Jump to content

NHK ga NKR


murali@nbkfan

Recommended Posts

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కల్యాణ్‌రామ్‌కి కీలక పాత్ర దక్కింది. చైతన్య రథ సారథిగా, తన తండ్రి హరికృష్ణ నిజ జీవిత పాత్రలో కల్యాణ్‌రామ్‌ నటించబోతున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రయాణంలో చైతన్య రథం ముఖ్యభూమిక పోషించింది. ప్రత్యేకంగా తయారు చేయించిన చైతన్యరథంపైనే ఎన్టీఆర్‌ 75వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వూరూ వాడా తిరిగి ప్రజల్ని కలుసుకున్నారు. ఆ రథాన్ని ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’లోనూ చైతన్య రథాన్ని చూపించబోతున్నారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించనుండగా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌ కనిపించబోతున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ కోసం ప్రస్తుతం నటీ నటుల ఎంపిక జరుగుతోంది. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని బాలకృషతో కలిసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మిస్తారు.

 

http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8

 

 

 

:jackson:  :terrific:  :terrific:  :terrific:  :terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...