హామీలు అమలు చేస్తాం
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోంది
కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఏపీలోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. గురువారం దిల్లీలో ఏపీ గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయమంత్రి సుజనాచౌదరి, సెయిల్, మెకాన్ అధికారుల