Jump to content

Recommended Posts

Posted (edited)
3 minutes ago, sonykongara said:

2286+739+785+620 = 4430 meters  anedi chance ledu,inkoti kattukovatame

canal divert cheyyakundaa , canal ki otherside second runway kattochaaa . endukante canal ki other side polaalu vunnaayi, houses levu .

https://www.google.com/maps/place/HELLO+CABS/@16.522685,80.7917178,3005m/data=!3m1!1e3!4m5!3m4!1s0x0:0x1bc844d2b2e24c5!8m2!3d16.523838!4d80.7914172

Edited by ravindras
Posted
1 minute ago, ravindras said:

canal divert cheyyakundaa , canal ki otherside second runway kattochaaa . endukante canal ki other side polaalu vunnaayi, houses levu .

kastam bro, chenai airport ki elaane runway kosam elane AAI land tisukoni  runway expansion chesi mundu unna runway ki link cheyyaleka gabbu chesaru,UPA time lo 3000cr karchu pettaru,ippud new airport plan chesthunnaru..

Posted
విస్తరణకు భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్‌ రుసుము మినహాయింపు

ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రానికి భూములు అప్పగించిన రైతులు.. బదులుగా తీసుకునే ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు లభించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన వారికి రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ ప్లాట్లను కేటాయిస్తోంది. వీటి రిజిస్ట్రేషన్‌లో ఫీజు పరంగా సంబంధితులకు మినహాయింపు ఇస్తూ స్టాంపు డ్యూటీ మొత్తాన్ని రూ.100కు తగ్గించారు. భూ సమీకరణ పథకం కింద గన్నవరం మండల వాసుల నుంచి ఈ భూములను సమీకరించటం తెలిసిందే.

Posted
గన్నవరం రైతులకు శుభవార్త.. రిజిస్ర్టేషన్‌.. ఉచితం!
02-01-2019 10:57:51
 
  • స్టాంపు డ్యూటీ ఇతర ఫీజుల నుంచి మినహాయింపు
  • రూ.18.88 కోట్ల మేర ఎక్సేంజ్‌ డీడ్లకు మినహాయింపు
  • రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన వారికి, వెంచర్ల, ప్లాట్ల నిర్వాహకులకు వెసులుబాటు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విమానాశ్రయ విస్తరణకు భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. భూ సమీకరణకు కష్టనష్టాల కోర్చి రైతాంగం త్యాగాలు చేయటంతో పాటు, అభివృద్ధికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నందుకు ప్రభుత్వం ప్రోత్సాహ కాన్ని కల్పించింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సహకరిస్తున్నందుకు గాను స్టాంపుడ్యూటీ, రిజిస్ర్టేషన్‌ఫీజుల నుంచి మినహాయింపు నిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రూ. 18.88 కోట్ల మేర రైతులకు లబ్ది కలగనుంది. విమానాశ్రయ విస్తరణ కోసం భూముల ను సమీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో, స్థానిక రెవెన్యూ , జిల్లా యంత్రాంగం దృష్టికి రైతులు తమకు రిజిస్ర్టేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపు కావాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళింది.
 
కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపు నిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల వల్ల సీఆర్‌డీఏ, గన్నవరం రైతుల మధ్య లావాదేవీలకు మార్గం మరింత సుగమం కానుంది. ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, బుద్దవరం, చిన అవుటపల్లి, అల్లాపురం గ్రామ రైతులకు లబ్ది కలగనుంది. ఎక్సేంజి డీడ్ల విషయంలో భూ యజమానులకు వెసులుబాటు కలగనుంది. రాజధానిలో ప్లాట్లు పొందేవారితో పాటు , రైతుల నుంచి కొనుగోలు చేసి విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. వెంచర్ల నిర్వాహకులతో పాటు, అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.
Posted
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో.. హరిత శోభ
02-01-2019 10:54:17
 
636820232575983701.jpg
  • రూ.6 కోట్లతో పనులు ప్రారంభం
  • ల్యాండ్‌ స్కేపింగ్‌, పాత్‌వేల నిర్మాణం
ఆంధ్రజ్యోతి, విజయవాడ: నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును మరింత ఆధునీకరించేందుకు రూ. 6 కోట్ల వ్యయంతో ‘మెగా బ్యూటిఫికేషన్‌’ పనులు ప్రారంభమయ్యాయి. 16 జాతీయ రహదారి వెంబడి గ్రాండ్‌ ఎంట్రన్స్‌ నుంచి ఆధునికత ఉట్టిపడేలా పనులు చే పడుతున్నారు. విమానాశ్రయ ఆవరణలోకి అడుగు పెట్టగానే.. చక్కటి ఉద్యానవనంలో ఉన్న అనుభూతులను పొందేలా, పాదచారులు ఈ అందాలను వీక్షించటానికి పాత్‌వేలు, జాతీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల మార్గాల అనుసంధానం.. జంక్షన్‌ అభివృద్ధి వంటివి ప్రధానమైనవి. గ్రాండ్‌ ఎంట్రన్స్‌ వద్ద ఉన్న ఐరన్‌ ఆర్చిలు తొలగించి కాంక్రీట్‌తో ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌తో పనులు ప్రారంభించారు.
 
