Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ల ప్రచార షెడ్యూల్ ఖరారు
27-11-2018 08:10:43
 
636789032144944723.jpg
  • రాహుల్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన...
హైదరాబాద్: రాహుల్‌గాంధీ పర్యటన కోసం కోస్గిలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పరిగిలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హెలీప్యాడ్‌, బహిరంగ సభా స్థలాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగర శివార్లలో మహాకూటమి తరుపున ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించనున్నారు.
 
అలాగే.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈనెల 29 తరువాత సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. సినీ నటుడు, టీడీపీ ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు రోజుల పాటు శివార్లలో పర్యటించనున్నారు. అయితే ఆయన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరుపున సీఎం కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్‌గల్లులో సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే బీజేపీ అభ్యర్థుల తరుపున ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, స్మృతిఇరానీ తదితరులు ఉమ్మడి జిల్లాలో వారం రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు.
 
Tags : nandamuri suhasini, jr ntr, Kalyan Ram, balakrishna, kukatpally cons
Link to comment
Share on other sites

  • Replies 1.2k
  • Created
  • Last Reply

పరిటాల కుటుంబం అంటేనే, ఒక ప్రత్యేక అభిమానం. ఈ రోజు పరిటాల సునీత గారు కూకట్ పల్లిలో ప్రచారం. ఊపిరి పీల్చుకో కూకట్ పల్లి!

Ds-2eFOV4AUuLeL.jpg
Link to comment
Share on other sites

శ్రీమతి పరిటాల సునీత గారి కూకట్పల్లి లో ఎన్నికల ప్రచార షెడ్యూల్. ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్  

మంగళవారం 27 నవoబరు 2018

* కూకట్ పల్లి నియోజకవర్గ మహా కూటమి అభ్యర్ధి నందమూరి సుహాసిని గారితో కలిసి మంత్రి పరిటాల సునీత గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు

* ఉదయం 9.30 ని.ల నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు కూకట్ పల్లి లోని బిజెపి ఆఫీస్ సమీపం నుండి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు

* సాయంత్రం 4.00 గం.ల నుండి 4.30 వరకు ఆకృతి ఎన్ క్లీవ్

* సాయంత్రం 4.30 నుండి 5.00 గం.ల వరకు ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1

* సాయంత్రం 5.00 గం.ల నుండి 5.30 ని.ల వరకు 3 rd ఫేజ్

* సాయంత్రం 5.30 ని.ల నుండి 6.00 గం.ల వరకు NRSA, CBCID, భగత్  సింగ్ నగర్ ఫేజ్-2

* సాయంత్రం 6.30 గం.ల నుండి 7.00 గం.ల వరకు మిడోలాండ్ అపార్టుమెంట్స్

* రాత్రి 7.00 గం.ల నుండి 7.30 వరకు డైమండ్ ఎస్టేట్ అపార్టుమెంట్స్

* రాత్రి 7.30 నుండి 8.00 గం.ల వరకు శిల్ప అవెన్యూ(విశ్వంబర)

* రాత్రి 8.00 గం.ల నుండి 8.30 ని.ల వరకు 4th ఫేజ్ లో మహిళలతో సమావేశం

Link to comment
Share on other sites

సుహాసిని రాజకీయ ఎంట్రీ వెనుక పెద్దకథే నడిచిందట..!
27-11-2018 10:28:09
 
636789116811583271.jpg
ఎన్‌టీఆర్.. ఈ మూడు అక్షరాలు భారత రాజకీయాల్లో సంచలనాలు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీ పీఠాన్ని సవాల్ చేసిన రాజకీయ దిగ్గజం ఆయన! ఆయనంటే తెలుగువారందరికీ గొప్ప స్ఫూర్తి. నందమూరి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పేరు ప్రతిష్టలున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరో సంచలనంగా ముందుకొచ్చారు నందమూరి సుహాసిని. భాగ్యనగరంలోని కూకట్‌పల్లి నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సుహాసిని రాజకీయ ఆరంగేట్రం వెనుక పెద్దకథే నడిచింది. ఆ సంగతులు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
      తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే! అదే దారిలో కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా నడిచారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ ఆటుపోట్లకు గురైన మాట వాస్తవం. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ టీడీపీనే అంటిపెట్టుకున్న నాయకులు, కార్యకర్తలు ఎందరో ఉన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చిన తరుణంలో తెలంగాణలో తెలుగుదేశంపార్టీ మహాకూటమిలో చేరింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తెలంగాణ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌తో ఆ పార్టీ చేతులు కలిపింది. నిజానికి ఈ పరిణామం టీడీపీలోని హార్డ్ కోర్‌ నేతలకి ఏమాత్రం రుచించలేదు. కానీ, నరేంద్రమోదీ కల్పించిన ప్రమాదకర పరిస్థితి చూసి సర్ధిచెప్పుకున్నారు. ఏపీకి అన్యాయం చేయడంతో పాటు, చంద్రబాబుపై కత్తిగట్టిన మోదీని ఎదుర్కోవాల్సిందే అన్న అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు కూడా టీడీపీ క్యాడర్‌నీ, ఏపీ ప్రజానీకాన్నీ మానసికంగా అందుకు సిద్ధంచేశారు.
 
