sonykongara Posted February 24, 2019 Author Posted February 24, 2019 అగ్నిపై పోరుకు.. అధునాతన శకటాలు... గన్నవరం విమానాశ్రయంలో పక్కాగా ఏర్పాట్లుబెంగళూరు ఘటన నేపథ్యంలో ఈనాడు పరిశీలన ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో అగ్ని ప్రమాదాల నిరోధకానికి పక్కాగా ఏర్పాట్లున్నాయి. విమానాశ్రయంలో ఉన్న అంతర్జాతీయ, దేశీయ టెర్మినళ్లలో అధునాతన అగ్నిమాపక స్ప్రింక్లర్ల వ్యవస్థ ఉంది. ఏమాత్రం చిన్న పొగ వచ్చినా వెంటనే నీటిని వెదజల్లి ఆర్పేస్తాయి. ప్రస్తుతం విమానాశ్రయం ఫైర్‌స్టేషన్ కేటగిరి 7లో ఉంది. ప్రయాణికుల రద్దీ, రాకపోకలు సాగించే విమాన సర్వీసుల ఆధారంగా కేటగిరి 7లో రెండు అగ్నిమాపక వాహనాలు ఉంటే సరిపోతుంది. గన్నవరం విమానాశ్రయంలో అధునాతనమైన మూడు అగ్నిమాపక వాహనాలున్నాయి. వీటిలో రెండింటిని ఆస్ట్రియా నుంచి ఏడాదిన్నర కిందట తెప్పించారు. ఒక్కొక్కటీ రూ.6 కోట్ల విలువైన ఈ ఫైర్ ఫైటర్ వాహనాలు.. ఎప్పుడూ 10వేల లీటర్ల నీరు, 1300లీటర్ల ఫోమ్‌తో సిద్ధంగా ఉంటాయి. ఈ వాహనాలు ఎంత పెద్ద మంటల్లోనికైనా దూసుకెళ్లిపోయేలా.. ప్రత్యేకంగా సెల్ఫ్ ప్రొటక్షన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. మూడోది అగ్నివిజయ్ వాహనం. దీనిలో 7500 లీటర్ల నీరు, 850లీటర్ల ఫోమ్ సిద్ధంగా ఉంటుంది. విమానాశ్రయంలోని ఏ మూలకైనా ప్రమాదం జరిగిన 60 సెకెన్ల సమయంలో దూసుకెళ్లిపోయి.. నీరు, ఫోమ్‌ను మంటలపైకి వెదలజల్లే సామర్థ్యం ఉన్నవి. రెండున్నర నిమిషాల్లోనే ఎంత పెద్దదైనా మంటలనైనా ఆర్పేస్తాయి. బెంగళూరు విమానాశ్రయం పార్కింగ్ ప్రదేశంలో శనివారం జరిగిన అగ్నిప్రమాద సంఘటన నేపథ్యంలో ఈనాడు బృందం గన్నవరం విమానాశ్రయాన్ని పరిశీలించింది. అక్కడి పరిస్థితులు ఇవీ... గన్నవరం విమానాశ్రయంలో ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీనే అధికంగా ఉంది. నిత్యం 55 సర్వీసులు దేశంలోని ఎనిమిది నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ 3వేల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దేశీయ టెర్మినల్ వద్దే వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ 500 కార్లు నిలిపేలా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఒకేసారి వంద వాహనాలకు మించి పార్కింగ్ చేసినంత రద్దీ ఎప్పుడూ ఉండదు. అంతర్జాతీయ సర్వీసులు ప్రస్తుతం మంగళ, గురువారాల్లోనే ఒక సర్వీసు సింగపూర్‌కు నడుస్తోంది. అందుకే.. ఆ రెండు రోజులు మినహా ఇక్కడ రద్దీ పెద్దగా ఉండదు. అంతర్జాతీయ టెర్మినల్ వద్ద సైతం 200 కార్లను నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో సిమెంట్‌తో ఫ్లోరింగ్ ఉండడంతో ప్రమాదాలకు ఆస్కారం లేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవించినా.. వెంటనే అక్కడికి క్షణాల్లో చేరుకునేలా 30 మంది అగ్నిమాకప దళ సిబ్బంది, వాహనాలతో ఎప్పుడూ స్టాండ్‌బై పొజిషన్‌లో సిద్ధంగా ఉంటారు. బాధితులకు ప్రథమ చికిత్స అందించేందుకు, తరలించేందుకు రెండు అధునాతన అంబులెన్స్‌లు సైతం సిద్ధంగా ఉంటాయి. విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో ఫైర్ కంట్రోల్ యూనిట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తమవుతుంటారని గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు వెల్లడించారు.
