Jump to content

Recommended Posts

Posted (edited)
పేరేచర్ల - కొండమోడు రహదారికి.. మహర్దశ
26-11-2018 07:25:23
 
  • పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్మాణం
  • రూ.736 కోట్లతో నాలుగు వరసలుగా అభివృద్ధి
  • నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
  • ఎంపీ రాయపాటి పోరాటం సఫలం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు - హైదరాబాద్‌ సెక్షన్‌లో విస్తరణ జరగకుండా మిగిలిపోయిన పేరేచర్ల - కొండమోడు రహదారి దశ తిరగబోతోంది. దీనిని నాలుగు వరసలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి గుంటూరు - హైదరాబాద్‌ మధ్యన ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. సోమవారం పల్నాడు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్నారు.
 
నార్కెట్‌పల్లి - అద్దంకి రహదారి ప్రాజెక్టులో భాగంగా కొండమోడు వరకు నాలుగు వరసలుగా రోడ్డు అభివృద్ధి చెందింది. కొండమోడు నుంచి పేరేచర్ల వరకు కేవలం రెండు వరసలుగా మాత్రమే రహదారి ఉన్నది. దీంతో నిత్యం ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతోన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొన్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. మొత్తం 49.040 కిలోమీటర్ల పొడవునా ఉన్న రోడ్డు రెండు రాష్ట్ర రహదారులు, ఒక జాతీయ రహదారిని అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డుని ఇరువైపులా 7.25 మీటర్ల క్యారేజ్‌ వే, నాలుగు మీటర్ల వెడల్పుతో సెంట్రల్‌ డివైడర్‌(మీడియన్‌)ని నిర్మిస్తారు. ఇందుకోసం 45 మీటర్ల పొడవునా రోడ్డు కోసం, బైపాసు వద్ద 60 మీటర్ల పొడవునా భూమిని సేకరించాల్సి ఉన్నది. సత్తెనపల్లికి 9.4 కిలోమీటర్లు, మేడికొండూరుకు 3.8 కిలోమీటర్ల పొడవునా బైపాసు రోడ్లు ఈ ప్రాజెక్టులో రాబోతోన్నాయి. ఈ రహదారిలో ట్రాఫిక్‌ సాంద్రతని 36869 పీసీయూలుగా లెక్కించారు.
 
మొత్తం ప్రాజెక్టుకి రూ.736 కోట్ల నిధులు అవసరమౌతాయి. మొదటి దశలో భూసేకరణకు రూ.181 కోట్లు, పునరావాసానికి రూ.40 కోట్లు, విద్యుత్‌ స్తంభాలు వంటివి పక్కకు మార్చడానికి రూ.10 కోట్ల నిధులు కలిపి రూ.231 కోట్ల నిధులు కావాలి. రెండో దశలో రూ.505 కోట్లు నిర్మాణానికి అవసరం అవుతాయి. రెండేళ్ల వ్యవధిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారు.23 సంవత్సరాల పాటు టోల్‌ ఫీజు వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కి భూసేకరణ ప్రతిపాదనని అందజేశారు. అందులో భాగంగా పెగ్‌మార్కింగ్‌ కూడా పూర్తి అయింది. రోడ్లు, భవనాల శాఖ బిడ్‌లు ఆహ్వానించింది.
Edited by sonykongara
Posted
21 minutes ago, kishbab said:

sattenapalli lo atu vypu vastundi bypass..any idea...oka vypu mavi inkovypu naa katnam land(maa athaagru pettinavi) unnay.

:blink: etu chusina bokka laga undi ga meeku manchi rate ravali ani pray cheyandi 

Posted
2 hours ago, MVS said:

:blink: etu chusina bokka laga undi ga meeku manchi rate ravali ani pray cheyandi 

 road kinda land pokunda unte chalu..automatic ga rate vastundi.peg marking aythe artham avtdi situation.

irrespective of these..e road mida povalante especially bike mida terror...last year oka lady maa relative spot dead RTC bus kotti

Posted
15 minutes ago, kishbab said:

 road kinda land pokunda unte chalu..automatic ga rate vastundi.peg marking aythe artham avtdi situation.

irrespective of these..e road mida povalante especially bike mida terror...last year oka lady maa relative spot dead RTC bus kotti

Night journey chala kastam le SAP to Guntur stretch.. finally expanding

Posted (edited)
4 minutes ago, sonykongara said:

guntur macherla  road padithe bagundedi edi okkati ednuku apero

guntur-macherla road ante macherla-nadukudi kada bro..direct road amundi macherla to guntur

Edited by kishbab
Posted
18 minutes ago, KaNTRhi said:

Ussh 16 km ki 2300 c kharchu pettadam deniki... vere deniki ayina upayoga padathayi.. 

No yar it's for again fourlane road and look at 16 km but one and half HR time save

Posted
18 minutes ago, KaNTRhi said:

Ussh 16 km ki 2300 c kharchu pettadam deniki... vere deniki ayina upayoga padathayi.. 

ppp ne ga vesedi, ayna vadu macherla to NRT vesthe saripothundi,amaravati to anantapur express highway untundi, nrt nundi

Posted (edited)
4 hours ago, Raaz@NBK said:

Enni vandhalu ekaralu vunnai enti..

Ade babu garu Zamindar’s ki saamanyulaki unna theda :whew:

Edited by Babu
Posted (edited)
6 minutes ago, Babu said:

Ade babu garu Zamindar’s ki saamanyulaki unna theda :whew:

Razzaya zamindar aithe u big zamindar vi ga uncle :wave:

Edited by MVS

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...