Sree Ram 583 Posted May 2, 2018 16 hours ago, swarnandhra said: 2000x12 = 24000 per year? 2.8 lacs lo 1/4 th eligible anukunna 16800 cr. sacchindi gorre(AP future generations). Mee lekka wrong aa .. leka nenu lekkalu marchipoyana? Mee lekka prakaram 168 cr kada ayyedi? Share this post Link to post Share on other sites
swarnandhra 366 Posted May 2, 2018 8 minutes ago, Sree Ram said: Mee lekka wrong aa .. leka nenu lekkalu marchipoyana? Mee lekka prakaram 168 cr kada ayyedi? oops !!! sorry. ☹️ then it is not that big a burden. Share this post Link to post Share on other sites
Sree Ram 583 Posted May 2, 2018 21 minutes ago, swarnandhra said: oops !!! sorry. ☹️ then it is not that big a burden. Yep. Ade anukuntunna .. correct ga chesthe bane undochu Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 4, 2018 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి04-05-2018 02:12:18 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు: మంత్రి యనమల అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతితో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని వందల కోట్లయినా కేటాయిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. సచివాలయంలో నిరుద్యోగ భృతిపై గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భృతి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్హుల వయస్సు, విద్యార్హతలపై చర్చించారు. డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు సూచించారు. Share this post Link to post Share on other sites
RKumar 841 Posted May 4, 2018 (edited) Ippudu TDP 1000/- isthe to unemployed ki Jagan 2000 istha adhikaram loki vachhaka antademo. Edited May 4, 2018 by RKumar Share this post Link to post Share on other sites
KING007 678 Posted May 4, 2018 Married ladies are eligible??? Share this post Link to post Share on other sites
Yaswanth526 7,708 Posted May 31, 2018 Its official 10 lakh unemployment youth will get 1000 rupees every month Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 31, 2018 నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన అమరావతి: నిరుద్యోగ భృతి అమలుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3గంటల నుంచి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు భేటీలో ఎక్కువ అంశాలు భూకేటాయింపులకు సంబంధించే ఉన్నప్పటికీ నిరుద్యోగ భృతి అంశంపైనే కీలకంగా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 10లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారు. ఈ భృతి చెల్లింపునకు కనీస అర్హతను డిగ్రీగా పరిగణించాలని నిర్ణయించారు. జూన్ నెల నుంచే నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటే సీఎం చంద్రబాబు పలు వేదికలపై ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అలాగే, రైతులకు లబ్ది చేకూర్చేందుకు కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 31, 2018 నిరుద్యోగ భృతిపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్ 31-05-2018 20:26:34 అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున భృతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ భృతికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హతగా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ అకౌంట్లోనే నిరుద్యోగ భృతి ప్రభుత్వం వేయనుంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నిరుద్యోగ భృతికి ఏడాదికి రూ.1200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉన్నా నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. నిరుద్యోగ భృతి అమలుపై తాము ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిందని, ఆ తర్వాత విధివిధానాలు రూపొందించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. Share this post Link to post Share on other sites
AnnaGaru 1,178 Posted May 31, 2018 (edited) ikkada oka macnhi/good twist undi....a dabbulu teesukuni SKILL development course attend avvali and compelte cheyyali ani gurthu.... Dassault,HP and other corporation partnership tho skill development centers lo training ippistaru....... Edited May 31, 2018 by AnnaGaru Share this post Link to post Share on other sites
