Jump to content

sonykongara

Members
  • Posts

    75,533
  • Joined

  • Last visited

  • Days Won

    113

Reputation Activity

  1. Like
    sonykongara got a reaction from narens in Top Private universities in Amaravati   
  2. Like
    sonykongara got a reaction from narens in Amaravati   
  3. Haha
    sonykongara got a reaction from Mobile GOM in AP Liquor scam   
    మద్యం కేసులో YCP విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు అందించింది. ఈనెల 12న విచారణకు రావాలని ఆదేశించింది.
  4. Like
    sonykongara got a reaction from Nfan from 1982 in AP Liquor scam   
  5. Like
    sonykongara got a reaction from narens in Jaggayyapeta -Nandigama Defense Cluster   
  6. Like
    sonykongara got a reaction from Mobile GOM in Amaravati heart project   
  7. Like
  8. Like
    sonykongara got a reaction from Nfan from 1982 in AP Tourism   
  9. Like
    sonykongara reacted to padmakumar in Quantum Computing Valley In Amaravati   
    Easy ga 1 year paina patudhii
  10. Like
    sonykongara got a reaction from AndhraBullodu in Amaravati   
    pedaparimi vallu 2015 lo ma land tisukomani govt ni adigevallu, ippudu rates peragane  Amaravati meda nammakam ledu kani rajadani pakkana undtam valla ma rates ekkuvaga unnayi antunnaru , kontha mandi unna lands antha ayipoyaka malli lands tisukovachuga ippude enduku antunnaru, appudu ippudu icchevallu appudu ivvaru.
  11. Like
    sonykongara got a reaction from Narendra1 in Amaravati   
    Jagan gadi time dani ni cheda dobberu, CBN emo oka range lo kavali antadu, reality duram ga dates pedatadu.
  12. Like
    sonykongara reacted to surapaneni1 in Amaravati   
    Ippudu lands lekapote nxt villages lo same situation 
  13. Like
    sonykongara got a reaction from Flash in AIIMS   
    CBN chala vati ki elane land icchadu, IIT ki, IPPE kuda
  14. Like
    sonykongara reacted to N sainyam in Quantum Computing Valley In Amaravati   
    For me, This is the only exciting project for amaravathi. Chuddam how fast this would get into reality 
  15. Love
    sonykongara got a reaction from Flash in Quantum Computing Valley In Amaravati   
  16. Like
    sonykongara got a reaction from Narendra1 in Quantum Computing Valley In Amaravati   
    Ayana cheyyalani anukunnadi cheyyalani chusthadu, odipothe opdipotadu kani prayathnam apadu.
  17. Like
    sonykongara reacted to NTR ANNA in Amaravati   
    Edho oka iconic building two years lo complete cheyyandi 
  18. Like
    sonykongara got a reaction from Mobile GOM in Budameru Rivulet   
  19. Like
    sonykongara got a reaction from Mobile GOM in Amaravati   
    Amaravati Govt Complex Buildings: అమరావతి ప్రభుత్వ సముదాయం (AGC)లోని భవనాలకు కొత్త టెక్నాలజీతో ‘డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌’ ద్వారా శీతలీకరణ అందించనున్నారు. ఈ సముదాయంలోని ఐకానిక్‌ టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు ఏసీ యంత్రాలు బిగించకుండా, వీటి స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కూలింగ్ అందిస్తారు.
    గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తబ్రీద్‌ సంస్థతో ఒప్పందంపై 2018లో సీఆర్డీఏతో సంతకాలు అయ్యాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఒప్పందం అమలుకు నోచుకోలేదు. రూ.350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల సెంట్రల్ కూలింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. పాత ఒప్పందం ప్రకారం అదే ధరకు అందించేందుకు సదరు సంస్థ ముందుకొచ్చింది. దీనికి ప్రపంచ బ్యాంకు సైతం ఆమోదం తెలిపింది.
    భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్: అమరావతిలో ఎక్కువగా భవనాలు ఉండే ప్రాంతాల్లో వ్యక్తిగత ఏసీలు ఏర్పాటు చేయకుండా, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సీఆర్డీఏ భావిస్తోంది. సెంట్రల్ ప్లాంట్‌ ద్వారా బహుళ భవనాలకు భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్ అందిస్తారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు. గడువు ముగిసిన తరువాత ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగిస్తారు.
    విద్యుత్తు బిల్లు ఆదా అవుతుంది: అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్‌ బ్లాక్‌ ‘E’లో అసెంబ్లీ భవనాన్ని 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 3 అంతస్తుల్లో డిజైన్లు రూపొందించారు. హైకోర్టు సూపర్‌ బ్లాక్‌ ‘F’లో 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది.
        బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులతో బిల్డింగ్ని నిర్మిస్తున్నారు. ఐకానిక్‌ టవర్లలో సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు రానున్నాయి. విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. గుత్తేదారు సంస్థలకు ఇటీవలే సీఆర్డీఏ ఎల్‌వోఏలు అందజేసింది. వీటికి కొత్త వ్యవస్థ ద్వారా అందించే కూలింగ్ ద్వారా దాదాపు 50% మేర విద్యుత్తు ఆదా కావడంతో పాటు వ్యయంలో 20% వరకు తగ్గనుందని భావిస్తున్నారు.
  20. Like
    sonykongara got a reaction from Mobile GOM in Vizag IT   
    Visakhapatnam: విశాఖ.. ‘టెక్‌’ పతాక
     
