Jump to content

Formula 1 Powerboat World Championship in Amaravati


Recommended Posts

ఫ్‌1హెచ్‌2వో స్పీడ్‌ బోట్‌ రేస్‌ ప్రారంభం
17-11-2018 08:26:11
 
636780399693226207.jpg
  • జెండా ఊపి ట్రయల్‌ రన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • వర్షం కారణంగా కాస్త ఆలస్యం
  • ట్రయల్‌ రన్‌ను ఆసాంతం ఆస్వాదించిన వీక్షకులు
  • నేటి నుంచే అసలు రేస్‌లు
రయ్యిరయ్యిమంటూ.. రెక్కలు విప్పుకొంటూ... పడుతూ లేస్తూ.. ఓసారి ఉన్న పళంగా నీటిలోకి ప్రవేశిస్తూ.. మరోసారి హఠాత్తుగా పైకి ఎగురుతూ.. అబ్బో.. ఆశ్చర్యపోయే ఎన్నో రకాల విన్యాసాలకు కృష్ణాతీరం వేదికైంది. స్పీడ్‌ బోట్లలోని పవర్‌ను చూపిస్తూ.. గాలితో పోటీపడుతూ.. మునుపెన్నడూ ప్రత్యక్షంగా తిలకించని జల అద్భుతాలను కళ్ల ముందు ఆవిష్కరించింది. తొమ్మిది దేశాలకు చెందిన రేసర్లు.. 250 కిలోమీటర్ల స్పీడ్‌ బోట్లలో దూసుకెళ్తుంటే.. అలలు అలాఅలా ఎగసిపడగా, కృష్ణాజలమే కాదు.. ఒడ్డున ఉన్న జనం కూడా పులకించిపోయారు. మూడు రోజులపాటు నిర్వహించే ఎఫ్‌1హెచ్‌2వో పవర్‌ బోటింగ్‌ రేసుల ట్రయల్‌ రన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పున్నమి ఘాట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నమంతా స్పీడ్‌ బోట్లు ఉత్సాహపరచగా, సాయంకాలం బాబా సెహగల్‌ మ్యూజిక్‌ మస్తీ మస్త్‌మస్త్‌గా సాగింది. మోతెక్కిపోయే మోటార్‌ సౌండ్‌తో.. 250 కిలోమీటర్ల వేగంతో నీళ్లల్లో దూసుకుపోతున్న పవర్‌ బోట్లను చూడటానికి రెండు కళ్లు చాల్లేదు. ట్రయల్‌ రన్‌లోనే అదరగొట్టిన 9 దేశాల రేసర్లు ఒక్కొక్కరుగా నదీ జలాల్లోకి అడుగుపెట్టి హంగామా సృష్టించారు. నదిలో ఏర్పాటుచేసిన బూయిస్‌(లక్ష్య నిర్ధేశం) చుట్టూ రౌండ్లు కొడుతూ పరుగులు పెట్టిన పవర్‌ బోట్లు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. రయ్‌..న గాల్లోకి లేస్తూ.. అంతలోనే నీళ్లపైకి పడుతూ కంటి చూపుకంటే వేగంగా దూసుకుపోతున్న బోట్లను చూడటానికి పున్నమి, భవానీ ఘాట్లకు ప్రజలు విరివిగా విచ్చేశారు. ట్రయల్‌ రన్‌ జరుగుతున్నంత సేపు ముఖ్యంగా అమరావతి టీమ్‌ డ్రైవ్‌ చేస్తున్న బోట్లు ఘాట్ల వైపుగా వచ్చిన ప్రతీ సారి ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి.
 
విజయవాడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఎఫ్‌1హెచ్‌2వో ట్రయల్‌ రన్‌ అదిరింది... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోటింగ్‌ రేసులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జెండా ఊపి ట్రయల్‌ రన్‌ను శుక్రవారం ప్రారంభించారు. రేస్‌ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో రేసర్లు రెచ్చిపోయారు. బూయిస్‌(లక్ష్య నిర్ధేశం) చుట్టూ రౌండ్లు కొడుతూ బోట్లు పరుగులు పెట్టాయి. రేస్‌లను చూడటానికి వచ్చిన వీక్షకుల చప్పట్లతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌గా సాగిన రేసులో ఆద్యంతం ఆగుతూ.. దూకుతూ దాదాపు అన్ని బోట్లు 45 ల్యాపు(రౌండ్లు)లను పూర్తి చేశాయి. సాంకేతిక సమస్యలు, చమురు ఖాళీ అవడం వంటి పలు కారణాలతో ఒడ్డుకు చేరుకోగా.. అక్కడ సిద్ధంగా ఉన్న క్రూస్‌(బోట్‌ సిబ్బంది) ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ తిరిగి బోట్లను నీళ్లల్లోకి వదలడానికి కృషి చేశారు. దీంతో అమరావతి, ఎమిరేట్స్‌ రేసింగ్‌, టీమ్‌ విక్టరీతో పాటు పలు టీమ్‌లకు చెందిన కొన్ని బోట్లు పలుమార్లు ఒడ్డుకు చేరి నిమిషాల వ్యవధిలోనే తిరిగి నీళ్లలోకి ప్రవేశించాయి. గంటన్నరకు పైగా జరిగిన తొలిరోజు ట్రయల్‌ రన్లో భాగంగా రేసర్లు అంచనాలకు మించి రాణించడమే గాక వీక్షకులను వారి దూకుడుతో ఉర్రూతలూగించారు. ప్రాక్టీస్‌ జరిగినంతసేపు రెండు స్పీడ్‌ బోట్లు, రెస్క్యూ బోట్లు నీళ్లలోనే కాపు కాస్తూ ఇబ్బందులు తలెత్తిన బోట్లను తక్షణమే ఒడ్డుకు చేర్చడానికి సాయమందించాయి.
 
