Yaswanth526 Posted March 30, 2019 Posted March 30, 2019 #Vijayawada Airport February month DGCA numbers are out Total Passengers: 92,989 Total Freight: 137.9 Tonnes Total Mail: 16.8 Tonnes
Yaswanth526 Posted March 30, 2019 Posted March 30, 2019 Vijayawada City @BZAUpdates Vijayawada Airport Passenger Stats : February 2019 : 1,100 + 91,303 (Int+Dom) Stats from April 2018 - February 2019 Domestic Passengers : 10,79,692 International Passengers : 5,268 (From Dec 2018) Total Passengers : 10,84,960 (66.6%) Officially Crossed 1 MILLION MARK
Yaswanth526 Posted March 30, 2019 Posted March 30, 2019 Vijayawada City @BZAUpdates The Phenomenal growth of VGA Airport over past 5 years - Thanks to State Govt for Acquiring addition 873 Acres for Airport development - Airport has seen a Rapid development when Ashok Gajapathi Raju Garu served as Aviation Minister & after that Progress is in snail pace
Yaswanth526 Posted April 18, 2019 Posted April 18, 2019 (edited) Edited April 18, 2019 by Yaswanth526
sonykongara Posted April 18, 2019 Author Posted April 18, 2019 గన్నవరం.. గణనీయం ప్రయాణికుల వృద్ధిలో అందనంత ఎత్తుకు 2018-19లో ప్రయాణించిన 11.91లక్షల మంది గత ఏడాదితో పోలిస్తే 4.41లక్షల పెరుగుదల ప్రయాణికుల రాకపోకల్లో ఏటేటా గన్నవరం విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. 2018-19 ఏడాదిలో 11,91,439మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించినట్టు అధికారులు లెక్కలు తేల్చారు. 2018 ఏప్రిల్ 01 నుంచి 2019 మార్చి 31 మధ్య వీరు రాకపోకలు సాగించారు. అంతకుముందటి ఏడాది కంటే.. 4.41లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. 2017-18 మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి 7.5లక్షల మంది రాకపోకలు సాగించారు. ప్రయాణికులతో పాటూ రాకపోకలు సాగించే విమాన సర్వీసుల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది 21,169 విమాన సర్వీసులు రాకపోకలు సాగించాయి. గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే విమానాశ్రయానికీ సాధ్యంకాని రీతిలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 9లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే.. అంచనాలను సైతం తారుమారు చేస్తూ.. అనూహ్యంగా 11.91లక్షలు దాటారు. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులతో పాటూ.. దేశంలోని తొమ్మిది నగరాల నుంచి ఇక్కడికి వచ్చేవారు సైతం అత్యధికంగానే ఉన్నారు. ఈ ఏడాది 6.15వేల మంది ఇతర నగరాల నుంచి విజయవాడకు చేరుకోగా.. ఇక్కడి నుంచి 5.75లక్షల మంది వెళ్లారు. ప్రస్తుతం రోజుకు 3264మంది, నెలకు 99,287మంది ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. విమానాశ్రయం నుంచి ఏ నగరానికి నూతన సర్వీసులు ఆరంభమైనా.. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి. 2018-19లో ప్రయాణికులు, సర్వీసులు.. మొత్తం ప్రయాణికులు: 11.91లక్షలు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు (డిపార్చర్): 5.75లక్షలు ఇతర నగరాల నుంచి వచ్చినవాళ్లు(అరైవల్): 6.15లక్షలు రోజుకు ప్రయాణికులు: 3264 నెలకు ప్రయాణికులు: 99,287 మొత్తం విమాన సర్వీసులు: 21,169 ఇక్కడి నుంచి వెళ్లినవి: 10,582 ఇతర నగరాల నుంచి వచ్చినవి: 10,587 రోజుకు సర్వీసులు: 58 నెలకు సర్వీసులు: 1764 డిసెంబర్ నుంచి నడిచిన అంతర్జాతీయ సర్వీసులు: 68 రాకపోకలు సాగించిన అంతర్జాతీయ ప్రయాణికులు: 6254
ravikia Posted April 18, 2019 Posted April 18, 2019 We fly from London twice an year. From past 3 years we have been flying only to and from Vijaywada. Vijaywada-Delhi-London. Sooper connectivity. Chakkaga intlo T taagi flight ekkochu, so much convenient and good service 👍 Raaz@NBK, Ntr-Cbn-Nbk, RamaSiddhu J and 1 other 4
