  • అమరావతిలో మెడికల్‌ నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ సెంటర్‌ నిర్మాణం. దీనివల్ల ప్రపంచంలోని అన్ని మెడికల్‌ ఇనస్టిట్యూషన్లు, కార్పొరేషన్లకు మెడికల్‌ నాలెడ్జ్‌ను అందించే సామర్థ్యం ఏపీకి లభిస్తుంది.
  • అమరావతి సమీపంలోని కృష్ణా నదీ ద్వీపంలో 18-గోల్ఫ్‌ కోర్సు ప్రాజెక్టుల నిర్మాణం. ఇందులో భాగంగా ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌, కన్వెన్షన సెంటర్‌ నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

BRS Ventures, AP ink MoU for investment of Rs. 12,000 cr in Amaravati

MoU_2838398f.jpg
 
Hyderabad, May 3:  

BRS Ventures of Abu Dhabi and Andhra Pradesh Government have inked a memorandum of understanding (MoU) which entails an investment of Rs. 12,000 crore in healthcare, setting up of a university, tourism, hospitality and infrastructure in the new capital city of Amaravati.

Dr. BR Shetty, a businessman from Abu Dhabi has committed an investment of $ 1.8 Billion (about Rs. 12,000 crore) in Andhra Pradesh. Shetty has business interests in hospitals (NMC Group of Hospitals), hospitality, educational institutions, financial services (UAE Exchange and Travelex), pharmaceuticals (Neopharma), ports, infrastructure and other businesses.

The MoU was inked by BRS Ventures represented promoter Dr. B.R. Shetty, Chairman, BRS Ventures and the Andhra Pradesh Government represented by J. Krishna Kishore, IRS, CEO, Economic Development Board, Government of Andhra Pradesh.

State Chief Minister N Chandrababu Naidu wanted BRS Ventures to quickly complete the projects assuring the land allotment and clearances will be accorded at the earliest.

The investments include setting up of a 3500-bed hospital. Of this, by December 2018, a 1500-bed hospital will come up in Amaravati. The health care facilities will follow a hub and spoke strategy which ensures that everybody in the region gets comprehensive health care coverage.

Other initiatives include a 300 bed hospital in Kurnool, a medical analytics centre and the Asia’s first quantum computing centre in Amravati with a focus on medical research enhancement, to be completed by December 2018.

As a part of the investments, other initiatives include, setting up of a Medical University in collaboration with a global Ivy League university as a knowledge partner, a pharmaceutical manufacturing unit in AP, a Knowledge process outsourcing centre, to be set up by December 2018.

The Amaravati medical Knowledge Process Outsourcing Centre will become the backbone knowledge provider to a large number of medical institutions and corporations across the globe. The investment company has proposed a golf course and an integrated hospitality ecosystem in Amaravati, preferably in one of the river islands of the Krishna river, to be completed in Phase II.

A hospitality ecosystem in amalgamation with our golf course project in form of a 5 star hotel along with a convention centre will be set up in phase I and II, to cater to the growing needs of this upcoming iconic city of Amaravati.

(This article was published on May 3, 2016)
Link to comment
Share on other sites

Sony bro, couple more updates 

 

1)  http://www.business-standard.com/article/companies/instant-coffee-maker-ccl-products-to-invest-40-million-on-a-green-field-plant-116050300674_1.html

 

Coffee processing in Chittoor. Chittoor lo coffee pandistara?

 

2) http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=94934&sid=1

 

Andhra medical zone completed registration officially at center

Link to comment
Share on other sites

635981752403939009.jpg

 

  • తొలుత 12,000 కోట్ల పెట్టుబడులు...
  • మున్ముందు మరిన్ని పెట్టుబడులకు రెడీ
  • ఆంధ్రజ్యోతితో యుఎఇ పారిశ్రామిక దిగ్గజం బిఆర్‌ షెట్టి

డబ్బు కంటే సేవ ముఖ్యం.. 
నేను ఏ వ్యాపారమూ కూడా డబ్బు సంపాదన లక్ష్యంగా ప్రారంభించలేదు. దేశానికి సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి. నాణ్యమైన సేవలు అందించాలి. ఎండ్‌ రిజల్ట్‌ ఈజ్‌ మనీ. డబ్బే మనల్ని ఫాలో అవుతుంది. 
 

