sonykongara Posted November 28, 2018 Author Posted November 28, 2018 (edited) Edited November 28, 2018 by sonykongara
sonykongara Posted November 28, 2018 Author Posted November 28, 2018 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సింగపూర్ కు వెళ్లే విమాన రాకపోకలు డిసెంబర్ 4న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు విమాన శాఖ అధికారులు తెలిపారు
sonykongara Posted November 28, 2018 Author Posted November 28, 2018 విజయవాడ-సింగపూర్ విమాన సేవలకు వీజీఎఫ్ ఇండిగో సంస్థకు రూ.3.05 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఈనాడు, అమరావతి: విజయవాడ-సింగపూర్ మధ్య విమానాలను నడిపేందుకు ఇండిగోసంస్థకు లోటుభర్తీ నిధి(వీజీఎఫ్) కింద చెల్లింపులు చేసేందుకు రూ.3.05 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్), ఇండిగో మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విజయవాడ- సింగపూర్ మధ్య విమానాలను నడిపేందుకు వీజీఎఫ్ కింద ప్రతి 15రోజులకోసారి చెల్లింపులు చేయాలి. ఇండిగో సంస్థ ప్రతి నెలా తొమ్మిది విమానాలను తిప్పనుంది. ఇందుకు వీజీఎఫ్ రూ.3.05 కోట్లు విడుదల చేసింది. 4న సింగపూర్‌కు ఇండిగో విమానం ఈనాడు, అమరావతి: విజయవాడ నుంచి తొలిసారిగా విదేశాలకు ఎగరనున్న విమానాన్ని వచ్చే నెల నాలుగో తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో సంస్థ విమానాలు నడిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా డిసెంబరు 4వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇండిగో విమానం 180 మంది ప్రయాణికులతో సింగపూర్‌కు బయలుదేరి వెళ్లనుంది. గన్నవరం విమానాశ్రయాన్ని ఇటీవల ఆధునికీకరించిన తర్వాత విదేశాలకు వెళ్లే తొలి విమానం ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే విషయం ఇంకా ఖరారు కాలేదు. అయిదో తేదీన స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని అదే రోజు సాయంత్రం దిల్లీకి బయలుదేరి వెళతారు.
sonykongara Posted November 29, 2018 Author Posted November 29, 2018 ఎయిర్‌పోర్టుకు సోలార్ వెలుగులు!29-11-2018 08:50:06 పవర్ ప్లాంట్‌కు భూమిపూజ రూ. 8 కోట్లతో 1మెగావాట్ ప్లాంట్ రాష్ట్రంలోనే తొలి సోలార్ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు ప్రస్తుతం నెలకు 800కిలోవాట్ల విద్యుత్ వినియోగం సోలార్ ప్లాంట్ ద్వారా మరో 200 కిలోవాట్ల మిగులు నెలకు రూ.35లక్షలు.. ఏడాదికి రూ. 4.20కోట్ల విద్యుత్ బిల్లు విజయవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఎకోఫ్రెండ్లీ’గా బెజవాడ ఎయిర్‌పోర్టు నిలువనుంది. ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వినియోగంలో తనకు తానే సాటిగా నిలువబోతోంది. రాష్ట్రంలోనే తొలి సోలార్ ఎయిర్‌పోర్టుగా బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతికెక్కనుంది. దీనిలోభాగంగా బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ పనులకు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు భూమిపూజ చేశారు. బెజవాడ ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో సోలార్‌గా మార్చివేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఉన్నతాధికారులు అడుగులువేశారు. ప్రస్తుతం రూ.8కోట్ల వ్యయంతో ఒక మెగావాట్ సామర్ధ్యమున్న సోలార్ పవర్‌ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. ప్లాంట్ రెండునెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. కొత్త సంవత్సరంలో ఇది వినియోగంలోకి వస్తుంది. సోలార్‌పవర్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రత్యామ్నాయ స్వీయ ఇంధన ఉత్పాదక శక్తిగా విజయవాడ ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించనుంది. విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఏడాది క్రితం వరకు 600 కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరిగేది. ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌కు శ్రీకారంచుట్టిన తర్వాత మరో 200 కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం నెలకు 800కిలోవాట్ల విద్యుత్‌ను ఎయిర్‌పోర్టు, పరిపాలనా, ఇతర విభాగాల అవసరాలకు వినియోగించటం జరుగుతోంది. ప్రతినెలా సగటున రూ.35 లక్షల మేర అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.4.20కోట్ల మేర విద్యుత్‌బిల్లును ఎయిర్‌పోర్టు అథారిటీ చెల్లిస్తోంది. మరో రెండునెలల్లో ఒక మెగావాట్ సోలార్ పవర్‌ప్లాంట్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుత వినియోగం 800 కిలోవాట్ల విద్యుత్ వినియోగం పోను, మరో 200 కిలోవాట్ల విద్యుత్ మిగులు ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్‌ను నెట్‌మీటరింగ్‌కు అనుసంధానం చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణయించారు. దీనివల్ల మిగులు విద్యుత్‌ను ఏపీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన గ్రిడ్‌కు నెట్‌మీటరింగ్ విధానంలో పంపుతారు. విద్యుత్ వినియోగం తగ్గటమే కాకుండా ప్రతినెలా ఎయిర్‌పోర్టు అథారిటీకే ఆదాయం వచ్చే పరిస్థితి నెలకొంది. కొద్దినెలల్లో ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు శ్రీకారంచుట్టనున్న నేపథ్యంలో, దాని అవసరాల కోసం కూడా మరో ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు భావిస్తున్నారు.