ravindras Posted February 25, 2019 Posted February 25, 2019 eluru canal ki other side lands ni no-construction zone lo pettaali. future lo second runway canal ki other side first runway ki parallel gaa kattavachu . mangalagiri/tadikonda/pedaparimi lo airport kadithe capital ki building height restrictions vasthaayi. another problem will be capital is surrounded by small hills. cbn building towers with 50 stairs, assembly with big cone shaped structure. they may obstruct flight path and visibility during winter season due to snow. https://www.google.com/maps/place/Vijayawada+International+Airport/@16.5107543,80.7878552,14z/data=!4m5!3m4!1s0x0:0x1bc844d2b2e24c5!8m2!3d16.523838!4d80.7914172
sonykongara Posted February 26, 2019 Author Posted February 26, 2019 అడుగు ముందుకు..26-02-2019 08:22:14 విమానాశ్రయ విస్తరణ బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులు ప్రారంభం చిన అవుటపల్లిలో లే అవుట్‌లో పనులు ప్రారంభం 49.35 ఎకరాలలో మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాగానే.. ఇళ్ల నిర్మాణం విజయవాడ (ఆంధ్రజ్యోతి): విమానా శ్రయ విస్తరణ బాధితులకు సాంత్వన చేకూర్చటానికి రెవెన్యూ యంత్రాంగం ఒకడుగు ముందుకు వేసింది. విస్తరణలో భాగంగా నిరాశ్రయులవుతున్న పేదల పునరా వాసం కోసం చిన అవుటపల్లిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులను రెవెన్యూ యంత్రాంగం చేపట్టింది. మొత్తం 49.35 ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదు పాయాలను కల్పిస్తోంది. విస్తరణం శీర్షికన.. విమానా శ్రయ విస్తరణకు సంబంధించిన వివిధ రకాల బాధితుల సమస్యలపై రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం నేపథ్యంలో, రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ యంత్రాంగం పేదలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులకు శ్రీకారం చుట్టింది. చిన అవుట పల్లిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులను రెవెన్యూ యం త్రాంగం చేపట్టడంతో బుద్ధవరం, దావాజిగూడెం, అల్లా పురం ప్రాంత పేదల్లో సంతోషం నెలకొంది. విమానాశ్రయ అధికారులు కూడా హమ్మయ్య అని నిట్టూర్పు విడు స్తున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు, ఇళ్ల నిర్మా ణాన్ని కూడా త్వరితగతిన చేపట్టాలని పేదలు, విమా నాశ్రయ అధికారులు కోరుతున్నారు. మౌలిక సదు పాయాల కల్పన ప్రారంభించిన నేపథ్యంలో, ఇళ్ల నిర్మాణ పనులను ఏజెన్సీద్వారా చేపట్టేందుకు చర్యలు తీసు కోవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఏక కాలంలో ప్యాకేజీ పనులు చిన అవుటపల్లిలో రెవెన్యూ యంత్రాంగం ఏకకాలంలో పనులు చేయిస్తోంది. రెవెన్యూ పర్యవేక్షణలో రోడ్లు, డ్రెయిన్ల పనులు ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులను చూస్తోంది. లే అవుట్ ప్రకారం.. నిర్దేశించిన మార్కింగ్ ప్రకారం రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నారు. మంచినీటి సరఫరా పనులను గ్రామీణ నీటిసరఫరా అధికారులు చేపడుతున్నారు. వీధిలైట్ల పనులను విద్యుత్‌శాఖ చేపడుతోంది. మొత్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 13.60 ఎకరాలలో పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. చిన అవుటపల్లి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సంబంధిత శాఖలు చేపడు తున్న పనులను సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. సకల వసతులతో.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో రెవెన్యూ యంత్రాంగం అనేక ప్రత్యేకతలు కల్పిస్తోంది. ఒక మోడల్ గ్రామంగా సదుపాయాలను కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం 51 సెంట్ల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్ల్యూఎం) ప్లాంట్‌ను 12 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 40 సెంట్ల విస్తీర్ణంలో ఒక దేవాలయ నిర్మాణం, 10 సెంట్ల విస్తీర్ణంలో అంగన్‌వాడీ కేంద్రం, 25 సెంట్ల విస్తీర్ణంలో మంచినీటి ట్యాంక్, 20 సెంట్ల విస్తీర్ణంలో ఆర్‌ఓ మినరల్ ప్లాంట్, 67 సెంట్ల విస్తీర్ణంలో పార్కు , 13 సెంట్ల విస్తీర్ణంలో లైబ్రరీ నిర్మాణం, 10 సెంట్ల స్థలంలో వెటరినరీ హాస్పిటల్, 25 సెంటర్ల స్థలంలో గోకులం, ఎకరంన్నర స్థలంలో ఎంపీపీ స్కూల్, 8 సెంట్ల స్థలంలో న్యూట్రీ గార్డెన్, 19 సెంట్ల స్థలంలో హెల్త్ సబ్ సెంటర్, 20 సెంట్ల స్థలంలో గ్రామ పంచాయితీ కార్యాలయం, 11 సెంట్ల స్థలంలో వీఆర్‌ఓ కార్యాలయం, 72 సెంట్ల స్థలంలో హిందూ శ్మశానం, 56 సెంట్ల విస్తీర్ణంలో క్రిస్టియన్ శ్మశానంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం మరో 16 సెంట్లను కూడా అందు బాటులో ఉంచారు. ఇదీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ స్వరూపం జిల్లా : కృష్ణా మండలం : గన్నవరం గ్రామం : చిన అవుటపల్లి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విస్తీర్ణం : 49.35 ఎకరాలు మొత్తం ప్లాట్ల విస్తీర్ణం : 24.35 ఎకరాలు ఆట స్థలం : 3.90 ఎకరాలు ఓపెన్ స్పేస్ : 7.50 ఎకరాలు రోడ్లు : 13.60 ఎకరాలు మొత్తం ప్లాట్లు : 487 ప్లాటు విస్తీర్ణం : 250 చదరపు గజాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులపై దృష్టి.. విమానాశ్రయ విస్తరణ బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులను ప్రారంభించాం. ఒక పక్క ఎన్నికల విధులతో చాలా బిజీగా ఉన్నప్పటికీ బాధితుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులకు శ్రీకారం చుట్టాం. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా పనులు జరుగుతున్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, గోకులం, వీఆర్‌ఓ భవనం వంటివి కల్పిస్తున్నాం. బాధితులకు ప్యాకేజీలో భాగంగా అన్ని సదుపాయాలను కల్పిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేపట్టాలని ఆదేశించాం. వేగంగానే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - స్వప్నిల్ దినకర్, సబ్ కలెక్టర్, నూజివీడు
sonykongara Posted March 2, 2019 Author Posted March 2, 2019 గన్నవరం-కొచ్చి విమాన సర్వీసు ప్రారంభం ఈనాడు, విజయవాడ: గన్నవరం నుంచి కేరళలోని కొచ్చికి స్పైస్‌జెట్ విమాన సర్వీసు శుక్రవారం నుంచి ఆరంభమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 5 గంటలకు 72మంది ప్రయాణికులతో బయలుదేరి కొచ్చికి వెళ్లింది. 78 సీట్లు ఉన్న విమాన సర్వీసు తొలిరోజే నిండుగా గాలిలోకి లేచింది. అంతకుముందు మధ్యాహ్నం 12.25కు కొచ్చి నుంచి తిరుపతి మీదుగా 66మంది ప్రయాణికులతో ఈ విమాన సర్వీసు గన్నవరానికి చేరుకుంది. మధ్యాహ్నం 3గంటలకు మొదటి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్‌ను గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదనరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు సర్వీసులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నామన్నారు. మంగళవారం మినహా మిగతా రోజులు కొచ్చి సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
sonykongara Posted March 2, 2019 Author Posted March 2, 2019 విమానాశ్రయ విస్తరణ బాధితులకు అధునాతన గృహాలు02-03-2019 10:04:28 దేశానికే ఆదర్శంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ. 15 కోట్ల అదనపు గ్రాంటు కోసం ప్రభుత్వానికి వినతి ప్రతిపాదన సిద్ధం చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఎఫ్ 6తో పాటు మరికొన్ని సంస్థల నుంచి డిజైన్లు మౌలిక సదుపాయాల కల్పనపై జేసీ కృతికా శుక్లా సమీక్ష రూ.30 కోట్లతో మోడల్ గృహ నిర్మాణాలు విమానాశ్రయ విస్తరణ బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న రెవెన్యూ యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది. విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అధునాతన గృహాలను కట్టించి ఇచ్చేందుకు మోడల్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. దేశంలోనే మోడల్ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీగా నిలపాలన్న ఉద్దేశంతో రెవెన్యూ యంత్రాంగం రూ. 30 కోట్ల అంచనాలతో ప్రణాళికలను సిద్ధం చేసింది. విజయవాడ /గన్నవరం, మార్చి1 (ఆంధ్ర జ్యోతి): విమానాశ్రయ విస్తరణ బాధితుల కోసం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ లో యు ద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న రెవెన్యూ యంత్రాంగం మరో అ డుగు ముందుకు వేసింది. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అధునాతన మోడల్ గృహాలను కట్టించి ఇ చ్చేందుకు మోడల్ ప్రాజెక్టులపై దృష్టి సారిం చింది. దేశంలోనే మోడల్ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకే జీగా నిలపాలన్న ఉద్దేశ్యంతో రెవెన్యూ యం త్రాంగం రూ.30 కోట్ల అంచనాలతో ప్రణా ళికలను సిద్ధం చేశారు. ఒక్కో గృహాన్ని రూ.5 లక్షలతో నిర్మించేందుకు రెవెన్యూ యం త్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఏ మోడల్‌లో ఇళ్ళను నిర్వహించాలన్న దానిపై గతంలో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రా జెక్టులకు డిజైన్లు ఇచ్చిన ఎఫ్ 6 సంస్థతో చర్చించటంతో పాటు దేశవ్యాప్తంగా మరిన్ని మంచి సంస్థల నుంచి మోడల్ గృహాల న మూనాలకు సంబంధించి అధ్యయనం చే యాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. ఈ ప్రక్రియ పక్షం రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. డిజైన్లు ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన విమానాశ్రయ విస్తరణ బాధితులకు ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం గతంలో ఇచ్చిన గ్రాంట్‌కు తోడు అదనంగా మరికొంత గ్రాంట్ అవ సరమేర్పడుతోంది. గతంలో ఇంటికి రూ.2.50 లక్షల చొప్పున వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రాంటు ఇవ్వటానికి అంగీకరించింది. ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ విధానాన్ని ఆదర్శవంతంగా నిలపాలన్న ఉద్దేశ్యంతో మోడల్ గృహాల కాన్సెప్ట్‌ను జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీసుకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఒక్కో గృహానికి రూ.5 లక్షల వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి రూ.15 కోట్ల అదనపు గ్రాంట్ అవసరమేర్పడుతుంది. అదనపు గ్రాంటును కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలన్న ఉద్దే శంతో జిల్లా యంత్రాంగం ఉంది. జాయింట్ కలెక్టర్ కృతిక శుక్లా ఈ మేరకు ప్రభుత్వానికి మరి కొద్దిరోజులలోనే ప్రతిపాదన పంపించనున్నారు. మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేయండి.. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భా గంగా ఇళ్లుకోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేలో చేపట్టనున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ ఇంజినీర్లకు జాయింట్ కలెక్టరు కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టరు తన క్యాంపు కార్యాలయలో నూజివీడు సబ్ కలెక్టరు స్వప్నిల్ దినక ర్, ఇతర ఇంజినీర్లతో కలిసి పునరావాస పనులపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జా యింట్ కలెక్టరు మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్ ప్యావేజీలో చేపట్టిన ప్లాట్‌లకు సంబంధించి పెగ్‌మార్క్‌ను గుర్తించి శాశ్వతప్రాతిపదికన ఫ్లాట్ నెంబరుతో సహా సిమెంటుతోకూడిన పెగ్‌లను ఏర్పాటు చేయాలని సర్వే శాఖ స హాయ సంచాలకులుకు ఆదేశించారు. కే టాయించిన ఫ్లాట్‌లో విద్యుత్తు, తాగునీరు, డ్రైయినేజి, సిమెంటురోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు తక్షణం కల్పించే విధంగా సంబంధిత శాఖల ఇంజినీర్లు పనిచేయాలని జేసీ ఆదేశించారు. ఇప్పటికే తాగునీరుకు సం బంధించి పైపులైన్లు, బోర్ వెల్స్ నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని వీటి పను లను ప్రారంభించనున్నట్లు ఆర్ డబ్ల్యుయస్ పర్యవేక్షక ఇంజినీరు సాయినాథ్ పేర్కొ న్నారు. భూగర్భ డ్రైయినేజీతోపాటు, సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మాణానికి ప్రతి పాదనలు సిద్ధంగా ఉన్నాయని త్వరలో పను లు ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీరు శివకుమార్ తెలిపారు. ఏలూరుకాల్వపై ని ర్మించ తలపెట్టిన వంతెన పనులను త్వరలో ప్రా రంభించనున్నట్లు ఆర్‌అండ్‌ఆర్ ఈఈ తెలి పారు. ఏపీఎస్‌పీడీఎల్ ఇంజినీర్లు విద్యుత్తు అంశాలను త్వరితగతిన చొరవచూపి విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేసేవిధంగా పనిచేయాలని ఇంజినీర్లకు సూచించారు.
sonykongara Posted March 2, 2019 Author Posted March 2, 2019 హౌస్‌ఫుల్ 02-03-2019 10:14:54 కొచిన్‌కు.. తొలిరోజే.. పర్యాటకులలో జోష్ !! ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళకు.. 72 సీట్ల సామర్థ్యంతో ప్రారంభించిన స్పైస్‌జెట్ ప్రతి రోజూ విమాన సర్వీసు ఎయిర్‌పోర్టు (గన్నవరం), మార్చి 1: తొలి రోజే కేరళ రాష్ట్రం కొచిన్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం హౌస్‌ఫుల్ అయింది! దేశీయ విమానయాన రంగంలో విజయవాడ ఎయిర్‌పోర్టు మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రంలోని కొచిన్ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. పొరుగు రాష్ర్టాలైన తెలంగాణాలో హైదరాబాద్‌కు, తమిళనాడులోని చెన్నై, కర్నాటకలోని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజఽధాని ముంబాయిల తర్వాత.. ఏడవ రాష్ట్ర సర్వీసుగా కేరళ రాష్ట్రం కొచిన్‌కు సర్వీసు ప్రారంభం కావటం గమనార్హం. