Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
అక్క గెలుపు కోసం కృషి చేస్తా: తారకరత్న

07100824BRKTARAKA1.JPG

హైదరాబాద్‌: తన సోదరి సుహాసిని గెలుపు కోసం కృషి చేస్తానని నటుడు నందమూరి తారకరత్న అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను గెలిపించమని ఇప్పటికే కథానాయకులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అభిమానుల్ని కోరారు. కాగా తారకరత్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో పార్టీ ప్రచారానికి సిద్ధమౌతున్నారు. సుహాసిని తరఫున ఆయన ప్రచారం చేయనున్నట్టు పార్టీ, కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ.. ‘అక్క గెలుపు కోసం కృషి చేస్తాను. అక్క గెలుపే పెదనాన్న హరికృష్ణకు ఘన నివాళి. రాజకీయాల్లో పెదనాన్న లేని లోటును అక్క విజయంతో పూడ్చుతాం. కార్యకర్తలతోపాటు కలిసి భారీ మెజారిటీ కోసం కృషి చేస్తా’ అని అన్నారు.

Link to comment
Share on other sites

సుహాసిని కోసం ఎన్టీఆర్‌ ప్రచారం!

042707BRK-SUSHASINI1.JPG

హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తరఫున ఆమె సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారం చేసే అవకాశం ఉంది. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు ఎన్టీఆర్‌ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కూకట్‌పల్లి అభ్యర్థిగా సుహాసినిని ప్రకటించగానే ఆమెకు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ సోదరి విజయం సాధించాలని కోరుకుంటున్నామని, అదే నందమూరి హరికృష్ణకు ఇచ్చే నివాళి అని వారు లేఖలో పేర్కొన్నారు. తన సోదరి గెలుపు కోసం కృషి చేస్తానని నందమూరి తారకరత్న ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. కార్యకర్తలతో కలిసి కూకట్‌పల్లి ప్రచారానికి వెళ్తానని తారకరత్న చెప్పారు.

Link to comment
Share on other sites

కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతు.. టీడీపీని ఓడించాలని పిలుపు !
25-11-2018 18:12:58
 
636787665229662250.jpg
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సింగిల్‌గా వస్తున్నారని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను బ్యానర్లపై ముద్రించడాన్ని కూడా వారు తప్పుబట్టారు. వైఎస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైఎస్ అవినీతిపరుడని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

Baffas, pawalas and jaffas... gujarath dream machine digi reality ki randi....AP lo dikku ledhu...TG lo entra meeru peekedhi kodi bocchu

Link to comment
Share on other sites

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత.. నందమూరి సుహాసిని ప్రచారం చేస్తుండగా...
25-11-2018 22:20:11
 
636787812094720845.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లి అల్లాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల ఘర్షణ కలకలం రేపింది. ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యాలయం ముందు నుంచి సుహాసిని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత నందమూరి సుహాసిని అర్ధాంతరంగా ప్రచారం ముగించుకొని వెళ్ళిపోయారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

trs laja koduku laki bag balasindi

Link to comment
Share on other sites

తెదేపా-తెరాస కార్యకర్తల మధ్య వివాదం

094753BREAK-SUHASINI.JPG

హైదరాబాద్‌: అల్లాపూర్‌ పరిధిలోని రామారావునగర్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తెదేపా-తెరాస కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

ప్రజాకూటమి సారథ్యంలో కూకట్‌పల్లిలో సుహాసిని ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న ఆమె నిర్వహించిన ప్రచారకార్యక్రమానికి తెదేపా నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. సుహాసిని తరపున పార్టీ పెద్దలు ప్రచారంలోకి దిగనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...