sonykongara Posted November 29, 2018 Author Posted November 29, 2018 విజయవాడ టూ సింగపూర్.. గ్రాండ్ ఓపెనింగ్..29-11-2018 08:44:55 డిసెంబరు 4న మధ్యాహ్నం సీఎం చంద్రబాబుచే జ్యోతి ప్రజ్వలన గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొననున్న.. కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు ఎయిర్‌పోర్టు అధికారులతో సమావేశమైన కలెక్టర్ లక్ష్మీకాంతం విజయవాడ/గన్నవరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి అంతర్జాతీయ తొలి సర్వీసును గ్రాండ్‌గా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్న జిల్లా యంత్రాంగం రెండు విడతలుగా సంబరం నిర్వహించాలని భావిస్తోంది. డిసెంబర్ 4న మధ్యాహ్నం, సాయంత్రం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించటానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుచే జ్యోతిప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావులు నిర్ణయించారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుచే సింగపూర్‌కు బయలుదేరే విమానానికి జెండాఊపి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి సర్వీసు ప్రారంభోత్సవానికి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా వస్తున్నట్టు తెలిపారు. ఇంతకుముందు రైల్వేశాఖమంత్రి హోదాలో వచ్చిన సురేష్ ప్రభు.. ఇపుడు పౌరవిమానయాన శాఖ మంత్రి హోదాలో వస్తుండటం విశేషం! కేంద్రమంత్రి సురేష్ ప్రభు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి సాయంత్రం కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి సర్వీసు డిసెంబర్ నాలుగు నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో, కలెక్టర్ లక్ష్మీకాంతం బుధవారం ఎయిర్‌పోర్టు అధికారులతో సమావేశమై రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని గ్రాండ్‌గా ప్రారంభించటానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సమీక్షలో నూజివీడ్ సబ్‌కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాలు పంచుకున్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావుతోపాటు, అధికారులంతా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌లు అంతర్జాతీయ టెర్మినల్‌ను పరిశీలించారు. టెర్మినల్‌లో అరైవల్, డిపార్చర్ బ్లాక్‌లలో కల్పిస్తున్న చర్యలపై చర్చించారు. టెర్మినల్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దటంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ టెర్మినల్‌లో.. కస్టమ్స్ , ఇమిగ్రేషన్ ఏర్పాట్లకు ఎలాంటి చర్యలు చేపట్టారో పరిశీలించారు. వీఐపీ లాంజ్‌లో ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ప్రయాణికుల వెయిటింగ్ హాల్, బ్యాగేజి చెక్ ఇన్ కౌంటర్లు, ఎయిర్‌లైన్స్ కౌంటర్స్ తదితరాలను పరిశీలించారు. టెర్మినల్‌లో విదేశీ ప్రయాణికుల కోసం క్యాష్ ఎక్సేంజ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
