Jump to content

Recommended Posts

Posted

Oka connection to middle east please, especially with Emirates/Etihad/Qatar

or connection to Singapore by Singapore/Silk airlines

or daily twice connection to Mumbai and Delhi by AirIndia

ex: 2002/3 mundu varaku Hyd airport choodandi (begumpet) , appatlo jet ruling

Posted
20 minutes ago, sonykongara said:

Vijayawada Singapore non stop flights will start from 4th Dec. tickets can be booked from tomorrow evening.

 
 
 
 
 
 

October 25th nundi, Dec 4th ki maarchaaara. Eee Modi Govt poye lopu egaravemo, international flights.

Posted
On 10/22/2018 at 9:27 AM, rk09 said:

Oka connection to middle east please, especially with Emirates/Etihad/Qatar

or connection to Singapore by Singapore/Silk airlines

or daily twice connection to Mumbai and Delhi by AirIndia

ex: 2002/3 mundu varaku Hyd airport choodandi (begumpet) , appatlo jet ruling

next ade route lo planning already tolded. once customs start ayithe inka all routes easy avuthayi. 

Posted
విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఎగరాల్సిన విమానం..
25-10-2018 09:21:11
 
636760562142838856.jpg
  • మళ్లీ వాయిదా!
  • సింగపూర్‌ విమానం ఎగిరేది డిసెంబరులోనే
  • సాంకేతిక కారణాలతో వాయిదా వేసి విమానయాన సంస్థ
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఎగరాల్సిన విమానం మరోసారి నిరాశ పర్చింది. వాస్తవానికి నేటి నుంచి (అక్టోబరు 25న) విజయవాడ-సింగపూర్‌ మధ్య తొలి విమానం ఎగరాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో ఈ సర్వీసును వాయిదా వేసినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించే అవకాశముందని వారు వెల్లడించారు.
 
 
విజయవాడ, ఆంధ్రజ్యోతి: విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిపైగా అవుతోంది. నాటి నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి నుంచి దేశీయంగా ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు విమానసర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. దీన్ని తీర్చడానికి సింగపూర్‌కు విమానసర్వీసును ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తొలుత సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడంతో అది కార్యరూపం దాల్చలేదు. అయినా పట్టువీడక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగించింది.
 
 
అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అదనంగా అయ్యే ఖర్చును భరించేందుకు (వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌) రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇండిగో సంస్థ సింగపూర్‌కు సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. తొలుత అక్టోబరు 2న ఈ సర్వీసు ప్రారంభం కావాల్సి ఉన్నా, అది అక్టోబరు 25కి, తాజాగా ఇది డిసెంబరుకు వాయిదా పడింది.
 
 
అన్ని ఏర్పాట్లు ఉన్నా..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నెలకు సగటున లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఏడీసీఎల్‌) ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సర్వేలో సుమారు 87 వేల మంది విజయవాడ -సింగపూర్‌ నడుమ ప్రయాణిచేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు విజయవాడ విమానాశ్రయంలో ఉన్నాయి. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇండిగో సంస్థ సింగపూర్‌కు విమానసర్వీసును ప్రారంభించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.’ అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే సింగపూర్‌ సర్వీసు నడిపేందుకు కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది.
Posted
డిసెంబర్‌ 4 నుంచి గన్నవరం-సింగపూర్‌ సర్వీసు
అనుమతుల జాప్యంతో 40 రోజుల ఆలస్యం

ఈనాడు, అమరావతి: గన్నవరం నుంచి సింగపూర్‌కు ప్రారంభం కావాల్సిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు డిసెంబరు 4కు వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ(ఏఏఐ), ఇండిగో సంస్థలు ముందుగా ప్రారంభ తేదీని ఈ నెల 25గా నిర్ణయించాయి. అనుమతులు రావడానికి ఆలస్యమయిందని, అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థకు అతి తక్కువ సమయమే మిగిలిందని, అందుకే వాయిదా వేసినట్టు ప్రభుత్వ విద్యుత్తు, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 4న ప్రారంభమయ్యే సర్వీసు కోసం ఈ నెల 26 నుంచి ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయాన్ని ఆరంభించే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. విజయవాడ నుంచి వారానికి రెండు రోజులు సింగపూర్‌కు ఈ సర్వీసు నడవనుంది.

