Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
అయ్యయ్యో....వంద కోట్లు పోయెనే...! 
పాలకవర్గం లేక జీవీఎంసీ చేజారిన నిధులు 
‘అమృత్‌’దీ అదే దారి 
న్యూస్‌టుడే - కార్పొరేషన్‌ 
vsp-top1a.jpg

అక్షరాలా వంద కోట్ల రూపాయలు.... 2017-18 ఆర్థిక సంవత్సరానికి మహా విశాఖ నగర పాలక సంస్థ చేజారి పోయిన 14వ ఆర్థిక సంఘ నిధులివి... ఇంకో ప్రమాదం ‘అమృత్‌’ నిధుల రూపంలో పొంచి ఉంది. కారణం... గత ఆరేళ్లుగా జీవీఎంసీకి  పాలకవర్గం లేకపోవటం.

పాలకవర్గం లేని స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుతం నాలుగేళ్లపాటు వేచిచూస్తుంది. అప్పటికీ పాలకవర్గం ఏర్పడకపోతే ఐదో సంవత్సరం నుంచి నిధుల విడుదలను నిలిపేస్తుంది. జీవీఎంసీ కౌన్సిల్‌ కాలపరిమితి ముగిసిపోయి దాదాపు ఆరేళ్లవుతోంది. ప్రత్యేకాధికారి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 100 కోట్ల నిధులు విడుదల కాకుండా నిలిచిపోయాయి. 2018-19 సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి తలెత్తనుంది. ఇదే జరిగితే జీవీఎంసీ ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువవుతాయని అధికారులు కలవర పడుతున్నారు. 
ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. ఆకర్షణీయ ప్రాజెక్టు పేరుతో ఏటా రూ. 100 కోట్లు విడుదల చేయడం, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌(అమృత్‌) ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకూ రూ.100 కోట్ల విలువైన పనులు మంజూరు చేయడం తప్ప ఇంకేవిధమైన సహకారం అందలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) ప్రాజెక్టులకు సంబంధించి జీవీఎంసీకి రూ. 75 కోట్లు బకాయిలున్నా వాటిని విడుదల చేయడంలో కేంద్రం అలసత్వం వహిస్తోంది. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి ఎస్కలేషన్‌ ఛార్జీలను సైతం జీవీఎంసీయే భరించాలని ఆదేశాలిస్తుండటం గమనార్హం. కేవలం రూ. 100 కోట్ల ఆకర్షణీయ నిధులు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంటోన్న కేంద్రం మరో విధంగా జీవీఎంసీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిపేసింది. గత ఆరేళ్లుగా జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిబంధనల మేరకు నిధులు మంజూరు చేయలేమని కేంద్రం చేతులెత్తేసింది. ఎలాగైనా అవి జీవీఎంసీకి తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఆకర్షణీయ ప్రాజెక్టులకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎలా సమకూర్చాలనే ఆలోచనలో అధికారులున్నారు.

ఆర్థిక సంఘం నిధులు ఏటా రూ.100 కోట్లు... 
జీవీఎంసీ క్రమశిక్షణ గల సంస్థ. సుమారు 20 లక్షల జనాభా గల విశాఖ మహానగరిలో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, ఇతర సంస్కరణల అమల్లో కచ్చితత్వాన్ని పాటిస్తోంది. జనాభా ప్రాతిపదికన, సేవలు అందించడంలో మెరుగ్గా రాణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం జీవీఎంసీకి రూ.100 కోట్ల వరకూ మంజూరు చేసేది. ఆర్థిక సంఘం నుంచి రూ.100 కోట్లు వస్తాయని జీవీఎంసీ బడ్జెట్‌లో కూడా అధికారులు పొందుపరుస్తుంటారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 100 కోట్లు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ విషయాన్ని బయటపెట్టకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు జీవీఎంసీ సొంత నిధులనే వినియోగించుకోవడం, ఆకర్షణీయ ప్రాజెక్టు పథకం అమలు కోసం రూ. 1603 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో నిధుల సమీకరణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగసామ్యం(పీపీపీ), ఆర్థిక సంఘం, ప్రపంచబ్యాంకు, అమృత్‌ తదితర పథకాలకు సంబంధించి నిధులను ఆకర్షణీయ ప్రాజెక్టులో వినియోగించాలని భావించిన అధికారులు ఆర్థిక సంఘం నిధులు రావని తెలియడంతో ఇక తప్పని పరిస్థితుల్లో విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

కోర్టు కేసులపై విన్నవించాం... 
జీవీఎంసీకి ఎన్నికలు జరగకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిపివేశారు. కమిషనర్‌ హరినారాయణన్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా నిధులు మంజూరు కాలేదు. ఈ పద్దుకింద జీవీఎంసీకి ఏటా రూ.100 కోట్లు సమకూరేవి. ఎన్నికలు జరగకపోవడానికి కోర్టు కేసులున్నాయని ప్రభుత్వానికి తెలియజేశాం. నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం.

