Jump to content

lagadapati


sonykongara

Recommended Posts

5 minutes ago, Saichandra said:

ఇది తెలంగాణాలో గ్రౌండ్ రియాలిటీ 

మేధావి గాడిదలు ప్రజలతో disconnect అయ్యిపోయి ఇది గ్రహించలేక పోయారు 

పనిచేసే వాడిని విమర్శిస్తూ .. ఇంట్లో పడుకున్న వాళ్ళని మోశారు

 

Ayyo.papam

Link to comment
Share on other sites

  • Replies 326
  • Created
  • Last Reply
36 minutes ago, Saichandra said:

ఇది తెలంగాణాలో గ్రౌండ్ రియాలిటీ 

మేధావి గాడిదలు ప్రజలతో disconnect అయ్యిపోయి ఇది గ్రహించలేక పోయారు 

పనిచేసే వాడిని విమర్శిస్తూ .. ఇంట్లో పడుకున్న వాళ్ళని మోశారు

 

This is right time for true TG public....send off Kachara 

Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

ఇది తెలంగాణాలో గ్రౌండ్ రియాలిటీ 

మేధావి గాడిదలు ప్రజలతో disconnect అయ్యిపోయి ఇది గ్రహించలేక పోయారు 

పనిచేసే వాడిని విమర్శిస్తూ .. ఇంట్లో పడుకున్న వాళ్ళని మోశారు

 

Papam feeling sad for them.. Vella usuru kcr family ki garanteeega tagiliddi .. TG vasthe manaki Anni vasthay Ani mayamatalu chepi namminchaadu..

Link to comment
Share on other sites

8 hours ago, Gunner said:

Congi ki absolute majority ravatam TRS gelavatam kanna danger....

Jagan is natural ally to INC... TG lo INC geliste Jaggu gadiki happy ne...

ideal scenario ante.. TDP shud win 8-9 seats and INC should fall 5-6 seats short of absolute majority

Chalaaaaaaaaa munduku velli alochincharu but chinna link miss ayyaru after winning 4 assembly elections

Congress operation akarsh start avuudhi AP lo YSRCP nunchi Congress loki entha mandi jump kodathaaro chudandi

Link to comment
Share on other sites

Just now, Yaswanth526 said:

Chalaaaaaaaaa munduku velli alochincharu but chinna link miss ayyaru after winning 4 assembly elections

Congress operation akarsh start avuudhi AP lo YSRCP nunchi Congress loki entha mandi jump kodathaaro chudandi

yes thats possible sayamainatha varaku laagi appudu TDP to pottu ettukuntaru oka 30 seats kavalani adgutaru

Link to comment
Share on other sites

మాజీ ఎంపీ లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు

1132393011BRK-LAGARAJAGOPAL.JPG

హైదరాబాద్‌ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి ఈసీకి ఫిర్యాదు చేసింది. సర్వేలపై ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనలు ఆయన ఉల్లంఘించించినట్లు ఈసీ దృష్టికి తెచ్చింది. తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని తన సర్వేలో వెల్లడైందని లగడపాటి ప్రకటించడం పట్ల తెరాస నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. లగడపాటి కాంగ్రెస్‌ నేత అయినందునే పథకం ప్రకారం ఎన్నికల ఫలితాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
Link to comment
Share on other sites

3 hours ago, baggie said:

yes thats possible sayamainatha varaku laagi appudu TDP to pottu ettukuntaru oka 30 seats kavalani adgutaru

RG is believing CBN, INC main aim is to dethrone Modi and BJP, form a govt at center with Congress support. Reviving AP congress is not important at this time, don’t think too far ahead. 

Link to comment
Share on other sites

1 minute ago, sskmaestro said:

RG is believing CBN, INC main aim is to dethrone Modi and BJP, form a govt at center with Congress support. Reviving AP congress is not important at this time, don’t think too far ahead. 

yes bro thats just a possibility...might or might not happen. i hope cbn plays it well with rahul

Link to comment
Share on other sites

1 minute ago, baggie said:

yes bro thats just a possibility...might or might not happen. i hope cbn plays it well with rahul

It is Rahul who declared that he has a chemistry with CBN and he was, may be the first congress leader to praise CBN (back in 2004). They need CBN to build consensus among parties and make sure they come with INC. people like Kezri, Mamata, Maya, Mulayam, Pawar, Patnaik lanti seniors ni at a time handle cheyyatam Rahul valla kaadu. I felt he sensed this reality and started coming close to CBN. 

 

If their relation continues as it is projected, AP and it’s people are lucky to say the least!

