Jump to content

Recommended Posts

Posted
విశాఖపట్నం దిశగా విరాట్‌!

ఈనాడు, అమరావతి: నౌకాదళం నుంచి ఇటీవల ఉపసంహరించుకున్న ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విమాన వాహక నౌకను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ మరో అడుగు ముందుకేసింది. విరాట్‌ను రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రం చేస్తున్న ఆలోచనలకు అద్దం పట్టేలా సిద్ధం చేసిన ప్రజంటేషన్‌ను ఏపీ పర్యాటక శాఖ అధికారులు దిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు చూపారు. గురువారం దిల్లీలోని శాస్త్రిభవన్‌లో ఈ దృశ్యరూప సమర్పణను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ కొన్ని సూచనలు చేయడంతో పాటు ప్రాజెక్టుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తీసుకురావాలని కోరింది. విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దు వద్ద విరాట్‌ను ఏర్పాటుచేసేందుకు 500 ఎకరాలను సిద్ధం చేయనున్నట్లు ఏపీ అధికారులు వివరించినట్లు సమాచారం.

Posted

విశాఖపట్నం దిశగా విరాట్‌!

ఈనాడు, అమరావతి: నౌకాదళం నుంచి ఇటీవల ఉపసంహరించుకున్న ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విమాన వాహక నౌకను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ మరో అడుగు ముందుకేసింది. విరాట్‌ను రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రం చేస్తున్న ఆలోచనలకు అద్దం పట్టేలా సిద్ధం చేసిన ప్రజంటేషన్‌ను ఏపీ పర్యాటక శాఖ అధికారులు దిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు చూపారు. గురువారం దిల్లీలోని శాస్త్రిభవన్‌లో ఈ దృశ్యరూప సమర్పణను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ కొన్ని సూచనలు చేయడంతో పాటు ప్రాజెక్టుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తీసుకురావాలని కోరింది. విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దు వద్ద విరాట్‌ను ఏర్పాటుచేసేందుకు 500 ఎకరాలను సిద్ధం చేయనున్నట్లు ఏపీ అధికారులు వివరించినట్లు సమాచారం.

 

 

 

8 months sea 4 months repairs chesthe better 500 acres too much 

Posted

విశాఖ సిగలో మణిపూసగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌!

23ap-state2a.jpg

ఈనాడు, అమరావతి : భారత నావికాదళంలో విశిష్ఠ సేవలందించిన, ఐదంతస్తులతో కూడిన ‘ఐఎన్‌ఎస్‌ విరాట్‌’ విమాన వాహక నౌకను విశాఖపట్నంలో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమైంది. విశాఖలోనే విరాట్‌ను ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ.. ఇటీవల దిల్లీలో కేంద్ర సర్కారు ముంగిట ప్రత్యేకంగా ప్రదర్శన(ప్రజంటేషన్‌) ఇచ్చింది. ఈ క్రమంలో ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)తో రావాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ రాష్ట్రానికి సూచించింది.

ఏర్పాటు.. అంచనా వ్యయం

* భీమిలిలో గోస్తనీ నదీ ముఖద్వారం వద్ద విరాట్‌ను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

* సముద్రానికి ఆనుకుని డ్రై డాక్‌ను సిద్ధం చేసి అక్కడ విరాట్‌ను ఏర్పాటుచేస్తారు. ఇందుకోసం బెర్త్‌, ఛానెల్‌ తవ్వకం వంటి పనుల కోసం రూ.162 కోట్లు ఖర్చవుతుందని, డ్రై డాక్‌లోకి రూ.2కోట్ల వ్యయంతో మంచినీటిని నింపడం ద్వారా విరాట్‌ నిర్వహణ వ్యయం తగ్గుతుందని అంచనా వేశారు.

* విరాట్‌కు రంగులు వేయడం, రీ ఫిట్టింగ్‌, విద్యుదీకరణ వ్యవస్థ ఏర్పాటు తదితరాలకు రూ.41కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

* ముంబయిలో ఉన్న విరాట్‌ను విశాఖకు తీసుకురావడానికి రూ.15కోట్లు ఖర్చవుతుంది.

* నౌకను హోటల్‌, ఇతర ఏర్పాట్లకు అనువుగా మార్చేందుకు రూ.42కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా.

  • 2 months later...
Posted

డిసెంబరుకల్లా కాకినాడకు ఐఎన్‌ఎస్‌ విరాట్‌!