sonykongara Posted April 22, 2019 Author Posted April 22, 2019 అంతర్జాతీయం అదరహో... సింగపూర్ సర్వీసులకు భారీ డిమాండ్ అలవాటుపడిన దేశ, విదేశీ ప్రయాణికులు దుబాయి విమానం కోసం ఎదురుచూపులు ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఒక్క సింగపూర్‌కు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తుండగా వాటికి సైతం మంచి డిమాండ్ ఉంటోంది. ప్రతి మంగళ, గురువారాల్లో సింగపూర్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. గత డిసెంబర్ 4వ తేదీ నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆరంభమయ్యాయి. మార్చి నెలాఖరు వరకూ.. మూడు నెలల్లో 68 అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు సాగించాయి. వీటిలో సగం విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లగా.. మిగతా సగం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. 68 సర్వీసుల్లో ఇప్పటివరకూ.. 6254 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అంటే ప్రతి సర్వీసులోనూ 100 మందికి తక్కువ కాకుండా ప్రయాణికుల డిమాండ్ ఉంటోంది. మొదట్లో విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లే ప్రయాణికుల కంటే అటు నుంచి ఇటు వచ్చేవారే అధికంగా ఉండేవారు. ప్రస్తుతం.. ఇటు నుంచి వెళ్లేవాళ్లు, అటు నుంచి వచ్చే వాళ్లు ఒకేలా ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు విదేశాలలో భారీ సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గన్నవరం నుంచి ప్రారంభమైన అంతర్జాతీయ విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ నెలకొంది. సీజన్‌తో సంబంధం లేకుండా.. అంతర్జాతీయ సర్వీసుల టిక్కెట్లకు డిమాండ్ ఉంటోంది. నాలుగు జిల్లాలకు సమీపంలోనే గన్నవరం విమానాశ్రయం ఉండటంతో.. ఇక్కడికే వచ్చి సింగపూర్ సర్వీసులను అందుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి వారు వెళ్లాల్సిన దేశాలకు చేరుకుంటున్నారు. సింగపూర్ సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకంగా వెళ్లి వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. గన్నవరం నుంచి మంగళ, గురు వారాల్లో సాయంత్రం 6.40కు బయలుదేరి సింగపూర్‌కు రాత్రి 10.40కు చేరుతుంది. ఇండిగో విమానయాన సంస్థ ఈ సర్వీసులు నడుపుతోంది. టిక్కెట్ ధర రూ.7,500 నుంచి రూ.10,422గా నిర్ణయించారు. సింగపూర్‌లోనూ మంగళ, గురువారాల్లో ఉదయం 11.40కు బయలుదేరి.. గన్నవరానికి మధ్యాహ్నం 3.45కు చేరుతుంది. నేరుగా గన్నవరం నుంచి సింగపూర్‌కు నాలుగు గంటల్లో ఈ సర్వీసులో చేరిపోవచ్చు. గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌కు సర్వీసులను అందుకోవాల్సి వచ్చేది. దీంతో ఆయా నగరాలకు వెళ్లడానికే సమయం ఎక్కువ అయ్యేది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేవారి సంఖ్య పెరిగింది. పరిమితంగానే నడుస్తున్నా.. ప్రస్తుతం వారంలో మంగళ, గురు రెండు రోజులు మాత్రమే సర్వీసులు ఉన్నాయి. అదే నిత్యం అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమైతే అంతర్జాతీయ డిమాండ్ భారీగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణికులంతా.. మంగళ, గురువారాల్లో వెళ్లేందుకు వేచి ఉండటం కుదరదు. అందుకే.. ఇప్పటికీ హైదరాబాద్ సహా ఇతర నగరాలకు వెళ్లి అక్కడి నుంచే సర్వీసులను అందుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దుబాయి వంటి దేశాలకు సైతం సర్వీసులను త్వరగా ఆరంభించాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట దుబాయి సర్వీసు కోసం టెండర్లను ఆహ్వానించింది. సింగపూర్ మాదిరిగానే వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పద్ధతిలో దుబాయి సర్వీసులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. విమానయాన సంస్థలు ఏవీ ముందుకు రాలేదు. దీంతో గడువు పొడిగించినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలోనూ కొన్ని అడ్డంకులు ఉండటంతో దుబాయి ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చాక దుబాయి సర్వీసుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. దుబాయి సర్వీసు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుంది.