Posted (edited)

Finally you can book Vijayawada to Singapore direct non-stop flight from 4 Dec 2018 in www.goindigo.in website. Flight Duration is 4:35 hours. 180 Standard seats available for each service. Service is operated on Tuesday and Thursday every week initially. Economy price is 7508.00 Rs only. Dream Coming True.

Congrats to NFDB, @sonykongara, @Yaswanth526 @Raaz@NBK... :D

CBN Rocks...

:fireworks1::multispotti::party:

 

Vij-Sing-Dirct-Flight.jpg

 

Edited by LuvNTR
Posted
సింగపూర్‌కు ఓకే.. ఇక దుబాయ్!
27-10-2018 07:12:35
 
636762211534326292.jpg
  • డిసెంబరు 4 నుంచి సింగపూర్‌కు ఇండిగో సర్వీసు
  • వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన దుబాయ్‌కీ విమానం
  • విజయవాడ ఎయిర్‌పోర్టుకు గొప్ప అవకాశం
  • అంతర్జాతీయ వేదికపై నూతనాధ్యాయం !!
 అంతర్జాతీయ వేదికపై విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతనాధ్యాయం ప్రారంభమైంది! ఇండిగో క్లియరెన్స్‌తో సింగపూర్‌కు విమాన సర్వీసు శుక్రవారం అధికారికంగా ఖరారైంది! ఇక దుబాయ్‌కు కార్యరూపం దాల్చాల్సి ఉంది! అన్నీ అనుకూలిస్తే డిసెంబర్‌ మాసంలోనే దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారే భారీగా విదేశీయానం చేస్తుంటారన్నది విదేశీ విమానయాన గణాంకాలు చెబుతున్నాయి.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్‌) దుబాయ్‌కు కూడా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన విమాన సర్వీసు నడిపే ఆలోచన చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే అంతర్జాతీయ విమానయాన చిత్రపటంలో తనదైన ముద్ర వేసే అవకాశం విజయవాడకు దక్కబోతోంది. ఏ అంతర్జాతీయ విమానాశ్రయం అయినా సింగపూర్‌, దుబాయ్‌ తదితర అభివృద్ధి చెందిన దేశాలకు విమాన సర్వీసులు నడిపితే అది గొప్ప అవకాశంగా చెప్పుకోవాలి. సింగపూర్‌, దుబాయ్‌ దేశాలలో డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టులు ఉంటాయి. ఈ దేశాలకు వెళితే ప్రపంచంలోని ఏ దేశానికైనా విమాన సర్వీసు ఉంటుంది. డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్ట్స్‌గా భావించే సింగపూర్‌, దుబాయ్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తే అంతర్జాతీయ వేదికపై వజయవాడ ఎయిర్‌పోర్టు ప్రగతి వీచిక వీయనున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
 
సింగపూర్‌కు విమాన సర్వీసును డిసెంబర్‌ 4 నుంచి నడపనున్నట్టు ఇండిగో సంస్థ క్లియరెన్స్‌ ఇచ్చి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టడంతో గత అర్థ సంవత్సరకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంబన ఎట్టకేలకు వీడింది. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. విదేశానికి విమానం ఎగరలేదన్న అపప్రద కూడా తొలగిపోయింది. సింగపూర్‌కు విమాన సర్వీసు బుకింగ్‌ కాగానే మనవాళ్ళు ఉత్సాహంతో బుకింగ్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి సింగపూర్‌ కంటే దుబాయ్‌కు మన దగ్గర నుంచి డిమాండ్‌ బాగా ఉంది. దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు నడపాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉండటంతో ఈ సర్వీసుపై కూడా ఆశలు కలుగుతున్నాయి. ఈ రెండు సర్వీసుల ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందన్నది అందరి మాట.
 