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఈ సరీసును ప్రారంభించింది. ఈ సర్వీసు రోజూ విజయవాడ నుంచి కొచిన్‌కు బయలు దేరటం గమనార్హం. రోజు సాయంత్రం స్పైస్‌జెట్ విమానం 4.20 వచ్చి 5 గంటలకు బయలుదేరి తిరుపతి మీదుగా కొచ్చిన్ వెళుతుంది. ఈ సర్వీసుకు సంబంధించి 72 సీట్ల సామర్ధ్యం ఉంది. తొలి రోజు అన్ని సీట్లు నిండాయి. దేశీయంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కేరళ ప్రధానమైనదని చెప్పుకోవాలి. దేశీయంగా కేంద్ర పాలిత ప్రాంత గోవాతో సరిసమానంగా కేరళకు పర్యాటకల సంఖ్య పోటెత్తుతుంటుంది. ప్రధానంగా కోస్తా జిల్లాల ప్రాంతాల ప్రజలకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక బంధం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కువుగా కేరళ రాష్ర్టానికి పర్యాటక విడిది చేస్తుంటారు. అక్కడి సహజ అందాల నేపథ్యంలో, ప్రతి వేసవి సీజన్‌లోనూ భారీ సంఖ్యలో పర్యాటకులు కేరళ వెళుతుంటారు. కేరళ వెళ్లేవారికి ఈ విమాన సర్వీసు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పర్యాటకుల అవసరాలను తీర్చటంలో ఎంతగానో ఈ విమాన సర్వీసు దోహదపడనుంది. వీటన్నింటికంటే మించి చూస్తే ప్రధానంగా శబరిమలై వెళ్లే యాత్రికులకు మన ప్రాంతం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ విమాన సర్వీసు ద్వారా త్వరగా శబరిమలైకు చేరుకుని అయ్యప్పస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. కొచిన్ సర్వీసును ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి ఓటింగ్ పాస్‌ను ఎనికేపాడుకు చెందిన ఫాదర్ జోసఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ దీనివలన తిరుపతి, బెంగళూరు, కొచ్చిన్ వెళ్ళేవారికి మంచి సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు ఏసీపీ వెంకటరత్నం, సంస్థ ప్రతినిధి కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted March 4, 2019 Author Posted March 4, 2019 ‘సౌర’వెలుగులు ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. విమానాశ్రయంలో దీని కోసం భారీ సౌర విద్యుత్తు ప్లాంటు సిద్ధమవుతోంది. రూ.6 కోట్లతో రోజుకు ఒక మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు ఈ ప్లాంట్ సిద్ధమై అందుబాటులోనికి రానుంది. విమానాశ్రయానికి అవసరమయ్యే మొత్తం విద్యుత్తులో 70శాతం ఈ ప్లాంట్ ఉత్పిత్తి చేసే దానితోనే వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గత ఐదు నెలలుగా ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సౌర పలకలను సైతం భారీగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే సౌర విద్యుత్తుతో నడిచే మొట్టమొదటి విమానాశ్రయంగా గన్నవరం గుర్తింపును తెచ్చుకోబోతోంది. గన్నవరం విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనానికి వెళ్లే మార్గంలో కుడివైపున భారీఎత్తున సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటవుతోంది. భారత విమానయాన సంస్థ ఆధ్వర్యంలో నోవాస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ అందుబాటులోకి వస్తే పర్యావరణహిత విద్యుత్తు వెలుగులను విరజిమ్మే విమానాశ్రయంగా గన్నవరం మారబోతోంది. ప్రస్తుతం నెలకు రూ.30 లక్షలకు పైగా విద్యుత్తు వినియోగానికి ఖర్చవుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్తు ప్లాంట్ అందుబాటులోనికి వస్తే నెలకు రూ.21 లక్షల వరకూ విద్యుత్తు ఖర్చు తగ్గిపోనుంది. మార్చి 31లోగా పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో జోరుగా చేపడుతున్నారు. విమానాశ్రయంలో రన్‌వే, టెర్మినల్ భవనాలు సహా ప్రాంగణం మొత్తం 24గంటలూ విద్యుత్తు ఉండాలి. ఒకవేళ విద్యుత్తుకు అంతరాయం ఏర్పడితే ఎనిమిది సెకన్లలో ఆన్ అయ్యే అధునాతన జనరేటర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు సరిపోతుంది..ప్రస్తుతం విమానాశ్రయంలో అధునాతన దేశీయ టెర్మినల్ భవనం ఉంది. రూ.160 కోట్లతో దీనిని నిర్మించారు. దేశీయ ప్రయాణికులు, సర్వీసుల రాకపోకలు, సంస్థల కార్యకలాపాలన్నీ ఈ నూతన టెర్మినల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో ఏసీలు 24గంటలూ పనిచేస్తూ ఉంటాయి. వీటి కోసం ఏసీ ప్లాంట్‌ను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. తాజాగా అంతర్జాతీయ టెర్మినల్ భవనం సైతం అందుబాటులోకి వచ్చింది. దీనిలోనూ ఏసీలు, సీసీ కెమెరాలు, బ్యాగేజీ తనిఖీ యంత్రాలు, కన్వేయర్ బెల్ట్‌లు.. సహా అన్నింటికీ విద్యుత్తు అత్యంత కీలకం. వీటన్నింటికీ తోడు రన్‌వే లైటింగ్, సిగ్నలింగ్ వ్యవస్థకు నిరంతరాయంగా విద్యుత్తు అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలన్నీ ఒకేచోట నుంచి నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వచ్చాక విద్యుత్తు అవసరాలు మరింత పెరుగుతాయి. అప్పటి అవసరాన్ని బట్టి.. రెండో దశలో మరో సౌర విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేయడం లేదంటే.. ఉన్నదాని సామర్థ్యం పెంచడం చేయాలనేది ప్రణాళిక. అనుకున్న లక్ష్యంలోగా అతి తక్కువ సమయంలోనే సౌర విద్యుత్తు ప్లాంటు పనులను పూర్తిచేసి.. అందుబాటులోకి తేవడం జరుగుతోందని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదన్‌రావు వెల్లడించారు.