sonykongara Posted April 24, 2019 Author Posted April 24, 2019 విమాన సర్వీసులు ఎనీ టైం.. 24-04-2019 08:23:33 24/7 ఆపరేషన్స్‌కు విజయవాడ ఎయిర్‌పోర్టు సంసిద్ధం నాలుగు దశలలో ప్రమాణాలు మెరుగు నైట్‌ల్యాండింగ్, ఐఎల్‌ఎస్ వ్యవస్థల ద్వారా ఐదేళ్ల కిందటే బీజం మూడు షిఫ్టులలో స్టాఫ్ పనిచేసేలా ఏఏఐ చర్యలు దేశీయంగా ఇక అర్ధరాత్రుళ్లు విమానాలు నడిపే అవకాశం ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఒకేసారి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తీపి కబురు అందించారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక మీదట ఈ ఇబ్బంది లేదు. పగలు, మధ్యాహ్నం, రాత్రిపూటే కాకుండా అర్థరాత్రుళ్లు, వేకువ ఝామున కూడా నిరభ్యంతరంగా విమానాలు నడుపుకోవచ్చు. విజయవాడ (ఆంధ్రజ్యోతి): కేవలం 12 గంటల ఆపరేషన్ ముద్ర వేసుకున్న విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఇక ఆ ముద్ర చెరిగిపోనుంది. విమానాశ్రయ ఉన్నతాధికారులు దశల వారీగా అవలంభించిన విధానాలు, తలపెట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాల ఫలితంగా విజయవాడ ఎయిర్‌పోర్టును 24 గంటల పాటు నిర్వహించటానికి అవకాశమేర్పడింది. ఐదేళ్ల కిందటే విజయవాడ విమానాశ్రయాన్ని రాత్రుళ్లు కూడా పనిచేయించటానికి బీజం పడింది. అప్పట్లో నైట్ ల్యాండింగ్ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతం సాధించారు. రాత్రుళ్లు విమానాలు సురక్షితంగా ల్యాండింగ్, టేకాఫ్ కావటానికి ఇన్‌స్ర్టుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్‌ఎస్) ఏర్పాటు చేశారు. రాత్రుళ్లు విమానాలు నడపటానికి అవకాశం చిక్కినా... రాత్రి 10 గంటలకు దుకాణం కట్టేసుకోవాల్సి వచ్చేది. సిబ్బంది కొరత, విమాన యాన సంస్థల అనాసక్తి, రన్‌వే పటిష్టత వంటి అంశాలు ఇబ్బందులు పెట్టేవి. ఈ కారణంగా విమానాశ్రయాన్ని కేవలం రోజులో సగం గంటలు మాత్రమే పనిచేయించాల్సి వచ్చేది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానికి తలమానికంగా విజయవాడ ఎయిర్‌పోర్టు మారటంతో, దీని అభివృద్ధి శరవేగంగా సాగింది. దీంతోపాటు వృద్ధిరేటు కూడా పరుగులు పెడుతూ వస్తోంది. ఈ సందర్భంలో ఎయిర్‌పోర్టు ఇంకా వృద్ధి చెందాలన్నా, మరిన్ని నగరాలకు విమాన సర్వీసులు కల్పించాలన్నా.. విజయవాడ విమానాశ్రయాన్ని రోజంతా పనిచేయిస్తే.. వృద్ధిని రెట్టింపు చేయవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని 24 గంటలు పనిచేయించటానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు శ్రీకారం చుట్టారు. రన్‌వే ధృఢత్వం తప్పనిసరి ఏదైనా విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేయాలంటే రన్‌వే దృఢత్వం తప్పనిసరి. దీనిని దృష్టిలో ఉంచుకుని రన్‌వేను పటిష్ట పరచాలని నిర్ణయించారు. దీనికోసం ఆయనకు అవకాశం కూడా వెన్నంటే వచ్చింది. రన్‌వే