Link to comment
Share on other sites

4 hours ago, vinayak said:
మాజీ ఎంపీ లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు

1132393011BRK-LAGARAJAGOPAL.JPG

హైదరాబాద్‌ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి ఈసీకి ఫిర్యాదు చేసింది. సర్వేలపై ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనలు ఆయన ఉల్లంఘించించినట్లు ఈసీ దృష్టికి తెచ్చింది. తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని తన సర్వేలో వెల్లడైందని లగడపాటి ప్రకటించడం పట్ల తెరాస నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. లగడపాటి కాంగ్రెస్‌ నేత అయినందునే పథకం ప్రకారం ఎన్నికల ఫలితాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

KCR 106 seats lo gelavabothunnam latest survey prakaram annadu ga public mtg lo :dream:

Link to comment
Share on other sites

8 hours ago, baggie said:

yes thats possible sayamainatha varaku laagi appudu TDP to pottu ettukuntaru oka 30 seats kavalani adgutaru

They need MP seats....vallaki telusu vote transfer anta easy kadu....seats teesukunna waste ani....ee election ayye varaku alantivi em cheyaru......Tg lo Cbn compramise inatlu AP lo cong compramise avutundi.....

Link to comment
Share on other sites

తెలంగాణలో ‘హంగ్‌’ రాదు: లగడపాటి
01-12-2018 03:09:02
 
636792305439709523.jpg
  • స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడుతుంది.. అది టీఆర్‌ఎస్‌దా, కూటమిదా ఇప్పుడే చెప్పలేను
  • ఈసారి ప్రజానాడి పట్టడం చాలా కష్టంగా ఉంది
  • డిసెంబర్‌ 7న పోలింగ్‌ ముగిశాక చెబుతాను
  • 10 సీట్లు పోయినా పార్టీలకింకా 109 సీట్లు
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ‘బిగ్‌ డిబేట్‌’లో లగడపాటి
హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘హంగ్‌ అసెంబ్లీ’ వచ్చే ముచ్చటే లేదని, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటవుతుందని సర్వేల విషయంలో అక్టోప్‌సగా పేరున్న లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని.. డిసెంబర్‌ 7న పోలింగ్‌ ముగిసిన తర్వాత వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని, నారాయణపేటలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి, బోధ్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అనిల్‌ జాదవ్‌ గెలుస్తారని.. శుక్రవారం తిరుపతిలో ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజగోపాల్‌తో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘బిగ్‌ డిబేట్‌’ నిర్వహించారు. ఆ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు..
 
ఆర్కే: తెలంగాణలో మీరు తాజాగా చేపట్టిన సర్వే కరెక్ట్‌ అవ్వాలని తిరుపతిలో వెంకటేశ్వరుణ్ని కోరుకున్నారా?
లగడపాటి: తిరుపతికి నేను ప్రతి నెలా వెళుతుంటాను. అక్కడికి వెళ్లినప్పుడల్లా అక్కడి విలేఖర్లు ఏదో ఒకటి చెప్పమంటారు. కానీ, నేను నాలుగేళ్లుగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చాలా వేడివేడిగా ఉంది, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏదో ఒకటి చెప్పండని విలేకరులు అడగడంతో రెండు పేర్లు చెప్పాను. మా అంచనా ప్రకారం తెలంగాణలో ఎక్కువ 8 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తున్నట్లు తేలింది. ఇంత మంది ఇండిపెండెంట్లు ఎందుకు గెలుస్తున్నారన్నది ఆలోచించాలి. అనేక ప్రలోభాలు, రాజకీయ బలబలాలున్నాయి. ఇవన్నీ కాదని ప్రజలు స్వతంత్రులను ఎందుకు గెలిపిస్తున్నారు? ఇండిపెండెంట్లను గెలిపించాలని ప్రజలు ఒకసారి నిర్ణయించుకుంటే మారరు. అయితే, ఇవి గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం లేదు. 10 సీట్లు (స్వతంత్రులకు) పోయినా పార్టీలు ఇంకా 109 సీట్లలో చూసుకోవచ్చు. డబ్బులు, పథకాలు, ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రుల్ని గెలిపిస్తున్నారంటే.. తెలంగాణ ప్రజలను అభినందించాలి. వారు ఎందుకిలా ఆలోచిస్తున్నారన్నదానిపై నేను అధ్యయనం చేస్తున్నాను.
 
మీరు చెప్పిన వారిద్దరూ కాంగ్రెస్‌ రెబెల్స్‌. ఇంకా ప్రకటించని అభ్యర్థులు కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థులా? టీఆర్‌ఎస్‌ రెబెల్సా?
నేను వాళ్లు ఏ పార్టీ అనేది చూడట్లేదు. చూడను కూడా. ఎందుకంటే రేపు వాళ్లు మారొచ్చు. ఇందులో కొంద రు బీఎస్పీ, బీఎల్‌ఎఫ్‌ వంటి చిన్న చిన్న పార్టీల నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
 
ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచి అధ్యయనం చేస్తున్నారు?
ఆగస్టు నుంచి అధ్యయనం చేస్తున్నాం. అనేక పర్యాయాలు స్టడీ చేశాం. మరో వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా అధ్యయనం చేస్తాం. ఏమైనా ప్రజా నాడి మా బృందానికి అంత సులువుగా దొరకట్లేదు. నాడి పట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇండిపెండెంట్ల విషయంలో ప్రజానాడి మారదు కాబట్టి వాటిపై ఫిక్స్‌ అయిపోయాం.
 