- మంగపతిరావు, మహా విశాఖ నగరపాలక సంస్థ, వ్యయ పరిశీలకుడు

‘అమృత్‌’ నిధులపై కూడా... 
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోన్న ‘అమృత్‌’ నిధులపై కూడా అధికారుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయాలంటే స్థానికంగా పాలకవర్గం తప్పకుండా ఉండాలి. కానీ జీవీఎంసీలో పాలకవర్గం లేకపోవడంతో నిధులు నిలిపివేస్తున్నట్లు ఏ క్షణాన్నైనా సమాచారం రావచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జీవీఎంసీ పాలకవర్గం లేకపోవడం వల్ల ఎలాంటి నష్టంలేదని ప్రకటిస్తూ, ఎన్నికలు జరిగితే తమ పరపతి ఎక్కడ కోల్పోతామోనని భావించి నగర ఎమ్మెల్యేలే ప్రజాస్వామ్య ప్రక్రియకు మోకాలడ్డుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో నిధులు సమకూర్చడంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కోర్టు కేసులున్నాయని ప్రకటిస్తోన్న ప్రజాప్రతినిధులు వాటి పరిష్కారంపై ఆసక్తి కనిపించడంలేదు.

Link to comment
Share on other sites

ఆర్కే బీచ్‌లో హోవర్‌క్రాఫ్ట్‌ పర్యాటకం 
విశాఖకు చేరుకున్న రెండు వాహనాలు 

ఈనాడు, విశాఖపట్నం: దేశంలో తొలిసారి హోవర్‌క్రాఫ్ట్‌ (నీటిలోనూ, నేలపైనా ప్రయాణించే వాహనం) పర్యాటకం విశాఖ తీరంలో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ‘హోవర్‌డాక్‌’ సంస్థ ఈ సేవలను అందించబోతోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను విశాఖకు తెప్పించింది. మంగళవారం ఈ వాహనాలు నౌకలో నగరానికి చేరుకున్నాయి. మరో రెండు వాహనాలు రాబోతున్నాయి. టగ్‌మాస్టర్లకు (డ్రైవర్లు) శిక్షణ అనంతరం ఆర్కే బీచ్‌లో నెల రోజుల్లో పర్యాటకులకు వీటిని అందుబాటులో ఉంచుతామని హోవర్‌డాక్‌ ఎండీ ఆర్‌.ఎం.చైతన్యవర్మ ‘ఈనాడు’కు తెలిపారు. శిక్షణ ఇవ్వడానికి రష్యా నుంచి నిపుణులు వచ్చారన్నారు.
ఇవీ ప్రత్యేకతలు:నీటిలోనూ, సముద్రతీరం పైనా ప్రయాణించే ఈ ఉభయచర వాహనం నిర్వహణకు ప్రత్యేకంగా జెట్టీ కూడా అవసరం లేదు. సముద్రంలో నుంచి నేరుగా తీరంలోని ఇసుక తిన్నెల మీదకు ప్రయాణిస్తుంది. వీటి కోసం ఆర్కే బీచ్‌లో 3,775 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు వచ్చి కూర్చోవడానికి, సేదదీరడానికి ఏర్పాట్లు చేస్తారు.
* ఒక్కో హోవర్‌క్రాఫ్ట్‌లో ఆరుగురు ప్రయాణించొచ్చు. సముద్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
* తీరం నుంచి సముద్రంలోకి రెండు కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు వీటికి అనుమతి ఇచ్చారు.