విస్తరణ అవకాశం కలిసి వచ్చింది. ఈ సందర్భంలో ప్రస్తుత రన్‌వేను కూడా పటిష్ట పరిచేందుకు ప్రతిపాదనలు పంపారు. కేంద్రం రెండింటికి కలిపి ప్రాజెక్టును శాంక్షన్ చేసింది. దీంతో నూతన రన్‌వే పనులు ఒక కొలిక్కి వచ్చిన దశలో .. పాత రన్‌వే పటిష్టత పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాత రన్‌వే పటిష్టత పూర్తయింది. రన్‌వే పటిష్టత పనులు పూర్తి కావటంతో 24 గంటల పాటు పనిచేయటానికి ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు. రోజంతా విమానాశ్రయాన్ని పనిచేయించాలంటే అందుకనుగుణంగా సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులు దృష్టి సారించారు. ఎయిర్‌పోర్టులో సిబ్బందికి మూడు షిప్టుల డ్యూటీలు వేయాలని నిర్ణయించారు. విమాన ఆపరేషన్స్‌కు సంబంధించి ప్రధానంగా టవర్, ఫైర్ సిబ్బందికి మూడు షిప్టుల డ్యూటీలు విధించారు. కోర్, నాన్ కోర్ ఏరియాలుగా విమానాశ్రయాన్ని విభజించి ప్రస్తుతం ఉన్న సిబ్బంది ద్వారానే సమర్థవంతమైన సేవలు వినియోగించుకునేలా వర్క్ గ్రూప్ చేశారు. విమానాశ్రయ వృద్ధి రేటు రెట్టింపు విమానాశ్రయాన్ని 24 గంటలు పనిచేయించటం ద్వారా వృద్ధిరేటును రెట్టింపు చేసుకునే అవకాశం ఏర్పడబోతోంది. దేశీయంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబాయి, ఢిల్లీ, కొచిన్ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రాంతీయంగా విశాఖపట్నం, తిరుపతి, కడపలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చూస్తే.. రోజంతా విమానాల జాతరను తలపిస్తోంది. మిగిలిన 12 గంటల పాటు విమానాశ్రయం అందుబాటులో ఉంటే దేశీయంగా మరిన్ని విమానాలు నడపటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రన్‌వే పటిష్టత గురించి ఆందోళనతో అనేక విమానయాన సంస్థలు ఆసక్తి చూపించటం లేదు. ప్రస్తుతం రన్‌వేను పూర్తిస్థాయిలో పటిష్టత పరిచారు కాబట్టి.. విమానయాన సంస్థలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. విమాన ఆపరేషన్స్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. తద్వారా వృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఔట్ సోర్సింగ్‌కు ప్రతిపాదన ఒక విమానం ల్యాండింగ్ అవుతుంటే దాని సైజును బట్టి రెండు నుంచి మూడు అంబులెన్స్‌ల అవసరం ఏర్పడుతుంది. అంబులెన్స్‌లను నడిపేందుకు అవసరమైన డ్రైవర్లను ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకుకోవటం ద్వారా స్వల్పంగా తలెత్తే ఉద్యోగుల షార్టేజీ సమస్యను అధిగమించవచ్చని ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు నివేదించారు. వారు కూడా ఫైల్‌ను ఆమోదించారు. ప్రస్తుతం ఏ క్షణం నుంచి అయినా విజయవాడ విమానాశ్రయాన్ని 24 గంటలు నడిపించటానికి అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. విమానయాన సంస్థల నుంచి ఆసక్తి రావటమే తరువాయి!