sonykongara Posted November 29, 2018 Author Posted November 29, 2018 ఆధునికత.. ఆకృతుల మేళవింపుఐదు టవర్లతో పరిపాలన కార్యాలయాలువాహనాల నిలుపుదలకు ప్రత్యేక నిర్మాణంఈనాడు-అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న పరిపాలన కార్యాలయాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఐదు టవర్లతో ప్రభుత్వ పాలన సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో భవనాలకు పునాదులు నిర్మాణంలో ప్రత్యేక ప్రణాళిక అనుసరిస్తున్నారు. నల్లరేగడి నేల కావడంతోపాటు ఒక భవనం 50 అంతస్థులు, నాలుగు భవనాలు 40 అంతస్థులతో నిర్మిస్తుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్లరేగడి నేలలు కావడం, భూగర్భజలాలు పైభాగంలో ఉండటంతో పునాదుల్లోకి నీరు వెళ్లకుండా జియో సింథటిక్ సామగ్రిని నిర్మాణంలో వినియోగిస్తున్నారు. పునాది నిర్మాణానికి 4మీటర్ల కంటే లోతుగా తవ్వి భూమిపై సింథటిక్ షీట్ వేసి దానిపై కాంక్రీటుతో నిర్మాణం ప్రారంభించారు. ఇలా పలులేయర్లుగా ఇనుము, కాంక్రీటుతో 4మీటర్ల మేర రాఫ్ట్ నిర్మిస్తున్నారు. రాఫ్ట్‌కు చుట్టూ సింథటిక్ షీట్ వేసి కాంక్రీటు నిర్మాణంలోకి భూగర్భజలాలు, డ్రైనేజీ, భూమిలోపలి నుంచి వచ్చే రసాయనాలు పునాదిలోకి వెళ్లకుండా అడ్డుకునేలా జియో సింథటిక్ విధానంలో నిర్మిస్తున్నారు. రాఫ్ట్‌పై భవన నిర్మాణం చేపట్టి బహుళ అంతస్థుల నిర్మాణాలు పూర్తిచేస్తారు. సింథటిక్ షీట్ నీటిని పునాదుల్లోకి రాకుండా అడ్డుకోవడం వల్ల నిర్మాణ సమయంలో ఉన్న నాణ్యత, సామర్థ్యం భవనం జీవితకాలం ఉండేలా కాపాడుతుందని ఇంజినీర్లు తెలిపారు. దీంతోపాటు పునాదులకు ఉపయోగిస్తున్న స్టీలు నీరు, రసాయనాల వల్ల త్వరగా తుప్పుపట్టకుండా ఉండే నాణ్యమైనవి వాడుతున్నారు. భవనానికి పునాది కీలకం కావడం, భూగర్భజలాలు పైనే ఉండటంతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు సదుపాయంసాధారణంగా బహుళ అంతస్థుల భవనాల్లో నివసించేవారు వాహనాలు నిలుపుకోవడానికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఖాళీ వదులుతారు. ఫిల్లర్ల మధ్య వాహనాలు పార్కింగ్ చేస్తారు. రాజధానిలో నిర్మిస్తున్న పరిపాలనా సముదాయంలో బహుళ అంతస్థుల భవనాల కింద పార్కింగ్ లేకుండా రాఫ్ట్‌పై భవనాల నిర్మాణం చేపడుతున్నారు. బహుళ అంతస్థుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు భవనానికి సమీపంలోనే వాహనాల నిలుపుదలకు ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు. రాజధానిలో ఐదు టవర్లలో కొన్నింటికి ముందువైపు, కొన్నింటికి భవనం వెనుకవైపు భూగర్భంలో రెండు అంతస్థులు, పైన రెండు అంతస్థుల్లో వాహనాలు నిలుపుకునేలా సౌకర్యం కల్పిస్తారు. బహుళ అంతస్థుల భవనాల్లో పార్కింగ్‌కు సదుపాయం కల్పిస్తే ఫిల్లర్ల మధ్య ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల భూకంపాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్‌కు భవనం సమీపంలో ప్రత్యేక నిర్మాణం చేపడుతున్నారు.
