Jump to content

Recommended Posts

Posted
దుబాయ్‌’కు జై
19-01-2019 03:54:49
 
636834668903388985.jpg
  •  బెజవాడ నుంచి ఆ సర్వీసుకు రెండు లక్షలమంది
  •  కూలీ నుంచి టూరిస్టు దాకా దుబాయ్‌ విమానానికే
విజయవాడ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి రెండవ అంతర్జాతీయ సర్వీసుగా దుబాయ్‌కు సర్వీసు నడిపే విషయమై ప్రజల నుంచి అనూహ్య మద్దతు వ్యక్తమవుతోంది. తొలి సర్వీసు అయిన సింగపూర్‌ సేవలతో పోల్చితే రెట్టింపు దుబాయ్‌ విషయంలో ప్రజాభిప్రాయం రావటం పట్ల రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అధికారులు, విమానాశ్రయ వర్గాలు ఆనందంతో ఉన్నాయి. ఏపీ ఏడీసీఎల్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో శుక్రవారం సాయంత్రానికి 2,01,092 మంది తమ మద్దతును తెలిపారు. మరికొద్ది రోజులు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన దుబాయ్‌కు విమాన సర్వీసులు నడపటానికి ఆసక్తి చూపే సంస్థల కోసం టెండర్లను పిలవనున్నారు. దుబాయ్‌కు సర్వీసును నడిపేందుకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ గతంలో ఆసక్తి చూపి వెనుకడుగు వేసింది.
 
ఈ సంస్థ ఒకవేళ ఇప్పుడు ఆసక్తి చూపిస్తే.. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన కాకుండా నేరుగానే నడపవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వీజీఎఫ్‌ విధానంలో విమాన సర్వీసు నడపటానికి శ్రీకారం చుట్టడంతో ప్రైవేటు సంస్థలే ముందుకు రావాల్సి ఉంటుంది. ఇండిగో సంస్థతోపాటు, స్పైస్‌జెట్‌ సంస్థ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తున్నా.. టెండర్లు పిలిచిన తర్వాత ఏఏ సంస్థలు పాల్గొంటాయన్నదానిపై స్పష్టత వస్తుంది. ఈ నెలాఖరుకు ఆసక్తి చూపించే విమానయాన సంస్థల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. దుబాయ్‌కు ఎన్ని సీట్ల విమానం నడిపితే బాగుంటుందన్న అంశాన్ని ఏడీసీఎల్‌ నిర్దేశిస్తుంది. దీని ప్రాతిపదికన టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
 
చాన్స్‌ కొట్టిన సర్కారు..
సింగపూర్‌ సర్వీసు కన్నా ముందు నుంచే దుబాయ్‌ సర్వీసుపై గట్టి డిమాండ్‌ ఉంది. దుబాయ్‌కు ఫ్లైట్‌ నడపటానికి ఆ దేశంతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన సంస్థలకు స్లాట్లను అప్పట్లో కేటాయించారు. ఈ స్లాట్లు ప్రాతిపదికన విమాన సర్వీసులు నడపాల్సి ఉంటుంది. స్లాట్‌ లేదన్న కారణంతోనే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపే విషయంలో వెనుకడుగు వేసింది. ఇటీవల కాలంలో స్పైస్‌జెట్‌ కొన్ని అనుకోని కారణాల వల్ల దుబాయ్‌కు పలు విమాన సర్వీసులు రద్దు చేసుకుంది. దీంతో ఆ ఖాళీల మేర స్లాట్స్‌కు అవకాశం కలిగింది. సరిగ్గా ఈ పరిణామాన్నే రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది. సింగపూర్‌ సర్వీసు కోసం టెండర్లు పిలిచినపుడు 180 సీటింగ్‌ విమానానికి ఏడీసీఎల్‌ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం దుబాయ్‌కు ఊహించని మద్దతు రావటంతో ఎన్ని సీట్ల కలిగిన విమానాన్ని నడిపేందుకు నిర్ణయిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. విమానయాన సంస్థలు కూడా అన్ని సీట్ల విమానాలను కలిగి ఉండాల్సి ఉంటుంది.
 
