Jump to content

DURGA GUDI FLYOVER

Recommended Posts

4 hours ago, Urban Legend said:

Arey raghuveera ne Congress party asala e flyover anavasaram memu kattam ani 10 yrs ruling lo pakkana padesaru even after many protests meeru kuda comedy chestunnaru ga 

Ma party okati undi ani janalaki remembering antey tapa no matter,picha lite

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 685
  • Created
  • Last Reply
  • 2 weeks later...

Another deadline for Kanaka Durga flyover

It now moves to August, which is doubtful as contractor schedules it for September

Just when people of the city thought all their woes will go with the completion of the flyover at the Kanaka Durga temple, pending for over a decade, authorities have pushed the deadline further again.

They had announced that the road, blocked for the flyover work, will be opened to traffic starting with two-wheelers on February 28. It did happen, albeit partially, when only parents taking their wards to examination centres on two-wheelers were allowed.

The Kanaka Durga Flyover intended to ease the congested stretch of Vijayawada-Hyderabad (NH 65) was supposed to be completed before Krishna Pushkaralu in August, 2016. The deadline was later moved to August, 2017, March, 2018 and now August, 2018.

While the delay in completion of the flyover construction is the concern of the government, the blockage of NH between Kummaripalem junction and the Prakasam Barrage for even motorcyclists has turned into a major cause of concern for thousands of people who used to commute through the route on a daily basis.

The road blocked in September last year was supposed to be opened for traffic by the end of the year and the latest deadline has been set for March 31. This is despite the announcement of the Collector twice that traffic would be allowed after January 15 and end of February.

“Though release of traffic had been planned from March 1, the difficulty in the erection of wings caused a delay of nearly two weeks recently. Once the wings are in place, motorcycles and light motor vehicles will be allowed to use the road,” Superintending Engineering of R&B and in charge of the project G. John Moshae told The Hindu.

Three targets

“As per the Chief Minister’s instructions, we have set three targets. One for the release of traffic by March 31, completion of works in the canal portion by May 31 and completion of the entire project by August 15,” Mr. John said.

However, as per the schedule of the contractor of the project, Soma Infrastructure, the project would be finished only by September. “We may have to push the contractor for early completion of the project and keep it ready for inauguration on August 15 and from the department, every support is being extended,” an official said. So far only 65% of the project, including six-laning of the road from the Padmavati Ghat to the Kankadurga Varadhi, has been completed.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
వయాడక్ట్‌ ఖర్చు రాష్ట్రానిదే
16-03-2018 07:14:57
 
636567812984477222.jpg
  •  వీఎంసీ వద్ద వయాడక్ట్‌ ఖర్చుకు కేంద్రం నో
  •  రూ.17.28 కోట్లతో నిర్మాణానికి సీఎం ఓకే..
 విజయవాడ (ఆంధ్రజ్యోతి): వీఎంసీ కార్యాలయం దగ్గర వయాడక్ట్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ (మోర్టు) తిరస్కరించింది. దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు సబ్‌వేను అనుసంధానం చేయటానికి గతంలో ప్రతిపాదించిన రీయిన్‌ ఫోర్సుడు ఎర్త్‌ రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో పిల్లర్లపై వయాడక్ట్‌ను నిర్మించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను గత అక్టోబరులో సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రూపంలో తెలపగా ఇప్పటికి సమాధానం రావడం గమనార్హం. వయాడక్ట్‌ ప్రతిపాదనను ఆమోదించడం లేదని, ఒకవేళ వయాడక్ట్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ ఖర్చును ఏపీ సర్కారే భరించాలని ఈ నెల 7వ తేదీన నితిన్‌ గడ్కరీ నుంచి లేఖ వచ్చింది. ఇక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడం వల్ల సుమారు 3.60 ఎకరాల స్థలం రెండు ముక్కలుగా విడిపోయి నిరుపయోగంగా మారిపోతుందని అధికారులు తెలిపారు. కృష్ణానది దగ్గర ఘాట్లు కూడా కనిపించకుండా మూసుకుపోతాయని పేర్కొన్నారు. రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో మూడు స్పాన్లతో వయాడక్ట్‌ను నిర్మించడం వల్ల 3.60 ఎకరాలు ఒకే బిట్‌గా ఉండి వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.17.28 కోట్లతో వయాడక్ట్‌ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. గురువారం సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని ఫ్లైఓవర్‌ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఎన్‌సీ జి.జాన్‌మోషే ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Link to comment
Share on other sites