sonykongara Posted November 29, 2018 Author Posted November 29, 2018 సౌర విద్యుత్తు ప్లాంట్‌కు భూమిపూజరూ.5.40 కోట్లతో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటుఈనాడు డిజిటల్, విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో మెగావాట్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్లాంటుకు బుధవారం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు చేతుల మీదగా భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయేత విద్యుత్తు వినియోగాన్ని పెంచడంలో భాగంగా ఈ ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టును రూ.5.40 కోట్లతో నోవస్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థ నిర్మించనుందని తెలిపారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రోజుకు 800 కిలోవాట్ విద్యుత్తు వాడుతుండగా.. నెలకు రూ.30 లక్షలు బిల్లు కడుతున్నామన్నారు. ఇది పూర్తయితే.. అన్ని అవసరాలకు పోనూ.. మిగులు విద్యుత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్(ఇంజినీరింగ్) జి.ప్రభాహరన్, జాయింట్ జనరల్ మేనేజర్ జి.ప్రభాహరన్, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు బి.ప్రమోద్, పవన్ కులకర్ని తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted November 29, 2018 Author Posted November 29, 2018 సింగపూర్ సర్వీసు ప్రారంభానికి ఏర్పాట్లుఅధికారులతో సమీక్షించిన కలెక్టర్ లక్ష్మీకాంతం విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే : గన్నవరం విమానాశ్రయం నుంచి డిసెంబరు 4న అంతర్జాతీయ విమాన సర్వీసు సింగపూర్ వెళ్లే విమానం ప్రారంభం రాష్ట్ర చరిత్రలోనే ప్రధాన ఘట్టమని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణాజిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం సమావేశ మందిరంలో డైరెక్టరు జి.మధుసూధనరావు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీ వీరేంద్రసింగ్, నూజివీడు ఉప కలెక్టరు స్వప్నిల్ దినకర్ ఇతర అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. నూతన రాజధాని అమరావతి కేంద్రంగా గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని తెలిపారు. డిసెంబరు 4న మధ్యాహ్నం 3.40 గంటలకు ఇండిగో విమానం రాక సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, సాయంత్రం 6.45 గంటలకు సింగపూర్‌కు విమానం బయలు దేరే కార్యక్రమం ఉంటుందని, ఇందులో ఉప రాష్ట్రపతి పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఇండిగో సంస్థ ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యటకాభివృద్ధిపైనా దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌లో అవసరమైన క్యాబ్‌లు, నగదు మార్పిడి కౌంటర్లు ఉన్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం, స్పిర్చ్యువల్ టూరిజం అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రన్‌వే విస్తరణ పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మిస్తామని, వారికి పూర్తి న్యాయం చేస్తామని వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద అందించనున్న సహకారంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాలనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యుత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
baggie Posted November 29, 2018 Posted November 29, 2018 ee airport ni shamsha bad kante peddadi ga cheyyali
