Jump to content

AP fibre Grid project

Recommended Posts

Fiber AP Inspires Modi

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu’s idea to use electric poles to lay optic fiber cables in their affordable internet to every household impressed Prime Minister Narendra Modi as well. Modi’s ambitious scheme, Digital India is of similar idea but is not going any where due to various issues. In a meeting with Niti Aayog and the department of technology, ministry of Information and Broadcasting and department of telecom, Modi asked the officials to follow Andhra model to provide internet connectivity to rural India as the process has several advantages like lower cost, speedier implementation, easy maintenance and utilisation of existing power line infrastructure. A team of officials from the Central government will be visiting the state and will sit with officials of AP government who are associated with this project to study the model. Andhra Pradesh’s Internet to All initiative is likely to roll out from August.

Link to comment
Share on other sites

  • Replies 610
  • Created
  • Last Reply
ఆగస్టు నుంచి ఫైబర్‌నెట్‌ ప్రసారాలు
 
  • కనీస చార్జీ నెలకు రూ.149.. 150 ఉచిత చానళ్లు
  • ఫైబర్‌నెట్‌ పరిధిలో ఉచిత టెలిఫోన్‌ సేవలు
  • 16 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌
హైదరాబాద్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార, సాంకేతిక వ్యవస్థలో కొత్త విప్లవానికి ఆగస్టు నెల నాంది పలకనుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టీవీ ప్రసారాలు ఒకే కేబుల్‌ ద్వారా అందించే ఏపీ ఫైబర్‌ నెట్‌ పథకం అమలులోకి రానుంది. ఇప్పటికే తుది అంకానికి చేరుకున్న ఈ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల ఎంఎ్‌సవోలు, స్థానిక కేబుల్‌ ఆపరేటర్లతో ఏపీ ఫైబర్‌ నెట్‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నెలకు రూ.149 కనీస చార్జీ వసూలు చేసి150 ఉచిత చానళ్లు, ఫైబర్‌నెట్‌ పరిధిలో టెలిఫోన్‌ సేవలు, 16 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ అందిస్తారు. సాధారణంగా.. టెలిఫోన్‌ సేవలను అందిస్తున్నందుకుగాను ఆపరేటర్లు నిర్ణీత మొత్తంలో నెలవారీ అద్దె వసూలు చేస్తారు. కానీ ఈ పథకంలో అందించే టెలిఫోన్‌ సేవల కోసం ప్రత్యేకంగా నెలవారీ అద్దెను వసూలు చేయరు. కాకపోతే.. ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిధిలోని వినియోగదారులు ఇంట ర్‌ కమ్‌ తరహాలో ఈ సేవలను వినియోగించుకునే సదుపాయముంది. అంటే. ఫైబర్‌నెట్‌ వినియోగదారులందరూ పరస్పరం ఉచితంగా ఎంతసేపైనా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే.. న్యూస్‌ చానళ్ల ప్రసారాలు సాధారణంగా స్థానిక ఎంఎ్‌సవోల అదుపాజ్ఞలలో ఉంటాయి. ఫైబర్‌ నెట్‌లో న్యూస్‌ చానళ్లన్నీ సంస్థ నియంత్రణలో ఉంటాయి. అందువల్ల కేబుల్‌ ఆపరేటర్ల గుత్తాధిపత్యం, ఆధిపత్యపోరుకు తెరపడుతుంద న్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. ఉచిత చానళ్లతో పాటు పెయిడ్‌ చానళ్లను కూడా తక్కువ ధరకు అందించే ప్రయత్నంలో ఫైబర్‌ నెట్‌ ఉంది.

World is watching how/if we can do this at such phenomenal rates. John Chambers said that himself.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
21 వేల కి.మీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి
 
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.149కే ఇంటింటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ చానళ్ల ప్రసారాలను అందించడానికి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం23,500 కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్లు వేస్తున్నారు. ఇందులో 21,300 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి

Link to comment
Share on other sites

Sony bro.. miru ese pics assalu kanipinchatlaa.. eroju :blink:

రూ.149 చెల్లిస్తే చాలు

ఫైబర్‌ నెట్‌ సేవలు

ప్రాథమిక వేగం 15 ఎంబీపీఎస్‌

ఇక్కడ 5జీబీ డేటా వరకు డౌన్‌లోడ్‌కు అవకాశం

అంతర్జాలం, ఫోన్‌, కేబుల్‌ ప్రసారాలకు రెండు బాక్సులు తప్పనిసరి

ఈనాడు - అమరావతి

028ap-main5a.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే ఏపీ ఫైబర్‌ సేవలు(అంతర్జాలం, ఫోన్‌, కేబుల్‌టీవీ) పొందేందుకు వినియోగదారులు రెండు బాక్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక బాక్సు ద్వారా అంతర్జాలం (ఇంటర్‌నెట్‌), ఫోన్‌ సౌకర్యం సమకూరుతుంది. ఇదే వైఫైగా కూడా పనిచేస్తుంది. వైఫై సౌకర్యమున్న పరికరాలన్నింటినీ దీంతో అనుసంధానించొచ్చు. రెండో బాక్సు ఐపీ టీవీ అంటే కేబుల్‌ టీవీ ప్రసారాలు అందుకోటానికి తీసుకోవాల్సి ఉంటుంది. రెండింటికీ కలిపి రూ.4,100 వెచ్చించాలి. ఈ బాక్సులను ఏపీ ఫైబర్‌తో ఒప్పందం కుదుర్చుకునే స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ నుంచి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

రెండు బాక్సులు ఎందుకంటే...

