Jump to content

Recommended Posts

Posted

yeah, taxi/runway construct cheyyalante Buddhavaram lo chala varaku houses lepeyyali, plus 10500 not possible without canal diversion.

Gannavaram airport expansion is very difficult.. Residential areas cameup very close to the airport.. better a new airport between Vijayawada and Guntur somewhere near Pedavadlapudi.

Posted

Gannavaram airport expansion is very difficult.. Residential areas cameup very close to the airport.. better a new airport between Vijayawada and Guntur somewhere near Pedavadlapudi.

 

Gannavaram can serve well for another 10-15 years. beyond that new airport in the middle of GNT-VIJ is a good idea but better do that north of Mangalagiri closer to new Amaravati rather than on prime Magani lands in south. 

Posted

Gannavaram can serve well for another 10-15 years. beyond that new airport in the middle of GNT-VIJ area is a good idea but better do that north of Mangalagiri closer to new Amaravati rather than on prime Magani lands in south. 

10 years anukunna, planning should start soon... North of Amaravati will become fully residential.. it is better for the airport to be little bit away from residential areas. this link http://www.bbc.com/news/uk-37721402 shows the noise disruption for people living closer to airport.

Posted

10 years anukunna, planning should start soon... North of Amaravati will become fully residential.. it is better for the airport to be little bit away from residential areas. this link http://www.bbc.com/news/uk-37721402 shows the noise disruption for people living closer to airport.

http://www.nandamurifans.com/forum/index.php?/topic/383851-international-airport-in-mangalagiri/page-9

Posted
గన్నవరం ఎయిర్-పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

gannavaram-intl-terminal-07122016.jpg

గన్నవరం విమానాశ్రయంలో రూ.181 కోట్ల నిధులను వెచ్చించి అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి నూతన టెర్మినల్ బిల్డింగ్ ను జనవరి 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఇతర కేంద్ర మంత్రులు, ప్రారంభోత్సవానికి హాజరవుతారు. రూ.181 కోట్ల వ్యయంతో విమానాశ్రయంలో నూతన ఇంటీరియల్ టెర్మినల్ బిల్డింగ్ పనులను, 2015 అక్టోబర్లో నూతన టెర్మినల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు కలిసి శంకుస్థాపన చేశారు.

నూతన టెర్మినల్ బిల్డింగ్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాజధాని చరిత్రను కళ్ళకు కట్టేలా ఇంటీరియర్ పనులు చేపడుతున్నారు.

కస్టమ్స్ ఇమ్మి గ్రేషన్ విభాగాల శాఖలను నెలకొల్పేందుకు సైతం ఈ నూతన టెర్మినల్ భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత దుబాయ్ కు, గన్నవరం నుంచి నేరుగా సర్వీసులను నడపాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు విమాన సర్వీసులు ఉండడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు.

నూతన టెర్మినల్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

విమానాశ్రయంలో 9520 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో కొత్తగా టెర్మినల్ భవనంలో అన్ని విభాగాలకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు మూడు దశల్లో తనిఖీలు, 16 చెక్ ఇన్ కౌంటర్లు, ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే భవనంలో వీఐపీలు, వీవీఐపీల కోసం ౩వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఓ అధునాతన లాంజ్ సైతం నిర్మిస్తున్నారు. ఇందులో విశ్రాంతి తీసుకునేందుకు, సమా వేశాలు, కాన్ఫరెన్స్లను నిర్వహించేందుకు అనువైన ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఇంత విశాలమైన లాంజ్ లు ఉన్న విమానాశ్రయాలు ఒకటో రెండో తప్ప పెద్దగా లేవు.