sonykongara Posted March 5, 2019 Author Posted March 5, 2019 మూణ్ణాళ్ల.. ముచ్చటేనా?05-03-2019 09:00:21 ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు పీఐబీ ఆమోదం ఏదీ? భూమిపూజ జరిగి సరిగ్గా 3 నెలలు ఇప్పటి వరకు ప్రాజెక్టుకు అనుమతే ఇవ్వని కేంద్రం ! ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే తీవ్ర జాప్యం నవ్యాంధ్ర అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు భూమి పూజ చేసి సరిగ్గా మూడు నెలలు కావస్తున్నా ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) దగ్గర ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా భూమిపూజ జరిగిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లిప్తతపై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర స్థాయిలోని పీఐబీ ఆమోదం పొందితేనే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు ప్రారంభించటానికి అవకాశం కలుగుతుంది. విజయవాడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర అమరావతికి బ్రాండింగ్ కల్పించే అత్యద్భుత విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నామని ప్రకటించిన కేంద్రం.. అబ్బుర పరిచేలా డిజైన్లు చూపించింది. పీఐబీ అనుమతులు రాకుండానే భూమి పూజ చేయటమేమిటన్న వాదనలు అప్పుడే వచ్చినా కేంద్రం వాటిని కొట్టిపారవేసింది. భూమి పూజే చేస్తుండటంతో పీఐబీ పెద్ద విషయం కాదని, అనుమతులు లాంఛనమేనని చెప్పి మరీ భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు నెలల కాలంగా కేంద్రం దగ్గరే ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పోనీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకుందామంటే కోర్రీలు కూడా వేయలేదు. పీఐబీ దగ్గర గతంలో విజయవాడ మీడియం మెట్రో ప్రాజెక్టు ఫైల్ కూడా ఇలాగే నాన్చి నాన్చి కొత్త మెట్రో పాలసీకి అనుగుణంగా డీపీఆర్‌ను తయారు చేసి పంపాలని కోరింది. దీంతో మీడియం మెట్రో ప్రాజెక్టు కథ కంచికి చేరింది. విజయవాడ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ విష యంలో కూడా ఇలానే చేస్తారా అన్న సం దేహాలు వ్యక్తం అవు తున్నాయి. త్వరలో ఎన్నికల కోడ్ రాబోతుంది. ఇలాంటపుడు నోటిఫికేషన్ ఇస్తే .. మళ్లీ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వం కొలువు తీరే వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. అప్పటి వరకు వేచి ఉండాలంటే ఎంత లేదన్నా.. నాలుగైదు నెలల సమయం వృధా అవుతుంది. సమ యా భావం పెరిగేకొద్దీ .. అంచనా వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉంది. నవ్యాంధ్ర రాజధానికే బ్రాండ్ ఎయి ర్‌పోర్టుగా అభివృద్ధి చేస్తామని భూ మిపూజ సందర్భంలో ప్రకటించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ తర్వాత దీని ఊసు మరిచిపోయారు. సోమవారం నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు భూమిపూజ జరిగి మూడు నెలలు అయినా ఇప్పటి వరకు అనుమతులు రాకపోవటంతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)గా ఉన్న స్టుప్ సంస్థ చేతుల్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. అత్యాధునిక హంగులు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ఎయిర్‌పోర్టు ఆవరణలో 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 611 కోట్ల వ్యయంతో నిర్మించటానికి అంచనాలను సిద్ధం చేశారు. స్టీలు, గ్లాస్ స్ట్రక్చర్ విధానంలో దీనిని నిర్మించేందుకు వీలుగా డిజైన్లు రూపొందించారు. డిజైన్లు చూస్తే కృష్ణానది పరవళ్లు, కూచిపూడి వైభవం, మల్లెపూలు, బౌద్ధారామాలన్నింటినీ మేళవించి అత్యద్భుతంగా ఆకృతులను రూపొందించారు. ఈ టెర్మినల్ బిల్డింగ్‌లో ఆధునిక బ్యాగేజి హ్యాండ్లింగ్, అరైవల్ బ్యాగేజి క్లెయిహ కారోసెల్స్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫైర్ అలారం, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, సీసీ టీవీ సర్వైలెన్స్, కస్టమ్స్, ఇమిగ్రేషన్ కౌంటర్స్, కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్ వంటి సదుపాయాలను కల్పించనున్నారు. గంటకు 1200 మంది సామర్ధ్యంతో కూడిన లాంజ్ సదుపాయం ఉంటుంది. వీటీతో పాటు మూడు ఏరో బ్రిడ్జిల ఏర్పాటు, 3 కోడ్ ఈ విమానాలు, 6 కోడ్ సీ విమానాలు పార్కింగ్ చేసుకునే ఆప్రాన్ నిర్మాణం చేపట్టటానికి డిజైన్లు రూపొందించారు. సిద్ధంగా ఉన్న ‘స్టుప్ ’ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ) గా ‘స్టుప్’ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సంస్థ నేతృత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్‌కు డిజైన్లను రూపొందించటం జరిగింది. ఈ సంస్థ నేతృత్వంలో పనులకు టెండర్లు పిలవటం, టెండర్లు ఖరారు చేయటం, ఎంపికైన కాంట్రాక్టరు పనిని పూర్తి చేసే వరకు ‘స్టుప్’ సంస్థ స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టుప్ సంస్థ టెండర్లను పిలవటానికి అంతా సిద్ధం చేసుకుని కూర్చుంది. ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు భూమిపూజ చేసినప్పటి నుంచి పీఐబీ నుంచి అనుమతులు ఎప్పుడు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా ఈ సంస్థ ఎదురు చూస్తోంది
Peter Griffin Posted March 7, 2019 Posted March 7, 2019 wiki lo singapore dhi may 28th yee last ani chupisthunadhi. indigo site lo kuda tharuvatha bookings chupinchatam ledhu
Yaswanth526 Posted March 7, 2019 Posted March 7, 2019 #Vijayawada Airport January month DGCA numbers are out Total Passengers: 96,982 Total Freight: 186.1 Tonnes Total Mail: 19.9 Tonnes G Venkatesh 1
Bezawada_Lion Posted March 8, 2019 Posted March 8, 2019 22 hours ago, katti said: why Singapore is not shown? VGF agreement 6 months ey gaa....anduke anthavarake choopistundi emo
swarnandhra Posted March 8, 2019 Posted March 8, 2019 6 months yena? Hammayya, ee tuglak Indigo ni vadilesi Silkair or other codesharing agreements vunna airline ki ivvatam better. Singapore lo connecting flight easy avutundi.