Link to comment
Share on other sites

రూ. 500 కోట్లతో భీమిలి - భోగాపురం బీచ్‌ కారిడార్‌ 
నాలుగు వరుసల రహదారి నిర్మాణం 
vsp-top2a.jpg

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భోగాపురంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా విశాఖకు వచ్చేందుకు నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ - భీమిలి మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా భోగాపురం వరకూ రహదారి నిర్మించేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా ఈ రహదారిని నిర్మించాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అవసరమైన భూసేకరణ బాధ్యతను విశాఖ రెవెన్యూ డివిజన్‌ భూసేకరణ విభాగానికి అప్పగించారు. రహదారి నిర్మాణ బాధ్యతను రహదారులు, భవనాల శాఖ చూస్తోంది.  భీమిలిలోని ఎస్‌బీఐ నుంచి భోగాపురం వరకూ ఇటీవల అధికారులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా ఉన్నందున రహదారి నిర్మాణం, భూసేకరణ, పరిహారాల చెల్లింపులకు రూ. 500 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. భీమిలి నుంచి ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయం వరకూ మొత్తం 21 కిలోమీటర్లు వస్తుంది. కొండలు, గుట్టలు, చెరువుల మీదుగా ఈ రహదారి వెళ్లనున్నది. మొత్తం 21 కిలోమీటర్లలో 9 కిలోమీటర్ల వరకూ విశాఖ జిల్లా పరిధిలో, మిగతా 12 కి.మీ. విజయనగరం జిల్లా పరిధిలో ఉంది. విశాఖ జిల్లా పరిధిలో మొత్తం 150 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉంది. ఇవి చిప్పాడ, భీమునిపట్నం, చినగంగవరం, మూలకుద్దు, వలంద గ్రామాల పరిధిలో ఉన్నాయి. మొత్తం భూముల్లో 100 ఎకరాల వరకు ప్రభుత్వానికి చెందినవి ఉంటే మిగతా 50 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రహదారి ఏర్పాటు నేపథ్యంలో అయిదు గ్రామాల పరిధిలో అనేక ఇళ్లు, స్థలాలను సేకరించాల్సి ఉంది. చెరువుల మీదుగా కూడా రోడ్డు వెళ్లనున్నట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. ఈ కారణంగా పరిహారం, పునరావాసం కోసం భారీగా నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక సామాజిక ప్రభావ మదింపు (ఎస్‌ఐఏ)ను చేపట్టాల్సి ఉంది. దీనికోసం అధికారులు ఒక సంస్థను నియమించనున్నారు.

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భోగాపురంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా విశాఖకు వచ్చేందుకు నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ - భీమిలి మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా భోగాపురం వరకూ రహదారి నిర్మించేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా ఈ రహదారిని నిర్మించాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అవసరమైన భూసేకరణ బాధ్యతను విశాఖ రెవెన్యూ డివిజన్‌ భూసేకరణ విభాగానికి అప్పగించారు. రహదారి నిర్మాణ బాధ్యతను రహదారులు, భవనాల శాఖ చూస్తోంది.  భీమిలిలోని ఎస్‌బీఐ నుంచి భోగాపురం వరకూ ఇటీవల

Link to comment
Share on other sites

బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా రుషికొండ 
తీరాన్ని పరిశీలించిన కేంద్ర అటవీ పర్యావరణ బృందం 
vsp-brk1a.jpg

ఈనాడు, విశాఖపట్నం: రుషికొండ సాగర తీరాన్ని బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు రుషికొండ బీచ్‌ అనువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కేంద్ర అటవీ పర్యావరణ ప్రతినిధుల బృందం గురువారం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. మేనేజింగ్‌ కన్సల్టెంట్‌ సంజయ్‌ జల్ల, సీనియర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధి శైలాష్‌ రుషికొండ సాగరతీరం, భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఇక్కడకు సందర్శకుల తాకిడి.. పర్యాటకంగా ఉన్న ప్రాముఖ్యత..వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకుడు శ్రీనివాసన్‌, జిల్లా పర్యాటకశాఖ అధికారి పూర్ణిమాదేవి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీనారాయణ తదితరులు వివరించారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో శుక్రవారం సమావేశం కానుంది. పర్యావరణం, నాణ్యత, భద్రత ప్రామాణికాలుగా ఈ ప్రాజెక్టుకు తీరాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

ఏపీలో కంపెనీ ఏర్పాటుకు సిద్ధం: డెస్క్‌ ఎరా సీఈవో
09-02-2018 11:57:00
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డెస్క్ ఎరా కంపెనీ సీఈవో శశాంక్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్‌తో డెస్క్ ఎరా సీఈవో సమావేశమయ్యారు. విశాఖలో ఈ నెలలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని ఈ సందర్భంగా శశాంక్ అన్నారు. విశాఖలో 500 మంది ఉద్యోగులతో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. పబ్లిక్‌, ప్రైవేట్ క్లౌడ్‌, మల్టీటెనన్సీ, వెబ్‌ సర్వీసెస్, ఇంటిగ్రేషన్‌ సర్వీసెస్‌‌ను  డెస్క్‌ ఎరా కంపెనీ అందిస్తోంది.