అక్టోబరులో యుద్ధనౌకను ప్రభుత్వానికి అప్పగించనున్న రక్షణ శాఖ

ఈనాడు, అమరావతి: ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను రాష్ట్రానికి తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఈ నౌకను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ టెండర్లు ఆహ్వానించింది. వచ్చే వారంలో ఈ టెండర్లను ఖరారు చేయనున్నారు. నౌక ఇంజిన్‌ పనిచేసే పరిస్థితిలో లేనందున అక్కడినుంచి కాకినాడ వరకు నీటిలో లాక్కుని రావాల్సి ఉంటుంది. ఈ పని కోసం ఒక సంస్థను ఎంపిక చేసేందుకే టెండర్లు ఆహ్వానించారు. నౌకను కాకినాడకు తీసుకువచ్చేందుకు రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కాకినాడకు తీసుకువచ్చాక అక్కడే నౌకకు అవసరమైన మెరుగులు దిద్దడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను చేపట్టనున్నారు. చివరగా విశాఖ తీరానికి తరలించి పర్యాటక కేంద్రంగా రూపొందించనున్నారు.

విరాట్‌ను పరిశీలించి తీసుకురానున్న నిపుణుడు: వచ్చే అక్టోబరులో విరాట్‌ను రక్షణశాఖ ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించనుంది. యుద్ధనౌకలో చరిత్రాత్మక ఇతర ప్రధాన, సాంకేతిక పరికరాలు, అవశేషాలు ఏం ఉన్నాయో పరిశీలించడంతో పాటు నౌకను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కపిల్‌గుప్తా అనే నిపుణుడిని సలహాదారుగా నియమించుకుంది. ఆయన్ని ముంబయికి పంపింది. కేంద్రం అప్పగింత, రాష్ట్రం స్వీకరణ ప్రక్రియను ఆయనే పర్యవేక్షించనున్నారు. లీడ్స్‌ కన్సల్టెంట్స్‌ అధిపతి అయిన గుప్తా గతంలో ఇదే విరాట్‌లో వైస్‌కెప్టెన్‌గా పనిచేశారని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాడార్‌, మిసైల్స్‌ వంటి వాటితో విరాట్‌లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. విరాట్‌కు వెనుకభాగంలో ఉన్న ఖాళీ స్థలంలో యుద్ధాల్లో వినియోగించిన పాత హెలికాప్టర్‌లాంటివి ఉంచి పర్యాటకులకు కనువిందు కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ హిమాన్షు శుక్లా తెలిపారు.

  • 3 weeks later...
Posted
విరాట్‌ తరలింపు టెండర్ల గడువు పెంపు

ఈనాడు, అమరావతి: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు సంబంధించి టెండర్ల గడువును ఆగస్టు 7వరకు పొడిగించారు. ముంబయి వద్ద ఉన్న ఈ యుద్ధనౌకను కాకినాడకు తెచ్చేందుకు ఈ టెండర్లను ఆహ్వానించగా రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. సాంకేతికపరమైన అంశం కాబట్టి టెండర్ల దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని ఆ సంస్థలతోపాటు, ఇతర సంస్థలు కొన్ని విజ్ఞప్తి చేయడం వల్లే గడువును పొడిగించినట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • 2 months later...
Posted

యుద్ధ నౌక విరాట్‌ను మ్యూజియంగా మార్చే ప్రతిపాదన పరిశీలనలో వుందని, దీనిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై అక్టోబరులో సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామన్నారు. 3,4 నెలల్లో రాష్ట్రానికి విరాట్‌ను తీసుకొస్తామన్నారు.

Posted

ఐఎన్‌ఎస్‌ విరాట్‌పై.. అధ్యయనం!

విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై చర్చ

సాంకేతిక అంశాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

డీపీఆర్‌కు నిధులు మంజూరు చేసిన పర్యాటకశాఖ

ins-viraat-story-fb_647_030617104958.jpg

ఈనాడు, విశాఖపట్నం: ఐదు లక్షల నాటికల్‌ మైళ్ల సుదీర్ఘ ప్రయాణం.. 27,800 టన్నుల బరువు అవలీలగా తీసుకెళ్లగలిగే సామర్థ్యం.. 58 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించిన ఐఎన్‌ఎన్‌ విరాట్‌ యుద్ధనౌక ఘనత ఇది. ఈ ఏడాది మార్చిలో సేవల నుంచి నిష్క్రమించిన ఈ యుద్ధనౌకను విశాఖ నగరంలోని సాగర తీరంలో పర్యాటక ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయాలన్న ప్రక్రియ నెమ్మదిగా కదులుతోంది. దీని ఏర్పాటుకు భారీ వ్యయం భరించాల్సి రావడమే పనుల నెమ్మదికి కారణంగా కనిపిస్తోంది.

