MVS Posted November 17, 2018 Posted November 17, 2018 Amaravathi arhata sadinchinda nenu andreson gadu dobbetademo anukuna second qualifying round lo 7th place ki drop avangane
MVS Posted November 17, 2018 Posted November 17, 2018 4 hours ago, sonykongara said: Ah anchor gadu mamulu english matladochu ga sollu edava
AnnaGaru Posted November 18, 2018 Posted November 18, 2018 (edited) just 4 years back this area on river front was abandoned(open defecation)...Today it is seen/shared all over world Team Abudhabi shared this back in Emirates and their news Today race is telecast live there in Abudhabi Edited November 18, 2018 by AnnaGaru MVS 1
MVS Posted November 18, 2018 Posted November 18, 2018 1 hour ago, AnnaGaru said: just 4 years back this area on river front was abandoned(open defecation)...Today it is seen/shared all over world Team Abudhabi shared this back in Emirates and their news Today race is telecast live there in Abudhabi F1h20 site lo live istunadu bro ...mana vijayawada arelia view baga chupinchadu vadu race starting lo
sonykongara Posted November 18, 2018 Author Posted November 18, 2018 44.54 సెకన్లలో 4.5 కి.మీ. ఫార్ములా-1 అర్హత పోటీల్లో అత్యధిక వేగం నమోదు చేసిన షాన్ రెండో స్థానంలో ఎమిరేట్స్ మహిళా డ్రైవర్ స్ట్రోమోయ్ ఐదో స్థానంలో నిలిచిన అమరావతి అండర్సన్ రెండో రోజు అర్హత పోటీల్లో అదరగొట్టిన రేస్‌డ్రైవర్లు నేడు సాయంత్రం 4 గంటలకు ఫార్ములా-1 తుదిపోరు ఈనాడు, అమరావతి ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్ సాగర్‌లో రెండో రోజు ఎఫ్1హెచ్2ఓ-పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.. ప్రధానంగా ఫార్ములా-1 అర్హత పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ఉర్రూతలూగించాయి. మూడు రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో అమరావతి బోట్ డ్రైవర్ అగ్రస్థానంలో నిలవాలంటూ.. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ప్రోత్సహించారు. శనివారం ఫార్ములా-1 అర్హత పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ రౌండ్లలో కేవలం కొన్ని సెకన్ల తేడాతో కొందరు, మిల్లీసెకన్ తేడాతో ఒక డ్రైవర్ తాము ఆశించిన స్థానాన్ని అందుకోలేకపోయారు.. తొలి రౌండ్: అర్హత పోటీ మొదటి రౌండ్‌లో 19 బోట్ల డ్రైవర్లూ పోటీపడ్డారు. 25 నిమిషాలపాటు సాగిన ఈ పోటీలో టాప్-12లో నిలిచిన డ్రైవర్లు రెండో రౌండ్‌కు అర్హత పొందారు. రెండో రౌండ్: పావుగంట పాటు జరిగిన ఈ పోటీలో తొలి ఆరు స్థానాల్లో నిలిచినవారే మూడో రౌండ్‌కు అర్హులవుతారు. కీలకంగా మారిన ఈ రౌండ్‌లో డ్రైవర్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. అబూదాబి డ్రైవర్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ దూసుకెళ్లారు. వీరి మధ్యలో ఎమిరేట్స్ రేసింగ్ బృందం మహిళా లీడ్ డ్రైవర్ స్ట్రోమోయ్ మ్యారిట్ మిగతా వారితో దీటుగా పోటీపడింది. 14 నిమిషాల వద్ద అమరావతి డ్రైవర్ ఆరో స్థానంలోకొచ్చాడు.. హఠాత్తుగా విక్టరీ, మరో బృందానికి చెందిన డ్రైవర్లు అమరావతి బోట్‌ను వెనక్కు నెట్టేసి ముందుకు వెళ్లసాగారు. ఆరో స్థానం కోల్పోతే మూడో రౌండ్‌కు అమరావతిపై అనర్హత వేటుపడే పరిస్థితి..