Link to comment
Share on other sites

Vizag steel in profits.....Amaravati area demand for Vizag steel jumped from 35 thousand to 1+ lakh metric ton in short span...

Last year on CBN request they opened sales office in Amaravati and now domestic demand helping them....konta mandi Jaffas musugulo dani meda kooda "CBN edo steel plant office marchadu ani rumour leparu"...actual ga CBN made sure they get domestic SALES by opening Amaravati sales office and that given results now..

 

VIJ_2018-02-10_maip3_14.jpg

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

Vizag steel in profits.....Amaravati area demand for Vizag steel jumped from 35 thousand to 1+ lakh metric ton in short span...

Last year on CBN request they opened sales office in Amaravati and now domestic demand helping them....konta mandi Jaffas musugulo dani meda kooda "CBN edo steel plant office marchadu ani rumour leparu"...actual ga CBN made sure they get domestic SALES by opening Amaravati sales office and that given results now..

 

 

12

 

@AnnaGaru 8 months back steel 35k per ton. ippudu around 51K. Polavaram gates delay chesivunte 16k rs over head ayyedi.. no one talks about the savings.

 

 

Link to comment
Share on other sites

11 hours ago, Nfan from 1982 said:

Tell something about this brother 

 

On 2/8/2018 at 3:45 PM, AnnaGaru said:

3RUERQp.jpg

 

This is Rushikonda millenium tower almot complete.....Franklin templeton&Fidelity gets some space here before they start their campus construction

Also they started 1500 acre Kapuluppada IT park infra works...

 

Conduent started operations and posted jobs and temporarily(they construct campus) they started operations in below building

DVsVxxoXUAAYtCp.jpg:large

Link to comment
Share on other sites

21 hours ago, AnnaGaru said:

Vizag steel in profits.....Amaravati area demand for Vizag steel jumped from 35 thousand to 1+ lakh metric ton in short span...

Last year on CBN request they opened sales office in Amaravati and now domestic demand helping them....konta mandi Jaffas musugulo dani meda kooda "CBN edo steel plant office marchadu ani rumour leparu"...actual ga CBN made sure they get domestic SALES by opening Amaravati sales office and that given results now..

 

VIJ_2018-02-10_maip3_14.jpg

Jaffas ki todu ga baffas kuda 

Link to comment
Share on other sites

విశాఖ: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విశాఖ హెల్త్‌సిటీకి ఏపీఐఐసీ గ్రహణం పట్టింది. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. దీనితో ఆస్పత్రుల వైద్యులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఆరోగ్యప్రదాయని ఉన్న హెల్త్‌సిటీ కష్టాలపై ఏబీఎన్‌ ప్రత్యేక కథనం.
 
విశాఖ హెల్త్‌సిటీ కష్టాల్లో పడింది. ఏపీఐఐసీ అలసత్వంతో మౌళికవసతులు కల్పించకపోవడంతో ఇప్పటికే అక్కడ వైద్యం ప్రారంభించిన ఆస్పత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2011లో అప్పటి ప్రభుత్వం విశాఖ అరిలోవ ప్రాంతంలో హెల్త్ సిటీని ఏర్పాటు చేసింది. 63 ఎకరాల్లో 27 ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్, ఎఫిషియంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్, పోలీస్ అవుట్ పోస్ట్ , వాటర్ ట్యాంక్, పోస్ట్ ఆఫీస్, బస్ స్టాప్, పార్కింగ్ ఏరియాతో కూడిన హెల్త్ సిటీ నిర్మిస్తామని ఏపీఐఐసీ ప్రకటించింది. ప్రశాంత వాతావరణం, పచ్చనికొండలు, కాలుష్యంలేని ప్రాంతం కావడంతో హెల్త్ సిటీలో ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చాలామంది వైద్యులు ముందుకు వచ్చారు. దీనితో ఆ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. హెల్త్ సిటీలో ఆసుపత్రులు నిర్మాణం జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో వివిధ ప్రయివేట్ కంపెనీలు, ప్రయివేట్ ఆసుపత్రులు నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.
 