snvchandu 38 Posted May 31, 2018 2 hours ago, AnnaGaru said: ikkada oka macnhi/good twist undi....a dabbulu teesukuni SKILL development course attend avvali and compelte cheyyali ani gurthu.... Dassault,HP and other corporation partnership tho skill development centers lo training ippistaru....... Very good initiative...Enduku ante aa money emi free ga dobbataniki kaadu kada... Skills lekapothey government ippinchi jobs ippistunna inka badha emundi... Unemployment lekunda chestaru Skill set readymade ga unte..This is good for youth in next 5 years .. 2019 ki malli babu garu vastaru.. Appdu 5 years lo guarantee ga chala changes untayyi AP lo and prajaloo...Prathi pakshalu emina peekala anna ee 9 months max...taruvatha ante malli TDP vaste dabida dibideyy.. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 1, 2018 నిరుద్యోగ భృతి.. నెలకు వెయ్యి01-06-2018 02:50:11 పది లక్షల మందికి చెల్లింపు ఏటా రూ.12 వేల కోట్ల వ్యయం మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర వెల్లడి అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు ఇది అందుతుంది. పేదలు, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. సుమారు 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేసినా.. ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కుటుంబానికి ఒక్కరికే నిరుద్యోగ భృతి అన్న పరిమితి లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇవ్వాలని నిశ్చయించింది. గురువారమిక్కడ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ ప్రాథమిక నిర్ణయాన్ని మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్రవిలేకరులకు వెల్లడించారు. ‘2014లో హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన చేసి ఆంధ్రులను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి నెట్టేశారు. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో చంద్రబాబు పాలన ప్రారంభించారు. అయినా ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ ఉపశమనం, పింఛను మొత్తం ఐదురెట్లు పెంచడం, 24 గంటల విద్యుత్ సరఫరా..ఇలా అన్నీ నురవేర్చారు. నిరుద్యోగ భృతి ఒక్కటే మిగిలింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ప్రతిపాదనను సిద్ధం చేశాం. వీటిని ప్రజల ముందు పెట్టి.. వారినుంచి వచ్చే సూచనల మేరకు వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి ఖరారు చేస్తారు’ అని లోకేశ్ పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం 9 అంశాలతో ప్రతిపాదన తయారుచేసింది. వెబ్సైట్ రూపకల్పన.. నిరుద్యోగ భృతి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని లోకే శ్ తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజల నుంచి స్పందనలు, సూచనలు తీసుకున్నాక వచ్చే మంత్రివర్గ సమావేశంలో వాటిపైనా చర్చించి తుది విధానం ఖరారుచేస్తామన్నారు. ఏ పేరు పెట్టాలన్నది కూడా అప్పుడే నిర్ణయిస్తామని తెలిపారు. ‘పథకం ప్రారంభించాక వెబ్సైట్లోనే దరఖాస్తులు పెట్టుకునేందుకు ఏర్పాటు చేస్తాం. ఆ వెబ్సైట్లోనే రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు. అదే వెబ్‌సైట్‌ను జాబ్పోర్టల్గా కూడా మలుస్తాం. రాష్ట్రంలోని అన్ని లక్షల మంది సమాచారం ఒకే చోట ఉన్నందున.. దేశంలో ఎవరైనా ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి తమకు కావాల్సిన అర్హతలున్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు. అంటే నిరుద్యోగ భృతి వెబ్‌సైటే జాబ్ పోర్టల్‌గా కూడా ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. దేశంలోనే ప్రథమం నిరుద్యోగ భృతిని ఈ తరహాలో అమలు చేయడం దేశంలోనే ప్రథమమని లోకేశ్ తెలిపారు. కేరళ, పశ్చిమబెంగాల్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలుచేశారని.. కానీ ఆయా రాష్ట్రాల్లో నెలకు రూ.120, రూ.200, రూ.500 చొప్పునే ఇస్తున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చారని.. కానీ ఆరు నెలల్లోనే పథకాన్ని ఎత్తేశారన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ, కుటుంబంలో ఒకరికి అనే పరిమితి లేకుండా ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఏపీయే అవుతుందన్నారు. ఆయా రాష్ట్రాలతో పాటు అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అమలుచేస్తున్న నిరుద్యోగ భృతిని కూడా పరిశీలించామని తెలిపారు. నిరుద్యోగ భృతిపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న