మనవాళ్లే ఎక్కువ
పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్ళే ప్రతి వంద మందిలో 46 మంది మనవాళ్ళే ఉన్నారన్న అధ్యయనాలు చూస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు తగిన ఆక్యుపెన్సీతో వెళ్ళగలవని అర్థమౌతోంది. విదేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు కూడా ఇక్కడి వారే ఉన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారే భారీగా విదేశీయానం చేస్తుంటారన్నది విదేశీ విమానయాన గణాంకాలు చెబుతున్నాయి. పొరుగు రాష్ట్రం ఖమ్మం జిల్లాకు కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు కూడా విజయవాడకే వస్తారు.
 
భౌగోళికంగా చూస్తే ఆసియా దేశాలకు అతి దగ్గరి ఎయిర్‌పోర్టుగా విజయవాడ ఉంది. విజయవాడ నుంచి అతి తక్కువ సమయంలోనే ఆయా దేశాలకు చేరుకునే అవకాశం ఉండటం వల్ల ఆయా దేశాలకు వెళ్ళే వారికి ఎంతో సమయం కలిసి వస్తుంది. దీని వల్ల ఇతర విమానాశ్రయాలకు వెళ్ళి ప్రయాస పడే బాధ కూడా తప్పుతుంది. ఇండిగో సంస్థ శుక్రవారం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టిన నేపథ్యంలో, సింగపూర్‌కు కేవలం నాలుగున్నర గంటలలోనే చేరుకునే అవకాశం ఉంది. అదే చెన్నై నుంచి చూస్తే 6, 7 గంటల సమయం పడుతుంది.
 
దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి చూస్తే ఈ సమయం ఇంకా ఎక్కువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు తక్కువ సమయంలో చేరుకునే విజయవాడ ఎయిర్‌పోర్టుకే ప్రాధాన్యత ఉంటుందన్నది ఆలోచించాల్సిన విషయం. తూర్పు,దక్షిణాసియా దేశాలకు విజయవాడ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉంటోంది. దుబాయ్‌ వంటి దేశానికి కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశం ఉంది. ఆస్ర్టేలియా, యూరప్‌ వంటి ఖండాలకు కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉంది. సింగపూర్‌, దుబాయ్‌లకు విమాన సర్వీసుల ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్టు నూతనాధ్యాయం సృష్టించనుంది.
Posted
విజయవాడ-సింగపూర్‌ విమాన టిక్కెట్ల విక్రయం ఆరంభం

ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు వెళ్లనున్న అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం శుక్రవారం ఆరంభమైంది. 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఏ 320 బోయింగ్‌ను గన్నవరం నుంచి సింగపూర్‌కు ఇండిగో సంస్థ నడుపుతోంది. డిసెంబర్‌ 4న మొదటి సర్వీసు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనుంది. వారంలో మంగళ, గురు వారాల్లో రెండు సర్వీసులను తొలుత నడపనున్నారు. సింగపూర్‌కు వెళ్లేటప్పుడు రూ.7,508, తిరిగి వచ్చేటప్పుడు రూ.10,133 టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు.