ప్రేక్షకుల్లో ఉత్కంఠ ప్రారంభమైంది. తుదకు అమరావతి ఆరో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్: రెండో రౌండ్‌లో టాప్-6లో నిలిచిన డ్రైవర్లలో ఒక్కొక్కరుగా రెండు ల్యాప్ (4.5కి.మీ.)లు పూర్తిచేయాల్సి ఉంటుంది.. ఈ రెండింటిలో ఏ ల్యాప్‌ను డ్రైవర్ అత్యంత వేగంగా పూర్తిచేస్తాడో దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. రెండో రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచిన అమరావతి డ్రైవర్ జోనస్ అండర్సన్ మొదటి ల్యాప్‌ను 45.46 సెకన్లలో, రెండో దాన్ని 45.22 సెకన్లలో పూర్తిచేశాడు. దీంతో 45.22 సెకన్లను అతడు పూర్తిచేసినట్లుగా నమోదయింది.. తర్వాత రెండోరౌండ్‌లో ఐదోస్థానంలో నిలిచిన విక్టరీ బృంద డ్రైవర్ ఆల్ హమేలీ అహ్మద్ ఒక్క మిల్లీసెకన్ ఆలస్యంగా అంటే 45.23 సెకన్లలో పూర్తిచేశాడు. కానీ, తర్వాత పోటీపడిన ఎమిరేట్స్ రేసింగ్ మహిళా డ్రైవర్ స్ట్రోమోయ్ ఒక ల్యాప్‌ను కేవలం 44.72 సెకన్లలో పూర్తిచేసి అమరావతి ఆశలపై నీళ్లు చల్లింది. తర్వాత వరుసగా అబూదాబి డ్రైవర్లు స్టార్క్ 45 సెకన్లలో, ఆల్ కెమ్జీ 45.06, షాన్ టొరంట్ అందరికంటే తక్కువగా 44.54 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ అర్హత పోటీల్లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన డ్రైవర్లకు ఆదివారం సాయంత్రం జరిగే తుది రేస్‌లో పోల్-పొజిషన్ కేటాయిస్తారు. ఫార్ములా-4: తొలిరోజు రేస్‌ను శనివారం నిర్వహించారు. ఫార్ములా-1 అర్హత పోటీల కంటే ముందుగా 30 నిమిషాల పాటు ఫార్ములా-4 రేస్ కొనసాగింది. 9 బృందాల డ్రైవర్లు ఈ రేస్‌లో పాల్గొన్నారు. పోలీసుల హడావుడి... పోలీసుల హడావుడితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎఫ్1హెచ్2ఓ పోటీలను తిలకించేందుకు వస్తున్న ప్రజలు కొందరు అసహనం వ్యక్తం చేశారు. 365 రోజులు పర్యాటక ఆకర్షణలు ఉండాలి ‘భారత్‌లో సాహస పర్యాటకానికి (అడ్వెంచర్ టూరిజం) అపారమైన అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా సాహస పర్యాటకం మార్కెట్ పరిమాణం 2017 నాటికి 683 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్‌లోనూ ఈ మార్కెట్ పరిమాణం విస్తృతమవుతోంది. 365 రోజులు పర్యాటక ఆకర్షణలు ఉండేలా సాహస పర్యాటకానికి రూపకల్పన చేయాలి’ - కెప్టెన్ స్వదేశ్‌కుమార్, భారత సాహస పర్యాటక నిర్వాహకుల సంఘం (ఏటీవోఏఐ) అధ్యక్షుడు ఏపీలో అకాడమీ ఏర్పాటు చేస్తాం జల క్రీడలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విజేతగా నిలిచింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ను 16ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి)కు తేవాలన్న ప్రయత్నం మొదలైంది. ఇన్నాళ్లకు వచ్చింది. అమరావతికి జలక్రీడల్లో గొప్ప భవిష్యత్తు ఉంది. - నికొలో, హెచ్2ఓ అధ్యక్షుడు
sonykongara Posted November 18, 2018 Author Posted November 18, 2018 రసవత్తరంగా ఎఫ్1హెచ్2వో బోట్ రేస్18-11-2018 06:41:44 మూడు దఫాలుగా ఎఫ్1హెచ్2వో క్వాలిఫైయింగ్ రౌండ్లు సత్తాచాటిన అమరావతి టీమ్ పోటెత్తిన జనం, కిక్కిరిసిన గ్యాలరీలు పోటెత్తిన జనంతో గ్యాలరీలు కిక్కిరిసిపోగా.. లోపలికి రాలేని జనం పరిసర ప్రాంత రోడ్లపై నుంచే రేసులను ఆస్వాదించారు. చప్పట్లు, ఈలలతో రేసులపై తమ అభిమానాన్ని చాటుకోవడమేగాక అమరావతి టీమ్ ప్రదర్శనకు