ఆందుకే ఇంత ఆసక్తి..
  • విజయవాడ నుంచి సింగపూర్‌ కన్నాదుబాయ్‌కే డిమాండ్‌ ఎక్కువ.
  • ఉపాధి కోసం ఎక్కువగా దుబాయ్‌ వెళ్లే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు చెన్నై కన్నా బెజవాడ రావడమే తేలిగ్గా ఉంటుంది.
  • విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా దుబాయ్‌కు ఫ్లైట్‌ లేదు. ఇది కూడా కలిసి వచ్చే అంశమే.
  •  యూఏఈ,దుబాయ్‌ల నుంచి అనేక కంపెనీలు విజయవాడ వచ్చి వ్యాపారావకాశాలపై వర్క్‌షా్‌పలు నిర్వహించడం పెరిగింది.
Posted (edited)
41 minutes ago, sonykongara said:

Quote

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా దుబాయ్‌కు ఫ్లైట్‌ లేదు. ఇది కూడా కలిసి వచ్చే అంశమే.

 @Saichandrawe need non stop flight from visakhapatnam to dubai . vizag to dubai has more demand , it can run without viability gap funding (vgf) . currently vizag is connected to singapore, bangkok, kualalampur. dubai is hub port to many cities in the world. if vizag has non-stop  flights to  dubai , it is possible to develop IT sector in vizag

if more slots are available in dubai airport , it is better to call tenders for vizag and dubai route also.

Edited by ravindras
Posted
9 minutes ago, ravindras said:

dani kuda try chesthunnaru 2 months mundu vizag MP dini gurichi AAI ki letter kuda rasadu

Posted
4 minutes ago, sonykongara said:

dani kuda try chesthunnaru 2 months mundu vizag MP dini gurichi AAI ki letter kuda rasadu

AAI tho pettukunte avvadhu , vaallu anni vishayaallo manaku against gaa vunnaaru . state initiative chesthene possible avvuthundhi

Posted
26 minutes ago, ravindras said:

 @Saichandrawe need non stop flight from visakhapatnam to dubai . vizag to dubai has more demand , it can run without viability gap funding (vgf) . currently vizag is connected to singapore, bangkok, kualalampur. dubai is hub port to many cities in the world. if vizag has non-stop  flights to  dubai , it is possible to develop IT sector in vizag

if more slots are available in dubai airport , it is better to call tenders for vizag and dubai route also.

9 minutes ago, ravindras said:

AAI tho pettukunte avvadhu , vaallu anni vishayaallo manaku against gaa vunnaaru . state initiative chesthene possible avvuthundhi

slot availability and janalu vunte some or the other airline will start operations from Vizag....

Posted

Inthaki runway expansion yentha varaku vatchindi?

recent weeks lo no news. 

Pedda flights land avva galigithe big carriers ni kaka pattavatchu 

okka Middle East carrier start ayithe - all will be set

Posted
2 hours ago, ravindras said:

 @Saichandrawe need non stop flight from visakhapatnam to dubai . vizag to dubai has more demand , it can run without viability gap funding (vgf) . currently vizag is connected to singapore, bangkok, kualalampur. dubai is hub port to many cities in the world. if vizag has non-stop  flights to  dubai , it is possible to develop IT sector in vizag

if more slots are available in dubai airport , it is better to call tenders for vizag and dubai route also.

Vij-Vizag - Dubai  better anukunta, better occupancy n frequency vuntadi.. 

Posted
5 minutes ago, ramntr said:

Vij-Vizag - Dubai  better anukunta, better occupancy n frequency vuntadi.. 

It should be vizag-vijayawada-Dubai(for distance purpose). But the propblem is, inernational flight can't land in India after taking off from origination.

Posted
10 minutes ago, ramntr said:

Vij-Vizag - Dubai  better anukunta, better occupancy n frequency vuntadi.. 

currently there is air india flight flying between vizag to dubai via hyderabad. vizag people demanding non-stop flight between vizag and dubai. it will serve east godavari , visakhapatnam, vizianagaram, sriakakulam , some parts of orissa and chattisgarh.

vijayawada - dubai and vizag - dubai can operate in parallel.  there is enough demand for both routes . currently vijayawada- singapore , vizag - singapore running successfully.    demand for dubai is more compare to singapore. 