Posted
అంతర్జాతీయం... సాకారం...
నాలుగేళ్లలో పాతాళం నుంచి ఆకాశంలోకి...
   విదేశాలకు వెళ్లే చారిత్రక రోజు వచ్చేసింది
   సింగపూర్‌కు టిక్కెట్ల విక్రయం ఆరంభం
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
నాలుగేళ్ల కిందట: గన్నవరం విమానాశ్రయాన్ని చూస్తే బస్టాండ్‌ కంటే దారుణంగా ఉందంటూ.. నాటి కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా ఉన్న అశోక్‌గజపతిరాజు అభివర్ణించారు. గట్టిగా గాలేస్తే.. ఎగిరిపోతాయేమోనన్నట్లుగా నాలుగు రేకుల షెడ్లతో.. కనీసం ప్రయాణికుల సౌకర్యాలకూ నోచుకోక దారుణంగా   ఉండేది. రోజుకు పది సర్వీసులు వచ్చి వెళ్తుండేవి. అవి కూడా హైదరాబాద్‌కే ఎక్కువ ఉండేవి.

* ప్రస్తుతం: రూ.160 కోట్లతో నిర్మించిన అత్యాధునిక దేశీయ టెర్మినల్‌ భవనం. మరోవైపు అధునాతన అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం. సకల సౌకర్యాలు. రోజుకు 53 సర్వీసులు.. నెలకు లక్ష మంది ప్రయాణికులు. అంతర్జాతీయ విమానాశ్రయం హోదా. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ సేవలు, పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయి. డిసెంబర్‌ 4న తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ఇక్కడి నుంచి బయలుదేరబోతోంది. కేవలం నాలుగేళ్లలో పాతాళం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.
గన్నవరం విమానాశ్రయం గత నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ లెక్కల ప్రకారం.. గత నాలుగేళ్లలో 220శాతం ప్రయాణికుల వృద్ధిని గన్నవరం విమానాశ్రయం సాధించింది. నాలుగేళ్ల కిందటి వరకూ కేవలం హైదరాబాద్‌, ఇంకో నగరానికి మాత్రమే వెళ్లేందుకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. కానీ.. ప్రస్తుతం దేశంలోని ఎనిమిది నగరాలకు వెళ్లేందుకు ప్రతి పావుగంటకో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అన్నింటికంటే ప్రధానంగా అంతర్జాతీయ సర్వీసులు డిసెంబర్‌ 4న తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు గన్నవరం నుంచి గాలిలోకి లేవబోతోంది. దశాబ్దాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన గన్నవరం.. కేవలం నాలుగేళ్లలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. గన్నవరంలో అడుగుపెడితే.. నేరుగా సింగపూర్‌లో దిగే చారిత్రక ఘట్టం కూడా త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం కూడా శుక్రవారం నుంచి ఆరంభమైంది.

amr-top1b.jpg
అన్ని అనుమానాలూ తొలిగిపోయాయ్‌..
ఏడాదిన్నర కిందట గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు గాలిలోకి లేస్తాయని ప్రకటించారు. కానీ.. అనేక ఆటంకాలను దాటి ఇన్నాళ్లకు అంతర్జాతీయ కలను సాకారం చేసుకునే రోజొచ్చింది. ఈనెల 25నే సింగపూర్‌కు తొలి సర్వీసును నడపాలని అధికారులు భావించినా.. కస్టమ్స్‌ అనుమతుల జాప్యంతో వాయిదా పడింది. డిసెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేశారు. కానీ.. ఈ తేదీని కూడా ఎంతవరకూ నమ్మొచ్చనే అనుమానాలు అందరిలో కలిగాయి. వాటన్నింటినీ తొలగిస్తూ.. ఇండిగో తన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని ఆరంభించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరిపోయేలా శీతాకాల షెడ్యూల్‌ను ఇండిగో ప్రకటించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు, అటు నుంచి వచ్చేందుకు వారంలో రెండు రోజులు అక్కడ, ఇక్కడ అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. రూ.18వేల లోపే సింగపూర్‌కు వెళ్లి వచ్చేందుకు టిక్కెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి.