రద్దీ సమయంలో ఒకేసారి 500 మంది రాక పోకలు సాగించేలా నూతన భవనంలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏటా కనీసం పది లక్షల మంది ప్రయాణించినా, ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్ల చేస్తున్నారు. 300 కార్లను ఒకేసారి నిలుపుకునేందుకు వీలుగా నూతన భవనం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికితోడు ప్రస్తుతం వినియోగిస్తున్న టెర్మినల్ పక్కనే కార్లో సర్వీసులను నడిపేందుకు అవసరమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడా అందుబాటులోనికి రానుంది. ఇప్పటికే పది పార్కింగ్ బేస్లను సైతం విమానశ్రయంలో అదనంగా ఏర్పాటు చేశారు. మొత్తం 16 పార్కింగ్ బేస్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళ విమాన సర్వీసులను నిలుపుకునేందుకు వీటి వల్ల ప్రయోజనం కలుగుతుంది. జనవరి రెండో వారంలో అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోనికి వచ్చాక, గన్నవరం విమానాశ్రయం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

Posted

 

గన్నవరం ఎయిర్-పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

gannavaram-intl-terminal-07122016.jpg

గన్నవరం విమానాశ్రయంలో రూ.181 కోట్ల నిధులను వెచ్చించి అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 

 

FCI godown/warehouse laga vundi. idi airport teminal enti? I hope this is not real. Tirupathi terminal ni ayina copy kotti vundocchu ga.

Guest Urban Legend
Posted

FCI godown/warehouse laga vundi. idi airport teminal enti? I hope this is not real. Tirupathi terminal ni ayina copy kotti vundocchu ga.

 

it is real

edo okati start avani annai anni ave change avuthayi, bigger and better airport around mangalagiri

Posted

Tirupathi international terminal one year back open chesadu mahanubhavudu...intha varaku okka service kuda padala. Ee daridranni malli theesakosthannara?

tappadu gaa...protocol okati edisindi....paiga paisal atu nunche ravaali....opigga bandi laagatame...
Posted

 

ఏపీకి సంక్రాంతి కానుక… బెజవాడ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్

గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిని అందుకోబోతోంది. సంక్రాంతికి కళ్లముందుకు రాబోతోంది. ప్రధాని మోడీ ఏర్ పోర్టు ఇంటర్నేషనల్ టెర్మినల్ ని జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రారంభోత్సం ఒక్కటే కాదు… ఇందులో ఇంకా మూడు విశేషాలున్నాయ్ !

ఆరు నెలల నుంచి ఊరిస్తున్న అంతర్జాతీయ టెర్మినల్ పనులు క్రమంగా ఓ కొలిక్కివచ్చేశాయ్. గన్నవరం ఏర్ పోర్టు దాదాపుగా రెడీ అయ్యింది. పుష్కరాల నాటికే మొదలు కావాల్సిఉన్నా… వ్యూహంలో మార్పులతో కాస్త ఆలస్యం అయ్యింది. తుఫాన్ లు, ప్రకృతి విలయాలను తట్టుకునేలా నిర్మించాలనే ఉద్దేశంతో ఆఖరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇపుడు అవన్నీ కళ్ల ముందుకి రాబోతున్నాయ్. 143 కోట్ల రూపాయల పనులు దాదాపుగా పూర్తి అయ్యాయ్. ఇంక ఇంటీరియర్ డిజైన్లు మాత్రం బాకీ. అమరావతి చరిత్ర తెలిసేలా…ఆంధ్రుల ప్రతిష్ట పెంచేలా ఉంటాయ్ డిజైన్లు అంటున్నారు. అందుకే ఇపుడు ఆసక్తి రెట్టింపు అవుతోంది. ప్రారంభోత్సవంలో ఇదో మెయిన్ ఎట్రాక్షన్.

ప్రారంభ వేడుకకు మోడీ రాబోతున్నారు. అమరావతి శంకుస్థాపనకి వచ్చాక… మోడీ మళ్లీ ఏపీ వైపు రావడం ఇదే ! కేంద్రం ప్యాకేజీ ప్రకటించాక ఆయన రాకకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనుకోవాలి ! ఇక అమరావతి పనులు కూడా అప్పటికి గేర్ మారతాయ్. టెండర్లు ఖరారు అవుతాయ్. అందుకే సంక్రాంతి నాటికి అంతర్జాతీయ టెర్మినల్ బిగినింగ్ అంటే ఏపీకే కొత్త ఇన్నింగ్స్ అనిపిస్తోందిప్పుడు !

Posted

ఏపీకి సంక్రాంతి కానుక… బెజవాడ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్

గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిని అందుకోబోతోంది. సంక్రాంతికి కళ్లముందుకు రాబోతోంది. ప్రధాని మోడీ ఏర్ పోర్టు ఇంటర్నేషనల్ టెర్మినల్ ని జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రారంభోత్సం ఒక్కటే కాదు… ఇందులో ఇంకా మూడు విశేషాలున్నాయ్ !