rk09 Posted March 8, 2019 Posted March 8, 2019 On 2/17/2019 at 2:28 PM, rk09 said: yes aa foreign low cost carriers ni lagali aa viability gap money edo vallaki isthe poddi like Silk Air to Singapore Flydubai to dubai Jet Airways to Abu Dubai They have code sharing with their respective parent airlines Singapore Airlines, Emirates and Etihad mana local carriers eppudo okappudu handsup anela vunnaru -
ravindras Posted March 9, 2019 Posted March 9, 2019 7 minutes ago, Yaswanth526 said: bangalore airport passenger growth super. they are able to handle 1 lakh passengers per day with single runway & dual taxiway.
sonykongara Posted March 26, 2019 Author Posted March 26, 2019 నవ్యాంధ్రకే తలమానికంగా..26-03-2019 09:24:22 నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కీలక విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు.. 700 ఎకరాల భూ సేకరణతో సుసాధ్యం భూ సేకరణతో .. ఎయిర్‌పోర్టు మెగా విస్తరణ పర్వం ప్రధాన రాష్ర్టాలకు విమానయానం అనుసంధానం అంతర్జాతీయంగా .. సింగపూర్‌కు విమాన సర్వీసు.. లైన్‌లో దుబాయ్ ! విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్రకే తలమానికంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం నేవీ హెలికాఫ్టర్లకు షెల్టర్‌జోన్‌గా ఉండే ఈ విమానాశ్రయం.. రాష్ట్ర విభజన తర్వాత కొత్త సొబగులు అద్దుకుంది. రాజధాని అమరావతి పరిధిలో ఉండటం.. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి భూసేకరణ చేసి ఏఏఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)కు అప్పగించింది. మహా విస్తరణ రూపం దాల్చింది. తర్వాత అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపడటంతో మహర్దశ పట్టింది. ప్రయాణికుల సంఖ్య ఏటా వృద్ధి చెందుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి విమాన ప్రయాణికులు ఇక్కడకు రావడంతో నవ్యాంధ్రలో కీలక విమానాశ్రయంగా మారింది. ఆంధ్రజ్యోతి విజయవాడ: నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో విజయవాడ(గన్నవరం) ఎయిర్‌పోర్టు రూపురేఖలే మారిపోయాయి. మెట్రో పాలిటన్ నగరాల విమానాశ్రయ వృద్ధిరేటు కంటే విజయవాడ విమానాశ్రయం నమోదు చేస్తున్న వృద్ధి ఎక్కువగా ఉంటోంది. ఈ విమానాశ్రయం మహా విస్తరణ రూపం దాల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో అవసరమైన భూములను అప్పగించడం, తగిన సహకారం అందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక అవసరాల కోసం నాటి బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌పోర్టు ఇది. ఆ తర్వాత .. స్వాతంత్ర్యానంతరం ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక్కటి నడిచేది. నేవీకి చెందిన హెలికాప్టర్లకు షెల్టర్‌జోన్‌గా ఎయిర్‌పోర్టుగా ఉండేది. అలాంటి విమానాశ్రయంలో దశాబ్దం క్రితం ఒకే ఒక్క సర్వీసుగా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌కు సర్వీసును నడిపేది. ఆ సంస్థ మూత పడిన తర్వాత పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. విభజన తర్వాత విమానాశ్రయానికి కొత్త సొబగులు వచ్చాయి. ప్రభుత్వ దూరదృష్టి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేసింది. 700 ఎకరాల భూములను విస్తరణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినా సీఎం చంద్రబాబు అప్పట్లో వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో సమానంగా గన్నవరం ప్రాంత రైతులకు కూడా ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో భూ సేకరణ సుసాధ్యమైంది. వీటిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు అప్పగించారు. సంస్థలకు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం విమానయాన ఇంథనంపై ట్యాక్సులను తగ్గించడంతో ఆ సంస్థలకు ప్రోత్సాహకరంగా మారింది. ఇక్కడ నుంచి అనేక విమానయాన సంస్థలు పలు ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించాయి. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ట్రూజెట్ వంటి అనేక సంస్థలు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఐదేళ్లుగా భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి, ఆర్థిక రాజధాని ముంబయికి, పొరుగు రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రాంతీయంగా విశాఖపట్నం, తిరుపతి, కడపకు సర్వీసులు ఉన్నాయి భూ సేకరణతో దశ తిరిగింది రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేయడంతో విజయవాడ విమానాశ్రయ దశ తిరిగింది. ఏఏఐ అధికారులు రూ. 