Jump to content

YCP Hands Up Constituencies


Recommended Posts

On 4/12/2024 at 12:26 PM, Flash said:

Ycp batch slowed down.. they will not spend anymore

Ongole to Hindupur ekkada slowdown avvala. Paapala peddireddi rowdy's & dabbu sanchulatho ready ayyadu 60+ seats lo mainly rayalaseema.

Link to comment
Share on other sites

Press  release

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్!

మాజీ ఎమ్మెల్యే సుభానితో సహా టిడిపిలోకి 500మంది

యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక

అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలసి రావాలన్న చంద్రబాబునాయుడు పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. గుంటూరు టిడిపి ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్, సిమ్స్ అధినేత భీమనాథం భరత్ రెడ్డి నేతృత్వాన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ నంబూరు సుభాని, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, వైసిపి కార్పొరేటర్లు షేక్ మీరావలి, చిష్టీభాష, వేముల జ్యోతి, మాజీ కార్పొరేటర్లు కుర్రా రవి, లాయర్ బుజ్జి, అబ్దుల్ కలామ్, అబ్రహంలతోపాటు 500మంది పార్టీలో చేరారు. వీరందరికీ ఉండవల్లి నివాసంలో యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం ఉంచి  రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలోకి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ  ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. కొత్తగా చేరిన నేతలు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని కోరారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ముస్లిం సోదరులు ఎటువంటి అపోహలకు గురికావద్దు, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... గత ఎన్నికల్లో వైసిపికి 22మంది ఎంపిలను ఇస్తే, ఏనాడూ వారు పార్లమెంట్ లో ప్రజాసమస్యలపై చర్చించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి – జనసేన - బిజెపి పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాక బిజెపి సహకారంతో కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. పార్టీలో చేరిన ప్రముఖుల్లో  సిద్ధార్థ (బాజీ), మారెడ్డి నరసారెడ్డి, మారెడ్డి కుశల్ కుమార్ రెడ్డి, రమణకుమార్, మజ్జిగ సందీప్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, గుంటకల శ్రీనివాస్, డి.అంజి, భీమనాథం రామకృష్ణారెడ్డి, భీమనాథం వేణుగోపాల్ రెడ్డి, కంజుల శివారెడ్డి, కంజుల గంగాధర్ రెడ్డి, కంజుల కిషోర్ రెడ్డి, కంజుల భాస్కర్ రెడ్డి, కంజుల వెంకట్ రెడ్డి, సన్నపురెడ్డి లక్ష్మారెడ్డి, తుమ్మల కోటిరెడ్డి, వసంతరావు యాదవ్, కాకుమాను గోపీనాథ్, షేక్ రహీమ్ తదితరులు ఉన్నారు. 
***

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...