Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

vinayak

Drama started as elections are coming

Recommended Posts

కొన్నాళ్ల క్రితం చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టాల‌ని భావించి మోడీ తీసుకున్న మొద‌టి చ‌ర్య కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంప‌డం. వెంక‌య్య నాయుడు తెలుగు రాష్ట్రాల‌లో కీల‌కంగా ఉండేవారు. మాజీ జాతీయ అధ్య‌క్షుడిగా, సీనియ‌ర్ నాయ‌కునిగా వెంక‌య్య త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని బీజేపీ ఉన్న‌తికి ఎంత‌గానో ఉప‌యోగించేవారు. అనేక సంక్షోభ స‌మ‌యాల‌లో వెంకెయ్య నెర‌పిన రాజ‌కీయ‌మే బీజేపీని ఇబ్బందుల్లో ప‌డ‌కుండా చేసింది. అలాంటి వెంక‌య్య‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేసేలా మోడీ తీసుకున్న నిర్ణ‌యంపై అప్ప‌ట్లో అనేక ర‌కాలుగా చ‌ర్చ సాగింది. అయితే, త‌న‌కు న‌చ్చ‌ని చంద్ర‌బాబుకు కూడా అండ‌గా ఉంటున్నార‌ని, బీజేపీ, టీడీపీ పొత్తుకు వెంక‌య్యే ఆలంబ‌న‌గా ఉన్నార‌ని గ్ర‌హించి ముందుగా వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టాల‌ని మోడీ నిశ్చ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే వెంక‌య్య‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేశారు. అయితే, అది ఎంత‌టి త‌ప్పుడు వ్యూహ‌మో మోడీకి తాజాగా తెలిసి వ‌చ్చిన‌ట్లు ఉంది.

28-narendra-modi-and-venkaiah-naidu-3532

 

ఒక‌వైపు వ‌రుస‌గా ఉప ఎన్న‌క‌ల‌లో ఎదుర‌వుతున్న ఓట‌మి.. కొండ‌లా పెరిగిపోతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త మోడీని కుదురుగా కూర్చోనియ‌డం లేదు. మ‌రో ఆరేడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా… ఇప్పుడు ఎదుర‌వుతున్న ప‌రాజ‌యాలు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు న‌మూనా ఫ‌లితాలుగా తేలిపోతుండ‌డంతో మోడీ, అమిత్ షాల‌కు నిద్ర ప‌డుతున్న‌ట్లు లేదు. మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా దిగిన చంద్ర‌బాబు మోడీకి వ్య‌తిరేకంగా విప‌క్షాల‌ను కూడ‌గ‌డుతున్న తీరు మోడీ, షాల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఈ అన్ని ప‌రిణామాల‌ను ఎదుర్కొవాలంటే ఏం చేయాలా అని ఆలోచించిన మోడీకి ఒకే ఒక దారి క‌నిపించిన‌ట్లు ఉంది. అదే వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య అయితేనే ప‌రాజ‌యం అంచున నిల‌బ‌డ్డ బీజేపీని మ‌ళ్లీ గ‌ట్టున ప‌డేయ‌గ‌ల‌ర‌ని మోడీకి అర్థ‌మైన‌ట్లే ఉంది. అందుకే అనూహ్యంగా ప్ర‌ధాని మోడీ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య త‌లుపు త‌ట్టారు. నేరుగా ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లిన మోడీ ఆయ‌న‌తో కీలక చర్చలు జరిపారు. గురువారం ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన మోదీకి వెంకయ్య దంపతులు స్వాగతం పలికారు. పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అక్కడే ప్రధాని మధ్యాహ్న భోజనం చేశారు. దేశ రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురూ చర్చించారు. ఈ మధ్య కాలంలో ఆయన పర్యటించిన దేశవిదేశాల విశేషాలను ప్రధానితో వెంకయ్య పంచుకున్నారు. ప్రగతి పథంలో పయనిస్తున్న భారతదేశం గురించి వివిధ దేశాధినేతల అభిప్రాయాలను, తన అభిప్రాయాలను ఈ సందర్భంగా ప్రధానికి తెలిపారు.

28-narendra-modi-and-venkaiah-naidu-3252

ఇలా అనూహ్యంగా ప్ర‌ధాని మోడీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇంటికి వెళ్ల‌డంపై దేశ రాజ‌ధానిలో చ‌ర్చొప‌చ‌ర్చ‌లు మోద‌ల‌య్యాయి. వ‌రుస‌గా ఎదుర‌వుతున్న ప‌రాజ‌యాలు… త‌న‌ను గ‌ద్దె దించేందుకు చంద్ర‌బాబు ఏర్పాటు చేస్తున్న కూట‌మి… దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్ల ఎదుర‌వుతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త ఈ ప్ర‌తికూల‌త‌ల‌ను ఎదుర్కోవ‌డం ఎలా అన్న‌దానిపై వెంక‌య్య‌తో మోడీ చ‌ర్చ‌లు సాగించార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అండ‌గా ఉన్నార‌ని ఆ రోజున ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోనే ఉండాల‌ని ఉంది అంటూ మొత్తుకున్నా వెంక‌య్య‌ను కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి ప్ర‌మోష‌న్ పేరిట ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపేశారు. ఆయ‌నే ఉండి ఉంటే ఈ రోజున బీజేపీ ప‌రిస్థితి ఇలా ఉండేది కాద‌ని బీజేపీ నేత‌లే కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రోజున ప‌క్క‌కు పంపేసి ఈ రోజున అవ‌స‌రం అయ్యేస‌రికి ఇంటికి వెళ్లి మ‌రీ అదే వెంక‌య్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన మోడీ తీరుపై అనేక ర‌కాల విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

Share this post


Link to post
Share on other sites
1 hour ago, minion said:

veediki konchemaina sigganipinchademo :wall:

Moshah ki winning elections matters Nd remaining all deniki iyna ready ..... 

Share this post


Link to post
Share on other sites
4 minutes ago, niceguy said:

B0000di gaadi antha moorkhudini inthavaraku soodala..

kinda nunchi edigina manishi konchem humility untundi modi lo anukunna ... apparently not.

 

Share this post


Link to post
Share on other sites
1 hour ago, minion said:

kinda nunchi edigina manishi konchem humility untundi modi lo anukunna ... apparently not.

 

OKKA WRONG STEP ANNI WRONG STEPS KI MOOLAM

Share this post


Link to post
Share on other sites
1 hour ago, vinayak said:

OKKA WRONG STEP ANNI WRONG STEPS KI MOOLAM

Not so brother ... life affords many opportunities to correct ourselves ... 

modi apparently so ingrained in his superiority ... that he forgot where he started from ... 

 

Share this post


Link to post
Share on other sites
On 11/8/2018 at 8:16 PM, vinayak said:

Image may contain: 5 people, people standing and indoor

 

I don't know when this picture was taken ... it looks soo pretentious of modi ... after all what he did to LKK Advani ... 

I'd feel sad if it influences one person even within BJP ... 

sad state of affairs ... 

PS: LKK ni xx cheyyatamendira ayya ... pindakudula undi ... 

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×