Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
14 hours ago, ramntr said:

సత్తుపల్లి 1st seat geluchedi, 10 ki 10 మంది ఏదో video lo only sandra అని చెబుతున్నారు.. So impact is huge anukunta.. 

looks like dynamics changing continously in TG.......

Let us hope for the best!

Link to comment
Share on other sites

టీడీపీ కంచుకోటలో పోటా పోటీ
23-11-2018 11:55:46
 
636785710828557879.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌ను తిరిగి తనఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి తన సత్తాను చాటి సీఎం కేసీఆర్‌కు బహూకరించాలని పట్టుదలతో ఉన్నారు.
 
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 43వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన మాధవరం కృష్ణారావు టీఆర్‌ఎ్‌సలో చేరి... ప్రస్తుత ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఉద్యమ సమయంలోనే అప్పటి టీడీపీ అభ్యర్థిగా నిలిచిన ఆయనకు 90వేలకు పైగా ఓట్లు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సారి టీడీపీ నుంచి ఏకంగా నందమూరి కుటుంబం బరిలోకి దిగడంతో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ ప్రతిఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు రెండున్నర నెలలుగా ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పదిరోజుల క్రితం మహాకూటమి నుంచి నందమూరి వెంకట సుహాసిని పేరు ఊహించని తీరులో ఖరారు కావడంతో నియోజకవర్గంలోని ఇతర పార్టీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
 
దీనికితోడు సుహాసిని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి తెరలేపారు. సుహాసిని తరపున ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలతో పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. అంతేకాకుండా కూకట్‌పల్లిలో నిర్వహించే రోడ్‌షోలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సైతం పాల్గొనేలా స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకూటమిలో అసమ్మతి వర్గం లేకపోవడంతోపాటు కాంగ్రెస్‌, టీజేఎస్‌ పార్టీలు సుహాసినికి మద్దతు తెలపడం శుభపరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. కాగా.. ఇప్పటికీ టీడీపీలో సరైన సమన్వయం లేకపోవడంతో ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొనలేకపోవడం ప్రతికూలతగా ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే టీడీపీ నాయకుల సమన్వయలోపాన్ని వేలెత్తి చూపుతూ స్థానిక టీడీపీ ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యుడు మాధవరం రంగారావు టీఆర్‌ఎ్‌సలో చేరడం.
 
స్టార్స్‌ క్యాంపెయిన్‌పైనే ఆధారం...
టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తుంటే.. టికెట్‌ కేటాయింపులో జరిగిన ఆలస్యం కారణంగా టీడీపీ అభ్యర్థి సుహాసిని చేపట్టాల్సిన ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన అభ్యర్థి కావడంతో ఓటర్లు ఆమెను కచ్చితంగా ఆదరిస్తారని, ఇటీవలే సుహాసిని తండ్రి హరికృష్ణ మృతిచెందడంతో ఆమెకు సానుభూతి ఓట్లు కూడా పడే అవకాశం ఉంది. పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో కేవలం రోడ్‌ షోలు చేసి... పట్టులేని ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో టీడీపీకి స్టార్స్‌ క్యాంపెయిన్‌ అత్యవసరంగా మారింది. ఇక టీఆర్‌ఎస్‌ కూడా కూకట్‌పల్లి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేటీఆర్‌ను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్‌ ఓసారి స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించగా... మరోసారి ఈనెల 29న జరిగే రోడ్‌షోలో పాల్గొంటూ ఓటర్లను టీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకొనేలా వ్యూహరచన చేస్తున్నారు.
 
 
టీడీపీ అనుకూలతలు
నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిగా బరిలో ఉండడం
మహిళకావడంతో నందమూరి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు సహకరించడం
పరిటాల, బాలయ్య, ఎన్టీఆర్‌ అభిమాన సంఘాలు అండగా ఉండడం
కూటమిలోని పార్టీలన్నీ అభ్యర్థికి మద్దతు తెలపడం
కూకట్‌పల్లిలో అభ్యర్థికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉండడం
చంద్రబాబు, బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రచారం కలిసొచ్చే అంశం
 
ప్రతికూలతలు..
టికెట్‌ కేటాయించడంలో జరిగిన ఆలస్యంతో కేడర్‌ను కలవలేకపోవడం
గెలిచినా, ఓడినా నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదన్న భావన
ముఖ్యనాయకుల్లో సమన్వయం లేకపోవడంతో స్థానిక ఫైవ్‌మెన్‌ నాయకుడు పార్టీని వీడడం
 
 
టీఆర్‌ఎస్‌ అనుకూలతలు...
టీడీపీ కుంచుకోటగా భావిస్తున్న నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కేడర్‌ బలోపేతం కావడం
ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకోవడం
సుమారు రూ.4వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం
30ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉంటూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం
నియోజకవర్గంపై పట్టు ఉన్న నాయకుడిగా గుర్తింపు
పార్టీలకు అతీతంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో దిట్ట
 
ప్రతికూలతలు...
నాలుగేళ్లుగా ఉద్యమకారులను విస్మరించారన్న భావన
కార్పొరేటర్లలో కొందరు అసంతృప్తిగా ఉండడం.. ఇప్పటికే బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ వ్యతిరేకంగా ప్రచారం చేయడం
టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ స్థానిక నాయకుడు పన్నాల హరీ్‌షచంద్రారెడ్డి... కృష్ణారావును ఓడించడమే టార్గెట్‌గా బరిలోకి దిగడం
తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణ ఉండడం..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...