గణనీయమైన ప్రయాణికుల వృద్ధి..
గన్నవరం విమానాశ్రయంలో ఏటేటా ప్రయాణికుల వృద్ధి దేశంలోనే మరెక్కడా కానరానిది. 2014 నుంచి ఇప్పటివరకూ 220శాతం ప్రయాణికులు పెరిగారు. సర్వీసులు సైతం దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ వచ్చాయి. కార్గో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంతర్జాతీయ సర్వీసులూ ప్రారంభమవుతున్నాయి. సింగపూర్‌తో పాటూ దుబాయ్‌కు సైతం సర్వీసులను ఆరంభిస్తే.. ఇంక ప్రపంచంలోని ఏ మూలకైనా ఇక్కడి నుంచి వెళ్లిపోయే అనుసంధానం వస్తుందని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంఘాలు కోరుతున్నాయి. 2014-15లో 2.31 లక్షల మంది ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించారు. 2015 తర్వాత ప్రయాణికుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది.

 
Posted
సింగపూర్‌కు ‘ఇండిగో’ బుకింగ్‌ ప్రారంభం
27-10-2018 03:15:23
 
636762069220661238.jpg
  • డిసెంబరు 4 నుంచి విమానాల రాకపోకలు
  • మంగళ, గురువారాల్లో సర్వీసులు
విజయవాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4నుంచి విమాన సర్వీసులు నడపనున్నట్టు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు క్లియరెన్స్‌ రిపోర్టు ఇవ్వడంతో పాటు సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టింది. తొలుత వెబ్‌పోర్టల్‌లో రూ.8,112గా ఉన్న ప్రారంభ ధర గంట తర్వాత రూ.7,508కి తగ్గింది. విజయవాడ నుంచి 180సీట్లతో కూడిన ఎయిర్‌బస్‌ 320, 321 నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును అందుబాటులోకి తేనుంది. మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విమానం తెల్లవారుజామున 2గంటలకు సింగపూర్‌ చేరుకుంటుంది.
Posted
18 hours ago, LuvNTR said:

Finally you can book Vijayawada to Singapore direct non-stop flight from 4 Dec 2018 in www.goindigo.in website. Flight Duration is 4:35 hours. 180 Standard seats available for each service. Service is operated on Tuesday and Thursday every week initially. Economy price is 7508.00 Rs only. Dream Coming True.

Congrats to NFDB, @sonykongara, @Yaswanth526 @Raaz@NBK... :D

CBN Rocks...

:fireworks1::multispotti::party:

 

Vij-Sing-Dirct-Flight.jpg

http://3.bp.blogspot.com/-tEqJZnvhXmI/UUh1Z7-fZoI/AAAAAAAAAoU/1-CzwRatVvI/s1600/brahmi-dance.gif

Posted
ఇక్కడినుంచే విదేశాలకు ఎగిరిపోదాం!
02-11-2018 03:30:02
 
636767262038604568.jpg
  •  విజయవాడ అంతర్జాతీయ టెర్మినల్‌ సిద్ధం
  •  ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలకు హంగులు
  •  అత్యాధునిక వీఐపీ లాంజ్‌, పటిష్ఠ భద్రత
  •  5 కోట్ల వ్యయంతో టెర్మినల్‌ ఆధునీకరణ
  •  కృష్ణా సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం,
  • రాజధాని ప్రణాళికల ఆర్ట్‌ పెయింటింగ్స్‌
విజయవాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలిచేలా విజయవాడ అంతర్జాతీయ టెర్మినల్‌ సిద్ధమైంది. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాల పనులు పూర్తయ్యాయి. సెంట్రలైజ్డ్‌ ఏసీ, చక్కటి ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్‌ దేశ, విదేశీ ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి గోడలపై కృష్ణాజిల్లా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంతోపాటు వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అమరావతి గురించి అర్థమయ్యేలా చక్కటి చిత్రాలను ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.5కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా దీన్ని ఆధునీకరించింది.
 