ఆరు నెలల నుంచి ఊరిస్తున్న అంతర్జాతీయ టెర్మినల్ పనులు క్రమంగా ఓ కొలిక్కివచ్చేశాయ్. గన్నవరం ఏర్ పోర్టు దాదాపుగా రెడీ అయ్యింది. పుష్కరాల నాటికే మొదలు కావాల్సిఉన్నా… వ్యూహంలో మార్పులతో కాస్త ఆలస్యం అయ్యింది. తుఫాన్ లు, ప్రకృతి విలయాలను తట్టుకునేలా నిర్మించాలనే ఉద్దేశంతో ఆఖరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇపుడు అవన్నీ కళ్ల ముందుకి రాబోతున్నాయ్. 143 కోట్ల రూపాయల పనులు దాదాపుగా పూర్తి అయ్యాయ్. ఇంక ఇంటీరియర్ డిజైన్లు మాత్రం బాకీ. అమరావతి చరిత్ర తెలిసేలా…ఆంధ్రుల ప్రతిష్ట పెంచేలా ఉంటాయ్ డిజైన్లు అంటున్నారు. అందుకే ఇపుడు ఆసక్తి రెట్టింపు అవుతోంది. ప్రారంభోత్సవంలో ఇదో మెయిన్ ఎట్రాక్షన్.

ప్రారంభ వేడుకకు మోడీ రాబోతున్నారు. అమరావతి శంకుస్థాపనకి వచ్చాక… మోడీ మళ్లీ ఏపీ వైపు రావడం ఇదే ! కేంద్రం ప్యాకేజీ ప్రకటించాక ఆయన రాకకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనుకోవాలి ! ఇక అమరావతి పనులు కూడా అప్పటికి గేర్ మారతాయ్. టెండర్లు ఖరారు అవుతాయ్. అందుకే సంక్రాంతి నాటికి అంతర్జాతీయ టెర్మినల్ బిగినింగ్ అంటే ఏపీకే కొత్త ఇన్నింగ్స్ అనిపిస్తోందిప్పుడు !

 

inka Mangalagiri airport ki plan start cheyochhu ayithe

Posted

ganna.jpg

adi cargo building aa.... :kick:

 

Kaneesam air conditioning kooda vunnattu ledu gaa....mari food products store cheyali ante ela? Transport ki ready ayye lopu temporary ga storing and sorting ey ga main ee buildings lo pani.....kaneesam staff koorchovataniki 4 tables kooda pattelaaga levu.....idem dikkumalina cargo building o mari

Posted

adi cargo building aa.... :kick:

 

Kaneesam air conditioning kooda vunnattu ledu gaa....mari food products store cheyali ante ela? Transport ki ready ayye lopu temporary ga storing and sorting ey ga main ee buildings lo pani.....kaneesam staff koorchovataniki 4 tables kooda pattelaaga levu.....idem dikkumalina cargo building o mari

purthiga ayipoyindi anledu ga bro pedtaru le anni

Posted

ఆరంచెల్లో.. ఆకాశంలోకి..!

దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ అనుసంధానం ముఖ్యం

ఈశాన్య, తూర్పు మధ్య దేశాలకు సర్వీసులు అత్యవసరం

గన్నవరం విమానాశ్రయంలో 24గంటల సేవలకు సమయమిది

రన్‌వే విస్తరణ షురూ..

ఈనాడు, అమరావతి

amr-top2a.jpg

విమానాశ్రయంలో ప్రస్తుతం రన్‌వే 2.1కిలోమీటర్ల పొడవులో ఉంది. దీనిని మరో 870 మీటర్లు పెంచాలనేది ప్రణాళిక. విమానాశ్రయంలో 300 విమానాలు నడవాలంటే అత్యవసరంగా రన్‌వేను విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం విమానాశ్రయ విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 700 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. దీనిని వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకొచ్చి.. రన్‌వే విస్తరణపై దృష్టిసారిస్తే.. భారీ విమానాలు తిరిగేందుకు అనువుగా ఉంటుంది.