4awernwe.jpgకొంతమేర ప్రహరీ తొలగించి ప్రవేశద్వారం జంక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పొక్లెయిన్‌తో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. జంక్షన్‌ విస్తరిస్తే రెండు మార్గాలకు ప్రయాణికుల రాకపోకలు సులువవుతుంది. ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ వెళ్ళే వైపు పాత్‌వేల వెంబడి ఇరువైపులా పూలు, క్రోటన్స్‌ మొక్కలు ఏర్పాటుచేస్తున్నారు. జంక్షన్‌ నుంచి రెండు ప్రధాన మార్గాల వెంబడి ల్యాండ్‌ స్కేపింగ్‌ చేపడతారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేసి విమానాశ్రయానికి కొత్తలుక్‌ తీసుకురానున్నారు.
Posted
11 minutes ago, sonykongara said:
గన్నవరం రైతులకు శుభవార్త.. రిజిస్ర్టేషన్‌.. ఉచితం!
02-01-2019 10:57:51
 
  • స్టాంపు డ్యూటీ ఇతర ఫీజుల నుంచి మినహాయింపు
  • రూ.18.88 కోట్ల మేర ఎక్సేంజ్‌ డీడ్లకు మినహాయింపు
  • రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన వారికి, వెంచర్ల, ప్లాట్ల నిర్వాహకులకు వెసులుబాటు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విమానాశ్రయ విస్తరణకు భూ సమీకరణ విధానంలో భూములు ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. భూ సమీకరణకు కష్టనష్టాల కోర్చి రైతాంగం త్యాగాలు చేయటంతో పాటు, అభివృద్ధికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నందుకు ప్రభుత్వం ప్రోత్సాహ కాన్ని కల్పించింది. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సహకరిస్తున్నందుకు గాను స్టాంపుడ్యూటీ, రిజిస్ర్టేషన్‌ఫీజుల నుంచి మినహాయింపు నిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రూ. 18.88 కోట్ల మేర రైతులకు లబ్ది కలగనుంది. విమానాశ్రయ విస్తరణ కోసం భూముల ను సమీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో, స్థానిక రెవెన్యూ , జిల్లా యంత్రాంగం దృష్టికి రైతులు తమకు రిజిస్ర్టేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపు కావాలని కోరారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళింది.
 
కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపు నిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల వల్ల సీఆర్‌డీఏ, గన్నవరం రైతుల మధ్య లావాదేవీలకు మార్గం మరింత సుగమం కానుంది. ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, బుద్దవరం, చిన అవుటపల్లి, అల్లాపురం గ్రామ రైతులకు లబ్ది కలగనుంది. ఎక్సేంజి డీడ్ల విషయంలో భూ యజమానులకు వెసులుబాటు కలగనుంది. రాజధానిలో ప్లాట్లు పొందేవారితో పాటు , రైతుల నుంచి కొనుగోలు చేసి విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. వెంచర్ల నిర్వాహకులతో పాటు, అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

Vamsi :no1:

  • 2 weeks later...
Posted
రయ్‌..న..
11-01-2019 09:29:33
 
636827957740228442.jpg
  • దేశీయంగా విమానాలు నడపడానికి ఆయా సంస్థల ఆసక్తి
  • ముంబైకి డైలీ ఫ్లైట్‌కు ఇండిగో..
  • వారణాసికి మళ్ళీ విమాన సర్వీసు.. స్పైస్‌జెట్‌ సంసిద్ధత
  • అహ్మదాబాద్‌, కోయంబత్తూరుకు విమాన సర్వీసులు
  • మార్చి నుంచి సమ్మర్‌ షెడ్యూల్‌
  • హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు అదనపు సర్వీసులు
విజయవాడ విమానాశ్రయం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రెగ్యులర్‌ సర్వీసుతో పాటు కోల్‌కతా, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, వారణాసి తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. బెజవాడ నుంచి డొమిస్టిక్‌ ఆపరేషన్స్‌లో పాలు పంచుకుంటున్న స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థలు ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులకు సంకేతాలిచ్చాయి. సమ్మర్‌ షెడ్యూల్స్‌ కోసం విమానాశ్రయ అధికారులు విమానయాన సంస్థలను ప్రతిపాదనలు కోరగా.. సరికొత్త రూట్లపై అవి సంకేతాలిచ్చాయి. ఇదే జరిగితే దేశీయంగా మరిన్ని రూట్లకు కనెక్టివిటీ ఏర్పడటంతో పాటు మరింత వృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి.
 
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల వరకు మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. వీటిలో ఒక్క ముంబై తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలకు రెగ్యులర్‌ విమానాలు నడుస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే విశాఖపట్నం, తిరుపతి, కడపలకు మరికొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇటీవలే తొలి సర్వీసుగా సింగపూర్‌కు ఇండి గో సంస్థ విమానాన్ని ప్రారంభించింది. దేశీయంగా మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కృష్ణా , గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు విజయవాడ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉండటం వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ ప్రాంతవాసుల నుంచి ఎంతో డిమాండ్‌ ఉంది. విజయవాడ విమానాశ్రయం ఇప్పటివరకు దేశీయంగా నిర్వహిస్తున్న ఆప రేషన్స్‌ మీదనే వృద్ధి చెందుతోంది. సింగపూర్‌కు సర్వీసు 80 - 90 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఇదే ఉత్సాహంలో దుబాయ్‌కు కూడా సర్వీసు నడిపేందుకు సా నుకూల పరిస్థితులు నెలకొన్నాయి. దు బాయ్‌కు కూడా సాకారమైతే ప్రపంచ దేశా లకెక్కడికైనా చేరుకోవటానికి విమాన సదు పాయాలు కలిగిన డెస్టినేషన్‌ ఎయి ర్‌పోర్టులకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతోంది.
 