     తాజాగా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరఫున పాలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ సీనియర్ నేత దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలోకి దించారు చంద్రబాబు! ఈ పరిణామం అటు పార్టీ నేతలకు, ఇటు ప్రత్యర్ధి పక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది. సుహాసినిని బరిలోకి దించడం వల్ల నందమూరి కుటుంబం తెలుగుదేశంతోనే ఉందన్న భావనను చంద్రబాబు కల్పించగలిగారు. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఎన్‌టీఆర్ కుటుంబంలో ఎటువంటి అసంతృప్తీ లేదన్న సంకేతాన్ని కూడా తెలుగు తమ్ముళ్లలోకి పంపగలిగారు. అంతేకాదు- సుహాసినిని తెరపైకి తేవడం వల్ల టీ-టీడీపీ సహా కూకట్‌పల్లి పార్టీ క్యాడర్‌లో నైతిక స్థయిర్యం పెరుగుతుందన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది.
 
    ఇదిలా ఉంటే, సుహాసినిని రంగంలోకి దించడంపై తెలుగుదేశం పార్టీలో పెద్ద కసరత్తే జరిగింది. పార్టీ నేతల కథనం ప్రకారం... ఈ ఆలోచన వచ్చిందే తడవుగా చంద్రబాబు తన కుమారుడు, రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఫోన్‌చేశారు. ఆ సమయంలో లోకేశ్‌ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. తెల్లవారుఝామున 5.30 గంటలకు లోకేశ్‌ మొబైల్ రింగ్‌ అయ్యింది. నిద్రలో ఉన్న లోకేశ్‌ కాల్‌ను రిసీవ్‌ చేసుకోలేదు. వెంటనే పక్కనే ఉన్న లోకేష్ భద్రతా సిబ్బందిలో ఒకరు వచ్చి లోకేశ్‌ను నిద్రలేపారు. సంగతేమిటని ప్రశ్నిస్తే "నాన్నగారి దగ్గర్నుంచి అర్జంట్ కాల్'' అని చెప్పారు. అప్పటికే తన ఫోన్‌లో మిస్‌డ్ కాల్‌ చూసుకున్నారు. మరుక్షణం చంద్రబాబుకు ఫోన్‌చేశారు లోకేశ్‌. ఎప్పటి మాదిరిగానే "ఆరు గంటల వరకు పడుకుంటే ఎలా?'' అని చిన్నగా క్లాస్ తీసుకుని, అనంతరం అసలు సంగతిలోకి వచ్చారు చంద్రబాబు. "కూకట్‌పల్లి స్థానం నుంచి నందమూరి సుహాసినిని రంగంలోకి దించుతున్నాం'' అని చెప్పారు. తొలుత చంద్రబాబు వ్యూహమేంటో లోకేశ్‌కు అర్ధంకాలేదు. లోకేశ్‌కు వరుసకు మేనమామ కూతురే సుహాసిని! కానీ లోకేశ్‌ ఆమెను అక్కా అని పిలుస్తారు.
 
     చంద్రబాబు చెప్పింది అర్థమయ్యాక లోకేశ్‌ స్పందించారు. "అక్క ఓకే చెప్పిందా?'' అని ప్రశ్నించారు. సుహాసినితో మాట్లాడానని చంద్రబాబు చెప్పడంతో ఆయన ఒకింత ఉత్సుకతకి లోనయ్యారు. ఇప్పుడిప్పుడే తెలుగుదేశం రాజకీయాలను ఒంటబట్టించుకుంటున్న లోకేశ్‌కి.. సుహాసినిని రంగంలోకి దించడంలో చంద్రబాబు వ్యూహం ఏంటో అర్థంకావడానికి కొంత సమయం పట్టింది. అసలు విషయం అర్ధమైన తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సుహాసిని రంగప్రవేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హరికృష్ణ కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడారు. "సుహాసినికి ఇష్టమైతే తమకు అభ్యంతరం లేదు'' అని అందరూ చెప్పడంతో ఆమెను కూకట్‌పల్లి అభ్యర్ధిగా టీడీపీ తరఫున బరిలోకి దించారు. సుహాసిని ప్రచారాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించేందుకు ఒక ప్రణాళికను సైతం సిద్ధంచేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు, టీ-టీడీపీ ముఖ్యనేతలంతా రంగంలోకి వచ్చారు. ఏపీ నుంచి కూడా కొంతమంది నేతలు ప్రచారంలో పాలుపంచుకుంటారు. టీడీపీ అభ్యర్ధులు పోటీచేస్తున్న నియోజకవర్గాలలో ప్రచారసరళిపై పార్టీ జాతీయ కార్యాలయం పర్యవేక్షణను కూడా ప్రారంభించింది. మొత్తానికి సుహాసిని రాజకీయ ప్రవేశం వెనుక ఇంత కథ నడిచిందన్న మాట!
Link to comment
Share on other sites