రాజధాని పరిధిలోని ఏకైక ఆకాశ ప్రయాణ కేంద్రం గన్నవరం విమానాశ్రయమే. ఇక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలు, విదేశాలకు నేరుగా సర్వీసులు నడిపితే డిమాండు భారీగా ఉంటుంది. ఈ ఆర్థిక ఏడాది తొలి అర్థసంవత్సరంలోనే ప్రయాణికుల సంఖ్య గత ఏడాది కంటే 71.38శాతం అధికంగా పెరగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గత రెండేళ్లలో చూసుకుంటే రద్దీ ఆరు రెట్లు పెరిగింది. ఇక్కడి నుంచి అవకాశం లేకపోవడంతో ఏటా 25లక్షల మంది వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విదేశాలు, ఇతర నగరాలకు విమానాల్లో చేరుకుంటున్నారు. అదే గన్నవరం విమానాశ్రయం నుంచే సర్వీసులు నడిపితే నేరుగా ఇక్కడి నుంచే వెళ్తారు. ప్రస్తుతం గన్నవరం అవసరాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన అభివృద్ధి చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.137 కోట్లతో అంతర్జాతీయస్థాయి టెర్మినల్‌ భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఆరు అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. తాజాగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఛైర్మన్‌ విజయవాడకు వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ సైతం ఇదే విజ్ఞప్తి చేసింది. ఇక్కడి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, విదేశాలకు తరచూ వెళ్లివచ్చే ప్రయాణికులు, విద్యార్థులు సైతం ఇదే కోరుకుంటున్నారు.

వారానికి రెండైనా విదేశాలకు..

రాష్ట్ర పరిపాలన మొత్తం సీఆర్‌డీఏ పరిధిలోనికి మారింది. విదేశీ అతిథుల రాక విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలివస్తున్నారు. అతిథులు వారి దేశం నుంచి వచ్చేందుకు పట్టే సమయంకన్నా రెట్టింపు హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి రావడానికే పడుతోంది. అందుకే ప్రస్తుతం వారానికి కనీసం రెండు సర్వీసులనైనా గన్నవరం నుంచి ఈశాన్య, తూర్పు మధ్య దేశాలకు నడపాలని ఇక్కడి వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు సైతం పలు విజ్ఞప్తులు చేశారు. ఎయిమ్స్‌, ఇండో యూకె హెల్త్‌కేర్‌, ఎన్‌ఐడీ లాంటి సంస్థలు ఇక్కడ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. చైనా, జపాన్‌, సింగపూర్‌, అబుదాబీ, యూకె. ఫ్రాన్స్‌ లాంటి దేశాల నుంచి ఎంబసీ ప్రతినిధులు, అతిథులు నిత్యం ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అమరావతి కేంద్రంగా పరిశ్రమలను నెలకొల్పేందుకు వందల విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వీటన్నింటికీ ఉన్న ఏకైక అడ్డంకి నేరుగా ఇక్కడికి చేరుకునేందుకు విమాన సౌకర్యం లేకపోవడమే. విదేశాల నుంచి వచ్చినా, వెళ్లాలన్నా సర్వీసులన్నీ హైదరాబాద్‌కు అర్థరాత్రి చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఉదయం 7గంటలకే తొలి సర్వీసు ఉంది. అప్పటివరకూ వేచి ఉండాల్సి వస్తోంది. అదే నేరుగా ఇక్కడికి చేరుకుంటే రాత్రి విశ్రాంతి తీసుకుని ఆ రోజు ఉదయం నుంచి పనులు ప్రారంభించుకోవచ్చు. అత్యవసరంగా దుబాయ్‌, సింగపూర్‌లాంటి సమీపంలో ఉన్న మధ్య, ఈశాన్య ఆసియా దేశాలకైనా వారానికి రెండు సర్వీసులు నడిపితే బాగుంటుంది. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు విమాన సదుపాయం ఉంటుంది. దుబాయ్‌కు సర్వీసు నడిపితే.. అక్కడి నుంచి అమెరికా, యూరప్‌, ఆఫ్రికా వంటి పశ్చిమ దేశాలకు వెళ్లేవాళ్లకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా సింగపూర్‌ నుంచి తూర్పు దేశాలకు వెళ్లేవాళ్లకు అనువుగా ఉంటుంది.