అంతర్జాతీయానం వేళ్ళూనుకుంటున్న తరుణంలోనే.. దేశీయంగా మరిన్ని నూతన ప్రాంతాలకు విమానాల అనుసంధానం ఏర్పడాల్సి ఉంది. ఈ తరుణంలో విమానయాన సంస్థలు శుభ సంకేతాలను ఇవ్వటంతో ఎయిర్‌పోర్టు అధికారులు కూడా సంతోషంగా ఉన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ వారంలో మంగళ, శుక్ర, ఆదివారాలలో మూడు రోజులు సర్వీసును నడుపుతోంది. నగర వ్యాపార వర్గాలు ముంబై సర్వీసును డైలీగా తిప్పాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంభైకి డైలీ సర్వీసు నడపాలన్న ఆలోచనలో ఇండిగో ఉంది. ముంబైకి సర్వీసు నడిపితే ఎలా ఉంటుందో అధ్యయనం చేసిన తర్వాతే రెగ్యులర్‌గా నడపాలన్న ఆలోచనను ఇండిగో చే సింది. ప్రస్తుతం వారంలో మూడు రోజులు మా త్రమే విమాన సర్వీసు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఆక్యుపెన్సీ కూడా 85 - 90 శాతం మేర ఉండటం గమనార్హం.
 
మరిన్ని సర్వీసులు
ముంబైకి వారంలో మూడుసార్లు కా కుండా డైలీ చేయాలన్న ఆలోచనలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఉన్నట్టు తెలు స్తోంది. చెన్నైకు స్పైస్‌ జెట్‌ విమాన సర్వీ సులను నడుపుతోంది. కోయంబత్తూరుకు కూడా సర్వీసు నడపాలన్న ఆలోచనలో ఇండిగో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనలో ఎరురిండియా, ఇండిగో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గుజరాత్‌కు వ్యాపార కలాపాల మీద రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువుగా ఉందని అధ్యయనంలో తేలటంతో ఈ రెండు సంస్థలు పోటీలు పడటం గమనార్హం. వారణాసికి సర్వీసు నడపాలన్న ఆలోచనలో స్పైస్‌ జెట్‌ సంస్థ ఉంది. గతంలో వారణాసికి ఈ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసు నడిపింది. ఆ తర్వాత అర్థంతరంగా రద్దు చేసింది. ఈ సర్వీసు రద్దుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. మళ్ళీ ఈ సర్వీసును పునరుద్ధరించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగా డైరెక్టు సర్వీసు కాకుండా హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్‌ మారేలా సర్వీసును నడపాలన్న ఆలోచనలో స్పైస్‌జెట్‌ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
 
మార్చి నుంచి సమ్మర్‌ షెడ్యూల్స్‌
రానున్న మార్చి నుంచి వేసవి ప్రత్యేక విమాన సర్వీసులను నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులకు మరిన్ని విమానాలు నడిపేందుకు స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారికంగా తమ షెడ్యూల్స్‌ వివరాలను ఈ సంస్థలు ప్రకటించనున్నాయి.
Posted
ఎయిర్‌పోర్ట్‌.. టాప్‌ గేర్‌
14-01-2019 08:24:11
 
636830510515319830.jpg
  • ఏఏఐ సర్వేలో.. ది బెస్ట్‌
  • దేశీయంగా వృద్ధిలో దూసుకుపోతున్న ఎయిర్‌పోర్టు
  • అంత ర్జాతీయ యవనికపై అడుగులతో..భారీ అంచనాలు
  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెగా విస్తరణ
  • రన్‌వే విస్తరణతో బోయింగ్‌ విమానాలు ల్యాండింగ్‌కు అవకాశం
దేశంలో చరిత్ర సృష్టిస్తున్న ఎయిర్‌పోర్టుల్లో విజయవాడ విమానాశ్రయం టాప్‌గేర్‌లో ఉంది! ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఎయిర్‌పోర్టు శరవేగంగా పురోగమిస్తోందని తేలింది! విమానాశ్రయం నుంచి పెరుగుతున్న విమాన సర్వీసులు, ప్రయాణీకుల ఆదరణ, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రణాళికలు, దేశ, విదేశాలకు కనెక్టివిటీ, ప్రాంతీయంగా ప్రజల ఆదరాభిమానాలు, భౌగోళిక పరిస్థితుల రీత్యా భవిష్యత్తులో విజయవాడ ఎయిర్‌పోర్టు రేంజ్‌ మరోలా ఉండబోతోందన్న అంశం వెలుగులోకి వచ్చింది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులకు దీటుగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ భవిష్యత్తుపై మరింత ఆశలు రేపుతోంది! ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ ఎయిర్‌పోర్టు శరవేగంగా పురోగమిస్తోందని తేలింది! ఈ నేపథ్యంలో, విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు సముచిత ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి.
 
