Jump to content

APIIC headquarters in Mangalagiri


Recommended Posts

  • Replies 61
  • Created
  • Last Reply
రూ.110 కోట్లు.. 11 అంతస్తులు

 

నేడు సీఎంచే ఏపీఐఐసీ భవనం ప్రారంభం

7ap-state1a_2.jpg

మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభిస్తారు. మంగళగిరి ఆటోనగర్‌లో 2.26 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ టవర్‌-1 నిర్మాణం పూర్తి చేశారు. 2.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా దీనిని నిర్మించారు. 11 అంతస్తుల్లో నిర్మించిన భవనంలో రాష్ట్రంలోని పారిశ్రామిక విభాగాలన్నీ ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు.

 

 
Link to comment
Share on other sites

40 minutes ago, Kondepati said:

ee options enti cold storage la vunnayi

 

20 minutes ago, ramntr said:

ఇదే veddam అని type చేసి aapesa, gnt - ch pet highway lo buildings ల vundi.. 

sry adi kadu

APIIC Tower-2 which will be constructed beside Tower-1 in Mangalagiri IT Park, Amaravati? - Same G+11 Construction as Tower-1 with more built-up Space up to 3,00,000 SFT? - Foundation Stone will be laid today by Honorable CM NCBN?

Dy3gnnvU0AEm3-7.jpg
Dy3goOqUcAAQnDI.jpg
Link to comment
Share on other sites

25 minutes ago, sonykongara said:

 

sry adi kadu

APIIC Tower-2 which will be constructed beside Tower-1 in Mangalagiri IT Park, Amaravati? - Same G+11 Construction as Tower-1 with more built-up Space up to 3,00,000 SFT? - Foundation Stone will be laid today by Honorable CM NCBN?

Dy3gnnvU0AEm3-7.jpg
Dy3goOqUcAAQnDI.jpg

This is still beautiful ??

Link to comment
Share on other sites

N Chandrababu NaiduVerified account @ncbn 4m4 minutes ago

 
 

APIIC Tower-I built at a cost of Rs. 110 Cr will have an Experience Centre on an entire floor dedicated to providing information to investors. Kiosks of all govt departments will help investors understand Policies, Incentives & Industry sector’s potential in the districts of AP.

Dy5M8T7VsAUm7E5.jpg
Dy5M9vdVYAAATe_.jpg
Dy5M_fiUwAEjbYl.jpg
Link to comment
Share on other sites

Andhra Pradesh CMVerified account @AndhraPradeshCM 8m8 minutes ago

 
 

CM @ncbn inaugurated APIIC Tower-I, a single integrated platform for investors to interact with government officials, at Mangalagiri. The facility with state of the art infrastructure will bring together institutions responsible for industrial development in AP, under one roof.

Dy5NuITUUAUrLVt.jpg
Dy5N04PUYAU_qI_.jpg
Dy5N2zKUwAASvhs.jpg
Dy5N6AfUwAAMEck.jpg
Link to comment
Share on other sites

వ్యాంధ్రలో.. పారిశ్రామిక ప్రగతి
09-02-2019 07:40:32
 
636852948304268033.jpg
  • ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయం అద్భుతం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబు
  • టవర్‌-1 భవన సముదాయం ప్రారంభం
  • టవర్‌-2 నిర్మాణ పనులకు భూమిపూజ
మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో నిర్మించిన ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయం అద్భుతంగా వుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కితాబిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఏపీఐఐసీకి సంబంధించి రెండు అతి పెద్ద టవర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో భాగంగా సుమారు 2.26ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్యయంతో టవర్‌-1 నిర్మాణ పనులను పూర్తిచేశారు. తొలుత టవర్‌-2 నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన అనంతరం టవర్‌-1 భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. నూతన భవనంలోని పలు విభాగాలను ఆయన సందర్శించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి కల్పిస్తున్న సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రూపొందించిన టచ్‌ స్ర్కీన్‌ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఏయే పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో పెట్టడానికి అనుకూల వాతావరణం వుంది, అక్కడ లభిస్తున్న భూముల వివరాలు, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులు ఏ దశలో వున్నాయి, ఆన్‌లైన్‌లో భూ కేటాయింపులు తదితర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం చేతి మునివేళ్ల మీద తెలుసుకునేలా ఏర్పాటుచేసిన ప్రత్యేక కియోస్కీ తెరలు, ఐవోటీ పరికరాలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ అధికారులతో సీఎం కొద్దిసేపు ముచ్చటించారు.
 