దేశీయంగా అన్ని నగరాలకూ సర్వీసులు..

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశీయంగా విశాఖ, తిరుపతి, కడప, హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై, బెంగళూరు ఏడు నగరాలకు మాత్రమే ప్రస్తుతం డొమెస్టిక్‌ సర్వీసులు నడుస్తున్నాయి. మిగతా ఏ ప్రధాన నగరానికి వెళ్లాలన్నా హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి వెళ్లాల్సిందే. నిత్యం ఇక్కడి నుంచి ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాలకు వందల మంది వెళ్తుంటారు. దేశంలోని 29 రాష్ట్రాలతోనూ ఇక్కడి వారికి వ్యాపార, వాణిజ్య, విద్యాపరమైన సంబంధాలున్నాయి. కేవలం నాలుగు రాష్ట్రాలకు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లే సర్వీసులున్నాయి. అవికూడా అరకొరగానే.. బెంగళూరు, చెన్నై, దిల్లీకి మూడు నాలుగు సర్వీసులుండగా, హైదరాబాద్‌కు ఐదు సర్వీసులు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. మిగతా తిరుపతి, విశాఖలకు రెండేసి, కడపకు ఒకటి మాత్రమే నడుస్తున్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి చేరుకోవచ్చనే దీమా ఉంటే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి ఆరు నెలలు సరిపోతుంది. కానీ.. ప్రయాణికులు లేరని విమానయాన సంస్థలు, సర్వీసులు లేవు కదా.. అని ప్రయాణికులు అనుకుంటుండడంతో ముందడుగు పడడం లేదు. ఈ ఏడాది అమరావతి పరిధిలో విట్‌, అమ్రిత, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలు తమ శాఖలను నెలకొల్పుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి వెళ్తుంటారు. మరికొన్ని జాతీయ విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలూ తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా సర్వీసులు అన్ని నగరాల నుంచి విరివిగా పెంచాల్సిన అత్యవసర సమయమిది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ, పరిపాలనకు విజయవాడ కీలకంగా మారాయి. ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళ సర్వీసులు పెరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 12.25కు మాత్రమే రెండు సర్వీసులు ఇటునుంచి వెళ్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి సైతం మధ్యాహ్నం 1.45, 3గంటలకు రెండు సర్వీసులే నడుస్తున్నాయి. వీటి సంఖ్యనూ పెంచాలి. ఉదయం బయలుదేరి అక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరిగి వచ్చేలా సదుపాయం కల్పించాల్సి ఉంది.

24గంటలూ సేవలందించాలి..

ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి దేశీయంగా ఆరు నగరాలకు ఉన్న సర్వీసులు సైతం ఉదయం 7గంటల నుంచి రాత్రి 10గంటల మధ్యలోనే నడుస్తున్నాయి. 24గంటలూ సేవలు అందించాల్సిన సమయమిది. విదేశాలకు సర్వీసులు వెళ్లాలన్నా, రావాలన్నా ఇక్కడికి అర్థరాత్రి సమయంలోనే జరుగుతుంది. అలాంటిది.. ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి సేవలూ ఉండకపోవడం వల్ల విమానయాన సంస్థలు సైతం ముందుకురావడం లేదనేది ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లాంటి సంస్థలు చెబుతున్న మాట. ప్రధానంగా రాత్రివేళ సైతం విధులు నిర్వహించేలా విమానాశ్రయానికి అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాల్సి ఉంది. రాత్రి వేళ సర్వీసులను నడిపేందుకు అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు పంపించగలిగితే విమానయాన సంస్థలు ముందుకొస్తాయి. ఒకవేళ హైదరాబాద్‌లాంటి నగరాలకు రాత్రివేళ చేరుకున్నా.. అక్కడే ఉండిపోకుండా.. ఇక్కడికి వెంటనే చేరుకునేందుకూ అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఎలాగూ రాత్రి 10 గంటల వరకూ చివరి సర్వీసును నడుపుతున్నారు. సిబ్బందిని సమకూర్చుకుంటే విరామం లేకుండా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.

నిరంతర వైద్య సదుపాయం..

