Jump to content

Showtime Consulting Robin Sharma


Sunny@CBN

Recommended Posts

తెలుగు 360:

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు టీడీపీ ముందస్తుగా పనులు చేసుకుంటోంది. వేరే కార్యకలాపాలేమీ లేకపోవడంతో చంద్రబాబు కూడా.. తిరుపతి ఉపఎన్నికకు సమయం కేటాయిస్తున్నారు. అయితే.. ఆయన ఈ ఎన్నిక బాధ్యతను ప్రధానంగా ఓ వ్యూహకర్తకు అప్పగించారు. ఆయనే రాబిన్ శర్మ. గతంలో పీకే టీంలో కీలకంగాపని చేసి… తర్వాత సొంత సంస్థ పెట్టుకున్నారు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. ఆయన పార్టీ స్ట్రాటజీని ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచార వ్యూహాల్ని భిన్నంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికీ ఐటీడీపీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అలాగే… ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించుకున్నారు. రాబిన్ శర్మ కొద్ది రోజుల పాటు తిరుపతిలో మకాం వేసి… పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రచార సరళి ఎలా ఉండాలనే అంశంపై ఒక వ్యూహం సిద్ధం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. వీటితోపాటు చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, చేస్తోన్న అన్యాయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని నిర్ణయించారు. టీటీడీ పవిత్రతను మంటగలిపే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు, ఇసుక, లిక్కర్ మాఫియా దందా, దళితులు, మైనార్టీలపై దాడులు వంటి ప్రధాన అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాబిన్ శర్మ టీం .. కొన్ని బృందాలను నియమించుకుంది. వారందరూ తిరుపతి చేరుకున్నారు. ఆ టీమ్ లు తమ పనిని ప్రారంభించాయి. ఇప్పటికే పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన చంద్రబాబు.. పార్టీ పరంగా క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు. బూత్, మండల, అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిల్లో కమిటీలను నియమించారు. బూత్ స్థాయిలో 8 వేల మంది కార్యకర్తలను రంగంలోకి దించారు. గ్రామ స్థాయిలో వెయ్యి మంది తమ పని మొదలుపెట్టారు. మండలస్థాయిలో 40 మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. 89 మంది పరిశీలకులను నియమించారు.
https://www.telugu360.com/te/robin-sharma-work-with-tdp-in-tirupati/

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...