తామంతా కలిసి ఈ పరిశీలన చేశామని చెప్పారు. యువతను పనిచేసే శక్తిగా తయారుచేస్తాం నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని, సమాజానికి ఉపయోగపడేలా, విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దుతామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువతను పనిచేసే శక్తిగా తయారుచేస్తామన్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించామని, దీనికితోడు వివిధ శాఖల నుంచి నిధుల మద్దతుతో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ భృతిపై సుదీర్ఘ చర్చ కేబినెట్ భేటీలో నిరుద్యోగ భృతిపై చాలాసేపు చర్చ జరిగింది. డిగ్రీ విద్యార్హతతో పాటు, ఇంటర్ పూర్తయ్యాక పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన నిరుద్యోగులకు కూడా భృతి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 2.5 ఎకరాల తరి, ఐదెకరాల మెట్ట పొలం కంటే తక్కువ ఉన్నవారికి భృతి ఇద్దామని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే అలాంటివి పెట్టి సంక్లిష్టం చేయవద్దని, తెల్ల రేషన్‌కార్డు ఉంటే చాలని పెట్టాలని.. సాధ్యమైనంత ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా నిబంధనలు ఉండాలని సీఎం ఆదేశించారు. పేద కుటుంబమై ఉండాలి.. తెల్లకార్డు ఉండాలి లబ్ధిదారుకు 22-35 ఏళ్ల వయసు ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీ. తత్సమాన విద్యార్హత. నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇస్తారు. నిరుద్యోగ భృతికి తోడు.. వారిని కొన్ని ప్రభుత్వ పనుల్లో ఉపయోగించుకుంటారు. దానికి అదనంగా ప్రోత్సాహకం ఇస్తారు. నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారు. రేషన్‌ను ఎక్కడైనా తీసుకున్నట్లే భృతిని ఎక్కడైనా తీసుకోవచ్చు. బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారికి ఉచితంగా నైపుణ్యాల అభివృద్ది శిక్షణ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే వర్క్‌ఫోర్స్‌గా తయారుచేస్తారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 1, 2018 నిరుద్యోగ భృతి రూ.100010 లక్షల మందికి ప్రయోజనం డిగ్రీ, డిప్లొమా అర్హత ఆన్లైన్లోనే దరఖాస్తు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పాత విక్రయ దస్తావేజులకు స్టాంపు డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారానే ఆటోమ్యుటేషన్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు వేయి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ, డిప్లొమా చదివిన వారికి ఈ భృతి అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఆటోమ్యుటేషన్ విధానం అమలుకు, చిన్న, సన్నకారు రైతుల పాత విక్రయ దస్తావేజులను స్టాంపు డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశ వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులకు వివరించారు. అర్హులు* దారిద్య్రరేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు.* డిగ్రీ, డిప్లొమా చదివినవారు.* 22 - 35 ఏళ్ల మధ్య వయసువారు.*ఒక కుటుంబంలో ఎంత మంది అర్హులున్నా అందరికీ చెల్లింపు.* నెలకు రూ.వేెయి చొప్పున చెల్లింపు.* నిరుద్యోగ భృతితోపాటు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.* బయోమెట్రిక్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే నగదు.* ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి దరఖాస్తుల ఆహ్వానం.* దరఖాస్తు సమయంలోనే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న నైపుణ్య విభాగాల ఎంపిక.* ప్రజా సాధికార సర్వే ప్రకారం ఉన్న 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉంటే వారికీ చెల్లింపు. తక్కువని అభిప్రాయం వస్తే పెంపు?నిరుద్యోగ భృతి చెల్లింపుపై యువత నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెలకు రూ.1000 తక్కువగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమైతే రూ.1500కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆటో మ్యుటేషన్‌కు ఆమోదంఆటో మ్యుటేషన్ అమలు కోసం పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం - 1971కు సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వివరాలను మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. కొత్త విధానం ప్రకారం.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయవిక్రయాల వివరాలను అప్పటికప్పుడు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తారు. వీటిని తహశీల్దారు కార్యాలయంలో 30 రోజులపాటు పరిశీలనకు ఉంచుతారు. అభ్యంతరాలు రాకుంటే దానంతటదే మ్యుటేషన్ అయిపోతుంది. ప్రస్తుత విధానంలో పొలం రిజిస్ట్రేషన్ జరిగిన అనంతరం రెవెన్యూ అధికారుల ద్వారా పాస్ పుస్తకాల్లో నమోదు చేయించుకోవాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ లేకుండానే...