దేశీయంగా రోజూ 57 విమానాలు
విజయవాడ విమానాశ్రయం దేశీయంగా అందిస్తున్న సేవల ప్రాతిపదికగానే పురోగామిశక్తిగా నిలిచింది. అంతర్జాతీయ యవనికపై ఇప్పుడిప్పుడే ముద్ర వేస్తున్న దశలో.. మరింత ప్రబలశక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయన్నది ఏఏఐ గుర్తించింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 57 విమానాలకు పైగా రోజూ దేశీయంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు ప్రాంతీయంగా విశాఖపట్నం, కడప, తిరుపతిలకు విమాన సేవలను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో డొమిస్టిక్‌ సేవలందిస్తూనే నాలుగేళ్ళలో అనూహ్య వృద్ధిని నమోదు చేయటం విశేషం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2018-2019 ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పటివర కు చూస్తే అర్థ సంవత్సరకాలంగా నెలకు లక్షమందికి పైగా విజయవాడ నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిలియన్‌ మార్కు దాటే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
 
మార్గం సుగమం
దేశీయంగా ముంబాయితో పాటు కలకత్తా, అహ్మదాబాద్‌, కోయంబత్తూరు, వారణాసి వంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి మార్గం సుగమం అవుతోంది. దీంతో మరింత వృద్ధి సాధించటానికి దోహదపడుతుంది. జైపూర్‌తో పాటు ఉత్తరభారతదేశ ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్‌ వస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి భవిష్యత్తు అవసరాలను ఇవి తేటతెల్లం చేస్తున్నాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ విమానాశ్రయం విప్లవాత్మక అడుగు వేసింది. డొమెస్టిక్‌ రంగంలో దుమ్ము దులుపుతున్న విజయవాడ అంతర్జాతీయ యవనికపై అడుగులు వేస్తోంది.
 
అంతర్జాతీయ హోదాతో..
ఏడాది కిందట అంతర్జాతీయ హోదా అందుకుంది. అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కావ టానికి కొంత సమయం పట్టినప్పటికీ.. ఇప్పుడిపుడే ఈ దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని విమానాలకు మార్గం సుగమం అవుతోంది! సింగపూర్‌కు తొలి విదేశీ సర్వీసు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) విధానంలో ఈ సర్వీసును ప్రవేశపెట్టగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండానే విజయవంతంగా ఈ సర్వీసు నడుస్తోంది. ఇదే దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు ప్రారంభం అయితే విజయవాడ ఎయిర్‌పోర్టు చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. ఇతర గల్ఫ్‌ దేశాలు, అమెరికా, ఆస్ర్టేలియా, యూరప్‌ దేశాలకు కూడా విమాన సర్వీసులు నడ వటానికి అనేక అవకాశాలు ఉన్నాయి.
 
మౌలిక వసతులు విస్తృతం
రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. దీంతో విదేశీయానానికి ఇక్కడ నుంచి క్రేజు ఉంది. ఈ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువుగా ఉండటం, ఎన్‌ఆర్‌ఐలు, చదువుకునే విద్యార్థులు, పర్యాటకంగా టూర్‌లు చేసే వారి సంఖ్య గణనీయంగా ఉండటం వల్ల కూడా విదేశీ విమానయానానికి భవిష్యత్తు ఉంటుందన్నది సుస్ఫష్టంగా అర్థమౌతోంది. దీనికి తగినట్టుగానే విజయవాడ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు కూడా విస్తృత మౌతున్నాయి. రూ.148 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రస్తుత అవసరాలను తీర్చుతోంది. ఈ టెర్మినల్‌ కూడా ఇప్పుడు సరిపోని పరిస్తితి ఏర్పడటంతో .. రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ చేపట్టాలని కేంద్రాన్ని కోరటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించిన ప్రతిపాదనను , ఏఏఐ ముందుంచారు. ఏఏఐ కూడా వెంటనే స్పందించింది. రూ.611 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కు ఇటీవల భూమి పూజ కూడా చేసుకోవటం జరిగింది. ఏరోబ్రిడ్జిలతో పాటు రాష్ర్టానికే ఐకానిక్‌గా నిలిచే విధంగా ఎయిర్‌పోర్టును అభివృద్ధిఽ చేయనున్నారు. విదేశీయానం దృష్టిలో ఉంచుకుని రన్‌వే విస్తరణ పనులను కూడా రూ.160 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు.
 
అతి పెద్ద రన్‌వే..
విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనుల వల్ల రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా నిలువబోతోంది. ప్రస్తుతం 2286 మీటర్లుగా ఉన్న రన్‌వేను 3362 మీటర్ల మేర విస్తరిస్తున్నారు. విస్తరణ పనులు తుది దశలో ఉన్నాయి. రన్‌వే అందుబాటులోకి వస్తే.. ఎయిర్‌బస్‌ 747, 777 విమానాలు కూడా ల్యాండ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. నైట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించుకోవటానికి కూడా అవసరం ఉంది. విమానాశ్రయం నుంచి కార్గోకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడి ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దేశీయంగా, విదేశాలకు ఎగుమతి, దిగుమతులు చేసుకోవటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయగా విజయవాడ ఎయిర్‌పోర్టు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సర్వేలో వెలుగు చూసిన అంశాల ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎంతో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంటుంది.
Posted
గన్నవరం నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు 

ప్రజాభిప్రాయానికి  శ్రీకారం చుట్టిన ఏపీఏడీసీఎల్‌

ఈనాడు-అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు నేరుగా విమానాన్ని నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రజాభిప్రాయానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. సింగపూర్‌కు విమాన సర్వీస్‌ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో  55వేల మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి దుబాయ్‌ వెళ్లే వారు హైదరాబాద్‌ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. సింగపూర్‌ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్‌ కోసం ఏపీఏడీసీఎల్‌ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది.