డిపార్చర్‌, అరైవల్‌ బ్లాకులు
ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు, చెకిన్‌ కౌంటర్లు, ప్రయాణికులు, సందర్శకుల ప్రీ వెయిటింగ్‌ రూం, సెక్యూరిటీ చెకింగ్‌, ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలు, పాసింజర్స్‌ సిట్టింగ్‌ ఏరియా, వీఐపీ లాంజ్‌ వంటివి డిపార్చర్‌ బ్లాక్‌లో ఉన్నాయి. ప్రవేశద్వారం వద్ద ఒకటి, భద్రత తనిఖీ విభాగం లోపల రెండు చొప్పున బ్యాగేజీ చెకింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికుల బ్యాగేజీ చెకిన్‌, కన్వేయర్‌ బెల్ట్‌, పాసింజర్‌ వెయిటింగ్‌ హాల్‌, కస్టమ్స్‌ చెకిన్‌ పాయింట్స్‌ అరైవల్‌ బ్లాక్‌లో ఉన్నాయి. ఈ బ్లాక్‌ బయటి గోడల మీద వేయించిన ఉండవల్లి గుహలు, కొండపల్లి బొమ్మలు, ప్రకాశం బ్యారేజీ, కూచిపూడి నృత్యాలు వంటి ఆర్ట్‌ పెయింటింగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.
 
Passangers-weighting-Hallww.jpgప్రత్యేక చాంబర్లు
ఇమిగ్రేషన్‌ సిబ్బందికి, కస్టమ్స్‌ విభాగానికి అవసరమైన చాంబర్లను సిద్ధం చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయిన ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పాసింజర్‌ లాబీ(సిట్టింగ్‌ ఏరియా)కి అనుబంధంగా అనేక సదుపాయాలు కల్పించారు. చంటిపిల్లలకు పాలు పట్టడానికి, ప్రార్థన చేసుకోవడానికి, స్మోకింగ్‌ కోసం ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటు చేశారు.
 
పటిష్ఠ భద్రత
టెర్మినల్‌ ముందు, వెనుక చక్కటి ల్యాండ్‌స్కేపింగ్‌తో గార్డెన్‌, విశాలమైన రహదారి, సెంట్రల్‌ డివైడర్‌ , రోడ్డుకిరువైపులా గ్రీనరీని అభివృద్ధి పరిచారు. అంతర్జాతీయ టెర్మినల్‌ దగ్గర పటిష్ఠ భద్రత కల్పించారు. సాధారణ సెక్యూరిటీతో పాటు పోలీసు సిబ్బంది, ఎస్‌పీఎఫ్‌ బలగాలను కూడా మోహరించా రు. భద్రతపరంగా ఎయిర్‌పోర్టును దుర్భేద్యంగా తీర్చిదిద్దారు.
 
 
ఆకట్టుకునేలా.. వీఐపీ లాంజ్‌
కస్టమ్స్‌ విభాగం వెనుక వీఐపీ లాంజ్‌కు వెళ్లే మార్గంలో అమరావతి ఊహాచిత్రం కనువిందు చేస్తుంది. ఖరీదైన సోఫాసెట్లు, టీపాయ్‌లతో ఈ లాంజ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. మువ్వన్నెల జెండాలో ఏపీ మ్యాప్‌, అందులో గౌతమ బుద్ధుడు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ, దుర్గగుడి, తెలుగుతల్లి విగ్రహం చిత్రాలు కనిపించేలా ఏర్పాటు చేశారు. పక్కనే కూచిపూడి నృత్యభంగిమ చిత్రం కూడా ఆకర్షిస్తుంది. లాంజ్‌ గోడలపై రాజధాని ప్రణాళికలకు సంబంధించిన చిత్రాలను ఉంచారు.
Posted

Extraordinary Response For 1st Maiden International Flight To Singapore 

Booking Started From Oct 26, Within 10 Days No. of tickets booked

VGA - SIN

Dec 4 : 42

Dec 6 : 21

Dec 11 : 30

Dec 13 : 22

SIN - VGA

Dec 4 : 51

Dec 6 : 36

Dec 11 : 34

Dec 13 : 31

Still1 more month to go  :dream: 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...