సాగుతున్న చర్చ..: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లాగానే విరాట్‌ కూడా ముక్కలవుతుందా..? లేదంటే పర్యాటకంగా దేశ, విదేశీయులను అలరిస్తుందా..? అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో విమాన వాహన యుద్ధనౌక విక్రాంత్‌ రిటైరయ్యాక 17 ఏళ్లపాటు భారత ప్రభుత్వం భారీ ఖర్చు భరించి నిర్వహణ బాధ్యత చూసింది. చివరికి చేసేది లేక ముక్కలు చేయాల్సి వచ్చింది. విరాట్‌ 27 ఏళ్లపాటు రాయల్‌ బ్రిటిష్‌కు సేవలందించి 1987లో భారత నేవీలో చేరింది.

రిటైరయ్యాక.. విశాఖ సాగర తీరంలో 13 అంతస్థుల మ్యూజియంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఆసక్తి చూపింది. దీనికి రూ. వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సగం నిధులు తాము భరించగలమని.. మిగిలిన సగం కేంద్రం సమకూర్చాలని ప్రభుత్వం కోరినా అటునుంచి సానుకూల స్పందన రాలేదు.

సమగ్ర పథక నివేదిక తయారీలో..

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముంబైకి చెందిన మాస్టర్‌ అండ్‌ అసోసియేట్స్‌ ఆర్కిటెక్ట్‌ ఇంటీరియల్‌ డిజైనర్స్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంటు సంస్థకు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతను ఆగస్టు 23న అప్పగించింది. నౌక ఏర్పాటుకు ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది..? ఒకవేళ ఏర్పాటు చేస్తే అక్కడి అలల వేగానికి ఇబ్బంది ఎదురవుతుందా..? తదితర అంశాలపై అధ్యయనం సాగుతోంది. ఈ సంస్థకు ఒప్పందంలో భాగంగా రూ. 17.70 లక్షలను శుక్రవారం పర్యాటకశాఖ విడుదల చేసింది. భారత నావికాదళంతో సంధానకర్తగా వ్యవహరిస్తున్న లీడ్స్‌ కన్సల్టింగ్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థకు రూ. 2.77 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. భీమిలి, రుషికొండ, మంగమారిపేట, జోడుగుళ్లపాలెం ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలుగా పర్యాటక శాఖ భావిస్తోంది.. దీనిపైనా అధ్యయన బృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Posted

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ డీపీఆర్‌పై సమీక్ష

ఈనాడు అమరావతి: యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో మరో అడుగు పడింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) పై ముంబయికి చెందిన మాస్టర్‌ అసోసియేషన్స్‌ ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనాను కలిసి చర్చించారు. మరికొన్ని సంస్థలు కూడా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయని మీనా తెలిపారు. ఆయా సంస్థల సామర్థ్యం, గతంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణలో వారి అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

Posted
ఆధునిక హంగులతో ఐఎన్‌ఎస్‌ విరాట్‌
14-10-2017 03:32:32
 
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధ నౌకను ఆధునిక హంగులతో తీర్చిదిద్ది త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావడానికి ఆ శాఖ కార్యదర్శి మీనా శుక్రవారం సచివాలయంలో కన్సల్టెంట్లతో చర్చించారు. అవి త్వరలోనే డీపీఆర్‌ ఇవ్వనున్నాయి
  • 2 months later...
Posted

దాదాపు రూ.300 కోట్లతో 15నెలల వ్యవధిలో రుషికొండలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

Posted

విరాట్‌ విశాఖ వస్తోంది! 