మొదట ఒకే బాక్సు ద్వారా అంతర్జాలం, ఫోన్‌, కేబుల్‌ టీవీ సేవలు అందించాలని భావించినా... ఇలాంటి బాక్సులు తయారుచేసే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇప్పటికిప్పుడు లక్షలాది బాక్సులు తయారు చేసే పరిస్థితి లేదు. సేవలన్నీ ఒకే బాక్సు ద్వారా అందిస్తే... ఒకవేళ అది పాడైతే సేవలన్నీ నిలిచిపోతాయి. తదుపరి దశలో ఏపీ ఫైబర్‌ వేదికగా మరింత విస్తృతమైన సేవలు అందించటానికి వివిధ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 బాక్సులు ఉండటమే వెసులుబాటుగా ఉంటుందని భావిస్తున్నారు.

విద్యుత్తు రీడింగ్‌ సైతం..!

ఏపీ ఫైబర్‌తో వివిధ రకాల సేవలందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్న క్రమంలో తొలిదశలో డిస్కంలు విద్యుత్తు మీటర్ల రీడింగ్‌నూ నమోదు చేయబోతున్నాయి. ఒక మనిషి ఇంటికొచ్చి మీటర్ల రీడింగ్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే మీటర్లలో ఎన్ని యూనిట్లు నమోదైందీ తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకున్నారు? వాస్తవంగా ఎంత వాడుతున్నారన్నది చూసి..అదనపు లోడ్‌ని నివారించే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట గడువులోగా ఎవరైన బిల్లు చెల్లించకపోతే వారికి సందేశాల ద్వారా అప్రమత్తం చేయొచ్చు.తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందడంతో పాటు..డిస్కంలకు పెద్ద మొత్తంలో నిధులు ఆదా కానున్నాయి. మామూలుగా పై సౌకర్యాలు పొందాలంటే స్మార్ట్‌ మీటర్‌ ఉండాలి. ఇందుకు రూ.10వేలు అవుతుంది. అంత ఖర్చు భరించటం కష్టం కనుక రూ.800 వ్యయమమ్యే ఇంటర్‌సెప్టర్‌ని... ఏపీ ఫైబర్‌ ద్వారా సమకూరే సెట్‌టాప్‌ బాక్సుతో అనుసంధానిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఇంటర్‌సెప్టెర్‌ పరికరాన్ని తయారు చేయించే పనిలో విద్యుత్తుశాఖ ఉంది. వారం, పది రోజుల్లో ఇది కొలిక్కి రావచ్చు. ప్రయోగాత్మకంగా కొన్ని ఇళ్లలో వాడి చూసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్‌ సేవలు అందుకుంటున్న ప్రతి ఇంటికి, కార్యాలయానికి ఈ సౌకర్యాన్ని విస్తరిస్తారు.

* నెలకి రూ.149కి అందించే ప్రాథమిక ప్యాకేజీ సేవల్లో అంతర్జాల వేగం 15 ఎంబీపీఎస్‌ ఉంటుంది. 5 జీబీ డౌన్‌లోడ్‌ వరకు ఇదే వేగం ఉంటుంది. అంతకుమించి వాడితే వేగం 512 కేపీబీఎస్‌కి తగ్గిపోతుంది. ఇది అపరిమితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ఇన్‌కమింగ్‌తోపాటు ఏపీ ఫైబర్‌ వినియోగదారులకు చేసే కాల్స్‌ సైతం ఉచితం.

* కేబుల్‌ టీవీ ప్రసారాల్లో 150 ఉచిత ఛానళ్లు అందిస్తారు. పే ఛానళ్ల అందించటానికి ఆయా సంస్థలతో ఏపీ ఫైబర్‌ సంప్రదింపులు జరుపుతోంది. వారం, పది రోజుల్లో వీటితో ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. డైరెక్ట్‌ టు హోం(డీటీహెచ్‌) మాదిరిగానే చూసే ఛానళ్లనుబట్టి అదనపు చెల్లింపు ఉంటుంది.

* అంతర్జాలం డేటా సైతం 25 జీబీ, 50 జీబీ, 100 జీబీ తరహా ప్యాకేజీలుంటాయి. వీటికి వసూలు చేసే ఛార్జీలతో సహా ప్యాకేజీల వివరాలన్నీ ఆగస్టు రెండో వారానికల్లా ప్రకటిస్తారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...