ప్రస్తుతం డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో విమానాశ్రయం నుంచి ప్రముఖుల రాకపోకలు పెరిగాయి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ప్రమాదం వచ్చినా అత్యవసరంగా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు విమానాశ్రయంలో లేవు. ఇటీవల ఓ శాస్త్రవేత్త రన్‌వేపై బస్సు ఎక్కుతూ పడిపోయి గాయపడగా.. ఆదివారం కావడంతో కనీస ప్రాథమిక వైద్యం చేసేవారూ లేకుండా పోయారు. దీంతో ఆయన తన సొంత వాహనంలోనే విజయవాడకు చేరుకుని ఆసుపత్రిలో చేరారు. అందుకే విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సేవల వివరాలు తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలి. ఒక అంబులెన్స్‌ను నిత్యం అందుబాటులో ఉంచాలి. గుండెపోటు, అపెంటిసైటిస్‌ లాంటివి వస్తే వారికి అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు ఉండాలి.

భవిష్యత్తు అంతా కార్గోపైనే..

విమానాశ్రయానికి సమీపంలోనే ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద మెగాఫుడ్‌పార్కు, గుంటూరులో స్పైస్‌పార్కులు, నూజివీడు మామిడి ఉత్పత్తులు, గుడివాడలో ఎలక్ట్రానిక్‌ హబ్‌, ఆక్వాహబ్‌, విజయవాడలో లాజిస్టిక్‌హబ్‌లను ఇప్పటికే సర్కారు ప్రకటించింది. రాజధాని నిర్మాణం ప్రారంభమయ్యాక రూ.లక్ష కోట్ల వ్యయం పెట్టుబడిగా పెట్టనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే ప్రధాన కార్యకలాపాలన్నింటికీ కార్గో సర్వీసులే ఆధారం. వీటన్నింటి నేపథ్యంలో ముందుగానే సిద్ధమై ఉంటే అవసరాన్ని బట్టి కార్గో సర్వీసులను ఎన్నైనా ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఉద్దేశంతోనే ప్రస్తుతం ఏఏఐ కార్గోకు మార్గం సుగమం చేసింది. భవన నిర్మాణం పూర్తయింది. సరకు రవాణా చేసేందుకు అవసరమైన ఎక్స్‌రే బ్యాగేజ్‌ మిషన్‌, ఈటీ ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్టర్‌, బీపీఎస్‌ అప్రూవల్‌ వంటివి ప్రస్తుతం సమకూర్చాల్సి ఉంది. కార్గో సర్వీసులు నడిపేందుకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కావాలనే విషయాన్ని తెలుసుకునేందుకే ఏఏఐకు చెందిన ప్రతినిధి బృందం వారం రోజుల్లో గన్నవరానికి రానుంది. అనంతరం వారు దిల్లీకి వెళ్లి అవసరమైన యంత్ర పరికరాలు, అనుమతులను ఇప్పించనున్నారు. కార్గో రవాణాకు అవసరమైన అనుమతులను జారీ చేసే ఫారిన్‌ట్రేడ్‌, కస్టమ్స్‌ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలు సైతం ప్రస్తుతం విజయవాడకు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి అనుమతుల జారీకి సైతం మార్గం సుగమమైంది. కస్టమ్స్‌ శాఖ అనుమతులు ఇచ్చేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి పూర్తిస్థాయిలో కార్గో సరఫరా లేకపోయినప్పటికీ ఒకే విమానంలో ప్రయాణికులు, సరకును తీసుకువెళ్లే బెల్లీ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. ఎయిర్‌ఇండియా లాంటి విమానాల్లో 2టన్నుల వరకూ సరకు రవాణాకు అవకాశం ఉంది. అయితే.. ఇప్పటివరకూ అటునుంచి ఇటు సరకును తెచ్చేందుకే వీటిని వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో కార్గో సర్వీసులు అందుబాటులోనికి వస్తేనే.. సరకు రవాణాకు వీలుంటుంది.