విజయవాడ (ఆంధ్రజ్యోతి): బిఆర్‌ షెట్టి.. పారిశ్రామిక ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన షెట్టి దశాబ్దాల క్రితం అబుదాబి వెళ్లారు. ఆ నగరాభివృద్ధితో సమాంతరంగా ఎదుగుతూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. బిఆర్‌ఎస్‌ వెంచర్స్‌, ఎన్‌ఎంసి గ్రూప్‌ ఆసుపత్రులు, హోటళ్లు, విద్యా సంస్థలను నెలకొల్పారు. నియో ఫార్మా పేరిట ఆ రంగంలోనూ కాలు మోపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఈయన ప్రారంభించిన మరో సంస్థ ట్రావెలెక్స్‌.. విదేశాల్లో సంపాదించిన ధనాన్ని సొంత దేశాలకు పంపించేవారికి పెద్ద వేదికగా మారింది. అబుదాబి అత్యున్నత పురస్కారాన్ని పొందిన షెట్టికి.. భారత ప్రభుత్వం కూడా ప్రవాస భారతీయ సమ్మాన్‌ పురస్కారం, ఆ తర్వాత పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.
 
ఈ నెల రెండో తేదీన షెట్టి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఓ భారీ ఒప్పందాన్ని చేసుకున్నారు.
 
అమరావతి కేంద్రంగా వివిధ రంగాల్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ సిఇఒ కృష్ణ కిశోర్‌తో బిఆర్‌ షెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ షెట్టి..‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 40 ఏళ్ల క్రితం అబుదాబిని ఇప్పటి అమరావతితో పోల్చిన షెట్టి... భవిష్యత అమరావతిలో ప్రస్తుత అబుదాబిని చూడగలుగుతున్నానని వ్యాఖ్యానించారు.
 
 

అప్పుడు అబుదాబి... ఇప్పుడు అమరావతి 

నేను మొదట అబుదాబి వెళ్లా. అప్పుడు అబుదాబి కూడా ఇంతే (ఇప్పుడు అమరావతిలా) ఉంది. అభివృద్ధి లేదు. ఆ నగరం అభివృద్ధిలో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈ రోజు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అబుదాబి ఒకటి. ఇక్కడ చంద్రబాబు ఒక రాష్ట్రాన్ని నిర్మించే సవాలును స్వీకరించారు. ఏ రాష్ట్ర అభివృద్ధిలోనైనా మొదట జాగ్రత్త తీసుకోవలసింది విద్య, వైద్య రంగాలపైనే. నేను ఆ రంగానికే చెందినవాడిని కాబట్టి వచ్చాను. నాకు ప్రపంచ వ్యాప్తంగా 38 ఆసుపత్రులున్నాయి. మాది లండన్‌ లిస్టెడ్‌ కంపెనీ. మా మార్కెట్‌ విలువ 340 కోట్ల డాలర్లకంటే ఎక్కువ. వీటికితోడు ఫార్మా, ఇన్వెన్షన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌. మిత్సుబిషి కార్పొరేషన్‌ నాతో భాగస్వామి కానుంది. అమెరికాలోని అత్యుత్తమ యూనివర్సిటీ, ఆసుపత్రులను కూడా భాగస్వాములను చేస్తా. నేను షార్ట్‌లిస్ట్‌ చేసిన సంస్థలలో శాన్‌డియాగో యూనివర్సిటీ ఒకటి. అలాంటి విశ్వవిద్యాలయం ఇక్కడకు రావడం అంటే... ప్రపంచ వ్యాప్త విద్యార్ధులు చదువుకోవడానికి ఇక్కడికే వస్తారు.
 
 

రూ.12 వేల కోట్లతో ఆగదు.. 