sonykongara Posted November 30, 2018 Author Posted November 30, 2018 సర్వాంగ సుందరంగా... ఇంటర్నేషనల్ టెర్మినల్30-11-2018 08:30:47 అతిథులకు ఆత్మీయ స్వాగతం రూ. 3 కోట్లతో దశలవారీ ఆధునికీకరణ విదేశీ యాత్రికులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు విజయవాడ అంతర్జాతీయ టెర్మినల్ ముస్తాబైంది. రన్‌వేకు అత్యంత సమీపంలో మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో టెర్మినల్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. అమరావతి-బెజవాడ సంస్కృతుల మేళవింపుతో శోభాయమానంగా తొలి ప్రయాణికుల రాక కోసం టెర్మినల్ ఎదురు చూస్తోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ టెర్మినల్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రూ.3 కోట్ల వ్యయంతో దశలవారీగా ఆధునికీకరించిన టెర్మినల్ విదేశీ యాత్రికులకు సేవలందించటానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ సర్వీసుల ముహూర్తానికే టెర్మినల్ కూడా విశిష్ట సేవలందించటానికి సిద్ధమైంది. టెర్మినల్ నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ సిబ్బంది నియమితులయ్యారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్ కౌంటర్లు, బ్యాగేజీ చెకిన్‌కౌంటర్లు, ఎయిర్‌లైన్స్ కౌంటర్లలో పనిచేసే విభాగాలు కూడా సిద్ధమయ్యాయి. కస్టమ్స్ విభాగంలో ప్రాథమికంగా 14మంది సుశిక్షిత సిబ్బంది విధు లు నిర్వహించనున్నారు. మరికొంతమంది శిక్షణలో ఉన్నబ్యాచ్ వీరికి సహాయకంగా పనిచేయనున్నారు. కస్టమ్స్ విభాగాన్ని ఆ శాఖ స్వాధీనం చేసుకుంది. సిబ్బంది సేవలందించటానికి వీలుగా కంప్యూటర్లను ఏర్పాటు చేసింది. ఇమిగ్రేషన్ విభాగం మొత్తం 18మంది సిబ్బందితో విధులు నిర్వహిం చటానికి సమాయత్తమైంది. ఆయా విభాగాలకు శక్తివంతమైన ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక, సాంకేతిక యంత్ర పరికరాలను కల్పించారు. ప్రయాణికులకు కనిపించేలా ఎయిర్‌లైన్స్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇండిగో సంస్థ ఒక్కటే ఇక్కడ కౌంటర్‌ను ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి ముందు కు వచ్చే సంస్థలకు మిగిలిన కౌంటర్లను ఎయిర్‌పోర్టు అధికారులు కేటాయిస్తారు. లోపలికి ప్రవేశించ గానే బ్యాగేజీ చెకింగ్ యంత్రం, ఆ వెనుకనే చెకిన్‌కౌంటర్స్ ఏర్పా టు చేశారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ కార్యాలయాల వెనుకభాగంలోనూ బ్యాగేజీ చెకిన్ యంత్రాలుంటాయి. యంత్రాల అవతల విశాలమైన ప్రయాణికుల లాంజ్‌లో చక్క టి సీటింగ్ ఒకేసారి 300మంది వరకు కూర్చునే సదుపాయం ఉంది. ప్రార్థనలు చేసుకోవటానికి ప్రేయర్ ఛాంబర్లను స్ర్తీ, పురుషులిద్దరికీ వేర్వేరుగా ఏర్పాటుచేశారు. పొగతాగే అలవాటున్న వారికి ప్రత్యేక స్మోకి ంగ్ చాంబర్లను ఏర్పాటుచేశారు. పిల్లలకు పాలు పట్టుకోవటానికి కూడా ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటుచేశారు. అంతర్జాతీయ పత్రికలు,మేగజైన్స్ చదువుకోవటానికి ఏర్పా ట్లు చేశారు. లోపల బేకరీ పాయింట్లు, ఫుడ్‌కోర్టులు, కాఫీక్లబ్‌లు వంటివి ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఏటీఎంలను కూడా సిద్ధంచేశారు. విదేశాలకు వెళ్ళే యాత్రికులను దృష్టిలో ఉంచుకుని మనీ ఎక్సేంజ్ మిషన్, చక్కటి కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, బ్యాగేజీ చెకిన్ పూర్తయిన తర్వాత ప్రయా ణికులను తీసుకువెళ్లేందుకు ఇండిగోకు చెం దిన లగ్జరీ బస్సు సిద్ధంగా ఉంటుంది. ట్రిప్పునకు 35 మంది ప్రయాణికులను ఇది తీసుకువెళుతుంది. సింగపూర్ నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులు డిపార్చర్ బ్లాక్ నుంచి బయటకు రావాల్సి ఉంది. డిపార్చర్ బ్లాక్‌లో ఆధునిక కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లోపలికి చేరుకునే సరికే కన్వేయర్ బెల్ట్ మీద లగేజీ తిరుగాడుతూ ఉంటుంది. లోపలికి వచ్చిన ప్రయా ణికులు ఎవరి బ్యాగేజీలను వారు తీసుకు వెళ్లవచ్చు. లోపల కొద్దిసేపు వెయిటింగ్‌కి పాసెంజర్ లాంజ్ ఉంటుంది. కాఫీక్లబ్, ఫుడ్‌కోర్టులుంటాయి. టాక్సీ కౌంటర్ కూడా ఉంటుంది. అద్భుతంగా.. వీఐపీ లాంజ్ అరైవల్, డిపార్చర్ బ్లాక్‌ల మధ్య వీఐపీ లాంజ్‌ను అభివృద్ధి చేశారు. ఈ లాంజ్‌లో ప్రవేశానికి ముందు అమరావతి ఊహా చిత్రంగా వీఐపీలకు స్వాగతం పలుకుతుం ది. వీఐపీ లాంజ్‌లో రెండు ఛాంబర్లు ఉం టాయి. రెండు