దుర్గ గుడి ఫ్లైఓవర్‌ కష్టాల నుంచి విముక్తి
16-03-2018 07:09:48
 
636567809897133581.jpg
  • ఏప్రిల్‌ 1 విడుదల!
  •  ఆ రోజు నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి
  •  మండలిలో ప్రకటించిన ఆర్‌అండ్‌బీ మంత్రి
  •  వీఎంసీ వద్ద వయాడక్ట్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదే
  •  రూ.17.28 కోట్లుతో నిర్మాణానికి సీఎం ఓకే
 
విజయవాడ ఆంధ్రజ్యోతి): దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులతో నగర ప్రజలు అనుభవిస్తున్న ట్రాఫిక్‌ కష్టాలకు ఎట్టకేలకు తెరపడనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్గంలో అన్ని రకాల వాహనాల రాకపోకలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు అవాంతరం ఎదురుకాకుండా చూసేందుకు గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. తొలుత మూడు నెలలపాటు వాహనాలను నియంత్రిస్తే సరిపోతుందని నిర్మాణసంస్థ అధికారులకు విన్నవించింది. ఆరునెలలు గడిచినా పనులు కొలిక్కి రాకపోవడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గొల్లపూడి, భవానీపురం తదితర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఈ ఏడాది జనవరి 15 నుంచి వాహనాల రాకపోకలను అనుమతించాలని అధికారులు తొలుత భావించినా అది సాధ్యం కాలేదు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి వాహనాలను అనుమతిస్తామని ప్రకటించినా అదీ కార్యరూపం దాల్చలేదు. అయితే బుధవారం శాసనమండలిలో సాక్షాత్తు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఏప్రిల్‌ 1 నుంచి వాహనాలను అనుమతిస్తామని ప్రకటించడం వాహనాదారుల్లో కాసింత నమ్మకాన్ని కలిగిస్తోంది.
Link to comment
Share on other sites

జాప్యం.. పాపం కేంద్రానిదే!
20-03-2018 08:44:47
 
636571322866016094.jpg
  • మూడేళ్లుగా కొలిక్కిరాని దుర్గ గుడి ఫ్లైఓవర్‌
  • పనుల వేగవంతం చేసేందుకు సీఎం చొరవ
  • సీఎం లేఖలపైనా స్పందించని మోదీ సర్కార్‌
  • గడువు పెంపుపైనా మీనమేషాలు
  • ఫలితంగా బిల్లుల్లో కోత.. ధరాభారం
  • వెరసి నత్తనడకన ఫ్లైఓవర్‌ పనులు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరం నడిమధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారి 65ని విస్తరించడం ద్వారా నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలకు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దుర్గ గుడి ఫ్లైఓవర్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దుర్గ గుడి వద్ద ఇరుకుగా ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడంతోపాటు 5.29 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.450 కోట్లు. ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టు వ్యయంలో సుమారు రూ.170 కోట్లను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మొత్తాన్ని భూసేకరణ, పైపు లైన్లు, విద్యుత్తు లైన్ల తొలగింపు తదితరాలకు ఇప్పటికే ఖర్చు చేసింది. మిగిలిన సుమారు రూ.280 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈపీసీ విధానంలో ఈ పనులను సోమా సంస్థ దక్కించుకుంది. 2015 డిసెంబరులో పనులను ప్రారంభించింది. ఏడాది కాలంలో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా కాంట్రాక్టు సంస్థ లక్ష్య సాధనలో విఫలమైంది. అదే సమయంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒప్పందంలోని క్లాజులను సాకుగా చూపి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడం ప్రారంభించింది.
 