ఒప్పందంలో లేని రంగాలు కూడా మా ప్రణాళికలో ఉన్నాయి. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అందులో ఒకటి. వివిధ పనులు చేసేవారికి కూడా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నగర పారిశుధ్యం చాలా ముఖ్యమైనది. అవన్నీ ఎంఒయులో రాయాల్సిన అవసరం లేదు. ఎంఒయులో రూ.12 వేల కోట్లు మాత్రమే పేర్కొన్నాం. అంటే 180 కోట్ల డాలర్లు. అది 250 కోట్ల డాలర్లకు వెళ్లొచ్చు. డబ్బు ముఖ్యం కాదు.
 
 

ఐలాండ్‌లో గోల్ఫ్‌ కోర్స్‌.. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్‌ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్‌ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్‌’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్‌గానే పని చేస్తా. ఒకహోటల్‌, సిపిటి ఏరియా, షాపింగ్‌ మాల్‌, ఆసుపత్రి ఉంటాయి.
 
 

ఆరు గంటల్లోనే కల్చర్‌ ఫలితాలు.. 

వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో అధునాతన పద్ధతులను ప్రవేశపెడతాం. కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌కు ఇప్పుడు మూడు రోజుల సమయం పడుతోంది. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటే తెలుసుకోవడానికి... దానికి విరుగుడుగా ఏ మందు వాడాలో నిర్ణయించడానికి మూడు రోజులు ఆగాలన్నమాట. నా దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆరు గంటల్లో ఈ పని చేయవచ్చు. ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.
 
 

అబుదాబి ప్రభుత్వం కూడా.. 

భవిష్యత అమరావతిలో అబుదాబి తరహా అభివృద్ధిని నేను ఇప్పుడే దర్శిస్తున్నా. అబుదాబి ప్రభుత్వంతో, రాజకుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తన తరఫున అబుదాబి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చి ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అవకాశాలను చూడాలని అబుధాబి ప్రభుత్వాన్ని కోరతా. ఇందులో భాగస్వాములయ్యేందుకు వారు సంతోషంగా ఒప్పుకుంటారు. వారు ఉదార స్వభావులు, సహనశీలురు. నీటి సరఫరా, తాగునీరు, రోడ్లు, ఎయిర్‌పోర్టుల వంటివి వారు చాలా చేయగలరు.
 
 

మొదటి దశలో 1800 పడకలు.. 
రాష్ట్రంలో 3,500 పడకలతో ఆసుపత్రులు నిర్మిస్తాం. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలలో కూడా ఆసుపత్రులు వస్తాయి. మొదటి దశలో భాగంగా అమరావతిలో 1500 పడకలు, కర్నూలులో 300 పడకలతో ఆసుపత్రులను నిర్మిస్తాం. మొదటి దశలో అమరావతిలో 300 పడకలు, కర్నూలులో 50 పడకలు ఏర్పాటు చేస్తాం. అనుమతులు వచ్చినప్పటినుంచి రెండేళ్లలో మొదటి దశ (మొత్తం 1800 పడకలు)పూర్తవుతుంది. కేరళ, రాయ్‌పూర్‌లలో నాకు ఆసుపత్రులున్నాయి. నేపాల్‌, ఈజిప్ట్‌, సౌదీ, ఒమన్‌ వంటి దేశాల్లోనూ ఆసుపత్రులున్నాయి. రీసెర్చ్‌ సెంటర్‌ మాత్రం కేవలం అబుదాబిలోనే ఉంది.

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్‌ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్‌ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్‌’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్‌గానే పని చేస్తా. ఒకహోటల్‌, సిపిటి ఏరియా, షాపింగ్‌ మాల్‌, ఆసుపత్రి ఉంటాయి.

 

 ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.

 

Padmashree BR Shetty ki Jai. Islands in Krishna are our main investment for Amaravati growth

Those are gods gift for Amaravati and even Gujarat River Front,Gift city location does not have them.