ఛాంబర్లలోనూ ధవళవర్ణం లో మెరిసిపోయే సోఫాసెట్లు తదితర స్టేషనరీ ఏర్పాటుచేశారు. వీఐపీలాంజ్‌లోని రెండు ఛాంబర్లలో గోడలపై అమరావతి నగర నిర్మాణ ఊహాచిత్రాలు కనువిందు చేస్తుంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఆశీనులయ్యే చాంబర్‌ను మరింత ఇంటీరియర్‌తో తీర్చిదిద్దారు. ఇం దులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని మోదీ చిత్రపటాలను ఏర్పాటుచేశారు. ప్రధాన గోడపై పెద్ద పెయింటింగ్‌ను ఆవిష్కరించారు. మవ్వన్నెల పతాకం.. అందు లో ఏపీ మ్యాప్ కనిపించేలా.. అమరావతి, విజయవాడ, తిరుపతి, ఇతర సాగునీటి ప్రాజెక్టులు కనిపించేలా ఆవిష్కరించారు. ఈ పెయింటింగ్ పక్కనే కూచిపూడి నృత్య భంగిమతో ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేశా రు. అతిథుల కోసం ఎల్‌ఈడీ టీవీని ఏర్పా టుచేశారు. పచ్చదనంతో ఉట్టిపడేలా టెర్మినల్ ఆవరణ ఇంటర్నేషనల్ టెర్మినల్ బయట, రన్‌వే వెంబడి పచ్చదనంతో ఉట్టిపడేలా అభివృద్ధి చేశారు. టెర్మినల్ ముందు భాగం గార్డెన్‌ను అభివృద్ధిచేశారు. రకరకాల క్రోటన్స్‌తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రన్‌వే వెంబడి కూడా టెర్మినల్‌కు సమీపంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టారు. కృష్ణాజిల్లా చారిత్రకతను చాటిచెప్పేలా అంతర్జాతీయ టెర్మినల్ ముందు భాగంలో ప్రహరీపై పెయింటింగ్స్‌ను తీర్చిదిద్దారు. సాగునీటి కాలువలు, కొండపల్లి బొమ్మల వైభవం, ఉండవల్లి గుహలు, కూచిపూడి నృత్యం, ప్రకాశం బ్యారేజీ వంటి పెయింటింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
sonykongara Posted December 1, 2018 Author Posted December 1, 2018 (edited) Edited December 1, 2018 by sonykongara
sonykongara Posted December 1, 2018 Author Posted December 1, 2018 3 రోజుల్లో.. కల సాకారంజోరుగా టిక్కెట్ల విక్రయాలువెళ్లే ధర రూ.7,508.. వచ్చే ధర రూ.10,4224వ తేదీ నుంచి 4 గంటల్లో సింగపూర్కుఈనాడు, అమరావతి గన్నవరం నుంచి అంతర్జాతీయ విమానాలు ఎగిరే క్షణం మరో మూడు రోజుల్లోనే సాకారం కాబోతోంది. సింగపూర్‌కు మొదటి విమానం డిసెంబర్ 4న గన్నవరం నుంచి పైకి ఎగరనుంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల కొనుగోళ్లు ఇప్పటికే జోరందుకున్నాయి. గన్నవరం నుంచి వచ్చే మంగళవారం బయలుదేరే తొలి విమాన సర్వీసుకు సంబంధించి శుక్రవారానికి 82 టిక్కెట్లు బుక్కయ్యాయి. 180 సీటింగ్ ఉన్న విమాన సర్వీసులను ఇండిగో సంస్థ సింగపూర్‌కు ప్రారంభిస్తోంది. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్ ప్రస్తుతం రూ.7,508 ఉంది. అదేరోజు అటునుంచి గన్నవరం వచ్చే వారికి టిక్కెట్ ధర రూ.10,422 ఉంది. విమానం బయలుదేరే సమయం వరకూ టిక్కెట్ల విక్రయాలకు అవకాశం ఉండడంతో.. మరో మూడు రోజులు ఉన్నందున మొదటి సర్వీసుకు కనీసం 60శాతం దాటనున్నాయని అధికారులు, ఇండిగో సంస్థ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులను ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు నడపనున్నారు. మంగళ, గురు వారాల్లో ఇటునుంచి అటు, అదే సమయంలో సింగపూర్ నుంచి ఇక్కడికి సర్వీసులు ఉంటాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.40కు ఇండిగో విమాన సర్వీసు సింగపూర్‌లో బయలుదేరుతుంది. సింగపూర్ కాలమానం ప్రకారం.. అక్కడ మధ్యాహ్నం 1.40 అవుతుంది. గన్నవరం విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.45కు చేరుకుంటుంది. గన్నవరం నుంచి సాయంత్రం 6.40కు బయలుదేరి సింగపూర్‌కు వెళుతుంది. భారత కాలమానం ప్రకారం.. అక్కడికి రాత్రి 10.40కు చేరుతుంది. నాలుగు గంటల్లో నేరుగా సింగపూర్‌కు ఈ విమాన సర్వీసులో చేరుకోవచ్చు. అటునుంచి డిమాండ్ ఎక్కువ..: సింగపూర్ నుంచి డిసెంబర్ 4న బయలుదేరి వచ్చే ఈ తొలి సర్వీసుకు ఇప్పటికే 130 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లే విమాన సర్వీసుల కంటే.. అటునుంచి వచ్చే వాటికి అధికంగా టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గన్నవరం నుంచి బయలుదేరే మొదటి సర్వీసుకు శుక్రవారం నాటికి 45శాతం టిక్కెట్లు అమ్ముడవ్వగా.. సింగపూర్ నుంచి వచ్చే విమానానికి 72శాతం పూర్తవ్వడమే దీనికి నిదర్శనం. డిసెంబర్ 6న సింగపూర్ నుంచి ఇక్కడికి, మళ్లీ అక్కడికి విమాన సర్వీసు నేరుగా ఉంటుంది. ఈ సర్వీసులకు సైతం టిక్కెట్ల అమ్మకం జోరుగా సాగుతోంది. 