అడుగడుగునా ఆటంకాలే
దుర్గ దుడి ఫ్లైఓవర్‌ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలనూ రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అదే ధోరణితో వ్యవహరిస్తోందన్నది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాదన. ఈ కారణంగానే దుర్గ గుడి ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని వారు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యి ఉండేదని వారు చెబుతున్నారు. పూర్తయిన పనులకూ నిధుల విడుదలలో కేంద్రం కొర్రీలు పెడుతుండటాన్ని సాకుగా చూపి నిర్మాణ సంస్థ పనులను నత్తనడకన నడిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిర్మాణ సంస్థకు ఇచ్చిన గడువు 2016 డిసెంబరులోనే పూర్తికావడంతో 2017 జూన్‌ వరకు గడువు పొడిగించాలని నిర్మాణ సంస్థ కోరింది. దీనిపై మీనమేషాలు లెక్కిం చిన కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహ దారుల మంత్రిత్వ శాఖ చాలా రోజుల అనం తరం నిర్ణయం తీసు కుంది. ఈ గడువు కూడా పూర్తికావడంతో రెండోసారి 2018 మార్చి 31 వరకు పొడి గించా లని నిర్మాణ సంస్థ కోరింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 
అలాగని నిర్మాణ సంస్థపై చర్యలూ తీసుకోవడం లేదు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణి కాంట్రాక్టు సంస్థకు వరంగా మారింది. గడువు పెంపుపై అధికారిక నిర్ణయం వెలువడకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో 5 శాతం కోత పడు తోందని, నెలవారీ జరగాల్సిన ప్రైస్‌ ఎస్కలేషన్‌ కూడా జరగడం లేదని పేర్కొం టూ కాంట్రాక్టు సంస్థ పనుల వేగాన్ని మంద గింప చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దుర్గ గుడి ఫ్లైఓవర్‌ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే ఫ్లైఓవర్‌ నిర్మాణం ఈపాటికే పూర్త య్యేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
ప్రాజెక్టు కేంద్రానిది.. కష్టాలు రాష్ట్రానివి!
హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రావాలంటే దుర్గ గుడి మీదుగా ఉన్న ప్రధాన మార్గమే దిక్కు. ఈ మార్గం బాగా ఇరుకుగా ఉంటుంది. ఇది కాకుండా సొరంగం ద్వారానూ నగరంలోకి ప్రవేశించే వెసులుబాటు ఉన్నా అది మరింత ఇరుకైన మార్గం. దుర్గ గుడి మార్గం బాగా ఇరుకుగా ఉండటంతో లక్షలాది మంది ప్రజలు ట్రాఫిక్‌ కష్టాలను ఎదుర్కొనేవారు. పండుగల వేళ ఇక పరిస్థితి చెప్పనక్కర లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని 2014 ఎన్నికల సమయంలో దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రం ఆమోదం పొందింది. ఆ తర్వాత నుంచే కష్టాలు మొదలయ్యాయి. వివిధ రకాల సాకులతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు కొర్రీలు వేస్తూ వచ్చింది. ప్రాజెక్టు జాప్యం అవుతున్న కొద్దీ లక్షల మంది ప్రజల కష్టాలు పెరగడం ప్రారంభించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వానికి ప్లస్‌ కావాల్సిన ప్రాజెక్టు మైనస్‌గా మారే పరిస్థితి ఏర్పడింది.
 
sgh.jpgసీఎం లేఖలపైనా నిర్లక్ష్యం
దుర్గగుడి ఫ్లైఓవర్‌ ఒప్పందాన్ని అనుసరించి.. పిల్లర్లు(స్తంభాలు), పిల్లర్ల నడుమ స్పైన్లను అమర్చిన తర్వాత 30 శాతం బిల్లును, స్పైన్లకు వింగ్స్‌ను అమరిస్తే మిగిలిన 70 శాతం బిల్లును చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి పిల్లర్లు, స్పైన్ల అమరికకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుందని, దానికి తక్కువ మొత్తాన్ని మంజూరు చేయడం వల్ల ప్లైఓవర్‌ పనుల వేగం మందగిస్తోందని ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పైన్ల అమరిక పూర్తయిన మేరకు కొంత మొత్తం బిల్లు విడుదలయ్యేలా చూస్తే నిర్మాణ పనులు పుంజుకునే అవకాశం ఉందని వివరించారు. గతంలో ఇదే తరహాలో నిర్మాణం జరుపుకున్న ముంబై సహర్‌ రోడ్‌ ఎలివేటెడ్‌ హైవే, ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఫైఓవర్‌కు సైతం బిల్లుల చెల్లింపుల్లో సవరణలు జరిగాయని వారు సీఎంకు వివరించారు.
 
అధికారుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు నిధుల విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని, సానుకూలంగా స్పందిస్తే ఫ్లైఓవర్‌ పనులు పుంజుకునే అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌-మోర్త్‌)కు లేఖ రాశారు. 2017 తొలి అర్ధభాగంలో ఓ లేఖ, అక్టోబరు 17న మరో లేఖ రాశారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు మోర్త్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనలపై తగిన నిర్ణయం తీసుకోకుండా విపరీతమైన జాప్యం చేసిన మోర్త్‌ ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 7న రాష్ట్రానికి ఓ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదలన్నింటినీ తిరస్కరిస్తున్నామని అందులో స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

పై వంతెనకు అడ్డుపుల్ల..! 
బిల్లుల ఆమోదానికి కేంద్ర పీఏఓలో వ్యంగ్య వాఖ్యానాలు 
amr-top1a.jpg

‘ఇక నుంచి మీరు పంపే బిల్లులు అంత సులభంగా ఆమోదించం. అన్నీ సక్రమంగా ఉండి పైనుంచి అనుమతి ఉంటేనే అప్రూవల్‌ చేస్తాం.. సమీకరణాలు మారాయి..’

- కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి బిల్లుల చెల్లింపు (పీఏఓ) కార్యాలయంలో సిబ్బంది వ్యాఖ్యలు ఇవి.

కనకదుర్గ పైవంతెన పనులకు సంబంధించి బిల్లులు పంపుతున్న సిబ్బంది, గుత్తేదారుల ప్రతినిధులతో కేంద్ర పీఏఓ కార్యాలయం సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇక నుంచి అప్రూవల్‌ కావంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అహంభావంతో ప్రవర్తిస్తున్నారు.. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరి..!’

- కనకదుర్గ పైవంతెన నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న ఓ అధికారి ఆవేదన
ఈనాడు, అమరావతి

కనకదుర్గ పైవంతెన నిర్మాణంపై కేంద్ర రాజకీయ పరిణామాల ప్రభావం పడుతోంది. అసలే నిధుల సమస్య వల్ల నత్తతో పోటీ పడుతూ.. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు ఎలా ఉంటాయో చూపిస్తున్న కనకదుర్గ పైవంతెన మరింత జాప్యం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పైవంతెనకు నిధులు మంజూరు చేయాల్సిన కేంద్రం అడ్డంకులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. బిల్లులను   ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు డీవియేషన్లకు ముప్పుతిప్పలు పెట్టి ఆరుసార్లు దస్త్రాలను తిప్పి కొట్టిన కేంద్రం ఇక ముందు బిల్లుల మంజూరుకు అడ్డుపుల్లలు వేయనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనకదుర్గ పైవంతెనను ఈఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. కానీ కనీసం నవంబరు 2018నాటికి ఇవ్వాలని గుత్తేదారులను కోరుతోంది. 2018 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని గుత్త సంస్థ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేంద్రం దయ... ప్రజల ప్రాప్తంలా మారింది.