Posted
త్వరలో విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు
 
636175525741082960.jpg
  • ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు జనవరి 12న భూమిపూజ?
  • సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ! 
  • 9వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ 
  • 10న బిడ్డర్‌ను ఎంపిక చేసే అవకాశం 
  • భారీగా దరఖాస్తులు వేసిన బిడ్డర్లు 
  • ప్రీ క్వాలిపికేషన్‌ దశలో టెండర్లు
విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు ముందడుగు పడుతోంది. 2017 జనవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో రన్ వే పనులకు శంకుస్థాపన చేయించాలని అధికారులు భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ స్థాయి హోదాను అందుకునేలా.. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు రంగం సిద్ధం అవుతోంది. రన్‌వే విస్తరణ, అనుబంధ పనులను రూ.143 కోట్ల వ్యయంతో చేపట్టడానికి పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పేరొందిన బడా కాంట్రాక్టు సంస్థలు రన్‌వే విస్తరణ పనులను దక్కించుకునేందుకు బిడ్లు వేశాయి. ఢిల్లీ స్థాయిలో ఏఏఐ అధికారులు టెండర్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. ఈ టెండర్ల ప్రక్రియను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ క్వాలిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతోందని సమాచారం. టెండర్లు వేసిన సంస్థల అర్హతలను నిర్ణయించేది ప్రీ క్వాలిఫికేషన్‌ ప్రక్రియ. ఎయిర్‌పోర్టు అధారిటీ (ఏఏఐ) నిర్దేశించిన అర్హతలు ఉన్న వాటినే ప్రీ క్వాలిఫికేషన్‌లో ఎంపిక చేస్తారు. టెండర్ల ప్రక్రియ ఇలా ఉంటే.. రన్‌వే విస్తరణ పనులకు సంబంధించిని ప్రక్రి యపై విజయవాడ అధికారులు దృష్టి సారించారు. జనవరి 12వ తేదీన రన్‌వే పనులకు భూమి పూజ చేయాలని భావిస్తున్నారు. విమానాశ్రయంలో రూ. 163 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జనవరి 12నే నిర్వహిస్తున్నందున.. రన్‌వే పనులకు కూడా సీఎం చేత అదే రోజు శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. రెండింటికీ ఒకేరోజు అటు ప్రారంభోత్సవం.. ఇటు శంకుస్థాపన చేయించటం ద్వారా ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయి సరసన నిలబె ట్టాలని ఏఏఐ అధికారులు భావిస్తున్నారు.
 
 
జనవరి 9న ప్రజాభిప్రాయ సేకరణ
రన్‌వే విస్తరణ పనులు అనుకున్న సమయాన్నే ప్రారంభించే విషయమై స్వల్ప అనుమానాలు ఉన్నాయి. అందుకే విమానాశ్రయ అధికారులు అధికారికంగా ప్రకటించడం లేదు. రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించాలంటే పర్యావరణ అనుమతులు కూడా రావాల్సి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు కొద్ది రోజుల కిందట రన్‌వే విస్తరణ భూములకు సంబంధించి పర్యావరణ హితానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటనను జారీ చేసింది. జనవరి 9వ తేదీన గన్నవరంలోని ఎయిర్‌పోర్టు ఆవరణలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయ సేకరణతో పాటుగా.. పరోక్షంగా ఈ మెయిల్‌ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ 9వ తేదీతో ముగిసినా.. రెండు రోజుల్లో రిపోర్టు వస్తే భూమిపూజ చేయటానికి ఎలాంటి అడ్డంకి ఉండదు.
 
జనవరి 10 లోపు కాంట్రాక్టర్‌ను ఎంపిక..
రన్‌వే పనులకు సంబంధించి జనవరి 12వ తేదీన భూమి పూజ చేయాల్సి ఉన్న నేపథ్యంలో, పదో తేదీ నాటికే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పర్యావరణ - కాలుష్య అనుమతులు వచ్చే వరకు వేచి చూడకుండా సమాంతరంగా టెండర్ల ప్రక్రియకు ఎక్కడా అవాంతరాలు లేకుండా ఏఏఐ అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ క్వాలిఫికేషన్‌ దశలో ఉన్నందున.. తర్వాత టెక్నికల్‌ దశ ఉంటుంది. ఇది పూర్తి అయిన తర్వాత సీల్డ్‌ బిడ్స్‌ ఓపెన్‌ చేస్తారు. అంతిమంగా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. జనవరి 10 వ తేదీ లోపు కాంట్రాక్టర్‌కు అవార్డు ఇవ్వనున్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...