* వివిధ కారణాలవల్ల భూముల క్రయవిక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోని (సాదా బైనామా) చిన్న, సన్నకారు రైతుల దస్తావేజులను స్టాంపు డ్యూటీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేందుకు మంత్రివర్గం అనుమతించింది.* 2014 జూన్ 2వ తేదీకి (రాష్ట్ర విభజన) ముందు జరిగిన లావాదేవీలకే స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది.* గ్రామీణ ప్రాంతాల్లో ఐదెకరాల్లోపు వ్యవసాయ భూములకే ఇది వర్తిస్తుంది.* ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజులపాటు స్టాంపు డ్యూటీ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకువీలు కల్పిస్తారు.* గ్రామ, మండల స్థాయిలో సమగ్ర విచారణ జరిపి సహేతుకం అని తేల్చిన లావాదేవీలకే అనుమతి ఉంటుంది. కలెక్టర్లకు అధికారంప్రభుత్వం, అభ్యంతరం లేని భూములు, వాటర్ బాడీ భూములను అనుమతించిన అధీకృత లేఔట్లలో (భూమి ధర ఎక్కడైతే రూ.50 లక్షల విలువ ఉండే ప్రదేశాలు) అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు, అటువంటి తరహా నిర్మాణాల కోసం 0.50 సెంట్ల వరకూ కేటాయించే అధికారం కలెక్టర్లకు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని నిర్ణయాలు* మెడికల్ ప్రాక్టీషనరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలన్న ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్టు-1968కు సవరణ.* కోస్తాంధ్ర తీరంలో నిర్మించిన పైపులైన్ల ద్వారా పెట్రో సహా వివిధ ఉత్పత్తుల సరఫరాపై పైపులైన్ ఛార్జీల వసూలు. ఈ ఛార్జీల నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్టు, మడ అడవులు, గుర్తింపు పొందిన అభయారణ్య ప్రాంతాల్లో ఉన్న పైపులైన్లకు మినహాయింపు. తీరం వెంబడి మత్స్య ప్రాజెక్టులకు మినహాయింపు.* ఆంధ్రప్రదేశ్ కోల్డ్ చైన్ ప్రమోషన్ లిమిటెడ్ పేరుతో కోల్డ్ చైన్ కార్పొరేషన్ ఏర్పాటు. దీనిద్వారా శీతల గిడ్డంగుల ఏర్పాటు, అభివృద్ధికి చర్యలు.* పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల ప్రత్యేక నిధి రూ.160 కోట్ల నుంచి రూ.170 కోట్లకు పెంపు.* అగ్రిగోల్డ్ బాధితుల్లో పేదలు ఉన్నందున.. వారందరికీ సత్వర న్యాయం చేసేందుకు దిల్లీ నుంచి నిపుణులను ప్రభుత్వం తరఫున తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు.* లబ్ధిదారులనే నేరుగా ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి వారికి నచ్చిన పాడి పశువులను కొనుగోలు చేయడానికి అవకాశం.* సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు కోసం రెండు ప్రాంతాల పరిశీలన. అందులో ఒక దానిని ఎంపిక చేశాక త్వరితగతిన పనులు.* వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటిస్తున్న కేంద్రం వాటిని కొనుగోలు చేసేందుకు రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించకపోవడాన్ని మంత్రివర్గ సమావేశం ఖండించింది. ఈ విషయంలో కేంద్రంపై గట్టి ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకుంది. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలిజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని, ఆరోపణలు చేసేవారు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. తాము వేసిన రోడ్లపై నడుస్తూ రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారనే తాను అన్నానని తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ కాంట్రాక్టును హెరిటేజ్ ఉద్యోగి హరిప్రసాద్‌కు కట్టబెట్టామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన హెరిటేజ్ ఉద్యోగి కాదని, ఫైబర్‌గ్రిడ్ సలహాదారు మాత్రమేనని వెల్లడించారు. తాము గత కొన్నేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని, ఆరోపణలు చేసేవారు వారి ఆస్తులను ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. ఏడాదికి రూ.1200 కోట్ల వ్యయంప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ యువత 10 లక్షల వరకు ఉన్నారని, నిరుద్యోగ భృతి చెల్లింపునకు సంబంధించి యువత నుంచి అభిప్రాయాలను సేకరించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఏడాదికి దీనికి రూ.1200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, ఎక్కడా విఫలం లేకుండా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని, ఉత్తరప్రదేశ్‌లో 6 నెలల్లోనే నిలిపివేశారని వెల్లడించారు. యువత నుంచి అభిప్రాయాల సేకరణ, పథకం అమలు తేదీలపై వచ్చే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇలా..- వివరాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకునేముందు ఇతర రాష్ట్రాలు ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నాయి? నెలకు ఎంత భృతి అందజేస్తున్నాయనే వివరాలను పరిశీలించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆ వివరాలివి. Share this post Link to post Share on other sites