నిధుల కోసం ముప్పుతిప్పలు..! 
మొత్తం వ్యయంలో 75శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. భూసేకరణ పరిహారం, పునరావాసం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. నాలుగు వరసల రహదారి, కనకదుర్గ పైవంతెన కలిపి రూ.448.60 కోట్లకు దక్కించుకుంది. అంచనా వ్యయం ప్రకారం ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. వాస్తవానికి రూ.282.4 కోట్లు మాత్రమే కేంద్రం భరించనుంది. పునరావాసం, భూసేకరణ ఖర్చు మినహాయించింది. కృష్ణలంక వద్ద అండర్‌పాస్‌ డీవియేషన్‌ రూ.11.40కోట్లు భరించేందుకు అంగీకరించింది. మొత్తం కలిపి రూ.293.8కోట్లు మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగిలిన మొత్తం రాష్ట్రం భరించాల్సి ఉంది. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేర్పులు ఉంటే సాంకేతిక కమిటీ, నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే ఆ మేరకు అనుమతిస్తారు. ఒకే ఒక్క డీవియేషన్‌ మినహా మిగిలిన డీవియేషన్లను అనుమతించబోమని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. దస్త్రాలను తిప్పికొట్టింది. దీంతో గుత్త సంస్థ వద్ద నిధుల లేమితో పాటు కేంద్రం నుంచి బిల్లులు ఆమోదం పొందక జాప్యం అవుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి వంతెనకు రూ.114.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్లు చెల్లింపులు జరిపింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.144 కోట్లు బిల్లులు మంజూరు అయ్యాయి. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టును రహదారులు, భవనాల శాఖ ఎన్‌హెచ్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. కేంద్రానికి సంబంధించిన నిధులను బెంగళూరులో ఉన్న కేంద్ర చెల్లింపులు, గణాంక కార్యాలయం(పీఏఓ) నుంచి బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడలో ఉన్న ప్రాంతీయ పీఏఓ ప్రతినిధి బిల్లులను బెంగళూరుకు పంపిస్తారు. అక్కడి నుంచి గుత్తేదారుకు మంజూరు కావాల్సి ఉంటుంది. పైవంతెన పనులు ప్రారంభమైన నుంచి ఇంత వరకు రూ.144 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లులు మంజూరు అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రం తన పరిధికి మించి నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రూ.170 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు 80శాతం కాంక్రీట్‌ పనులు అయిపోయాయి. 20శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం కాలువ, నదిలో పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. బిల్లులు ఆమోదించడానికి స్పైన్లు, వింగ్స్‌ అయితేనే కలిపి పెట్టాలని కేంద్ర పీఏఓ కార్యాలయం సూచిస్తోంది. నిధుల సమస్య వల్ల స్పైన్లు అయినంత వరకు ఇవ్వాలని గుత్త సంస్థ, పర్యవేక్షణ ఏజెన్సీ కోరినా అనుమతించలేదు. 23 పిల్లర్ల వరకు స్పాన్లు బిగించారు. అయితే 10 స్తంభాలకు వింగ్స్‌ బిగించాల్సి ఉంది.

వయాడక్ట్‌ సంగతేంటో... 
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వయాడక్డు నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డు వేసింది. ఇక్కడ వంతెన ఆకృతిని మార్చారు. వయాడక్డు నిర్మాణం చేయాలని సీఎం ప్రతిపాదించారు. దీనికి అయ్యే వ్యయాన్ని భరించాలని కేంద్రానికి లేఖ రాస్తే తిరస్కరించింది. మూడు సార్లు అభ్యర్థన పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. స్వయంగా సీఎం లేఖ రాసినా ఆమోదించలేదు. దీంతో ఈ విభాగానికి అయ్యే ఖర్చు రూ.17.28కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అంటే ఇప్పటికి ఖర్చు చేసిన రూ.170 కోట్లకు ఇది అదనం. గతంలోనే తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనవసర కొర్రీలు వేస్తున్నారని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకటి నుంచి విడుదల! 
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కనకదుర్గ పైవెంతన మార్గంలో ట్రాఫిక్‌ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత కార్లు, ఇతర వాహనాలను అనుమతించాలని ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్‌ సమక్షంలో పోలీసు అధికారులు, ర.భ. అధికారులు సమీక్షించనున్నారు. 23 వ పిల్లర్‌ వరకు స్పాన్లు భిగించడం వల్ల ద్విచక్ర వాహనాలను అనుమతించే అవకాశం ఉందన్నారు. రాత్రి పూట నిలుపుదల చేసి పనులు జరపాలనేది ప్రతిపాదన. కాలువల్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల నీరు విడుదల చేయడం కొంత సమ్య వచ్చింది. తిరిగి జూన్‌లోనే ఖరీఫ్‌కు పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని విడుదల చేయనున్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని ఎస్‌ఈ జాన్‌మోషే ‘ఈనాడు’తో చెప్పారు.

Link to comment
Share on other sites

3 minutes ago, rk09 said:

:buttkick:

Link to comment
Share on other sites

Just now, Dravidict said:

2018 december antunnarante elections ki kuda ready avvadhemo idhi (madhyalo rainy season and canals ki water release cheyyatam valla panulu aalasyam ayyayi ani sollu cheptharemo)

central govt dabbu ivvtam ledu anta

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

ippati ke state govt vata ki minchi karchupettindi kadha bro

Yes, aa migatha amount kuda icchi complete cheyyali. Aa vedhavalu ivvatledhani aapesthe manake bokka padedhi. Chaala inconvenience dheeni valla people ki. 

Link to comment
Share on other sites

1 minute ago, rk09 said:

Only option is to lend money to Soma to complete it and get it reimbursed from center once approved by them  

Loss will be interest and any further deviations. 

Complete aythe credit state ki vasthadhi ani edupu pushhh gallaki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...