    By Andhra Pradesh News DeskUpdated : 04 Jul 2025 04:13 IST Ee Font size         4 min read     రాష్ట్రంలో క్వాంటమ్‌ వ్యాలీ రాకతో మారనున్న రూపురేఖలు
    సాగర తీరానికి దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్‌ రాక
    రాబోయే 6 నెలల్లో 15 సంస్థలు వచ్చే అవకాశం
    చిన్నా పెద్దా కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు
    ఈనాడు - అమరావతి 

    అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్‌ వ్యాలీ.. విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజినీర్లకు శిక్షణ కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్‌ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్‌ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పనిచేయాలి. క్వాంటమ్‌ టెక్నాలజీకి సంబంధించి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలుపెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్లు.. సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థలు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకోసిస్టం ఉండటం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది.  
    విశాఖలో టెక్‌ పరుగులు
    రాబోయే 6 నెలల్లో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కివచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), గూగుల్, కాగ్నిజెంట్‌ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకూ ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో రూ.8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాల్చితే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర, డబ్ల్యూఎన్‌ఎస్, పాత్ర, కాండుయెంట్, ఫ్లూయంట్‌ గ్రిడ్, ఏసీఎన్, మిరాకిల్, టెక్‌ సర్వే, ప్రో విజిల్‌ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్ఠంగా 700 మందికి.. గరిష్ఠంగా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవికాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35 వేల మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా. 
    ఏటా 2.5 లక్షల మంది పట్టభద్రులు
    రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటికి వస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, పుణె, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థలను విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి.
    గూగుల్‌
    విశాఖలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్, క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ప్రభుత్వం మధురవాడలో 80 ఎకరాలు కేటాయించింది. సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్‌ సర్టిఫికేషన్, మెంటార్‌షిప్‌ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్‌ క్రెడిట్స్, వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. 
    కాగ్నిజెంట్‌
    కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీటీఎస్‌) రూ.1,583 కోట్ల పెట్టుబడితో విశాఖలో అత్యాధునిక క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాలను 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్‌ నాటికి మొదటి దశ క్యాంపస్‌ నిర్మాణాన్ని కాగ్నిజెంట్‌ పూర్తి చేయనుంది. 
    టీసీఎస్‌
    విశాఖలో ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.1,370 కోట్లు పెట్టుబడి పెట్టి 12 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం ఐటీ హిల్‌-3లో 22 ఎకరాలను 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. సొంత భవనాలు నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్‌-2లో భవనాన్ని టీసీఎస్‌కు సబ్‌లీజుకు ఇచ్చేందుకూ అనుమతించింది.
    ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
    విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్‌ స్పేస్‌ ఏర్పాటుకు రూ.5,278 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సంస్థకు ప్రభుత్వం కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున.. ఐటీ హిల్‌-3లో 3.5 ఎకరాలను ఎకరా రూ.కోటి చొప్పున కేటాయించింది.  
    వివిధ సంస్థలతో సంప్రదింపులు కొలిక్కి
    - భాస్కర్‌ కాటమనేని, ఐటీ శాఖ కార్యదర్శి
    ప్రముఖ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. రాబోయే 6 నెలల్లో మరిన్ని కంపెనీలు విశాఖకు రాబోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉన్న దృష్ట్యా ప్రస్తుతానికి వాటి పేర్లు వెల్లడించలేం.
  21. Love
    sonykongara got a reaction from Siddhugwotham in Amaravati Outer Ring Road   
    అమరావతికి మహర్దశ - ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లకు కేంద్రం గ్రీన్సిగ్నల్ - AMARAVATHI ORR PROJECT
    70 మీటర్లకు బదులు 140 మీటర్ల మార్పునకు కేంద్రం పచ్చజెండా - మార్చిలో గడ్కరీ, చంద్రబాబు భేటీ నిర్ణయాలు అధికారికంగా వెల్లడి
    Amaravathi ORR Project (EENADU) By ETV Bharat Andhra Pradesh Team
    Published : July 4, 2025 at 8:26 AM IST
    4 Min Read Amaravathi ORR Project : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో 70 మీటర్ల వెడల్పుతో 189 కి.మీ. ఓఆర్ఆర్ నిర్మాణానికి అంగీకారం తెలపగా, ఇది సరిపోదంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మిస్తుండటం, 50 ఏళ్లలో ఓఆర్ఆర్పై పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఆర్ను 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీనితో కేంద్రం 140 మీటర్ల వెడల్పుకు అంగీకరించింది.
    విజయవాడ తూర్పు బైపాస్ సాధ్యం కాదని గతంలో కేంద్రం పేర్కొన్నందున, దాని స్థానంలో ఓఆర్ఆర్కు అనుసంధానించడానికి రెండు చోట్ల లింక్ రోడ్ల నిర్మాణానికి అంగీకరించింది. మార్చి 5న దిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఓఆర్ఆర్తో పాటు రాష్ట్రంలోని అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని మినిట్స్ రూపంలో పేర్కొంటూ అధికారికంగా వివరాలను గురువారం ఇక్కడి అధికారులకు వచ్చాయి.
    భూసేకరణకు రాష్ట్రం రూ.1000 కోట్లు : ఓఆర్ఆర్కు 70 మీటర్ల వెడల్పు చాలంటూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్) ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గత డిసెంబరులో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదనంగా 70 మీటర్ల వెడల్పునకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో రూ.1,000 కోట్లు రాష్ట్రం వెచ్చించేందుకు చంద్రబాబు అంగీకరించారు.
    చంద్రబాబు, గడ్కరీ సమావేశం మార్చిలో జరిగినప్పుటికీ, అందులో తీసుకున్న నిర్ణయాల వివరాలు అధికారికంగా విడుదల కాకపోవడంతో కొంత అస్పష్టత నెలకొంది. దీంతో ఇక్కడి ఎన్హెచ్ఏఐ అధికారులు, 70 మీటర్ల వెడల్పుతోనే ఓఆర్ఆర్కు 5 జిల్లాల్లో భూసేకరణను ఇటీవల ప్రారంభించారు. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు ఖరారు చేస్తూ నిర్ణయం రావడంతో దానికి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.
    రెండు అనుసంధాన రోడ్లు : విజయవాడ పశ్చిమ వైపున బైపాస్ నిర్మాణం తుది దశలో ఉండగా, ఇప్పుడు తూర్పు వైపు నాలుగు వరుసలతో బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ తూర్పు బైపాస్ అమరావతి ఓఆర్ఆర్కు సమాంతరంగా ఉన్నందున, తూర్పు బైపాస్ను వద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నై - కోల్కతా ఎన్హెచ్-16పై కాజ వద్ద ముగిసే విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి సమీపంలో ఓఆర్ఆర్ వరకు 17.5 కి.మీ. మేర లింక్రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద ఎన్హెచ్-16 నుంచి నారాకోడూరు సమీపంలో ఓఆర్ఆర్ వరకు 5.2 కి.మీ. మేర మరో లింక్ రోడ్డు నిర్మాణానికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