Posted
జామ్‌ జామ్‌గా సింగపూర్‌ సర్వీసు 

విజయవాడ నుంచి భారీగా పెరిగిన రద్దీ 
90శాతం పైగా ఆక్యుపెన్సీతో రాకపోకలు 
వినియోగించుకుంటున్న అంతర్జాతీయ ప్రయాణికులు

14ap-main14a_1.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి ఇటీవల ప్రారంభమైన సింగపూర్‌ అంతర్జాతీయ సర్వీసులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రస్తుతం మంగళ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఈ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అవేరోజుల్లో సింగపూర్‌ నుంచి కూడా గన్నవరానికి తిరిగి చేరుకుంటున్నాయి. రాష్ట్రప్రభుత్వం, భారత విమానయాన సంస్థ(ఏఏఐ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో సంస్థ 180 సీటింగ్‌ ఉన్న ఎ320 ఎయిర్‌బస్‌ సర్వీసులను ఆరంభించింది. గత డిసెంబరు 4 నుంచి ఆరంభమైన ఈ సర్వీసులకు తొలుత సింగపూర్‌ నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అతితక్కువ కాలంలోనే ఏపీ నుంచి కూడా 90శాతం పైగా ఆక్యుపెన్సీని సాధించింది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరివెళ్లిన విమాన సర్వీసులోని 180 సీట్లూ పూర్తిగా నిండిపోయాయి. నాటి నుంచి అదే రద్దీ కొనసాగుతోంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను ఆరంభించాక.. ప్రయాణికులు అలవాటు పడేందుకు 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు భావించారు. అందుకే.. 50శాతం కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఇండిగోకు లోటు సర్దుబాటునిధి(వీజీఎఫ్‌)ని కూడా ఆరు నెలలకు రూ.18 కోట్ల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ అవసరం లేకుండానే ప్రయాణికుల రద్దీ నెల రోజుల వ్యవధిలోనే పుంజుకుంది.

14ap-main14b.jpg

త్వరగా అలవాటు పడ్డారు.. 
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో విదేశాలలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో నిత్యం విదేశాలకు వెళ్లి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాలకు వెళ్లి విదేశీ విమాన సర్వీసులను అందుకుంటున్నారు. ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం.. ఇలా కోస్తా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి విమానాలను ఎక్కుతున్న వారి సంఖ్య ఏటా 25లక్షల వరకూ ఉంటోంది. అందుకే గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. కనీసం సింగపూర్‌, దుబాయ్‌లకైనా తొలుత ఆరంభిస్తే అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ మూలకైనా తేలికగా చేరుకునే విమాన అనుసంధానం ఉంటుందంటూ పౌరవిమానయాన శాఖకు పలు నివేదికలను పంపించారు. ఎట్టకేలకు సింగపూర్‌ సర్వీసులు ఆరంభమవ్వడం, అంతర్జాతీయ ప్రయాణికులు అత్యంత త్వరగా వాటిని వినియోగించుకోవడం జరుగుతోందని గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సభ్యుడు, ఏపీ ఛాంబర్‌కు చెందిన ముత్తవరపు మురళీకృష్ణ వెల్లడించారు.

ప్రయాణికుల రద్దీ ఇలా.. 
సింగపూర్‌ నుంచి గన్నవరం వచ్చే సర్వీసుల్లో డిసెంబరు నాలుగో తేదీన 170మంది, ఆరున 165, 11న 177, 13న 168మంది ప్రయాణికులు వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4న 86, 6న 42, 11న 86, 13న 68 మంది వెళ్లారు. జనవరి నెలారంభం నుంచి అనూహ్యంగా ఇటునుంచి రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు జనవరి 1న 180, 3న 178, 8న 153, 10న 155 మంది ప్రయాణికులు వెళ్లారు. సింగపూర్‌ నుంచి జనవరి 1న 81, 3న 88, 8న 80, 10న 128మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. అమెరికా, చైనా, జపాన్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, ఉక్రెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు వెళ్లేవాళ్లంతా గన్నవరం నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి తేలికగా వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయే వీలుంది. ఇలాంటి వారంతా ప్రస్తుతం సింగపూర్‌ సర్వీసును వినియోగించుకుంటున్నట్టు ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు.

-ఈనాడు, విజయవాడ

Posted
దుబాయ్‌ కల నెరవేరుతోంది
 
త్వరలోనే ప్రారంభించేందుకు యత్నాలు
సింగపూర్‌ సర్వీసు మాదిరిగానే ప్రయోగం
ఈనాడు, అమరావతి