143 కోట్ల వ్యయంతో పదిహేనేళ్ల అవసరాల తగ్గట్లు తాత్కాలికంగా ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. శాశ్వత టెర్మినల్ బిల్డింగ్ త్వరగా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఏఏఐ అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూములను అప్పగించడంతో 2286 మీటర్లుగా ఉన్న రన్‌వేను 3360 మీటర్ల మేర రూ. 138 కోట్ల వ్యయంతో విస్తరించడానికి మార్గమేర్పడింది. ఆ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఏఏఐ రూ.611 కోట్ల వ్యయంతో ఇంటి గ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయికి... ఖ్యాతి ఈ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఎంతో కృషి చేశారు. అప్పట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సహకరించడంతో అంతర్జాతీయ స్థాయి వచ్చింది. దీంతో కస్టమ్స్, ఇమిగ్రేషన్ విభాగాలు కొలువు తీరాయి. అయినా విదేశాలకు విమాన సర్వీసులు నడపటానికి విమానయాన సంస్థలు భయపడుతున్న దశలో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, పొరుగు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రజలకు విజయవాడ ఎయిర్‌పోర్టు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి భారీ సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. వేలాది మంది ఏటా చదువుకోవడానికి విదేశాలకు వె ళుతుంటారు. ఉపాధి పనుల కోసం వేలాది సంఖ్యలో విదేశాలకు వెళ్లేవారు ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. ప్రయాణికుల నుంచి అనూహ్య డిమాండ్ వచ్చింది. సింగపూర్‌కు ఇండిగో విమానయాన సంస్థ సర్వీసును ప్రారంభించగానే 90 - 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇది విజయవంతంకావడంతో దుబాయ్‌కు ఇదే విధానంలో సర్వీసును నడపడానికి టెండర్లు పిలిచింది. విజయవాడ విమానాశ్రయ ప్రగతి పథం : క్ర.సం సంవత్సరం ప్రయాణికుల రాకపోకలు 1. 2011 - 2012 1,57,531 2. 2012 - 2013 1,69,624 3. 2013 - 2014 1,95,714 4. 2014 - 2015 2,33,617 5. 2015 - 2016 4,04,464 6. 2016 - 2017 6,50,463 7. 2017 - 2018 8,57,000 8. 2018 - 2019 10,00,000 + (ఫిబ్రవరి నాటికి) ఎయిర్‌పోర్టులో.. మెగా ఇన్‌ఫ్రా ఇక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్, లాజిస్టిక్ టెర్మినల్ బిల్డింగ్స్‌కు వెళ్లడానికి రెండు వరసల ప్రధాన రహదారి, ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌కు కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు మరో రెండు వరసల ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టింది. రూ.15 కోట్ల వ్యయంతో విమానాశ్రయ రూపురేఖలను మార్చటానికి ల్యాండ్‌స్కేపింగ్ పనులను చేపడుతున్నారు. గతంలో ఆరు పార్కింగ్ బేలు ఉండేవి. అదనంగా మరో పదింటి నిర్మాణం చేపట్టారు. కార్ల పార్కింగ్ ఏర్పాటుచేశారు. ఆస్ర్టియా దేశపు రెండు ఫైర్‌ఫైటర్లను రూ. 10 కోట్లతో కోనుగోలు చేశారు. రూ. కోటితో ఎయిర్‌పోర్టులో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గణనీయంగా ప్రయాణికుల వృద్ధి ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటి నుంచి విమాన యాన సంస్థలు పోటాపోటీగా సర్వీసులను నడుపు తున్నాయి. ఏడాదికి 4,372 విమానాల ట్రిప్‌ల నుంచి మొదలై ప్రస్తుతం ఏడాదికి 15 వేలకు పైగా ట్రిప్స్ వేసే స్థాయికి ఎదిగింది. 2011 నుంచి 2014 వరకు రెండు లక్షల లోపే ఏడాదికి విమాన ప్రయాణికుల సంఖ్య ఉంటే.. 2014 నుంచి ఏటా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల నాటికే ఒక మిలియన్(పది లక్షలు) ప్రయాణికులు రాకపోకలు సాగించడం గమనార్హం. గన్నవరానికి ప్రాధాన్యం విమానాశ్రయం అభివృద్ధి ఈ ఐదేళ్లలో శరవేగంగా జరిగింది. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. దీంతో గన్నవరానికి ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి. భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారు. వీరికి రాజధానిలో ప్యాకేజీ కల్పించడంతో ఆనందంగా ఉంది. -బొబ్బా నాగేంద్రరావు, రైతు రూపురేఖలు మారిపోయాయి కార్పొరేట్ వరల్డ్ విజయవాడ రాకపోవడానికి కారణం ఏమిటా అనుకునేవాళ్లం. సరైన ఎయిర్‌పోర్టు లేకే అని గుర్తించాం. దేశంలో అనేక ఎయిర్‌పోర్టులను చూశాం. చూస్తుండగానే సాదాసీదా ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. కేంద్రం సహకరించి ఇంకా బాగా ఉండేది. - పొట్లూరి భాస్కరరావు, వ్యాపారవేత్త అంతర్జాతీయ సర్వీసులు.. సంతోషమే నాలుగేళ్లలో విమానాశ్రయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. విశాఖతో పోల్చుకుంటే ఇక్కడ నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తుంది. దుబాయ్‌కు విమాన సర్వీసు నడపాలి. -జి.వెంకటరావు, విశ్రాంత లెక్చరర్
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now