Jump to content

Recommended Posts

Posted

ee mosha and current bjp entha chillara mundakodukulo idi chusthe artham avthundi ... 

what the hell happened to bjp ... why anyone in bjp with an ounce of decency questioning mosha ... 

hate to say this ... bjp has become disgusting.

Posted
విరాట్‌పై ‘మహా’స్త్రం 

 

విఖ్యాత యుద్ధనౌక ఇక మహారాష్ట్ర పరమేనా? 
రాజకీయ జోక్యమే కారణం 
కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదంటున్న అధికారులు 
ముంబయి వద్ద సముద్రంలో నౌక 
జనవరిలోనే డీపీఆర్‌ సమర్పించిన ఏపీ

3ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకపై ‘మహా’స్త్రం పనిచేయనుందా? ఇక ఈ విఖ్యాత యుద్ధనౌక ఏపీకి రాకపోవచ్చా? మహారాష్ట్ర పరం కానుందా..? అంటే దాదాపు అదే నిజమయ్యే అవకాశం ఉందంటోంది రాష్ట్ర అధికార యంత్రాంగం. 2016 ప్రథమార్ధం నుంచి విరాట్‌పై పోటీ నెలకొంది. ఇప్పుడు మహారాష్ట్ర దాదాపు ముందు వరుసలోకి వచ్చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రం, మహారాష్ట్రలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం, కేంద్రం-ఏపీ మధ్య నెలకొన్న రాజకీయ అంతరం, తదితర పరిణామాలు నేపథ్యంలో నౌక మహారాష్ట్రకే దక్కే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విరాట్‌ ముంబయి వద్ద సముద్రంలో ఉంది. దీంతో అక్కడే ఈ నౌకను ప్రదర్శన కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్రకు విరాట్‌ను కేటాయిస్తున్నట్లు కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదనేది ఏపీ పర్యాటక శాఖ అధికారుల వాదన. 
ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోవా, గుజరాత్‌, మహారాష్ట్ర కూడా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ కోసం పోటీపడ్డాయి. ఈ నౌకను 2017 జూన్‌లో ఉపసంహరించుకో(డీ కమిషన్‌)గానే ఏపీకి అప్పగించేందుకు భారత నౌకాదళం సమ్మతించింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కూడా సానుకూలంగా ఉందని.. 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యాటకశాఖ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2017 జూన్‌లో విరాట్‌ను డీ కమిషన్‌ చేశారు...కానీ, ఏపీకి కేటాయిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. తర్వాత ముఖ్యమంత్రి కేంద్రానికి, రక్షణశాఖకు రెండుసార్లు లేఖలు రాసినట్లు అధికారిక సమాచారం. నౌకను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను పంపాలని కేంద్రం సూచించగా..ఈ ఏడాది జనవరిలో సుమారు రూ.310 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ సమర్పించింది.

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను విశాఖ బీచ్‌కు తరలించి పర్యాటక గమ్యస్థానంగా మలిచే ప్రతిపాదనల్లో.. 
సముద్ర జలక్రీడలు 
యాచింగ్ 
సెయిలింగ్ 
గ్లైడింగ్‌ 
క్రూయిజింగ్ 
5నక్షత్రాల హోటల్‌ 
సుమారు 500గదులు 
హెలిప్యాడ్‌ 
సౌండ్‌, లైట్‌ షో 
థీమ్‌ పార్క్‌ 
వీటితోపాటు మరిన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని పేర్కొన్నారు. సముద్ర జలాల్లోనే దీన్ని ఉంచి అభివృద్ధి చేసేందుకు విశాఖలో కసరత్తు చేశారు. పలు ప్రతిపాదనలనూ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించింది.

 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...