మొదట చెప్పినట్లు ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం నడుచుకోకపోవడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీనితో ఇక్కడ ఆస్పత్రులు ప్రారంభించిన వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ సిటీలో వసతులు కల్పించకుండా కాసుల కోసం ప్రయివేట్ కంపెనీలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారని కొందరు వైద్యులు ఆరోపించారు. ఏపీఐఐసీ చెప్పినట్లుగా వసతులు కల్పిస్తే ఇంటర్‌నేషన్‌ అక్రిడేషన్‌ ఆమోదం లభిస్తుందని.. దీని వల్ల విశాఖ ఆస్పత్రులకు విదేశాల నుంచి మంచి గుర్తింపు వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Link to comment
Share on other sites

విశాఖకు నేవీ మరో వరం
15-02-2018 01:40:56
 
636542556576840524.jpg
  • మ్యూజియంగా సీ హేరియర్‌.. స్థలం అన్వేషణ
విశాఖపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళం మరో వరం ప్రసాదించింది. యుద్ధ విమానం ‘సీ హేరియర్‌’ను మ్యూ జియంగా మార్చడానికి ముందుకు వచ్చింది. అనువైన స్థలం చూపిస్తే పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విశాఖపట్నంలో నేవీకి సంబంధించి ఇప్పటికే రెండు మ్యూజియంలు ఉన్నాయి. అందులో ఒకటి సబ్‌మెరైన్‌ కురుసుర కాగా, మరొకటి టీయూ-142 యుద్ధవిమానం. ఇటీవలే రాష్ట్రపతి కోవింద్‌ ప్రారంభించడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మ్యూజియం కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ రూ.13 కోట్లు కేటాయించగా, బీచ్‌ రోడ్డులో ఏర్పాటుచేసి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ అనేక హంగులు సమకూర్చింది. ఈ యుద్ధ విమానాన్ని సందర్శించేందుకు రోజుకు సగటున 4 వేల మంది వస్తున్నారు. ఈ మ్యూజియం చూసి నేవీ ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు.
 
 
టీయూ-142ని సేవల్లోకి తీసుకున్న మొదటిరోజున కూడా ఇంత అందంగా చూడలేదని, అద్భుతంగా తయారుచేశారని వుడా అధికారులను ప్రశంసించారు. దీనికి ప్రజాదరణ అధికంగా వుండడంతో ఏడాదిన్నర క్రితం సేవల నుంచి విరమించిన సీ హేరియర్‌లో ఒకటి విశాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై నేవీ అధికారులు రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శికి లేఖ రాయగా, ఆయన జిల్లా అధికారులకు తెలియజేశారు. సీ హేరియర్‌ బ్రిటీష్‌ దేశానికి చెందిన యుద్ధ విమానం.
 
1983లో వీటిని మన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.సీ హేరియర్‌ ఇతర యుద్ధ విమానాల కంటే భిన్నమైంది. ఆకాశం నుంచి గెంతినట్టు నిట్టనిలువుగా ల్యాండ్‌ అవుతుంది. టేకాఫ్‌ కూడా అలాగే తీసుకుంటుంది. వీటిని ‘వైట్‌ టైగర్స్‌’గాను వ్యవహరిస్తారు. సీ హేరియర్‌ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి స్థలం అన్వేషిస్తున్నామని రుషికొండలో గానీ, వుడా పార్కు లోపల గానీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు
Link to comment
Share on other sites

విశాఖలో రెండు 5నక్షత్రాల హోటళ్లు 
సబ్‌మెరైన్‌ పార్క్‌  విజయవాడ భవానీద్వీపంలో సీలయన్‌, 
మొసళ్ల పార్క్‌ అనుమతించిన పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డు 
ఈనాడు - అమరావతి 