sonykongara Posted April 25, 2019 Author Posted April 25, 2019 నెలాఖరున టెండర్లు! 25-04-2019 08:12:44 పీఐబీ కోర్టులో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రతిపాదన తుది అనుమతులు లేకున్నా.. టెండర్లకు అవకాశం వారం రోజుల్లో తేలనున్న భవితవ్యం! అంతా సానుకూలమేనంటున్న ఏఏఐ అధికారులు (ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ విమానాశ్రయ బ్రాండ్ ఇమేజ్‌ను చాటేలా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు ఈ నెలాఖరున టెండర్లు పిలవనున్నట్టు తెలుస్తోంది. టెర్మినల్ బిల్డింగ్‌కు తుది అనుమతులు రాకపోయినా.. ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం హడావిడిగా భూమిపూజ చేసింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు సంబంధించి పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) ముందు ప్రతిపాదన ఉంది. పీఐబీ అనుమతులు లాంఛనమేనని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటివరకు పీఐబీ నుంచి తగిన స్పష్టత రాలేదని తెలుస్తోంది. నోటిఫికేషన్‌కు ముందుగానే భూమిపూజ పూర్తిచేసినందున అనుమతులకు కోడ్ అడ్డంకి కాదన్నది పీఐబీ నిర్ణయంగా తెలుస్తోంది. వారం రోజుల్లో పీఐబీ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. పీఐబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఏఏఐ భావిస్తోంది. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ప్రాజెక్టుకు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)గా ఉన్న ‘స్టుప్’ను అప్రమత్తం చేసింది. పీబీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. టెండర్లు పిలవాలని భావిస్తోంది. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు విజయవాడ విమానాశ్రయ అధికారులు రూ. 740 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను పరిశీలించాక దానిని రూ. 611 కోట్లకు కుదించింది. దీంతోపాటు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కమిటీ (పీఎంసీ)గా స్టుప్ సంస్థను కూడా కేంద్రప్రభుత్వమే ఎంపికచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టేవారికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ బ్రాండ్ ఇమేజ్‌గా కనిపించటానికి వీలుగా స్టుప్ సంస్థ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు విమానాశ్రయ అధికారులు చూపించారు. డిజైన్లను పరిశీలించిన మీదట ఆయన కొన్ని మార్పులు, చేర్పులకు సూచించారు. ఆ మేరకు స్టుప్ సంస్థ మళ్ళీ డిజైన్లను మార్చింది. రాష్ట్రప్రభుత్వం ఫైనల్ డి జైన్లను ఆమోదించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు భూమిపూజ చేసింది. నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలుస్తున్న విజయవాడ విమానాశ్రయం విదేశీయులు సైతం అచ్చెరువొందించేలా చేయటానికి పూర్తిగా టెర్మినల్‌ను గ్లాస్, స్టీల్ స్ట్రక్చర్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ప్రయాణికుల కోసం ఆధునిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌లో ఆధునిక బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్, అరైవల్ బ్యాగేజ్ క్లెయిమ్ క్లారోసెల్స్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫైర్ అలారం సిస్టమ్, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్, సీసీటీవీ సర్వీయిలెన్స్, చెక్ ఇన్ కౌంటర్, కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్ వంటి వసతులను కల్పించాలని ఆ మేరకు డిజైన్‌లో పొందు పరిచారు. విజయవాడ నగరంతోపాటు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ బిల్డింగ్‌లో అంతర్గతంగా ఇంటీరియర్ చేయాలని ఆమేరకు డిజైన్లు రూపొందించారు. కృష్ణా జిల్లా, అమరావతిలను దృష్టిలో ఉంచుకుని కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యం, మల్లెపూలు, అమరావతి స్తూపం, కృష్ణానదీ పాయల ఆకారాలను డిజైన్స్‌లో పొందు పరిచారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను మొత్తం 1200మంది హ్యాండ్లింగ్ కెపాసిటీతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ 1200 మందిలో 800 మంది డొమిస్టిక్, 400 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. గన్నవరంలోని ప్రస్తుత