కురుసుర జలాంతర్గామి... టీయూ 142 యుద్ధ విమానం.. పర్యాటకంగా విశాఖ నగర కీర్తిని రెపరెపలాడిస్తున్నాయి...ఇక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక కూడా విశాఖ ఒడికి చేరనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణలోకి దిగింది. భారత నౌకాదళ సేవల నుంచి నిష్కృమించిన ఈ యుద్ధ నౌకను విశాఖ సాగర తీరంలో పర్యాటక ప్రదర్శనశాలగా ఏర్పాటు చేసేందుకు 15 నెలల గడువును నిర్దేశించుకుంది. ఈ నౌకను జాతీయ స్థాయి మెరైన్‌ మ్యూజియంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు పర్యాటక వారసత్వ బోర్డు ఆమోద ముద్ర వేసింది.
విశాఖపట్నం: మహా నగర పరిధిలోని రుషికొండ.. భీమిలి.. మంగమూరిపేట, మూలకుద్దు.. తదితర సాగర తీర ప్రాంతాలు విరాట్‌ను కొలువుదీర్చేందుకు అనువైన ప్రాంతాలుగా పర్యాటకశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక అంచనాకు వచ్చేందుకు సర్వే కూడా చేసింది. దిల్లీలోని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమైన రాష్ట్ర అధికారులు విశాఖ    పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృశ్యరూపికలో వివరించారు.
రూ. 300 కోట్లతో సాధ్యమేనా..? 
ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు రూ. వెయ్యి కోట్ల భారీ వ్యయం అవుతుందని తొలుత అంచనాలు వేశారు. ఇప్పుడు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చవొచ్చని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై అధికార వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిధులు నౌకను లంగరు వేయడానికే సరిపోతాయని చెబుతున్నారు. దీని నిర్వహణకు రూ. కోట్లలో వెచ్చించాలంటున్నారు. ఈ భారీ నౌకను నిలపాలంటే 18 ఎకరాల స్థలం అవసరం. దీన్ని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనశాలగా మార్చేందుకు పార్కింగ్‌ ప్రాంతం, విన్యాసాల వేదికలు.. ఇతర హంగులతో పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో మార్చాలంటే దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం భారీగా నిధులు వెచ్చించి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఎక్కడెక్కడ నుంచి సమకూర్చాలన్నదానిపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన ప్రభుత్వం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతోపాటు నౌకాయాన, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతోంది. తొలుత ఈ ప్రాజెక్టు బాధ్యతను వుడా చేపడుతుందని భావించినా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. దీంతో రాష్ట్ర పర్యాటకశాఖ కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని పట్టాలెక్కించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
విశాఖే సరైన వేదిక..: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను యుద్ధవిమాన ప్రదర్శనశాలగా ఏర్పాటు చేసేందుకు గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు పోటీ పడినా.. విశాఖలో ఏర్పాటు చేస్తే పర్యాటకరంగానికి మంచిదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. దీన్ని పర్యాటక హంగులతో మెగా టూరిజం ప్రాజెక్టుగా రూపొందించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కురుసుర జలాంతర్గామి ప్రదర్శనశాల.. తాజాగా ఏర్పాటు చేసిన టీయూ-142 యుద్ధవిమాన ప్రదర్శనశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్న విశాఖలో విరాట్‌ ప్రాజెక్టు కోసం ఎంత వెచ్చించినా ఫర్యాలేదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. 
విరాట్‌ నౌకలోని గదులను నక్షత్ర హోటల్‌గా మార్చడంతోపాటు వాణిజ్య పరంగానూ వినియోగించుకుంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రత్యేక అనుభూతి పొందుతారని.. ఆదాయ వనరులూ పెరుగుతాయని భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖ వేదికవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. 
యుద్ధ విమాన వాహన నౌక పైనుంచి హెలి పర్యాటకం నడిపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖ పర్యటనలో వెల్లడించారు. బీ నౌకలో వినోద కార్యక్రమాలు.. ప్రాంగణంలో జల క్రీడలు, సాహస విన్యాసాలకు ఏర్పాట్లు చేసి అన్నివర్గాల పర్యాటకులను ఆకట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

  • 3 weeks later...
  • 9 months later...
Posted
విరాట్‌ వెళ్లిపోయింది!
03-11-2018 03:33:38
 
636768128194935622.jpg
  •  ఏపీ ఆశలపై కేంద్రం నీళ్లు.. మహారాష్ట్రకు కేటాయింపు
  •  దుర్గసింధ్‌లో 852కోట్లతో ప్రాజెక్టు
విశాఖపట్నం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విరాట్‌ వెళ్లిపోయింది. విశాఖపట్నం వస్తుందని భావించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహకనౌక ఐఎన్‌ఎ్‌స విరాట్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. దీంతో రాష్ట్రం ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. దీన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మలచాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. ఢిల్లీకి వెళ్లినపుడల్లా రక్షణశాఖ అధికారులతో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. విశాఖ సాగరతీరంలో ఫ్లోటింగ్‌ హోటల్‌గా మార్చాలనుకున్నారు. అంతపెద్ద నౌకను తీరానికి చేర్చడం కష్టమైన పని కాబట్టి, నీటిలోనే ఉంచాలని నిర్ణయించారు. భీమిలిలో 500ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. సుమారు రూ.వేయి కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని చంద్రబాబు కోరడంపై రక్షణశాఖ విభేదించింది. ఏ రాష్ట్రం తీసుకున్నా కేంద్రం రూపాయి కూడా ఇవ్వదని, వారే అభివృద్ధి చేసుకోవాలని స్పష్టంచేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఏపీ ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. దుర్గసింధ్‌ జిల్లాలో రూ.852 కోట్ల విరాట్‌ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నిర్ణయించింది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...