Posted
7 minutes ago, ravindras said:

currently there is air india flight flying between vizag to dubai via hyderabad.

is the flight originating in Vizag goes to Dubai or it is just a connecting flight to Hyd-Dubai flight?

Posted
34 minutes ago, swarnandhra said:

It should be vizag-vijayawada-Dubai(for distance purpose). But the propblem is, inernational flight can't land in India after taking off from origination.

Indian carriers operate same way na, to go to abhudabi some jet flights take you to Mumbai n then destination, 1 domestic travel connecting to international... No carrier hav base location in ap tht might be problem.. 

Posted
2 hours ago, swarnandhra said:

is the flight originating in Vizag goes to Dubai or it is just a connecting flight to Hyd-Dubai flight?

flight originating in vizag goes to dubai with stopover at hyderabad

Posted
రైతులకు ప్లాట్ల కేటాయింపు
22-01-2019 07:47:06
 
636837400269111114.jpg
  • ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చినవారికి..
  • రాజధానిలో ప్లాట్లు కేటాయించి.. రిజిస్ర్టేషన్లు
  • గన్నవరం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కౌంటర్‌
  • రోజుకు 40 ప్లాట్లు మాత్రమే రిజిస్ర్టేషన్‌
గన్నవరం: ఎయిర్‌పోర్టు విస్తరణకు భూ ములిచ్చిన రై తులకు రా జధానిలో కేటాయించిన ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు గన్నవరం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. సీఆర్డీయేకు చెందిన తహసీల్దారు శ్రీనివాసరావు పర్యవేక్షణలో రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఎకరం భూమికి రాజధానిలో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ 1,450 గజాల చొప్పున లాటరీ ద్వారా తొలి దశలో సుమారు 500 మందికి ప్లాట్లు కేటాయించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికోసం ప్రత్యేక సెల్‌ను సీఆర్డీయే ఏర్పాటు చేసింది. ఎటువంటి రుసుం చెల్లించకుండానే దస్తావేజులు తయారు చేసి అందిస్తుంది. అయితే రైతులు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది. రోజుకు 40 ప్లాట్లు మాత్రమే రిజి స్ర్టేషన్‌ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 
మ్యుటెంట్‌(చేతులు మారిన) భూముల యజమానులు మాత్రమే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చలానాలు కట్టాల్సి ఉంటుంది. భూమి అమ్మకాలు జరపని రైతులకు మాత్రం ప్రభుత్వం ఉచిత రిజిస్ర్టేషన్‌లు సౌకర్యం కల్పించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు ఆధార్‌ నెంబర్‌ సహకారంతో డాక్యుమెంట్‌ సిద్ధం చేస్తారు. తొలిరోజు 40 ప్లాట్లను సినీ నిర్మాత అశ్వనీదత్‌ దంపతులు చేయించుకున్నారు. వీరు ఎయిర్‌పోర్టు విస్తరణకు సుమారు 40 ఎకరాల భూమి ఇచ్చారు. వీరికి రెసిడెన్షియల్‌ జోన్‌లో 39 ప్లాట్లు వెయ్యి గజాల చొప్పున, కమర్షియల్‌ జోన్‌లో ఒక ప్లాటు 1750 గజాలు కేటాయించారు.
 
ఇది ఒక చరిత్ర
ఎయిర్‌పోర్టు విస్తరణలో భూ ములు పోతున్నాయని బాధపడ్డాం. తొలి దశలో సరైన పరిహారం ప్రకటించకపోవడంతో నష్టపోతున్నామని అనుకున్నాం. కానీ నేడు రాజధానిలో భాగ స్వాములయ్యామని ఆనందపడుతున్నాం. సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. ఈ నాలుగున్నరేళ్లు చరిత్ర సృష్టించారు. రైతులందరూ సంతోష పడేలా పరిహారం ఇచ్చారు. సీఆర్‌డీఏ అధికారులు సమన్వయంతో పని చేయడంతో త్వరితగతిన ప్లాట్లు రిజిస్ర్టేషన్‌లు చేశారు. 
- అశ్వనీదత్‌
స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి...
ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేసుకోదలచిన వారు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. రోజుకు 40 రిజిస్ర్టేషన్‌ మాత్రమే జరుగుతాయి. స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి ఆధార్‌ నెంబర్‌తో డాక్యుమెంట్‌ తయారు చేస్తాం. సీఆర్‌డీఏకు ఏ ఒక్క రైతు రుసుము చెల్లించాల్సిన పని లేదు. చేతులు మారిన భూములకు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చలనాలు ఇవ్వాలి.
- శ్రీనివాసరావు, తహసీల్దార్‌
Posted
కొలంబోకు ఛార్టర్డ్‌ విమానం