amr-gen1a_57.jpg

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవాలనేది ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ. కనీసం దుబాయి, సింగపూర్‌ దేశాలకైనా తొలుత సర్వీసులను ఆరంభించాలంటూ చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ఎట్టకేలకు సింగపూర్‌కు గత నెల నుంచి ఆరంభమైన సర్వీసులతో ఆ కల తీరింది. వారంలో   రెండు రోజులు సర్వీసులు నడుస్తున్నాయి. వాటికి రద్దీ సైతం ఉంటోంది. త్వరలో ఆ మిగతా కల కూడా నెరవేరబోతోంది. దుబాయికి సైతం సర్వీసులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. విమానయాన సంస్థలతో మాట్లాడి దుబాయికి సర్వీసును ఆరంభించేందుకు అవసరమైన చర్యలను తాజాగా చేపడుతోంది. దీంతో మరో ఒకటి రెండు నెలల్లో దుబాయి విమానం గాలిలోనికి ఎగరబోతోంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి అంతర్జాతీయ సర్వీసు ఆరంభమైతే.. ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరబోతోంది. చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు చెందిన అంతర్జాతీయ ప్రయాణికులు.. నేరుగా దుబాయికి వెళ్లి.. అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ప్రధానంగా ఉపకరించే అంశమిది. దుబాయి విమానం ఏర్పాటు కోసం ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం నడుస్తున్న సింగపూర్‌ సర్వీసు మాదిరిగానే.. దుబాయికి సైతం తొలుత వారంలో రెండు రోజులు సర్వీసులు ప్రారంభించాలనేది ఆలోచన. దీనికోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు సైతం పెద్దఎత్తున మద్దతు లభించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ), అంగీకారం తెలిపే విమానయాన సంస్థల మధ్య ఒప్పందం కుదరబోతోంది. దీనికి సంబంధించిన టెండర్లను సైతం ఈ నెలాఖరులో పిలవనున్నారు. టెండర్లలో పాల్గొనే విమానయాన సంస్థలు తెలిపే అంగీకారం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం సింగపూర్‌కు సర్వీసులు నడుపుతున్న ఇండిగో సంస్థ, లేదంటే మరో విమానయాన సంస్థను ఎంపిక చేసి.. దుబాయికి సర్వీసులను ఆరంభించనున్నారు.

ప్రపంచంలో ఎక్కడికైనా..
దుబాయికి సర్వీసులు ఆరంభమైతే.. ప్రపంచంలోని ఏ మూలకైనా తేలికగా చేరుకునే సౌకర్యం ఇక్కడి వారికి అందుబాటులోనికి వస్తుంది. గన్నవరం నుంచి నేరుగా దుబాయికి చేరుకుని.. అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయేలా ప్రపంచమంతటికీ దుబాయితో అనుసంధానం ఉంది. పైగా.. దుబాయిలో చదువుకునేందుకు సైతం పెద్దఎత్తున విద్యార్థులు ఇక్కడి నుంచి వెళుతున్నారు. వారితోపాటూ పర్యాటకంగా చూపి వచ్చేందుకు ఏటా వేల మంది దుబాయికి వెళ్లి వస్తున్నారు. ఇలాంటి వారందరికీ దుబాయి సర్వీసు ఆరంభమైతే.. చాలావరకూ కష్టాలు తీరినట్టే. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలికవసతులు సిద్ధంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా.. వాయిదాలు వేయాల్సిన పనిలేదు. ఒకసారి ఒప్పందం కుదిరిన వెంటనే ఎంపికైన విమానయాన సంస్థ నేరుగా టిక్కెట్ల విక్రయాన్ని ఆరంభించుకోవచ్చు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ సహా అన్ని వ్యవస్థలూ ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు.

Posted
ఆరెండే.. అడ్డంకి
 
కోడ్‌ షేరింగ్‌ లేకపోవడంతో ఇబ్బందులు
సింగపూర్‌ వీసాలు వస్తే మరింత రద్దీ
గన్నవరానికి భారీగా అంతర్జాతీయ డిమాండ్‌
ఈనాడు అమరావతి

amr-gen2a_44.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడానికి అంతర్జాతీయ ప్రయాణికులు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం వారానికి రెండు సర్వీసుల చొప్పున ఇక్కడి నుంచి సింగపూర్‌కు వెళుతున్నాయి. అదే సమయంలో అటునుంచి సైతం రెండు సర్వీసులు వస్తున్నాయి. ఈ సర్వీసుల టిక్కెట్లకు మంచి డిమాండ్‌ ఉంటోంది. అయితే.. ఇంకా కొన్ని సమస్యలు అంతర్జాతీయ ప్రయాణికులను వేధిస్తున్నాయి. దాంతో ఇక్కడ వాస్తవంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రయాణికులు రాకపోకలు సాగించడం లేదు. గన్నవరం నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రస్తుతం సింగపూర్‌కు సేవలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కోడ్‌ షేరింగ్‌ వ్యవస్థ ఇండిగోకు లేదు. అంతర్జాతీయ ప్రయాణికులను ఇది ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికితోడు సింగపూర్‌ వీసాల సమస్య కూడా ఉంది. సింగపూర్‌ విమానాశ్రయంలో ఆన్‌అరైవల్‌ వీసాలను ఇవ్వడం లేదు. దీంతో వీసా కోసం దరఖాస్తు చేసుకుని కొంతకాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ రెండింటి వల్లే.. ప్రస్తుతానికి డిమాండ్‌ భారీగా ఉన్నా.. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పరిమితంగా ఉంటోంది. గతం కంటే అనూహ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. వాస్తవ డిమాండ్‌తో పోలిస్తే.. ఇది చాలా తక్కువ.