మీ అంచనా ప్రకారం ఆగస్టులో వాతావరణం ఎలా ఉంది ?
మా బృందం ఆగస్టులో ఒక టీవీ చానెల్‌ కోసం సర్వే చేసింది. కానీ, నా పేరు వాడాలనుకుంటే.. ఎన్నికలప్పుడు మాత్రమే నేను పూర్తిస్థాయిలో ఇన్‌వాల్వ్‌ అవుతాను. సంవత్సరం, ఆరు నెలల ముందుగానే సర్వే చేస్తే ఎలా నిరూపిస్తావన్న ఆరోపణలు వస్తాయి. ఆగస్టులో పరిస్థితిని నేను విశ్లేషించలేదు. అప్పటి డేటాను పరిశీలిస్తూనే ఇప్పుడు వాస్తవపరిస్థితులను అంచనా వేస్తున్నాను. నేను కూడా కొన్ని ప్రాంతాలను తిరిగొచ్చా. అనేక మంది నాతో మాట్లాడుతుంటారు. దాంతో నాకు ఒక అవగాహన వస్తుంది.
 
మీరు 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలుస్తున్నారనేసరికి తెలంగాణలో ‘హంగ్‌’ ఏర్పడబోతోందన్న అభిప్రాయం ఓటర్లలో వచ్చింది..
‘హంగ్‌ అసెంబ్లీ’ అనే ముచ్చటే లేదు. ఇండిపెండెంట్లు ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావు. అది ప్రజా కూటమిగానీ, టీఆర్‌ఎ్‌సగానీ స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.
 
మీ ప్రకటన నేపథ్యంలో కేసీఆర్‌ స్పందించారు..
ఆ వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు. నన్ను గురించి అని ఉంటారని నేను అనుకోవడం లేదు. రెండు నెలల క్రితం మా టీమ్‌ విడుదల చేసిన సర్వే ఆయనకు అనుకూలంగానే వచ్చింది. కాబట్టి నన్ను ఉద్దేశించి ఆయన ఆ మాటలు అన్నారని నేను అనుకోవడం లేదు. రెబెల్స్‌పై నేను ప్రకటన చేసిన తర్వాత కొంత మంది సీనియర్‌ నాయకులు నాకు ఫోన్లు చేశారు. కొంత మంది.. ‘రెండు ఇండిపెండెంట్‌ సీట్లు కరెక్టే’ అన్నారు. కొంత మంది ఒకటి కరెక్ట్‌ అన్నారు. ఏ ఒక్కరూ తప్పనలేదు.
 
ఆగస్టులో మీ బృందం ఇచ్చిన సర్వే టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు లేదనుకోవచ్చా?
మా బృందం ఆగస్టులో ఒక మీడియా చానెల్‌ కోసం సర్వే చేసింది. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజు ముందు ఎన్నికల వివరాలు చెప్పమంటే చెప్పగలను. 3 నెలల ముందు ఫలితాల గురించి చెప్పమంటే చెప్పలేను.
 
స్వతంత్రుల గెలుపంటే ప్రభుత్వంపై సానుకూలత లేదనుకోవచ్చా?
దానిపై నేను డిసెంబరు ఏడో తేదీ సాయంత్రం మాట్లాడతా. ఈలోపు నేను జాగ్రత్తగా ఉండాలి.
 
ఓకే... ఏడో తేదీ వరకు మేం కూడా వెయిట్‌ చేస్తాం. పోలింగ్‌ తర్వాత ఇదే స్టూడియోలో మళ్లీ కూర్చుందాం... థాంక్యూ
 
 
ఇంతమంది రెబెల్స్‌ గెలిస్తే హంగే: బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు
లగడపాటి అంచనాలతో విబేధించను. కానీ, నేను ఈ ఎన్నికలలో అనేక జిల్లాల్లో తిరిగాను. పలు నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీలున్నందున ఈ ఎన్నికలలో గెలవాలంటే 50 వేల ఓట్లు వస్తే చాలు. కాబట్టి స్వతంత్రులు గెలిచే చాన్స్‌ ఉంటుంది. రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటే ఆ పరిధి 70-80 వేల మధ్య ఉంటుంది. నేను సర్వే చేయలేదుగానీ.. నా అంచనా ప్రకారం హంగ్‌ రావడం ఖాయం. ఒక పార్టీకి మెజారిటీ వచ్చే తరుణంలో స్వతంత్రుల సంఖ్య ఐదు కంటే తక్కువగా ఉంటుంది. లగడపాటి చెప్పినట్లు పదిమంది స్వతంత్రులు గెలిస్తే రాబోయేది హంగ్‌ అసెంబ్లీ అవుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...