హారతులు పట్టారు. టీమ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన ఆ టీమ్ డ్రైవర్ ఆండర్సన్ విజయానికి ఫిదా అయ్యారు. ఘాట్ల వద్ద గ్యాలరీలు నిండిపోవడంతో పలువురు ఘాట్ మెట్లపైనే కూర్చుని మరీ రేసులను ఆస్వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోటింగ్ రేసుల్లో భాగంగా శనివారం జరిగిన రేసులు ప్రజల మనసులను దోచేశాయి. విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోటింగ్ రేసుల్లో భాగంగా శనివారం జరిగిన రేసులు వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫార్ములావన్ పవర్ బోటింగ్ రేసుల్లో భాగంగా మూడుదఫాలుగా క్వాలిఫైయింగ్ రౌండ్లను ఏర్పాటుచేశారు. తొలిదఫా రౌండ్లో పాల్గొన్న 19 టీముల్లో 12 రెండో రౌండ్‌కు, అందులో తొలి ఆరుస్థానాలను కైవసం చేసుకున్న బృందాలను ఎంపిక చేసి ఆదివారం జరగబోయే ఫైనల్స్‌కు ఎంపికచేశారు. ల్యాప్స్(లక్ష్యాన్ని)ను అతితక్కువ సమయంలో దాటిన రేసర్ల ప్రతిభను బట్టి విజేతలను నిర్ణయించారు. ప్రతిభకు పట్టం కట్టిన నిర్ణేతల న్యాయంతో అమరావతి టీమ్ ఫైనల్స్‌కు స్థానం దక్కించుకుంది. తొలిక్వాలిఫైయింగ్ రౌండ్లో ప్రథమస్థానంలో నిలిచిన అమరావతి టీమ్, రెండు, మూడు రౌండ్లలో మాత్రం 6, 5 స్థానాలను దక్కించుకుంది. చాకచక్యంగా వ్యవహరించిన రేసర్ జోనస్ ఆండర్సన్‌బోట్‌ను మలుపుల్లోనూ వేగం తగ్గకుండా డ్రైవ్ చేస్తూ చూపరులను ఉత్కంఠకు గురిచేశాడు. అత్యంత ప్రతిభ కనబరిచిన ఇతర పోటీదారు రేసర్లు కూడా చూపు తిప్పుకోనివ్వలేని ప్రదర్శన చేశారు. ఒకదానితో మరోటి పోటీ పడుతూ కర్వ్‌లలో(మలుపుల్లో)నూ 150 కిలోమీటర్ల వేగం తగ్గకుండా బోట్లను దూకించిన రేసర్ల సత్తాను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు కుర్చీల్లో ప్రశాంతంగా కూర్చోలేకపోయారు. స్థాయికి మించి రాణించిన అమరావతి టీమ్(ఐదో స్థానం)తో పాటు అబుదబీ టీమ్‌కు చెందిన షాన్ టొరెంటె(ప్రథమ స్థానం), ఎమిరేట్స్ రేసింగ్ టీమ్‌కు చెందిన మేరిట్ స్ర్టోమోయ్(ద్వితీయ స్థానం), అబు దబీ టీమ్‌కు చెందిన ఎరిక్ స్టార్క్(తృతీయ స్థానం), థాని అల్ కెమ్జీ (నాలుగో స్థానం), టీమ్ విక్టరీకి చెందిన అహ్మ ద్ అల్ హమేలీ(ఆరోస్థానం) ఫైనల్స్‌కు చేరుకున్నారు. టీమ్ అమరావతి ఫైనల్స్‌కు చేరుకుందని విన్న గ్యాలరీల్లోని ప్రజలు జై అమరావతి అంటూ హర్షధ్వానాలు చేస్తూ.. డ్రైవర్ ఆండర్సన్‌కు అభినందనలు తెలిపారు. పవర్ రేసుకు పోటెత్తారు తొలిరోజు వర్షం కారణంగా స్పందన అంతంత మాత్రంగానే ఉన్నా రెండోరోజు ఏకంగా 80వేలమంది రేసులను ప్రత్యక్షంగా చూశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన వీఐపీ, వీవీఐపీ, అధికారులు, నామినేటెడ్ నేతలతో పాటు సామాన్యులకూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోగా.. లోపలికి రావడం కుదరని, పాస్‌లు లేని ఇతరత్రా ప్రజలకు దుర్గా, భవానీ ఘాట్లతో పాటు ప్రకాశం బ్యారేజి, ఫ్లై ఓవర్ వద్ద నుంచే రేసులను వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అదేజోరు ఒక్క రేసులవద్దే గాక సాయంత్రపువేళ చల్లని నదీ తీరాన ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంగీత దర్శకుడు థామన్ చేపట్టిన మ్యూజికల్ నైట్ కోసం పలువురు ప్రజలు నగరేతర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు. కార్యక్రమంలో నారా భువనేశ్వరి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మేయర్ కోనేరు నగర కమిషనర్ జె.