గన్నవరం నుంచి సింగపూర్‌కు సర్వీసులు నడుపుతున్న ఇండిగో సంస్థకు ఇతర విమానయాన సంస్థలతో కోడ్‌ షేరింగ్‌ ఒప్పందం లేదు. ఎయిరిండియా మాదిరిగా కోడ్‌ షేరింగ్‌ ఉంటే.. ఎమిరేట్స్‌, సిల్క్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిరేసియా వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో ఒప్పందం ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా ఏ దేశానికి వెళ్లాలన్నా లగేజీని గన్నవరంలోనే ఇచ్చేసి, ఇక్కడే బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటే సరిపోతుంది. సింగపూర్‌ విమానాశ్రయంలో దిగి.. లగేజీ, బోర్డింగ్‌ పాస్‌తో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి మరో సర్వీసును అందుకుని.. ఆయా దేశాలకు చేరుకోవచ్చు. గమ్యస్థానం చేరాక.. మళ్లీ లగేజీని తీసుకుని వెళ్లిపోవచ్చు. విమానయాన సంస్థల మధ్య ఆమేరకు ఒప్పందం ఉండి.. లగేజీని మార్చుకుంటాయి. ఇండిగోకు కోడ్‌షేరింగ్‌ అనుమతి లేకపోవడంతో ప్రస్తుతం సింగపూర్‌ విమానాశ్రయంలో దిగి అక్కడ మళ్లీ లగేజీ, బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని వెళ్లాలి. ఇది.. అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించే అంశం. అందుకే.. ఇప్పటికీ చాలామంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళుతున్నారు.

కోడ్‌ షేరింగ్‌ ఉన్న సర్వీసులొస్తే.. : కోడ్‌ షేరింగ్‌ అనుమతి ఉన్న విమానయాన సంస్థల సర్వీసులు ప్రారంభమైతే.. గన్నవరం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుంది. అప్పుడు వారానికి రెండు సర్వీసులు ఏమాత్రం చాలవు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీకి రోజూ సర్వీసులు నడిపినా సరిపోయేంత డిమాండ్‌ ఉంటుంది. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో విమానం ఎక్కే ముందే.. తమ లగేజీని అప్పగించేస్తున్నారు. మళ్లీ వాళ్లు తమ గమ్యస్థానం చేరాకే దానిని తీసుకుంటున్నారు. మధ్యలో మరో దేశంలో దిగి విమానం మారి.. వెళ్లాల్సి వచ్చినా.. లగేజీతో సంబంధం లేకుండా వెళ్లిపోతున్నారు. కోడ్‌షేరింగ్‌ ఒప్పందం ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థల సర్వీసులు ఇక్కడి నుంచి ఆరంభమైతేనే.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

సింగపూర్‌ వీసాలకు దరఖాస్తులు..: ప్రస్తుతం సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమైన నేపథ్యంలో ఆ దేశ వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. సింగపూర్‌ దేశం మనకు ఆన్‌అరైవల్‌ వీసాను ఇవ్వడం లేదు. దీంతో వీసా కోసం సంబంధిత ధృవీకరణపత్రాలన్నింటితో ముందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించాకే.. వీసాను ఇస్తారు. అయితే.. ప్రస్తుతం వీసా దరఖాస్తుతో పాటూ ఆ దేశానికి వెళ్లేందుకు అవసరమైన విమాన టిక్కెట్‌ను సైతం జత చేయాలనే నిబంధన పెట్టారు. ఇదికూడా ప్రస్తుతం ఇబ్బందికరంగా మారుతోంది. దరఖాస్తు కోసం టిక్కెట్‌ను బుక్‌ చేసుకుని పంపిస్తే.. ఒకవేళ వీసా ఇవ్వకుండా నిరాకరిస్తే.. ప్రయాణికులు నష్టపోవాల్సి వస్తోంది. టిక్కెట్‌ను రద్దు చేసుకోవడం వంటివి అనవసర తలనొప్పులుగా మారుతున్నాయి. అదే.. సింగపూర్‌ ఆన్‌ అరైవల్‌ వీసాను ఇస్తే.. ఈ సమస్యలేవీ ఉండవు. నేరుగా.. ఆ దేశంలో దిగాక.. విమానాశ్రయంలోని ఆన్‌అరైవల్‌ వీసా కౌంటర్‌ వద్దకు వెళితే సరిపోతుంది. అక్కడికక్కడే వీసాను ఇస్తారు. ప్రస్తుతం ఈ సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ప్రయాణికుల రద్దీ చాలావరకూ తగ్గేలా చేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో సింగపూర్‌ వీసాలను తెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుందని, అనంతరం పర్యాటకంగా రద్దీ మరింత పెరగనుంది. దిల్లీకి వెళ్లే.. విమాన ఛార్జీతోనే సింగపూర్‌కు వెళ్లిపోయేంత తక్కువ ధర ప్రస్తుతం ఉంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు వెళ్లే విమాన సర్వీసుకు రూ.8 వేలు, అటునుంచి ఇక్కడికొచ్చే సర్వీసుకు రూ.10 వేల టిక్కెట్‌ ధరను నిర్ణయించారు. వీసాల సమస్య తీరితే.. పర్యాటకంగా, విద్య పరంగానూ సింగపూర్‌ బాట పట్టేవారి సంఖ్య పెరగనుందని.. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సభ్యులు, ఏపీ ఛాంబర్‌కు చెందిన ముత్తవరపు మురళీకృష్ణ పేర్కొన్నారు.