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమష్టి కృషి ఫలితంగానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం ముందుకు దూసుకువెళుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు వాతావరణం ఎంత అనుకూలంగా వుందో తెలియజేసేలా అత్యాధునిక హంగులతో ఏపీఐఐసీ భవన నిర్మాణం పూర్తిచేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, వైస్‌చైర్మన్‌, ఎండీ బాబు.ఎ, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, జిల్లా కలెక్టరు కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయరావు, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, పూర్వ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ సంకా బాలాజీగుప్తా తదితరులు పాల్గొన్నారు.
 
సీఎం రాక ఆలస్యం కావడంతో నిరుత్సాహం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షెడ్యూల్‌లో జాప్యం చోటుచేసుకుంది. ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి మధ్యాహ్నం మూడు గంటలకు రావలసిన ఆయన రాత్రి ఎనిమిదిన్నర గంటలకు విచ్చేశారు. దీంతో సీఎం రాకకోసం గంటల కొద్ది వేచిచూసిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. దాదాపు అయిదు గంటలపాటు ఎదురుచూసిన పలువురు సీఎం వస్తారో, రారోనన్న సందిగ్ధంలో నిరాశతో వెనుదిరిగారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ముగింపు సెషన్స్‌ కావడంతో అక్కడ బాగా ఆలస్యమైంది. ఆ వెంటనే ఏపీఐఐసీ భవనం ప్రారంభోత్సవానికి హాజరై అనంతరం మంత్రివర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కావలసివుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ముగియడంతో ఆ వెంటనే మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరుకావలసి వచ్చింది. దీంతో మంగళగిరి పర్యటనలో జాప్యం చోటుచేసుకుంది. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మంగళగిరికి చేరుకున్న సీఎం చంద్రబాబు కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించి... టవర్‌-1 ప్రారంభోత్సవం, టవర్‌-2 భూమిపూజ చేసి, అధికారులతో కొన్ని నిమిషాలపాటు మాట్లాడి వెళ్లిపోయారు.
Link to comment
Share on other sites

పెట్టుబడిదారులకు సకాలంలో అనుమతులు

 

ఏపీఐఐసీ టవర్‌ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

ap-state2a_5.jpg

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, సంస్థలు స్థాపించడానికి వచ్చే పెట్టుబడిదారులకు సకాలంలో అనుమతులు మంజూరు చేయడానికి వీలుగా అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం మంగళగిరి ఆటోనగర్‌లో ఏపీఐఐసీ రూ.110 కోట్లతో నిర్మించిన 11 అంతస్తుల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ భవనం పక్కనే రెండో టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవనాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి ఈ భవనం ఒక నిలువుటద్దంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణం ఉందో చెప్పడానికి ఈ భవనమే నిదర్శనమన్నారు. ఏయే పరిశ్రమలు    ఏ ప్రాంతాల్లో పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి? అక్కడ లభిస్తున్న భూముల వివరాలు, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తు ఏస్థాయిలో ఉంది? ఆన్‌లైన్‌లో భూకేటాయింపులు తదితర సమస్త సమాచారం తెలుసుకునేలా ప్రత్యేక కియోస్కీ తెరలు ఐవోటీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు లోకేశ్‌, అమరనాథరెడ్డి, పుల్లారావు, నక్కా ఆనందబాబు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య, ఎండీ ఎ.బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...