గన్నవరం నుంచి తొలి ప్రత్యేక సర్వీసు
ఎనిమిది మంది ప్రయాణికులతో గాల్లోకి...
విదేశాల నుంచి నేరుగా వచ్చేందుకు పచ్చజెండా
ఈనాడు, అమరావతి

amr-brk1a_55.jpg

న్నవరం విమానాశ్రయం మరో అంతర్జాతీయ ఘనతను సాధించింది. మొదటి అంతర్జాతీయ ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ గన్నవరం నుంచి శ్రీలంకలోని కొలంబోకు సోమవారం బయలుదేరి వెళ్లింది. గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు గత డిసెంబర్‌లో ఆరంభమయ్యాయి. ఇండిగో సర్వీసు వారానికి రెండు రోజులు నడుస్తుండగా.. వాటి టిక్కెట్లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. తాజాగా అంతర్జాతీయ ఛార్టర్డ్‌ విమాన సర్వీసులు ఆరంభమయ్యాయి. ఇప్పటివరకూ కేవలం దేశీయంగానే ఛార్టర్డ్‌ విమాన సర్వీసులు గన్నవరానికి వచ్చి వెళుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఛార్టర్డ్‌ సర్వీసులు తిరిగేందుకు ప్రస్తుతం అన్ని అనుమతులూ వచ్చాయి.
కర్ణాటకలోని బెల్గామ్‌ నుంచి ఛార్టర్డ్‌ విమాన సర్వీసు విజయవాడకు చేరుకుంది. ఇక్కడి నుంచి కొలంబోకు వెళ్లింది. దిల్లీకి చెందిన వి.ఎస్‌.ఆర్‌.ఏవియేషన్‌ సంస్థకు చెందిన ఈ విమాన సర్వీసులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు కొలంబోకు వెళ్లారు. వీఎస్‌ఆర్‌ సంస్థ ఫ్లైట్‌ క్లియరెన్స్‌ కోసం విమానాశ్రయానికి ముందుగా దరఖాస్తు చేసుకుంది. దీంతో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన ఈ తొలి అంతర్జాతీయ ఛార్టర్డ్‌ విమాన సర్వీసుకు కెప్టెన్‌ రోహిత్‌ సింగ్‌, కెప్టెన్‌ గోపీ పైలట్లుగా వ్యవహరించారు. విజయవాడలో మధ్యాహ్నం 12.30కు బయులుదేరి.. కొలంబోకు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంది.

ఇప్పటివరకూ దేశీయంగానే..
గన్నవరం విమానాశ్రయానికి దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు తరచూ ఛార్టర్డ్‌ ఫ్లైట్లలో వస్తూ వెళుతున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు పరిధిలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, క్రీడాకారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఛార్టర్డ్‌ ఫ్లైట్లలో వస్తున్నారు. మొదటిసారి మరో దేశానికి గన్నవరం నుంచి విమాన సర్వీసు వెళ్లింది. దీంతో ఇకనుంచి దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, ప్రయాణికులు నేరుగా గన్నవరం విమానాశ్రయంలో తమ చార్టర్డ్‌ విమాన సర్వీసుల్లో దిగేందుకు వీలుకలిగింది.

ముందస్తు ఏర్పాట్లతో..
గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ సహా అన్ని ఏర్పాట్లూ అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల కోసం ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం సింగపూర్‌ అంతర్జాతీయ సర్వీసు మంగళ, గురువారాల్లో మాత్రమే నడుస్తుండడంతో ఈ విభాగాలు ఆ రెండు రోజులే విధుల్లో ఉంటున్నాయి. తాజాగా ఛార్టర్డ్‌ విమాన సర్వీసు సోమవారం వచ్చి వెళ్లడంతో.. విమానాశ్రయ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ సహా అంతర్జాతీయ టెర్మినల్‌ సిబ్బంది విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో తొలి అంతర్జాతీయ ఛార్టర్డ్‌ విమాన సర్వీసు విజయవంతంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.