Posted
On 1/11/2019 at 9:49 PM, sonykongara said:
రయ్‌..న..
11-01-2019 09:29:33
 
636827957740228442.jpg
  • దేశీయంగా విమానాలు నడపడానికి ఆయా సంస్థల ఆసక్తి
  • ముంబైకి డైలీ ఫ్లైట్‌కు ఇండిగో..
  • వారణాసికి మళ్ళీ విమాన సర్వీసు.. స్పైస్‌జెట్‌ సంసిద్ధత
  • అహ్మదాబాద్‌, కోయంబత్తూరుకు విమాన సర్వీసులు
  • మార్చి నుంచి సమ్మర్‌ షెడ్యూల్‌
  • హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు అదనపు సర్వీసులు
విజయవాడ విమానాశ్రయం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రెగ్యులర్‌ సర్వీసుతో పాటు కోల్‌కతా, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, వారణాసి తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. బెజవాడ నుంచి డొమిస్టిక్‌ ఆపరేషన్స్‌లో పాలు పంచుకుంటున్న స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థలు ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులకు సంకేతాలిచ్చాయి. సమ్మర్‌ షెడ్యూల్స్‌ కోసం విమానాశ్రయ అధికారులు విమానయాన సంస్థలను ప్రతిపాదనలు కోరగా.. సరికొత్త రూట్లపై అవి సంకేతాలిచ్చాయి. ఇదే జరిగితే దేశీయంగా మరిన్ని రూట్లకు కనెక్టివిటీ ఏర్పడటంతో పాటు మరింత వృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి.
 
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల వరకు మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. వీటిలో ఒక్క ముంబై తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలకు రెగ్యులర్‌ విమానాలు నడుస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే విశాఖపట్నం, తిరుపతి, కడపలకు మరికొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇటీవలే తొలి సర్వీసుగా సింగపూర్‌కు ఇండి గో సంస్థ విమానాన్ని ప్రారంభించింది. దేశీయంగా మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కృష్ణా , గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు విజయవాడ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉండటం వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఈ ప్రాంతవాసుల నుంచి ఎంతో డిమాండ్‌ ఉంది. విజయవాడ విమానాశ్రయం ఇప్పటివరకు దేశీయంగా నిర్వహిస్తున్న ఆప రేషన్స్‌ మీదనే వృద్ధి చెందుతోంది. సింగపూర్‌కు సర్వీసు 80 - 90 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఇదే ఉత్సాహంలో దుబాయ్‌కు కూడా సర్వీసు నడిపేందుకు సా నుకూల పరిస్థితులు నెలకొన్నాయి. దు బాయ్‌కు కూడా సాకారమైతే ప్రపంచ దేశా లకెక్కడికైనా చేరుకోవటానికి విమాన సదు పాయాలు కలిగిన డెస్టినేషన్‌ ఎయి ర్‌పోర్టులకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతోంది.
 
అంతర్జాతీయానం వేళ్ళూనుకుంటున్న తరుణంలోనే.. దేశీయంగా మరిన్ని నూతన ప్రాంతాలకు విమానాల అనుసంధానం ఏర్పడాల్సి ఉంది. ఈ తరుణంలో విమానయాన సంస్థలు శుభ సంకేతాలను ఇవ్వటంతో ఎయిర్‌పోర్టు అధికారులు కూడా సంతోషంగా ఉన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ వారంలో మంగళ, శుక్ర, ఆదివారాలలో మూడు రోజులు సర్వీసును నడుపుతోంది. నగర వ్యాపార వర్గాలు ముంబై సర్వీసును డైలీగా తిప్పాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంభైకి డైలీ సర్వీసు నడపాలన్న ఆలోచనలో ఇండిగో ఉంది. ముంబైకి సర్వీసు నడిపితే ఎలా ఉంటుందో అధ్యయనం చేసిన తర్వాతే రెగ్యులర్‌గా నడపాలన్న ఆలోచనను ఇండిగో చే సింది. ప్రస్తుతం వారంలో మూడు రోజులు మా త్రమే విమాన సర్వీసు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఆక్యుపెన్సీ కూడా 85 - 90 శాతం మేర ఉండటం గమనార్హం.
 
మరిన్ని సర్వీసులు
ముంబైకి వారంలో మూడుసార్లు కా కుండా డైలీ చేయాలన్న ఆలోచనలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఉన్నట్టు తెలు స్తోంది. చెన్నైకు స్పైస్‌ జెట్‌ విమాన సర్వీ సులను నడుపుతోంది. కోయంబత్తూరుకు కూడా సర్వీసు నడపాలన్న ఆలోచనలో ఇండిగో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనలో ఎరురిండియా, ఇండిగో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గుజరాత్‌కు వ్యాపార కలాపాల మీద రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువుగా ఉందని అధ్యయనంలో తేలటంతో ఈ రెండు సంస్థలు పోటీలు పడటం గమనార్హం. వారణాసికి సర్వీసు నడపాలన్న ఆలోచనలో స్పైస్‌ జెట్‌ సంస్థ ఉంది. గతంలో వారణాసికి ఈ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసు నడిపింది. ఆ తర్వాత అర్థంతరంగా రద్దు చేసింది. ఈ సర్వీసు రద్దుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. మళ్ళీ ఈ సర్వీసును పునరుద్ధరించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగా డైరెక్టు సర్వీసు కాకుండా హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్‌ మారేలా సర్వీసును నడపాలన్న ఆలోచనలో స్పైస్‌జెట్‌ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
 
మార్చి నుంచి సమ్మర్‌ షెడ్యూల్స్‌
రానున్న మార్చి నుంచి వేసవి ప్రత్యేక విమాన సర్వీసులను నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులకు మరిన్ని విమానాలు నడిపేందుకు స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారికంగా తమ షెడ్యూల్స్‌ వివరాలను ఈ సంస్థలు ప్రకటించనున్నాయి.

Slow ga Increase avutunnai flights :super:

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...