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ఐలాండ్‌ నాకు ఇచ్చారు. అందులో గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేస్తా. ఒక టూరిజం సెంటర్‌ కూడా.... చంద్రబాబు ఎక్సలెంట్‌’కు తక్కువగా దేన్నీ ఆమోదించరు. కాబట్టి నేను ఎక్సలెంట్‌గానే పని చేస్తా. ఒకహోటల్‌, సిపిటి ఏరియా, షాపింగ్‌ మాల్‌, ఆసుపత్రి ఉంటాయి.

 

 ఐదు నుంచి ఆరు గంటల్లోనే కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ సత్ఫలితాలు వస్తాయి. ఇది కొత్త టెక్నాలజీ. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిసే్ట్రషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందినది. భారతలో ఇది ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి. అమరావతిలో నేను నెలకొల్పబోతున్న పరిశోధనా కేంద్రం, లేబొరేటరీ వంటిది మరెక్కడా లేదు. ఒక్క అమెరికాలో తప్ప.

 

Padmashree BR Shetty ki Jai. Islands in Krishna are our main investment for Amaravati growth

Those are gods gift for Amaravati and even Gujarat River Front,Gift city location does not have them.

 

 

epaper clipping veddaam ani try chesaa brother - complete page vastundi kanee - cutting okkatey raa ledu

Link to comment
Share on other sites

  • 4 months later...
సీమ, ఉత్తరాంధ్రలోనూ ఆస్పత్రులు
 
636103656984013248.jpg
  • విశాఖలో ఫార్మా కంపెనీ.. బీఆర్‌ శెట్టి అంగీకారం
  • నెలలోగా అమరావతిలో భూమి: సీఎం
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): నూతన రాజధాని అమరావతితోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర నగరాల్లోనూ ఆస్పత్రులను నిర్మించడానికి అబుదాబికి చెందిన బడా వ్యాపారి బీఆర్‌ శెట్టి ముందుకొచ్చారు. అమరావతితోపాటు సీమలోని కర్నూలులో ఆస్పత్రి నిర్మాణానికి ఇదివరకే అంగీకారం కుదరగా... ఇప్పుడు మరికొన్ని నగరాల్లో ఆస్పత్రులను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు చేసిన సూచనకు శెట్టి అంగీకారం తెలిపారు. ఒక్కో చోట 300 నుంచి 500 పడకలతో ఆస్పత్రి నిర్మించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆరోగ్య, ఆహ్లాద కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం-బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ మధ్య గతంలోనే ఓ భారీ అవగాహన ఒప్పందం కుదిరింది. అమరావతిలో 3,500 పడకలతోనూ, కర్నూలులో 300 పడకలతోనూ ఆస్పత్రులను నిర్మించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తంగా రూ.12 వేల కోట్ల మేరకు పెట్టుబడి పెడతామని అప్పట్లో శెట్టి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించిన సవివరమైన ప్రతిపాదనలతో ఆయన శనివారం ఉదయం సీఎంను కలిశారు. విశాఖపట్నంలో నియో ఫార్మాస్యూటికల్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ఈ భేటీలో అంగీకారం కుదిరినట్టు తెలిసింది. గతంలో అంగీకారం కుదిరిన ప్రాజెక్టుల పనిని ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాజధాని అమరావతి ప్రాంతంలో ఎంత త్వరగా భూమిని అప్పగిస్తే అంత త్వరగా నిర్మాణాలను ప్రారంభిస్తామని సీఎంతో శెట్టి చెప్పారు. అమరావతి ప్రాంతంలో తాను తొలిగా నిర్మాణం చేపట్టబోయే ప్రాజెక్టు... మెడికల్‌ యూనివర్సిటీయేనని తెలిపారు. కాగా, మరో నెలలోగా భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. బీఆర్‌ శెట్టి గ్రూపు సంస్థలకు అమరావతి ప్రాంతంలో 200 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధానితో సహా రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలపై పశ్చిమాసియా దేశాల పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారని చంద్రబాబుతో శెట్టి అన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...