Posted
8 minutes ago, sonykongara said:

8fsfbqe.jpgmyPHbun.jpg

Who is this lady in puto :peepwall:

Posted
సంస్కృతి.. సమ్మిళితం!
23-01-2019 06:51:44
 
636838231049917479.jpg
  • నవ్య నూతనంగా అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌!
  • సీఎం సూచనలతో ఫ్రంట్‌ ఎలివేషన్‌ రెండు వైపులా మార్పులు
  • టెండర్ల ప్రక్రియకు స్టుప్‌ సంస్థ సిద్ధం
  • 35వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో.. భారీ టెర్మినల్‌ బిల్డింగ్‌
విమానాశ్రయంలో శాశ్వతప్రాతిపదికన నిర్మించనున్న ‘ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌’ నవ్యాంధ్రకే ఐకానిక్‌గా నిలిచేలా డిజైన్లలో సీఎం చంద్రబాబు పలు మార్పులు, చేర్పులకు ఆదేశించారు. సంస్కృతిని మరింత ప్రతిబింబించేలా టెర్మినల్‌ బిల్డింగ్‌ ఎలివేషన్‌ను రూపొందించాలని ఎయిర్‌పోర్టు అధికారులకు సీఎం సూచించారు. టెండర్ల ప్రక్రియకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) ‘స్టుప్‌’ సంస్థ సన్నద్ధమౌతోంది. నెలరోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని, పక్షం రోజుల్లోనే పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకోవాలని పీఎంసీ భావిస్తోంది.
 
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ మరింత ప్రత్యేకంగా కనిపించేలా ముఖ్యమంత్రి సూచించిన మార్పుల, చేర్పులకు అనుగుణంగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) స్టుప్‌ సంస్థ ఫైనల్‌ డి జైన్లను సిద్ధం చేసింది. డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టెండర్ల ప్రక్రియకు ‘స్టుప్‌’ సిద్ధమౌతోంది. 45 రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎయిర్‌పోర్టు అధికారులు కృతనిశ్ఛయంతో ఉన్నారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం కోసం కృష్ణాజిల్లా, అమరావతి సంస్కృతిని ప్రతిబింబించేలా సమ్మిళిత రూపాలతో డిజైన్లను సిద్ధం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ‘కూచిపూడి నృత్యం’తో కూడిన భంగిమలను డిజైన్‌ చేశారు. పశ్చిమ కృష్ణాలో మల్లెల సాగు ఎక్కువ. ‘మల్లె’ రాష్ట్ర పుష్పంగా కూడా ఉంది. జిల్లాలో పరిమళాలు వీచేలా టెర్మినల్‌ బిల్డింగ్‌లో మల్లెమొగ్గలను పొందు పరిచారు. కృష్ణవేణి పరవళ్లను కూడా డిజైన్‌లో పొందుపరిచారు.
 
ఫ్రంట్‌ ఎలివేషన్‌లో కేంద్రస్థానం బౌద్ధ స్థూపం, దీనికి రెండువైపులా కూచిపూడి నాట్యభంగిమలతో ఇంటీరియర్‌ డిజైన్స్‌ తీర్చిదిద్దారు. కూచిపూడి భంగిమలో కనిపించే బొమ్మల తల.. రోడ్డు వైపు నుంచి చూస్తే మల్లె మొగ్గలుగా కనిపిస్తాయి. విరబూసిన మల్లెల్లా శ్లాబ్‌ భాగంలో డిజైన్‌ను పొందుపరిచారు. వీటిని తిరగేస్తే.. కొండపల్లి బుట్ట బొమ్మలు వేసుకునే పట్టు లంగాలుగానూ కనిపిస్తాయి. టెర్మినల్‌ బిల్డింగ్‌ పై భాగం ఏరియల్‌ వ్యూ చూస్తే మెలికలు తిరిగినట్టుగా.. కృష్ణవేణి ప్రవాహానికి నిదర్శనంగా డిజైన్‌ను తీర్చిదిద్దారు. డిజైన్‌పై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి చెందారు. డిజైన్‌లలో కొన్నిమార్పులు చేయాల్సి ఉందని చెప్పారు.
 