6న సింగపూర్ నుంచి వచ్చే సర్వీసుకు ఇప్పటికే 123 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అదే రోజు ఇటునుంచి వెళ్లే సర్వీసుకు 27 టిక్కెట్ల అమ్మకం జరిగింది. తర్వాత.. డిసెంబర్ 11న మంగళవారం, 13న గురువారం మళ్లీ సర్వీసులుంటాయి. వీటికీ టిక్కెట్ల అమ్మకం జోరుగానే సాగుతోంది. రద్దీ ఉంది.. అలవాటు పడాలి..: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ సమీప భవిష్యత్తులోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల వారికి గన్నవరం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ నాలుగు జిల్లాల నుంచే విదేశాల్లో ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి ఊరిలోనూ వందల మంది విదేశాల్లో ఉన్నవారుంటారు. ఏటా ఇక్కడి నుంచి కనీసం 25లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విమాన సర్వీసులను అందుకుంటున్నారని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ నివేదికలు సైతం రూపొందించింది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వస్తే.. వీరంతా ఇక్కడి నుంచే నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుపుతుండడంతో.. విదేశీ ప్రయాణికులు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. సింగపూర్‌తో పాటు దుబాయ్ లాంటి మరికొన్ని దేశాలకు సర్వీసులు ప్రారంభమైతే డిమాండ్ క్రమంగా పెరగనుంది.
sonykongara Posted December 2, 2018 Author Posted December 2, 2018 ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌కు పచ్చజెండాఅంతర్జాతీయ, దేశీయ కార్యకలాపాలు ఒకేచోటగన్నవరం విమానాశ్రయానికి పూర్తిస్థాయి సౌకర్యాలుఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అంతర్జాతీయ సొగసులను అద్దుకుంటోంది. అంతర్జాతీయ, దేశీయ విమాన కార్యకలాపాలను వేర్వేరుగా కాకుండా.. ఒకేచోట నుంచి నిర్వహించే అధునాతన భవన సముదాయం అందుబాటులోనికి రాబోతోంది. రూ.611 కోట్లతో.. 35వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం పనులు ఆరంభం కాబోతున్నాయి. డిసెంబర్ 04న అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభంతో పాటూ.. కొత్త టెర్మినల్ భూమిపూజ సైతం జరగనుంది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ నగరాల్లో మాదిరిగా అధునాతన సౌకర్యాలు కలిగిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని గన్నవరంలో నిర్మించాలని రెండేళ్ల కిందటే నిర్ణయించారు. విమానాశ్రయానికి భవిష్యత్తులో పెరిగే అంతర్జాతీయ, దేశీయ రెండింటి ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఈ నూతన టెర్మినల్ నిర్మించాలనేది ప్రతిపాదన. కానీ.. ఎప్పటినుంచి పనులు ఆరంభమవుతాయి, ఎప్పటిలోగా అందుబాటులోనికి వస్తుందనే విషయంలో ఇప్పటివరకూ సందిగ్ధం ఉండేది. తాజాగా.. దీనిపై స్పష్టత వచ్చింది. దేశంలోనే అత్యధిక ప్రయాణికుల వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో త్వరితగతిన గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను నిర్మించాలని కేంద్ర పౌర విమానయానశాఖ నిర్ణయించింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కార్యకలాపాలు వేర్వేరుగా సాగుతున్నాయి. రెండింటినీ ఒకేచోటి నుంచి నిర్వహించేందుకు అవసరమైన భవన సముదాయం లేదు. ప్రస్తుతం దేశీయ సర్వీసులు, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో రూ.160 కోట్లతో నిర్మించిన టెర్మినల్‌ను వీటి కోసం వినియోగిస్తున్నారు. విమానాశ్రయ సమగ్రాభివృద్ధి కోసం రూపొందించిన బృహత్తర ప్రణాళిక ప్రకారం.