అత్యధిక మెజారిటీతో సుహాసినిని గెలిపించాలి
కాంగ్రెస్‌ నేత సర్వేసత్యనారాయణ
101412SARVEY-SATYANARAYANA.JPG

హైదరాబాద్‌ : ప్రజాసేవకు నందమూరి వంశం నుంచి సుహాసిని వస్తున్నారని.. అత్యధిక మెజారిటీతో ఆమెను గెలింపించి ఆశీర్వదించాలని కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ కోరారు. కూకట్‌పల్లి తెదేపా కార్యాలయంలో స్థానిక మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు సుహాసిని అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని చెప్పారు. పేదలను ఆదుకునే పార్టీలన్నీ కలిసి పోటీచేస్తున్నాయని.. ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లని ఎన్నుకోవాలని కోరారు.

సుహాసినిపై పలు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని సర్వే మండిపడ్డారు. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రచారం చేస్తున్నారని... దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. కూకట్‌పల్లిలోనే సుహాసిని ఇల్లు తీసుకున్నారని.. ప్రజాసేవ కోసం ఆమె ఇక్కడే ఉంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు. తాను అందుబాటులో ఉండనని చేస్తున్న ప్రచారం అబద్ధమని.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అధిక మెజారిటీతో గెలిపించండి.. రుణం తీర్చుకుంటా: సుహాసిని
27-11-2018 12:34:32
 
636789195687456743.jpg
ఓల్డుబోయినపల్లి/హైదరాబాద్: ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపిస్తే.. ప్రజల రుణం తీర్చుకుంటానని మహాకూటమి టీడీపీ కూకట్‌పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని కోరారు. సోమవారం ఉదయం ఓల్డుబోయినపల్లి మహాకూటమి ఇన్‌చార్జి పెంటారెడ్డి, టీ-పీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఓల్డుబోయినపల్లి చెక్‌పోస్ట్‌ నుంచి ప్రచారం చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆమె అభివాదం చేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ మహాకూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. తాను స్థానికురాలిని కాదని కొందరు ప్రచారం చేయడం తగదన్నారు. బాల్యం నుంచి డిగ్రీ వరకు నగరంలోనే చదివానని చెప్పారు. స్వర్గీయ ఎన్‌టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు సైతం.. తన తండ్రి హరికృష్ణతో కలిసి ప్రచారంలో పాల్గొన్నానని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జి నరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ మహిళా నాయకులు పాల్గొన్నారు.
 
పార్టీ కార్యాలయం ప్రారంభం..
బాలాజీనగర్‌ డివిజన్‌ ఆంజనేయనగర్‌లో పార్టీ కార్యాలయాన్ని నందమూరి సుహాసిని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మాచౌదరి ఆరోఫేజ్‌లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఎస్కే సత్తార్‌ ఆధ్వర్యంలో ఐదోఫేజ్‌లో శ్రీనివాస్‌ ప్రజలను కలిసి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు.
 
తెలంగాణ మైనారిటీ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సభ్యుల మద్దతు
నందమూరి సుహాసినికి ఫతేనగర్‌ డివిజన్‌ అక్షయ్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన తెలంగాణ మైనారిటీ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సభ్యులు మద్దతు తెలిపారు. ఆమెను అక్షయ్‌ ఎన్‌క్లేవ్‌కు ఆహ్వానించి, ఘనంగా సత్కరించి మద్దతు తెలియజేశారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు చెందిన తామంతా ఈఎ్‌సఐ తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నికల్లో గెలిస్తే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సుహాసినికి అందజేశారు. మాజీ కార్పొరేటర్‌ కృష్ణగౌడ్‌, ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యుడు చిలుకూరి హరిచంద్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు జహంగీర్‌, జనరల్‌ సెక్రెటరీ మహ్మద్‌ ఖాలీద్‌, ఉపాధ్యక్షుడు షేక్‌ ఉమర్‌, జాయింట్‌ సెక్రెటరీ మహ్మద్‌ హైదర్‌ఖాన్‌, కోశాధికారి అబ్దుల్‌ గఫార్‌, సభ్యులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

బిసి సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో సుహాసిని అక్క...

