Jump to content

⭐ ⭐ ⭐ Veera Simha Reddy ⭐⭐⭐


OneAndOnlyMKC

Recommended Posts

  • Replies 9.2k
  • Created
  • Last Reply

ఔరా ! గోపిచందూ..!

వీరసింహారెడ్డి..ఇరగదీసాడు..!

చాలా అంచనాలు..!
అసలే అఖండ ఫీవర్ ఇంకా తగ్గలేదు..!
నిన్న గాక మొన్న మళ్ళీ వేసారు..చూసారు..!

బాలయ్య అభిమాని దర్శకుడు..!
చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఎక్కడబడితే అక్కడ..!
మడతెట్టేస్తానని..!

మొదటి పావుగంట సాధారణం..!
తర్వాత జాతర మొదలయింది..!
వీరసింహా పక్కన సిద్దప్ప..!
ఆ దృశ్యం అనిర్వచనీయం..!

పదునైన సంభాషణలు..!
ఉలిక్కిపడే ఉరుములు..!

యాక్షన్ సీక్వెన్స్ లు వేరే లెవల్..!
రామ్ లక్ష్మణ్ ల కెరీర్ లోనే బెస్ట్!

తమన్  ఏ మాత్రం తగ్గని దరువు..!
సన్నివేశాలకు బలం చేకూర్చే బాక్ గ్రౌండ్ మ్యూజిక్!

సాయిమాధవ్ బుర్రా సంభాషణలు చాలా పదును..!
వాడి ములుకులు..!
చురకలు కాదు..కొరకంచు తో వేసిన రచ్చలు!

దునియా విజయ్ టాలివుడ్ కి దొరికిన మరో మంచి ప్రతినాయకుడు..!

మలయాళి లాల్ గారు..దునియా విజయ్..హనీరోజ్ ..ఫ్రెష్ గా ఉంది స్క్రీన్..!

వరలక్ష్మి మంచి వగరు పొగరు ఉన్నట్టు కనిపించే ఫిగరు..!
కొంచెం భయం కొంచెం బెరుకు టచ్ చెయ్యాలంటే ..!

మరో కొత్త అందం హనీరోజ్..!
అచ్చం లడ్డుండలాగ ఉంది..!
తన పరిధి మేరకు అలరించింది..!

శ్రుతి హాసన్ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది..!
కెమెరా పనితనం చాలా బాగుంది..!

సినిమా లో బాలయ్య విశ్వరూపం..!
పోరాట సన్నివేశాలు అత్యద్భుతం..!

రెండు పాటలు అదుర్స్..!
జై బాలయ్య పాట చిత్రీకరణ చాలా ఊపు వస్తుంది.

ఇంటర్వెల్ ముందు..తర్వాత ఎమోషన్ వర్కవట్ అయింది..బాగా కనెక్టవుతారు..!
కళ్ళు చెమర్చని వారుండరు..!
ద్వితీయార్ధం లో మలుపులు..భావోద్వేగం సినిమా ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళాయి..!

పొలిటికల్ పంచ్ లు పేలాయి..!
ధియేటర్లు దద్దరిల్లే స్పందన..!
కారణం అరాచకాన్ని ఎత్తిచూపటమే..!

సీమ వాసులు కుశాలు అయ్యే ఊసులు బాలయ్య నోటివెంట..రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు..!

యాక్షన్..ఎలివేషన్..ఎమోషన్..!
యాక్షన్ సన్నివేశాలతో పొట్లాం కట్టిన ఎమోషన్..!
పొలిటికల్ పంచ్ లతో డైరెక్ట్ ఎటాక్..!

వెరసి వీరసింహారెడ్డి..!

వర..దునియా విజయ్..లాల్ సహా నల్లచొక్కా కాఫీ కలరు పంచె కట్డుకున్న బాలయ్య చుట్ట నోట్లోకి ఎగరేసి  పొగ వదులుతూ...సినిమా ముగిసినా మన కూడా వచ్చేస్తారు..!
ఆ పాత్రలు హంటింగ్ చేస్తాయి..!

గోపిచంద్ మలినేని..బోయపాటికి పోటీ..వచ్చేసాడు..!
బాలయ్య కు చిక్కొచ్చిపడింది..!
ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు..!

కంగ్రాట్యులేషన్స్ గోపిచంద్ మలినేని గారు..!

లాస్ట్ బట్ నాట్ లీస్ట్..!
మైత్రీ మూవీ మేకర్స్..అరుదైన ఫీట్..!
ఇద్దరు ఉద్దండులు..రెండు భారీ చిత్రాలు..!
అందులో ఒకటి మల్టీ స్టారర్..!

ఒకేసారి రిలీజ్..!
ఇది ఒక రికార్డ్!

నిర్మాతలకు అభినందనలు..!

Link to comment
Share on other sites

6 minutes ago, usandeep said:

Ekkada nundi ekkadaki tesukuni vachadu hero xroda collections lo nag fans kuda Kindle chesavaru manalni happy tears asalu

nag fans kindle chese antha histroy em ledu vancle vallaki x roads lo.. NN run in X Roads is still a history... anni continuous fulls tho ade last movie anukunta akkada.. 

Link to comment
Share on other sites

7 minutes ago, Husker said:

nag fans kindle chese antha histroy em ledu vancle vallaki x roads lo.. NN run in X Roads is still a history... anni continuous fulls tho ade last movie anukunta akkada.. 

Nag fans ki manam movie is last anukunta which did well at X roads.

Link to comment
Share on other sites

5 minutes ago, prudhvi225 said:

can i use paytm movies to book movie tickets from USA for my parents? I am getting this!!
image.png.d91f909e1db89893bbdd200b7542445d.png
 

why PayTm.. they may have location based checks..  use BMS you'll have better payment options.. you can even use $0 foreign transaction fee credit cards at the end.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...