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అందుబాటులోనికి వచ్చాక.. దేశీయ, అంతర్జాతీయ రెండింటి కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగుతాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న టెర్మినల్ భవనాన్ని కార్గోకు కేటాయించాలని మొదట నిర్ణయించారు. కానీ.. అత్యాధునికంగా నిర్మించిన టెర్మినల్ భవనం కావడంతో.. కార్గోకు వినియోగించడం కంటే.. వీఐపీ, హజ్ యాత్రికుల రాకపోకలకు వినియోగిస్తే బాగుంటుందని ప్రస్తుతం భావిస్తున్నారు. ఈ రెండింటికీ కాకుంటే.. దిల్లీ, ముంబయి లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాదిరిగా.. అత్యధిక రద్దీ ఉండే ఏదైనా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మొత్తం ప్రక్రియ ఒకేచోట నుంచి జరిగేలా ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఆఫ్రాన్‌కు ఆనుకునే నిర్మాణం..విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు సమీపంలోనే ఆప్రాన్‌ను ఆనుకుని కొత్త టెర్మినల్‌ను నిర్మించనున్నారు. దీనికోసం ఆప్రాన్‌ను సైతం పొడిగించి.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి అనుసంధానం చేస్తారు. ఆప్రాన్‌లోనికి వచ్చి ఆగే విమానాల నుంచి నేరుగా ఏరో బ్రిడ్జ్‌ల మీదుగా ప్రయాణికులు టెర్మినల్ భవనంలోనికి నడుచుకుంటూ వచ్చేయొచ్చు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఉన్నట్టుగా ప్రత్యేక బస్సుల్లో వెళ్లి విమానాలను ఎక్కాల్సిన అవసరం ఉండదు.
sonykongara Posted December 3, 2018 Author Posted December 3, 2018 విజయవాడ - సింగపూర్.. రేపు విమాన సర్వీస్ ప్రారంభం03-12-2018 10:14:26 ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు రామవరప్పాడు(విజయవాడ): గన్నవరం విమానాశ్రయం నుంచి ఈనెల 4 నుంచి సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు పారంభం కానున్నట్లు కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయడు విమాన సర్వీసును ప్రారంభిస్తారన్నారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా ఇక్కడి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు ప్రారంభం కావడం ముఖ్య ఘట్టమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.40గంటలకు ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6.45గంటలకు సింగపూర్‌కు బయలుదేరుతుందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనన్నుట్టు కలెక్టరు పేర్కొన్నారు. తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను గౌరవ అతిధులతో అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ, జాతీయ ప్రయాణికులకు రాష్ట్ర పర్యాటక సమాచారం తెలిసేలా విమానాశ్రయంలో టూరిజం స్టాల్ ఏర్పాటు చేసినట్టు కలెక్టరు లక్ష్మీకాంతం తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో కృష్ణా జిల్లాదే అగ్రస్థానం సంక్షేమ పథకాల అమల్లో కృష్ణాజిల్లా 11 పాయింట్లు సాధించి రాష్టంలోనే అగ్రస్థానంలో ఉందని కలెక్టరు బి.లక్ష్మీకాంతం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు చివరి వరకు జిల్లాలో సాధించిన సంక్షేమ అభివృద్ధి కార్యాక్రమాల ప్రగతితో రాష్టప్రభుత్వం ర్యాంకింగ్ ప్రకటించడం జరిగిందన్నారు. 2017-18 గ్రాస్ డ్రిస్టిక్ట్ డొమిస్టిక్ ప్రొడక్ట్ 97వేల 59 కోట్లు, తలసరి ఆదాయం లక్ష 89వేల 121 కోట్లు సాధించి రాష్టంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి (జీవీఏ గ్రాస్ వాల్యూ ఆడెడ్) 36వేల 70కోట్లు సాధించి మొదటి స్ధానంలో నిలచామన్నారు. వ్యవసాయం, చేపలు, రొయ్యల ఉత్పత్తి, రవాణా, ఆరోగ్యరంగం, సంతోష సూచికల్లో రాష్టంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కృష్ణాజిల్లా ప్రగతిని సమిక్షీంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆభినందించినట్టు కలెక్టర్ తెలిపారు. Advertisem
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now