venkat232 112 Posted June 1, 2018 12 hours ago, AnnaGaru said: ikkada oka macnhi/good twist undi....a dabbulu teesukuni SKILL development course attend avvali and compelte cheyyali ani gurthu.... Dassault,HP and other corporation partnership tho skill development centers lo training ippistaru....... Good.....SKILL development course lantivi lekapote....worst scheme........ Share this post Link to post Share on other sites
swarnandhra 366 Posted June 1, 2018 here you go... నిరుద్యోగ భృతి నెలకు రూ. 3600 ఇవ్వాలి: రామకృష్ణ 01-06-2018 16:07:32 అమరావతి: నిరుద్యోగ భృతి నెలకు రూ. 3600 ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి కనీస అర్హత పదవ తరగతిగా నిర్ణయించాలని సూచించారు. జూన్ 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల మౌలిక వసతులకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం చేపడుతున్నామని రామకృష్ణ చెప్పారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయలేదని, ప్రభుత్వం అశ్రద్ధ పేదవారికి శాపంగా మారిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. Share this post Link to post Share on other sites
Yaswanth526 7,708 Posted June 1, 2018 A historic decision was taken yesterday by CBN’s Cabinet.Unemployed youth in the age group of 22 to 35 years hailing from Below Poverty Line (BPL) families will be given a stipend of Rs. 1000. Graduates / Equivalent Diploma Holders will be eligible to receive this benefit. Youth who have enrolled into the scheme will also be given skill training by government agencies until they find a suitable job that matches their qualification. Around 10 lakh youngsters will be eligible for the scheme which will cost Rs.1200 crore to the state’s exchequer. Share this post Link to post Share on other sites
swarnandhra 366 Posted June 1, 2018 (edited) just wondering what will be a "suitable" job for BA degree holder. Edited June 1, 2018 by swarnandhra Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 2, 2018 భృతి.. ఆర్థిక శృతితుది దశకు చేరిన కసరత్తు 1.30 లక్షల మందికి లబ్ధి! కర్నూలు విద్య, న్యూస్‌టుడే: పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువకులకే భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా నిరుద్యోగ భృతిపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పల్స్ సర్వే సందర్భంగా ప్రతి ఇంటి నుంచి సేకరించిన సమాచారాన్ని నిరుద్యోగ భృతి కోసం పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబాల నుంచి సేకరించిన వివరాల్లో నిర్దేశించిన అర్హతలకు సరిపోతే భృతి ఇవ్వడానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. జాబితాలో నమోదు కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేసి తమ వివరాలు చెప్పడానికి అవకాశం కల్పిస్తారు. చివరలో అధికారులు సర్వే చేసి నిజంగానే తప్పు జరిగితే సరిచేస్తారు. లేదంటే తొలగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్హతపై కూడా ఒక స్పష్టతకు వచ్చింది. డిగ్రీ, డిప్లమో పూర్తిచేసిన విద్యార్థులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. తద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలిగి జీవితాల్లో నిలదొక్కుకునే వీలు కలగనుంది. పీజీ ఆపైన చదివిన విద్యార్థులను గ్రాడ్యుయేట్‌గా, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, ఇంజినీరింగ్, ఐటీఐ కోర్సులు చదివిన విద్యార్థులకు డిప్లమో అర్హతగా తీసుకోనున్నారు. వయోపరిమితి కూడా 22-35 సంవత్సరాల మధ్యలో ఉన్నవారినే నిరుద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అర్హతలు ప్రమాణంగా తీసుకుంటే జిల్లావ్యాప్తంగా లక్ష మంది పైగానే నిరుద్యోగ భృతి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్హత కలిగిన నిరుద్యోగులకు నెలకు రూ.