      బైపాస్‌లో నాలుగు చోట్ల వంతెనలు : గొల్లపూడి నుంచి రాజధాని ప్రాంతం మీదుగా కాజ వరకు వెళ్లే విజయవాడ వెస్ట్ బైపాస్లో నాలుగు రహదారుల వద్ద అండర్పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. తొలుత వెస్ట్ బైపాస్ పూర్తిచేసిన తర్వాత దశలవారీగా వీటిని నిర్మిస్తారు.
    గుంటూరుకు హైవే విస్తరణ : అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న హైవే-544డి లో వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరుసలుగా విస్తరించడానికి గత సంవత్సరం డిసెంబరులో మోర్త్ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. వినుకొండ నుంచి గుంటూరులోని చెన్నై-కోల్కతా హైవే వరకు 109.65 కి.మీ. మేర విస్తరించకుండా, ఔటర్ రింగ్ క్రాస్ వరకు విస్తరణకు 84.80 కి.మీ. మేరకే ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గడ్కరీ వద్ద ప్రస్తావించారు. గుంటూరు వరకు ఎన్హెచ్-544డి ని విస్తరించాలని కోరారు. దీంతో గుంటూరు వరకు మిగిలిన 24.85 కి.మీ. దూరాన్నీ నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం అంగీకరించింది.
    విశాఖలో 12జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లు :
    శ్రీకాకుళం జిల్లా మూలపేట నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇది తీరానికి దగ్గరగా ఉండేలా దీనిపై అధ్యయనం చేయనున్నారు. విశాఖ మీదుగా వెళ్లే పాత చెన్నై-కోల్కతా హైవేలో లంకెలపాలెం నుంచి మధురవాడ కార్షెడ్ జంక్షన్ వరకు మొత్తం 12 జంక్షన్లు ఉన్నాయి. వీటివద్ద వంతెనల నిర్మాణానికి తొలుత ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఒకటి నుంచి ఎనిమిదో జంక్షన్ వరకు 15 కిలో మీటర్ల ఎలివేటెడ్ బ్రిడ్జిని , ఆ తర్వాత 3 జంక్షన్లకు 8 కిలో మీటర్ల మరో ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించారు. 12వ జంక్షన్ వద్ద ప్రత్యేక బ్రిడ్జిని నిర్మాణానికి అంగీకరించారు. వీటిలో 10 జంక్షన్ల మీదుగా మెట్రో రైలు ప్రాజెక్టు వెళ్తుండటంతో, ఎన్హెచ్ఐ వంతెన, దానిపైన మెట్రోరైలు వంతెనను కలిపి నాగ్పుర్ తరహాలో ఒకే ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు 226 కి.మీ. హైవేను ఆరు/ఎనిమిది వరుసలుగా, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేను ఆరు వరుసలుగా విస్తరించడానికి సంబంధించిన డీపీఆర్లను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు. కుప్పం నుంచి తమిళనాడులోని హోసూర్ మధ్య 56 కి.మీ. నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం 9 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తారు. కాకినాడ పోర్టుకు దక్షిణ వైపు నుంచి కత్తిపూడి-ఒంగోలు హైవేకు అనుసంధానం చేసేందుకు డీపీఆర్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. చెన్నై-కోల్‌కతా హైవే నెల్లూరు వద్ద 17.16 కి.మీ బైపాస్ నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిపై టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందకు 2015 నుంచి ఎన్హెచ్ఐ ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనితో నగర పరిధి దాటిన తర్వాత మరెక్కడైనా హైవేపై టోల్ప్లాజా ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గడ్కరీ సూచించారు.
  22. Like
    sonykongara got a reaction from narens in Talliki Vandanam   
  23. Love
    sonykongara got a reaction from narens in P4   
  24. Like
    sonykongara got a reaction from Mobile GOM in Talliki Vandanam   
  25. Like
    sonykongara got a reaction from Nfan from 1982 in Amaravati   
×
×
  • Create New...