నివాస్, శ్రీధర్, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు. రేసులకు విపక్ష నేతలూ ఫిదా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు చేసిన పలువురు నేతలు కూడా రేసులకు మైమరచిపోయారు. ఘాట్ల వద్ద మెట్లపైనే కూర్చుని రేసర్ల మెరుపు వేగాన్ని ఆస్వాదించారు. సీపీఐ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, మంగళగిరిలో నివాసముంటున్న పలువు రు నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు కూడా రేసుల మజాను కాదనలేకపోయారు. తిరిగివెళ్తూ వారివారి ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నగరానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతుడయ్యారని, ప్రతిభను ఒప్పుకోవడంలో తప్పులేదని అభినందించారు.
sonykongara Posted November 18, 2018 Author Posted November 18, 2018 Team Amaravati qualifies for city's F1H2O Power Boat Racing Championship finals Team Amaravati’s Jonas Andersson qualified for the final race by finishing fifth on the second day of Amaravati F1H2O Power Boat Racing Championship on Saturday. Published: 18th November 2018 08:50 AM | Last Updated: 18th November 2018 08:50 AM | A+A A- By Express News Service VIJAYAWADA: Team Amaravati’s Jonas Andersson qualified for the final race by finishing fifth on the second day of Amaravati F1H2O Power Boat Racing Championship on Saturday. Preceding the third qualifying round where he finished the race in 45.22 seconds, he made the Qualifying round one (Q1) and Qualifying round two (Q2) with 46.58 seconds and 46.85 seconds, respectively. In a first, Marit Stromoy, a woman driver from Germany participated and stood second during the final qualifying round. Her speed in the first three rounds stood at 44.72 km, 46. 38 km and 47.63 km, respectively. Shaun Torrente from the US ranked first, while Erik Strak from Abu Dhabi stood third. Nine teams with 19 drivers raced in the three qualifying rounds. The first two were combined as one race. In the qualifying round, the driver has to finish two laps; each lap spanned 2.125 km. The ranking of the drivers depended on the time the laps were completed. The day’s chief guests were CM’s wife N Bhuvaneswari, Irrigation Minister Devineni Umamaheswara Rao, Tourism Minister Bhuma Akhila Priya and Vijayawada Mayor Koneru Sridhar.Tomorrow’s highly anticipated finals will see Chief Minister N Chandrababu Naidu presenting the awards the winners of the competition.Later, F1H2O organisers told TNIE that the average budget for organising an edition was around US $ one million.
sonykongara Posted November 18, 2018 Author Posted November 18, 2018 http://www.newindianexpress.com/cities/vijayawada/2018/nov/18/team-amaravati-qualifies-for-citys-f1h2o-power-boat-racing-championship-finals-1899696.html
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now