5awer.jpgఫ్రంట్‌ ఎలివేషన్‌లో కూచిపూడి నాట్య భంగిమల నిడివి ఎక్కువుగా ఉండటం వల్ల.. ప్రధాన టెర్మినల్‌ ఎలివేషన్‌ దెబ్బతింటుందని, కొంతమేర నిడివి తగ్గించమని సూచించారు. దాంతో పాటు ఫ్రంట్‌ ఎలివేషన్‌ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్‌లో సవరణలు చేయాలని సూచించారు. రెండువారాల తర్వాత పీఎంసీ సంస్థ ’స్టుప్‌’ తుది డిజైన్లను ఖరారు చేసింది. వాటికి ముఖ్యమంత్రి ఓకే చెప్పినట్టు సమాచారం. పీఎంసీ సంస్థ టెండర్లకు సిద్ధమౌతోంది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు రూ. 611 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించింది. ఈ మేరకు టెండర్లు పిలవనున్నారు. ఔత్సాహిక సంస్థలను ఎంపిక చేసిన తర్వాత టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లలో అర్హతల ప్రాతిపదికన కాంట్రాక్టర్‌ను ఎంపికచేసి ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను పూర్తిచేయటానికి రెండేళ్ల సమయం నిర్దేశించనున్నారు.
 
ప్రస్తుత టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే.. రూ.611 కోట్లవ్యయంతో టెర్మినల్‌ బిల్డింగ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను స్టీల్‌, గ్లాస్‌ నిర్మాణంలో చేపట్టవలసి ఉంటుంది. ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌లో కల్పించనున్నారు. గంటకు 1200 మంది ప్రయాణికుల సామర్ధ్యానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. మొత్తం 1200 మందిలో 800 మంది డొమెస్టిక్‌, 400మంది అంతర్జాతీయ ప్రయాణికులకు అనుగుణంగా సేవలు అందించేలా దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. మొత్తం 24 చెకిన్‌కౌంటర్లు, అరైవల్‌-డిపార్చర్‌లో కలిపి మొత్తం 14 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు, 4కస్టమ్స్‌ కౌంటర్ల ఏర్పాటుకు వీలుగా డిజైన్‌ను మార్పుచేశారు.
 
awberwe.jpgఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ‘జీఆర్‌ ఐహెచ్‌ఏ 4 స్టార్‌’ సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టెర్మినల్‌లో పూర్తిగా ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ హీట్‌ గెయిన్‌ గ్లేజింగ్‌, ఒలాటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌ (విఓసీ), వర్షపు నీటి గుంటలు, ఇంథన సామర్ధ్యంతో కూడిన ఎయిర్‌ కండిషనింగ్‌, డబుల్‌ ఇన్సులేటెడ్‌ పైకప్పు, ఉపయోగించిన నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను కల్పించనున్నారు.
Posted

for me this new terminal seems waste of money and time. 611cr and 3 years... ee time edho Vij-Guntur madhayalo new airport planning ki invest cheyyatam better anukunta..

Posted
6 minutes ago, katti said:

for me this new terminal seems waste of money and time. 611cr and 3 years... ee time edho Vij-Guntur madhayalo new airport planning ki invest cheyyatam better anukunta..

Antha pedda airport katti maintain cheyali ante 611 crs kante chaala ekkuva avuddi....airport ki taggatu traffic and tarrifs kooda vundaali.....ivemi lekunda kadithe tadisi mopedu avuddi.....

paiga ippudu katte airport ala vundi poddi....every cosmopolitan citi will have a secondary airport....future lo current airport ala use chesukovachu.....

simple math....

Posted
1 hour ago, Bezawada_Lion said:

Antha pedda airport katti maintain cheyali ante 611 crs kante chaala ekkuva avuddi....airport ki taggatu traffic and tarrifs kooda vundaali.....ivemi lekunda kadithe tadisi mopedu avuddi.....

paiga ippudu katte airport ala vundi poddi....every cosmopolitan citi will have a secondary airport....future lo current airport ala use chesukovachu.....

simple math....

Correct

New airport only after 10 years... Land block cheyinchi pettukovatam better

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...