సుహాసిని గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు

Image may contain: 3 people, people smiling, people standing

Link to comment
Share on other sites

3 minutes ago, Narendra1 said:

Last 3 days kosam Kuna ki babu gaaru funding ippistey chaalu.. and Repu Rahul-cbn road show sanat nagar constituency loney.. Satyam theater chowrasta.. 

ok,  great aithe maanchi oopu vastadi kuna kuda sure shot gelsustadu

Link to comment
Share on other sites

అలాగే.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈనెల 29 తరువాత సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. 

:lol2:

Ee matram daaniki aa headline enti raa edo confirm aipoinattu

Link to comment
Share on other sites

2 minutes ago, mahesh1987 said:

అలాగే.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈనెల 29 తరువాత సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించనున్నారు. 

:lol2:

Ee matram daaniki aa headline enti raa edo confirm aipoinattu

Really doubt Tarak vasthada aa okka roju ayina.. :peepwall:

Link to comment
Share on other sites

38 minutes ago, sonykongara said:
అధిక మెజారిటీతో గెలిపించండి.. రుణం తీర్చుకుంటా: సుహాసిని
27-11-2018 12:34:32
 
636789195687456743.jpg
ఓల్డుబోయినపల్లి/హైదరాబాద్: ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపిస్తే.. ప్రజల రుణం తీర్చుకుంటానని మహాకూటమి టీడీపీ కూకట్‌పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని కోరారు. సోమవారం ఉదయం ఓల్డుబోయినపల్లి మహాకూటమి ఇన్‌చార్జి పెంటారెడ్డి, టీ-పీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఓల్డుబోయినపల్లి చెక్‌పోస్ట్‌ నుంచి ప్రచారం చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆమె అభివాదం చేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ మహాకూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. తాను స్థానికురాలిని కాదని కొందరు ప్రచారం చేయడం తగదన్నారు. బాల్యం నుంచి డిగ్రీ వరకు నగరంలోనే చదివానని చెప్పారు. స్వర్గీయ ఎన్‌టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు సైతం.. తన తండ్రి హరికృష్ణతో కలిసి ప్రచారంలో పాల్గొన్నానని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జి నరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ మహిళా నాయకులు పాల్గొన్నారు.
 
పార్టీ కార్యాలయం ప్రారంభం..
బాలాజీనగర్‌ డివిజన్‌ ఆంజనేయనగర్‌లో పార్టీ కార్యాలయాన్ని నందమూరి సుహాసిని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మాచౌదరి ఆరోఫేజ్‌లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఎస్కే సత్తార్‌ ఆధ్వర్యంలో ఐదోఫేజ్‌లో శ్రీనివాస్‌ ప్రజలను కలిసి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు.
 
తెలంగాణ మైనారిటీ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సభ్యుల మద్దతు
నందమూరి సుహాసినికి ఫతేనగర్‌ డివిజన్‌ అక్షయ్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన తెలంగాణ మైనారిటీ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సభ్యులు మద్దతు తెలిపారు. ఆమెను అక్షయ్‌ ఎన్‌క్లేవ్‌కు ఆహ్వానించి, ఘనంగా సత్కరించి మద్దతు తెలియజేశారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు చెందిన తామంతా ఈఎ్‌సఐ తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నికల్లో గెలిస్తే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సుహాసినికి అందజేశారు. మాజీ కార్పొరేటర్‌ కృష్ణగౌడ్‌, ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యుడు చిలుకూరి హరిచంద్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు జహంగీర్‌, జనరల్‌ సెక్రెటరీ మహ్మద్‌ ఖాలీద్‌, ఉపాధ్యక్షుడు షేక్‌ ఉమర్‌, జాయింట్‌ సెక్రెటరీ మహ్మద్‌ హైదర్‌ఖాన్‌, కోశాధికారి అబ్దుల్‌ గఫార్‌, సభ్యులు పాల్గొన్నారు.

:super: Suhasini Garu Andharni kalusthuu vala maddhatu kudabedutunnaru..

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Gottimukkala padmarao joining tdp,met cbn today 

Unless ground situation is bad for TRS sr. leaders like Gottimukkala (Hyderabad/RR), Baig/Balasani (Khammam) from TRS will not join TDP.

That too Velama leader Gottimukkala leaving TRS means TRS political future in doubt.

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Unless ground situation is bad for TRS sr. leaders like Gottimukkala (Hyderabad/RR), Baig/Balasani (Khammam) from TRS will not join TDP.

That too Velama leader Gottimukkala leaving TRS means TRS political future in doubt.

krishnarao join ayaka evaru pattichukovtam ledu emo.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...