Jump to content

farmers ki good news ?


sonykongara

Recommended Posts

అమరావతి: వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
 
 
ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ‘పెట్టుబడి సాయం’ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు
 

 

Link to comment
Share on other sites

ఎల్లుండి ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌?
19-01-2019 16:06:20
 
636835110579165373.jpg
అమరావతి: సోమవారం ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
 
 
వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
 
Tags : AP Cabinet, Chandrababu, amaravathi
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...