వేయి చొప్పున భృతి చెల్లించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా డిగ్రీ, డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులకు ఈ భృతి అందనుంది. రాష్ట్ర పరిధిలో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటే అర్హుల సంఖ్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు సుమారు 30 వేల మంది నిరుద్యోగ యువత జిల్లాలో ఓటర్లుగా నమోదు కానట్లు సమాచారం. వారిని జాబితాలోకి తీసుకోవాలా? వద్దా? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగ భృతిలో భాగంగా అర్హులకు ఎంత ఇవ్వాలన్నది స్పష్టంగా ఖరారు చేయలేదు. ఇప్పటికే ప్రతినెలా వృద్ధులు, వితంతువులు, అభయహస్తం, చేనేత, గీత కార్మికులకు రూ.1000, దివ్యాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తున్నారు. ఇదే విధానంలో యువకులకు కూడా రూ.వేయి అందివ్వడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు, హరియాణా, పశ్చిమబంగ, కేరళ, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ప్రతి నెలా భృతి అందిస్తున్నారు. భృతికి వీరు అనర్హులు..?ప్రసుత్తం ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే శిక్షణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రముఖ కంపెనీల్లో యువత ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. వీటితోపాటుగా ప్రభుత్వ పథకాల కింద స్వయం ఉపాధికి సాయం పొందిన అభ్యర్థులను భృతికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తైన వారిని ఉద్యోగాలకు పనికి వచ్చేలా తీర్చిదిద్దడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే అప్రంటీస్ శిక్షణ, నైపుణ్య శిక్షణలకు కేంద్రం కొన్ని పథకాలు నిర్వహిస్తోంది. అందుకుగాను సంస్థలకు కేంద్రం కొంత నిధులు కేటాయిస్తోంది. నిరుద్యోగులకు ప్రభుత్వం భృతి ఇస్తూనే ఈ పథకాల కింద వివిధ సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తే ఉద్యోగాలు పొందే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఇలా..డిగ్రీ అర్హత జాబితా వివరాలు* పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ)- 11 వేలు* గ్రాడ్యుయేషన్ - 1.5 లక్షలు డిప్లమో అర్హత జాబితా వివరాలు*ఐటీఐ: 35 వేలు* ఇంజినీరింగ్: 30 వేలు* పాలిటెక్నిక్: 22 వేలు* పైన సూచించిన జాబితాలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు స్వయం ఉపాధి పొందుతున్నారు.* ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి నిరుద్యోగుల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 2, 2018 నిరుద్యోగ భృతిపై హర్షం02-06-2018 03:01:36 సీఎంకు యువత కృతజ్ఞతలు అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ‘నిరుద్యోగ భృతి’ ప్రకటించిన సీఎం చంద్రబాబును కలిసేందుకు పెద్దసంఖ్యలో యువత ఆయన నివాసానికి తరలివచ్చింది. టీడీపీ నాయకుడు దేవినేని అవినాశ్ నేతృత్వంలో శక్రవారం పలువురు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు యువత కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని చందు నేతృత్వంలో పెద్దఎత్తున యువత సీఎంను కలిశారు. తమకు నిరుద్యోగ భృతితో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఒక విధానం రూపొందించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన చివరి హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 2, 2018 నిరుద్యోగ భృతి ఎక్కడ.. ఎంత..?02-06-2018 03:00:56 అమరావతి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం వివిధ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించింది. ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిరుద్యోగ భృతి వివరాలు ఇలా ఉన్నాయి. హరియాణాలో ఇంటర్ చదివిన వారికి రూ.900, డిగ్రీ చేసిన వాళ్లకు రూ.1500, పీజీ చేసిన వారికి రూ.3 వేలు అందిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో అందరికీ ఒకే రకంగా నెలకు రూ.1500 అందిస్తున్నారు. కేరళలో నెలకు కేవలం రూ.120 మాత్రమే ఇస్తున్నారు. రాజస్థాన్‌లో సాధారణ యువతకు రూ.500, వికలాంగులకు రూ.600 ఇస్తున్నారు. తమిళనాడులో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఐదేళ్లు పూర్తి అయి ఉంటేనే భృతి ఇస్తారు. ఇది రూ.200 నుంచి రూ.600 వరకూ ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి కనీసం ఏడాదై ఉంటే నెలకు రూ.1000 అందిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఇంటర్ అయితే రూ.500, గ్రాడ్యుయేట్స్‌కు రూ.750, పోస్టు గ్రాడ్యుయేట్స్‌కు రూ.1000లు ఇస్తున్నారు. పంజాబ్‌లో రూ.150 నుంచి రూ.200 అందిస్తున్నారు. బిహార్‌లో రూ.200 భృతి అందిస్తోంటే... ఉత్తరప్రదేశ్‌లో నెలకు రూ.1000 అందించాలన్న యోచనలో ఉన్నారు Share this post Link to post Share on other sites