ప్రత్యేక ఆకర్షణగా తాత-మనవళ్లు
ఒకవైపు ట్రయల్‌ రన్‌ ఆకట్టుకోగా.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మనవడు నారా దేవాన్ష్‌ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రితో పాటు కోడలు నారా బ్రాహ్మణితో పాటు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ కూడా రాగా.. మనవడిని వెంటపెట్టుకుని మరీ చంద్రబాబు ఈవెంట్లో ఏర్పాటుచేసిన క్రాఫ్ట్‌ బజార్‌ను సందర్శించారు. అనంతరం వేదికపైకి వచ్చిన చంద్రబాబుతో పాటు వచ్చిన దేవాన్స్‌ను ముద్దులాడుతూ చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. కొద్దిసేపటి తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వచ్చి దేవాన్స్‌ను బ్రాహ్మణి వద్దకు తీసుకెళ్లారు.
 
రద్దయిన రేసర్ల బ్రీఫింగ్‌
పోటీల్లో పాల్గొనబోయే రేసర్లతో బ్రీఫింగ్‌(వివరణ) ఇప్పించిన అనంతరం ప్రారంభమవ్వాల్ని ట్రయల్‌ రన్‌, ఆ బ్రీఫింగ్‌ జరక్కుండానే మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం గురించి కలెక్టర్‌ లక్ష్మీకాంతం అనుకో కుండా అదే కాన్ఫరెన్స్‌ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహిం చడంతో షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించుకున్న కార్యక్రమం రద్దయింది. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 9 దేశాల నుంచి వచ్చిన 19 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారని తెలియజేశారు. వీఐపీ, వీవీఐపీలతో పాటు అధికారులు ఇతరత్రాలకు ప్రత్యేకమైనా గ్యాలరీలు ఏర్పాటుచేశామని, మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో 18వ తేదీ కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ప్రారంభమైన ఎఫ్‌1హెచ్‌2ఏ ట్రయల్‌ రన్లో భాగంగా పాల్గొన్న 19 మంది రేసర్లలో అమరావతి టీమ్‌ తరఫున బరిలోకి దిగిన జోనస్‌ ఆండర్సన్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రయల్‌ రన్లోనే సత్తాచాటిన అమరావతి టీమ్‌ రేసుల్లో మరింత దూకుడుగా బరిలో ప్రతిభ కనబరుస్తుందన్న ఊహలకు ఆండర్సన్‌ ప్రాణం పోశాడు.
 
నేటి నుంచే అసలు పోరు
తొలిరోజు ట్రయల్‌ రన్‌తో సరిపెట్టినా.. తరువాతి రోజు(శనివారం) నుంచే అసలు రేసులు ప్రారంభమవ్వబోతున్నాయి. నగరానికి విచ్చేసిన 19 మంది రేసర్ల మధ్యన పోటీలను నిర్వహించి చివరిరోజైన ఆదివారం ఫైనల్‌ రేసులను నిర్వహించబోతున్నారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి విజేత కప్‌తో పాటు క్యాష్‌ ఫ్రైజ్‌ అవార్డును కూడా అందిస్తారు. అయితే ఇంత వరకు క్యాష్‌ ప్రైజ్‌ ఎంత అన్న విషయాన్ని ప్రకటించకపోవడం కొసమెరుపు. దీంతో అందరి దృష్టి విజేత అందుకోబోయే క్యాష్‌ ఫ్రైజ్‌ పైనే నిలుస్తున్నాయి.
Link to comment
Share on other sites

MAD CROC’S MIHALDINECZ WINS RACE 1 IN F4-S

 

 

Saturday, 17 November, AMARAVATI (India): Veteran driver Rudi Mihaldinecz used all his experience to take victory in the first of this weekend’s two races in the F4-S Championship in Amaravati.

 

In a highly entertaining race Mad Croc BABA Racing’s Hungarian driver led the race from pole position, but a mistake on lap 4 allowed series debutant Jeff Jelf to take the lead for Team Amaravati which he held onto until lap 12 when yellow flag was raised to allow race marshals to remove the stationary Blaze Performance driver Max Stilz.

 

At the restart on lap 16 Mihaldinecz immediately jumped Jelf to retake the lead, going on to win the 20-lap race by 5.22s with Jelf in pursuit but coming up short.

 

The middle order produced a great scrap before and after the yellow, Stilz running in third from F1 Atlantic’s Sam Whittle until both were passed on lap 9 by Victory’s Ahmed Al Fahim.

 

The yellow flag bunched up the pack with Whittle making up a place after Al Fahim hooked and dropped to sixth, with Emirates Racing’s Tom Chaippe also taking advantage as well as getting the better of Abu Dhabi’s Mohamed Al Mehairbi to move up and take fourth.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...