విశాఖపట్నంలో రెండు 5 నక్షత్రాల హోటళ్లు, ఒక రిసార్టు, గోల్ఫ్‌ కోర్సుతోపాటు...సబ్‌మెరైన్‌ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వారసత్వ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఈ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. పలు ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ కొన్నింటి అమలుకు ఆమోదముద్ర వేసింది. పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ, ఆ శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా, కమిషనర్‌ హిమాన్షు శుక్లా, విశాఖ నుంచి తూర్పు నౌకాదళ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు అనుమతించివాటిలో.బీ విశాఖ మధురవాడలో మోహమ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంఐపీఎల్‌) ఆధ్వర్యంలో రాడిసన్‌ హోటల్‌, రిసార్ట్‌ గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటు. మూడు దశల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో రూ.100 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల్లో 120 గదులతో రిసార్టు ఏర్పాటు. రెండో దశలో రూ.50కోట్లతో మరో 10 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్సు నిర్మాణం. మూడో దశలో 2.20 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుతోబాటు మొదటిదశలో ఏర్పాటు చేసే రిసార్టులో మిగిలిన 80 గదులనూ అందుబాటులోకి తీసుకువస్తారు. 250మందికి ఈ ప్రాజెక్టుతో ఉద్యోగాల కల్పన. 
* విశాఖ తొట్లకొండలో కఠ్మాండూకు చెందిన వైశాలీ హైడ్రో ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.105 కోట్ల పెట్టుబడితో 225 గదుల సామర్థ్యంతో రిసార్టు ఏర్పాటు. 
* తూర్పునౌకాదళ స్వర్ణోత్సవాల సందర్భంగా విశాఖలోనే రూ.20కోట్లతో సబ్‌మెరైన్‌ వారసత్వ మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తూర్పు నౌకాదళ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. చర్చ తర్వాత ఆమోదం తెలిపారు. 
* విజయవాడ భవానీ ద్వీపంలో సీ లయన్‌, మొసళ్ల పార్కులను ఏర్పాటు.
విశాఖలో 2500 గదులే ఉన్నాయి
వచ్చే అయిదేళ్లలో విశాఖపట్నంలో జరగనున్న పర్యాటకాభివృద్ధి నేపథ్యంలో 25వేల హోటల్‌ గదులు అవసరమవుతాయి. ఇప్పటివరకూ అక్కడ కేవలం 2,500 గదులే అందుబాటులో ఉన్నాయి. గదుల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖలో భూమి తీసుకుని ప్రాజెక్టును ప్రారంభించని ఒక సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు బోర్డు అనుమతించింది.

Link to comment
Share on other sites

Rocky Mountain research Institute  opening Lab in Vizag and confirmed in Lokesh recent trip

https://www.rmi.org/

https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/us-institute-keen-on-setting-up-urban-mobility-lab-in-city/articleshow/62989245.cms?utm_source=twitter.com&utm_medium=social&utm_campaign=TOIDesktop

 

In another news Dubai getting ANdhra fruits from Vizag port this summer

 

DWcLCjYX0AAgYit.jpg

 

In another news Vizag AMTZ one more step

http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=107359&sid=1

Link to comment
Share on other sites

mottam a chuttuakkala YV Subbareddy(kinda video lo a pakkana hill hamfutt....without single penny down payment made 300 crore white on papers and sold),comedy peaks entante Nursing home ani anil batch kottesaru a video lo hill kinda land beach daggara, jaffa(1700 acres single bit prime) land dobbesadu a video ki NORTH lo...

 

migilina land lo CBN future ki batalu vestunadu,...decoit batch chesina sweep ki  "OCENARIUM" ki iddamanna prime land ledu...pity situation

 

Brahmi-3.gif

 

 

 

Link to comment
Share on other sites

5 minutes ago, Yaswanth526 said:

so ah area entha develop ayithe vallaki antha use untadi anamaata  :thinking:

also Puran aunty daugther house a video lo towards beach unde hill meda(anta clear ga kanapadatla) :) ...

kastam emo CBN di dobbesedi matram jaffas....malli tinnadi aragaka edustaru ayana meda...

 

CBN 2004 lo digipoye time Kenexa(later IBM),HSBC,WIPRO,SATYAm.SOFTPRO lantivi techadu vizag ki...after CBN decoits looted all the prime beach lands(mainly hills) around that area but no single real company came...Total 50K+ acres changed hands under decoit in this area....

Link to comment
Share on other sites

43 minutes ago, curiousgally said:

@Annagaru bro, can govt not confiscate those lands showing cases of fraud. Just thinking !!!

already two hands marai plots&villas vesi ammesaru public ki......

good thing is, 1500 acres already CBN govt won in High court and that is where Kapuluppada IT park is coming....for that also decoit put terms such a way that state cannot take it back...But CBN govt caught a clause violation where the party has to pay 150 crores in 4 years and they did not pay that....

BJP MLA vishnukumar raju(basically a builder and got hill land) is mental jaffa for this lands reasons...where as CBN reserved these hills for BIG gaints...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...