విమానాశ్ర యంలో నూతనంగా నిర్మించిన ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌కు పక్కనే 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించనున్నారు. మొత్తం 24 చెక్ ఇన్ కౌంటర్స్, ఒక బ్యాగేజ్ కన్వేయర్, 5 బ్యాగేజ్ క్లెయిమ్ క్లారోసెల్స్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు - 14 (డిపార్చర్ -4, అరైవల్ - 10) కస్టమ్ కౌంటర్స్ -4 (డిపార్చర్ -1, అరైవల్ - 3) చొప్పున ఏర్పాటు చేయాలని డిజైన్స్ రూపొందించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను జీఆర్‌ఐహెచ్‌ఏ 4 స్టార్ సదుపాయాలతో కూడిన వసతులను కల్పించాలన్న ఉద్దేశంతో ఎల్‌ఈడీ లైట్లు, లో వీఓసీ పెయింట్ / వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్, తక్కువ హీట్ గెయిన్ గ్లేజింగ్, ఎనర్షీ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనింగ్, నీటి శుద్ధిప్లాంట్, డబుల్ ఇన్సులేటెడ్ పై కప్పులు, మొత్తం 1000 కార్లు, 200 టాక్సీలు సామర్థ్యం ఉన్న కారు / టాక్సీ పార్కింగ్ కల్పించాలని నిర్ణయించారు. దీంతోపాటు నూతన ఆఫ్రాన్ ముందు ఏరో బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కూడా డిజైన్లు రూపొందించారు. మొత్తం 3 కోడ్ ఈ విమానాలు, ఆరు కోడ్ సీ విమానాలు పార్కింగ్ చేయటానికి వీలుగా ఆఫ్రాన్‌ను విస్తరించాలన్న ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. భూమిపూజ ప్రారంభం కాగానే టెండర్లు పిలవటమే ఆలస్యం అనుకుంటే.. పీఐబీ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చేసరికే .. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో, పీఐబీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటానికి ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం ఇబ్బందులు లేవని గుర్తించిన నేపథ్యంలో, వారం రోజులలో తీపికబురు వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Raaz@NBK Posted April 25, 2019 Posted April 25, 2019 (edited) On 4/23/2019 at 10:45 AM, Yaswanth526 said: Top 10 lo 4 places AP ne AP Edited April 25, 2019 by Raaz@NBK
Yaswanth526 Posted April 25, 2019 Posted April 25, 2019 1 hour ago, Raaz@NBK said: Top 10 lo 3 places AP be AP 3 endi 4
rk09 Posted April 25, 2019 Posted April 25, 2019 1 hour ago, Raaz@NBK said: Top 10 lo 3 places AP be AP Out of 5 operational airports 4 are in rapid growth - not 3
Raaz@NBK Posted April 25, 2019 Posted April 25, 2019 9 minutes ago, Yaswanth526 said: 3 endi 4 Sorry kanapadala 😛
Raaz@NBK Posted April 25, 2019 Posted April 25, 2019 2 minutes ago, rk09 said: Out of 5 operational airports 4 are in rapid growth - not 3 Out of 7 lo 4 AP vi..
rk09 Posted April 25, 2019 Posted April 25, 2019 (edited) 4 minutes ago, Raaz@NBK said: Out of 7 lo 4 AP vi.. I mean - in AP, currently there are 5 airports that are in operational migatha rendu yevi? Edited April 25, 2019 by rk09
Raaz@NBK Posted April 25, 2019 Posted April 25, 2019 Just now, rk09 said: I mean - in AP, currently there are 5 airports that are in operational Got it
rk09 Posted April 25, 2019 Posted April 25, 2019 Puttaparthi - private one - not used for commercial yet Orvakal, Kurnool - Yet to start operations
Yaswanth526 Posted April 27, 2019 Posted April 27, 2019 (edited) Edited April 27, 2019 by Yaswanth526
Yaswanth526 Posted April 27, 2019 Posted April 27, 2019 #NTR #Amaravati International Airport march month DGCA numbers are out #Vijayawada #Gannavaram #AndhraPradesh Total Passengers: 99,781 Total Freight: 202.8 Tonnes Total Mail: 18.7 Tonnes
Yaswanth526 Posted April 28, 2019 Posted April 28, 2019 (edited) Edited April 29, 2019 by Yaswanth526
Nfan from 1982 Posted April 28, 2019 Posted April 28, 2019 Total ~4.3L passengers in the month of March in all areas of AP👍
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now